Google Docs, Sheets, Slides, & Drawings కోసం యాక్సెసిబిలిటీ

Google Docs, Sheets, Slides, Drawings స్క్రీన్ రీడర్‌లు, బ్రెయిలీ పరికరాలు, స్క్రీన్ మ్యాగ్నిఫికేషన్ ఇంకా మరిన్నింటితో పని చేయడానికి రూపొందించబడ్డాయి.

మీరు TalkBack స్క్రీన్ రీడర్, స్క్రీన్ మాగ్నిఫికేషన్‌తో పాటు మరెన్నో Android యాక్సెస్ సౌలభ్య ఫీచర్‌లును డాక్స్ ఎడిటర్‌లతో ఉపయోగించుకోవచ్చు.

TalkBack స్క్రీన్ రీడర్‌ని ఉపయోగించడం

మీ Android పరికరంలో TalkBackని ఇంకా ఆన్ చేయకపోయినట్లయితే, TalkBackని ఎలా ఆన్ చేయాలో తెలుసుకోండి. మీరు TalkBackని ఆన్ చేసిన తర్వాత, ఈ కింది చిట్కాలను ఉపయోగించండి.

డాక్స్ యాప్

ఒక డాక్యుమెంట్‌ను కనుగొనడం

  1. డాక్స్ యాప్‌ను తెరవండి.
  2. మీరు చదవాలనుకునే లేదా సవరించాలనుకునే డాక్యుమెంట్‌ని కనుగొనడానికి యాప్‌ని అన్వేషించండి.
    • కొత్త డాక్యుమెంట్‌ మెను: ఖాళీ డాక్యుమెంట్‌ని సృష్టించడానికి లేదా టెంప్లేట్‌ను ఉపయోగించడానికి ఈ మెనూని ఉపయోగించండి.
    • నావిగేషన్ డ్రాయర్: ఎగువున ఎడమ వైపు, మీరు నావిగేషన్ డ్రాయర్‌ను కనుగొనవచ్చు. ఇటీవలివి మరియు నాతో షేర్ చేసినవి వంటి ఎంపికలను అన్వేషించడానికి తెరవండి.
    • వెతుకు: ఒక డాక్యుమెంట్‌ని వెతకండి.
    • డాక్యుమెంట్‌ తెరువు: Google డిస్క్ నుండి లేదా మీ పరికర నిల్వ నుండి తెరవండి.
    • మరిన్ని ఎంపికలు:ఇలా క్రమీకరించు, కొత్తది చేర్చు, లేదా రిఫ్రెష్ చేయి వంటి ఎంపికలను అన్వేషించండి.

ఒక డాక్యుమెంట్‌ను చదవడం

  1. డాక్స్ యాప్‌ను తెరవండి.
  2. ఫోకస్‌ను డాక్యుమెంట్‌ పైకి తరలించి, ఎంచుకోవడానికి రెండుసార్లు నొక్కండి.
  3. డాక్యుమెంట్‌ని చదవడం ప్రారంభించడానికి కుడివైపు స్వైప్ చేయండి.
  4. ఐచ్ఛికం: డాక్యుమెంట్‌లోనే మీ నావిగేషన్ యొక్క కణికీయతను మార్చుకోవచ్చు.
    • అక్షరాలు, పదాలు లేదా పేరాల ద్వారా నావిగేట్ చెయ్యడానికి, పైకి లేదా కిందకు స్వైప్ చేయండి. ఆపై మీ డాక్యుమెంట్‌లో తరలింపును కొనసాగించడానికి కుడివైపు స్వైప్ చేయండి.
    • పంక్తుల ద్వారా నావిగేట్ చేయడానికి,మరిన్ని ఎంపికలుకు వెళ్లి, ప్రింట్ లేఅవుట్ను ఎంచుకోండి. మీ ఫోకస్‌ను తిరిగి డాక్యుమెంట్‌ వచనం వైపు తరలించి, పంక్తి ద్వారా నావిగేట్ చేసే ఎంపిక మీకు వినిపించేవరకు పైకి లేదా కిందకు స్వైప్ చేయండి. ఆపై మీ డాక్యుమెంట్‌లో తరలింపును కొనసాగించడానికి కుడివైపు స్వైప్ చేయండి.
  5. చదవడం ఆపడానికి, స్క్రీన్‌ను నొక్కండి.

