స్క్రీన్ రీడర్‌తో సహకరించండి & వ్యాఖ్యానించండి

ముఖ్యమైనది: దిగువన పేర్కొన్న దశలను అనుసరించే ముందు, మీరు డాక్స్ స్క్రీన్ రీడర్ మద్దతును ఆన్ చేశారని నిర్ధారించుకోండి.

ఫైల్‌ను షేర్ చేయండి

 1. మీ బ్రౌజర్ కోసం షార్ట్‌కట్ కీని ఉపయోగించి ఫైల్ మెనును ప్రారంభించడానికి:
  • Chromeని ఉపయోగించే Windowsలో: Alt + f
  • Windowsని ఉపయోగించే ఇతర బ్రౌజర్‌లలో: Alt + Shift + f 
  • Chrome OSలో: Alt + f
  • Mac: ముందుగా పాస్-త్రూ కీలు Ctrl + Option + Tab నొక్కి, ఆపై Ctrl + Option + f 
 2. షేర్ చేయి ఎంచుకుని, ఆపై షేరింగ్ డైలాగ్‌ను ఉపయోగించి వ్యక్తులను జోడించండి.

ఫైల్‌లని షేర్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.

నిజ సమయంలో ఇతర వ్యక్తులతో పని చేయండి 

చిట్కా: డాక్యుమెంట్‌లు, స్ప్రెడ్‌షీట్‌లు, ప్రెజెంటేషన్‌లు మరియు డ్రాయింగ్‌ల కోసం సహకారం నిజ సమయంలో అందుబాటులో ఉంది, కానీ ఫారమ్‌ల కోసం లేదు.
మీరు షేర్ చేసిన ఫైల్‌ను సవరిస్తున్నట్లయితే, ఇతర వ్యక్తులు ఎవరైనా ఫైల్‌లోకి ప్రవేశించినప్పుడు లేదా నిష్క్రమించినప్పుడు మీ స్క్రీన్ రీడర్ ప్రకటిస్తుంది. డాక్యుమెంట్‌లు, ప్రెజెంటేషన్‌లు మరియు డ్రాయింగ్‌లలో, మీరు వేరే వ్యక్తి సవరిస్తున్నవచనానికి లేదా చిత్రానికి సమీపంలో ఉంటే మీకొక నోటిఫికేషన్ వినపడుతుంది. 

Google డాక్స్

ప్రస్తుతం డాక్యుమెంట్‌ లో ఎవరు పని చేస్తున్నారో తెలుసుకోవడానికి మరియు నిజ సమయంలో సహకారుల సవరణల గురించి వివరణ వినడానికి:

మీ సహకారులందరి సవరణలను అనుసరించడానికి:

 1. మీరు స్క్రీన్ రీడర్ మద్దతును ఆన్ చేశారని నిర్ధారించుకోండి. 
 2. మీ సహకారులందరి ప్రత్యక్ష సవరణలను కనుగొనడానికి షార్ట్‌కట్ కీని ఉపయోగించండి:
  • Windows మరియు Chrome OSలో: Ctrl + Alt + Shift + r
  • Macలో: ⌘+Option+Shift+r

ఒక సహకారి సవరణలను అనుసరించడానికి:

 1. మీరు స్క్రీన్ రీడర్ మద్దతును ఆన్ చేశారని నిర్ధారించుకోండి.
 2. మీ బ్రౌజర్ కోసం షార్ట్‌కట్ కీని ఉపయోగించి మెనూ బార్‌కు తరలండి:
  • Chromeని ఉపయోగించే Windowsలో: Alt + f
  • Windowsని ఉపయోగించే ఇతర బ్రౌజర్‌లలో: Alt + Shift + f 
  • Chrome OSలో: Alt + f
  • Mac: ముందుగా పాస్-త్రూ కీలు Ctrl + Option + Tab నొక్కి, ఆపై Ctrl + Option + f 
 3. మీరు "సహకారులు"ను చేరే వరకు Shift + Tabను నొక్కండి. 
 4. జాబితాలోని సహకారి పేరు మీద Enter నొక్కండి. వారి ప్రత్యక్ష సవరణలను అనుసరించడానికి సహకారి చురుకుగా ఉండాలి.

ఒక సహకారి లేదా బహుళ సహకారులు చేసిన మునుపటి సవరణలను చూడటానికి, ఈ కింది కీలను ఉపయోగించండి:

 • ఒక మార్పుతో పైకి లేదా కిందకి తరలడానికి: Up లేదా Down arrow
 • 10 ఎడిట్‌లతో పైకి లేదా కిందకి తరలడానికి: Page Up లేదా Page Down
 • జాబితాలోని మొదటి లేదా చివరి ఎడిట్‌కి తరలడానికి: Home లేదా End
 • మార్పు జరిగిన ఎడిటింగ్ ప్రాంతానికి వెళ్ళడానికి: మార్పుపై Enter నొక్కండి.

చిట్కాలు:

 • డాక్యుమెంట్‌లో సూచించిన సవరణలు మరియు వ్యాఖ్యలు మార్పుగా జాబితా చేయబడవు. 
 • ఒకవేళ డాక్యుమెంట్‌ మునుపటి వెర్షన్‌కు పునరుద్ధరించబడితే, మార్పుల జాబితాను కోల్పోతారు. 
 • మీరు ఇతర వ్యక్తులతో చాట్ చేయగల చాట్ విండోను తెరవడానికి, Shift + Escapeను నొక్కండి.

Google డాక్స్, షీట్‌లు, స్లయిడ్‌లు & డ్రాయింగ్‌లు

ప్రస్తుతం డాక్యుమెంట్‌ లో ఎవరు పని చేస్తున్నారో తెలుసుకోవడానికి:

 1. మీ బ్రౌజర్ కోసం షార్ట్‌కట్ కీని ఉపయోగించి మెనూ బార్‌కు తరలండి:
  • Chromeని ఉపయోగించే Windowsలో: Alt + f
  • Windowsని ఉపయోగించే ఇతర బ్రౌజర్‌లలో: Alt + Shift + f 
  • Chrome OSలో: Alt + f
  • Mac: ముందుగా పాస్-త్రూ కీలు Ctrl + Option + Tab నొక్కి, ఆపై Ctrl + Option + f 
 2. మీరు "సహకారులు"ను చేరే వరకు Shift + Tabను నొక్కండి.
 3. ఫైల్‌లోని ఒక వ్యక్తి స్థానానికి వెళ్లడానికి, జాబితాలో ఆ వ్యక్తి పేరుపై Enter నొక్కండి.

మీరు ఇతర వ్యక్తులతో చాట్ చేయగల చాట్ విండోను తెరవడానికి, Shift + Escapeను నొక్కండి.

సహకారి ప్రకటనలను ఆఫ్ చేయి

డాక్యుమెంట్‌లు, స్ప్రెడ్‌షీట్‌లు మరియు ప్రెజెంటేషన్‌లలో, మీరు ఫైల్‌లోకి ప్రవేశిస్తున్న, సవరిస్తున్న లేదా నిష్క్రమిస్తున్న ఇతర వ్యక్తుల గురించి వచ్చే స్క్రీన్ రీడర్ ప్రకటనలను ఆపివేయవచ్చు.

 1. సాధనాల మెనులో, యాక్సెసిబిలిటీ సెట్టింగ్‌లు ఎంచుకోండి.
 2. సహకారి ప్రకటనలను ఆన్ చేయి ఎంపికను తొలగించండి .
ఇది సహాయకరంగా ఉందా?
మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయి
శోధనను మూసివేయి
Google యాప్‌లు
ప్రధాన మెనూ
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
35
false