ఒక డాక్యుమెంట్‌ను ఎడిట్ చేయడం

  1. డాక్స్ యాప్‌ను తెరవండి.
  2. ఫోకస్‌ను డాక్యుమెంట్‌ పైకి తరలించి, ఎంచుకోవడానికి రెండుసార్లు నొక్కండి.
  3. ఫోకస్‌ను ఎడిట్‌ బటన్ వైపు తరలించి, యాక్టివేట్ చేయడానికి రెండుసార్లు నొక్కండి.
  4. ఈ కింది సవరణ నియంత్రణలను ఉపయోగించడానికి యాప్‌ని అన్వేషించండి: 
    • బటన్‌లను మరియు మెనూలను అన్వేషించండి: కుడివైపు, ఎడమవైపు, పైకి లేదా కిందికి స్వైప్ చేయండి. 
    • కణికీయతను సర్దుబాటు చేయడం లేదా కర్సర్‌ను నియంత్రించడం: ఫోకస్‌ను డాక్యుమెంట్ వచనం వైపు తరలించి, స్థానిక సందర్భ మెనూని తెరవడానికి పైకి, ఆపై కుడివైపుకు స్వైప్ చేయండి.
    • స్క్రీన్‌పై కీబోర్డ్‌ను ఉపయోగించడం: కీబోర్డ్‌పై మీ వేలితో లాగండి మరియు కీని నమోదు చేయడానికి మీ వేలిని ఎత్తండి.

వచనాన్ని ఎంచుకుని చర్యను అమలు చేయడం

  1. మరిన్ని ఎంపికలుకు, ఆపై ఎంపిక నియంత్రణకు వెళ్లండి.
  2. మెను నుండి, ఎంపిక చేయి, అన్నీ ఎంపిక చేయి, కాపీ చేయి, కట్ చేయి, అతికించు, వ్యాఖ్యానించు, లేదా ఎంపిక ఫార్మాటింగ్‌ను చదివి వినిపించువంటి ఎంపికలను ఎంచుకోండి. మెనులోని ఎంపికలు మీరు ఎంచుకున్న దానిపై ఆధారపడి ఉంటాయి.

సహకారి ప్రకటనలను ఆఫ్ చేయడం

మీరు మీ డాక్యుమెంట్‌లోకి ప్రవేశించే లేదా నిష్క్రమించే ఇతర వ్యక్తుల గురించి వచ్చే స్క్రీన్ రీడర్ ప్రకటనలను ఆపివేయవచ్చు.

  1. మరిన్ని ఎంపికలుకు వెళ్ళండి.
  2. ప్రవేశాలు మరియు నిష్క్రమణలను మ్యూట్ చేయిను ఎంపిక చేయండి.

షీట్‌లు యాప్

స్ప్రెడ్‌షీట్‌ను కనుగొనండి

  1. షీట్‌లు యాప్‌ను తెరవండి.
  2. మీరు చదవాలనుకునే లేదా సవరించాలనుకునే స్ప్రెడ్‌షీట్‌ను కనుగొనడానికి యాప్‌ని అన్వేషించండి.
    • కొత్త స్ప్రెడ్‌షీట్ మెను: ఖాళీ స్ప్రెడ్‌షీట్‌ను సృష్టించడానికి లేదా టెంప్లేట్‌ను ఉపయోగించడానికి ఈ మెనూని ఉపయోగించండి.
    • నావిగేషన్ డ్రాయర్: ఎగువున ఎడమ వైపు, మీరు నావిగేషన్ డ్రాయర్‌ను కనుగొనవచ్చు. ఇటీవలివి మరియు నాతో షేర్ చేసినవి వంటి ఎంపికలను అన్వేషించడానికి తెరవండి.
    • వెతుకు స్ప్రెడ్‌షీట్ కోసం వెతకండి.
    • స్ప్రెడ్‌షీట్ తెరువు: Google డిస్క్ నుండి లేదా మీ పరికర నిల్వ నుండి తెరవండి.
    • మరిన్ని ఎంపికలు: ఇలా క్రమీకరించు, కొత్తది చేర్చు లేదా రిఫ్రెష్ చేయి వంటి ఎంపికలను అన్వేషించండి.

స్ప్రెడ్‌షీట్‌ను సవరించడం

  1. షీట్‌లు యాప్‌ను తెరవండి.
  2. ఫోకస్‌ను స్ప్రెడ్‌షీట్ పైకి తరలించి, ఎంచుకోవడానికి రెండుసార్లు నొక్కండి.
  3. సెల్‌ను చదవడానికి ఫోకస్‌ను దానిపై తరలించి, ఆపై సవరించడానికి రెండుసార్లు నొక్కండి.

సెల్ లేదా పరిధిని ఎంచుకోవడం

  1. షీట్‌లు యాప్‌ను తెరవండి.
  2. ఫోకస్‌ను స్ప్రెడ్‌షీట్ పైకి తరలించి, ఎంచుకోవడానికి రెండుసార్లు నొక్కండి.
  3. మరిన్ని ఎంపికలుకు, ఆపై సెల్ లేదా పరిధిని ఎంచుకోండి వెళ్లండి. 
  4. ఫీల్డ్‌ను సవరించడాన్ని యాక్టివేట్ చేయడానికి రెండుసార్లు నొక్కండి.
  5. సెల్ (C3)ని నమోదు చేయండి లేదా కోలన్ గుర్తుతో వేరు చేస్తూ ఒక పరిధిని ఇవ్వండి (R4:R10).
  6. సరేను ఎంచుకోండి.

ప్రకటనలను మార్చడం

  1. షీట్‌లు యాప్‌ను తెరవండి.
  2. ఫోకస్‌ను స్ప్రెడ్‌షీట్ పైకి తరలించి, ఎంచుకోవడానికి రెండుసార్లు నొక్కండి.
  3. మరిన్ని ఎంపికలుకు, ఆపై యాక్సెసిబిలిటీ సెట్టింగ్‌లు వెళ్లండి. 
  4. ఏ లక్షణాలను ప్రకటించాలో ఎంచుకోవడానికి, ఆకృతీకరణ లక్షణాలను చదువు ఆన్ చేయండి. 
    • ఐచ్ఛికం: వచన ఫార్మాటింగ్, సెల్ ఫార్మాటింగ్, నంబర్ ఫార్మాటింగ్ మరియు ఫాంట్‌ల యొక్క క్రియాకరణాన్ని ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు.
  5. సహకారి మార్పులను వినడానికి, సహకారి మార్పులను చదువును ఆన్ చేయండి.

సెల్ ఫార్మాటింగ్‌ను మార్చడం

  1. షీట్‌లు యాప్‌ను తెరవండి.
  2. ఫోకస్‌ను స్ప్రెడ్‌షీట్ పైకి తరలించి, ఎంచుకోవడానికి రెండుసార్లు నొక్కండి.
  3. ఫోకస్‌ను సెల్ పైకి తరలించి, ఎంచుకోవడానికి రెండుసార్లు నొక్కండి. 
  4. టూల్‌బార్‌లోని ఫార్మాటింగ్ బటన్‌లను ఉపయోగించడానికి తాకడం ద్వారా పరిశీలించండి.

స్లయిడ్‌లు యాప్

ప్రెజెంటేషన్‌ను కనుగొనడం

  1. స్లయిడ్‌లు యాప్‌ను తెరవండి.
  2. మీరు చదవాలనుకునే లేదా సవరించాలనుకునే ప్రెజెంటేషన్‌ను కనుగొనడానికి యాప్‌ని అన్వేషించండి.
    • కొత్త ప్రెజెంటేషన్ మెను: ఖాళీ ప్రెజెంటేషన్‌ను సృష్టించడానికి లేదా టెంప్లేట్‌ను ఉపయోగించడానికి ఈ మెనూని ఉపయోగించండి.
    • నావిగేషన్ డ్రాయర్: ఎగువున ఎడమ వైపు, మీరు నావిగేషన్ డ్రాయర్‌ను కనుగొనవచ్చు. ఇటీవలివి మరియు నాతో షేర్ చేసినవి వంటి ఎంపికలను అన్వేషించడానికి తెరవండి.
    • వెతుకు: ప్రెజెంటేషన్‌ను వెతకండి.
    • ప్రెజెంటేషన్‌ను తెరువు: Google డిస్క్ నుండి లేదా మీ పరికర నిల్వ నుండి తెరవండి.
    • మరిన్ని ఎంపికలు:ఇలా క్రమీకరించు, కొత్తది చేర్చు, లేదా రిఫ్రెష్ చేయి వంటి ఎంపికలను అన్వేషించండి.

ప్రెజెంటేషన్‌ను చదవడం

  1. స్లయిడ్‌లు యాప్‌ను తెరవండి.
  2. ఫోకస్‌ను ప్రెజెంటేషన్ పైకి తరలించి, ఎంచుకోవడానికి రెండుసార్లు నొక్కండి.
  3. ప్రెజెంటేషన్‌ను చదవడం ప్రారంభించడానికి కుడివైపునకు స్వైప్ చేయండి.
  4. నావిగేట్ చెయ్యడానికి ఈ చిట్కాలను ఉపయోగించండి:
    • ఫోకస్‌ను తరలించడానికి: కుడివైపునకు లేదా ఎడమవైపునకు స్వైప్ చేయండి.
    • తర్వాత లేదా మునుపటి స్లయిడ్‌కు వెళ్లడానికి: రెండు వేళ్లతో ఎడమవైపునకు లేదా కుడివైపుకి స్వైప్ చేయండి.
    • దగ్గరగా లేదా దూరంగా జూమ్ చేయడానికి: స్క్రీన్‌పై రెండు వేళ్లను ఉంచి ఆ వేళ్లను దగ్గరకు లేదా దూరానికి జరపండి.
    • కాన్వాస్‌ని ప్యాన్ చేయడానికి: స్క్రీన్‌పై రెండు వేళ్లతో లాగండి.

ఆకారాలను ఎంచుకోవడం, సవరించడం మరియు ఎంపికను తొలగించడం 

  1. స్లయిడ్‌లు యాప్‌ను తెరవండి.
  2. ఫోకస్‌ను ప్రెజెంటేషన్ పైకి తరలించి, ఎంచుకోవడానికి రెండుసార్లు నొక్కండి.
  3. ఫోకస్‌ను ఆకారం లేదా గుంపు పైకి తరలించి, ఎంచుకోవడానికి రెండుసార్లు నొక్కండి.
  4. ఎంచుకున్న ఆకారాన్ని సవరించడానికి, మళ్ళీ రెండుసార్లు నొక్కండి.
  5. అన్ని ఆకారాల ఎంపికను తొలగించడానికి, ఫోకస్‌ను కాన్వాస్‌కు తరలించి, రెండుసార్లు నొక్కండి.

ఆకారాన్ని తరలించడం

  1. స్లయిడ్‌లు యాప్‌ను తెరవండి.
  2. ఫోకస్‌ను ప్రెజెంటేషన్ పైకి తరలించి, ఎంచుకోవడానికి రెండుసార్లు నొక్కండి.
  3. ఫోకస్‌ను ఆకారం పైకి తరలించండి.
  4. "ఆకారాలను తరలించడానికి లాగండి" అని మీకు వినిపించేవరకు రెండుసార్లు నొక్కి, పట్టుకోండి. 
  5. ఆకారాన్ని తరలించడానికి మీ వేలితో లాగండి.

ఆకారాన్ని తిప్పడం

  1. స్లయిడ్‌లు యాప్‌ను తెరవండి.
  2. ఫోకస్‌ను ప్రెజెంటేషన్ పైకి తరలించి, ఎంచుకోవడానికి రెండుసార్లు నొక్కండి.
  3. ఫోకస్‌ను ఆకారం పైకి తరలించి, ఎంచుకోవడానికి రెండుసార్లు నొక్కండి.
  4. ఫోకస్ భ్రమణ హ్యాండిల్‌ను చేరే వరకు కుడివైపు స్వైప్ చేయండి.
  5. "ఆకారాలను తిప్పడానికి లాగండి" అని మీకు వినిపించేవరకు రెండుసార్లు నొక్కి, పట్టుకోండి. 
  6. ఆకారాన్ని తిప్పడానికి మీ వేలితో లాగండి.

సహకారి ప్రకటనలను ఆఫ్ చేయడం

మీరు మీ ప్రెజెంటేషన్‌లోకి ప్రవేశించే లేదా నిష్క్రమించే ఇతర వ్యక్తుల గురించి వచ్చే స్క్రీన్ రీడర్ ప్రకటనలను ఆపివేయవచ్చు.

  1. మరిన్ని ఎంపికలుకు వెళ్ళండి.
  2. ప్రవేశాలు మరియు నిష్క్రమణలను మ్యూట్ చేయిను ఎంపిక చేయండి.

కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించండి

మీరు మీ పరికరంతో జత చేసిన కీబోర్డ్‌ను ఉపయోగిస్తే, మీరు కీ‌బోర్డ్‌ షార్ట్‌కట్‌లను డాక్స్, షీట్‌లు మరియు స్లయిడ్‌లు యాప్‌లలో ఉపయోగించవచ్చు. Android షార్ట్‌కట్‌ల జాబితా కోసం, డాక్స్ షార్ట్‌కట్‌లు, షీట్‌లు షార్ట్‌కట్‌లు, మరియు స్లయిడ్‌లు షార్ట్‌కట్‌లును చూడండి.

బ్రెయిలీ డిస్‌ప్లేను ఉపయోగించండి

డాక్స్ మరియు స్లయిడ్‌ల యాప్‌లలో, వచనాన్ని చదవడానికి మరియు నమోదు చేయడానికి, మీరు బ్రెయిలీ డిస్‌ప్లేని ఉపయోగించవచ్చు. బ్రెయిలీ మద్దతు గురించి తెలుసుకోండి.

 

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
11439763312017952916
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false