శ్రేణి అనేది ఓ విలువల పట్టిక (అడ్డు వరుసలు మరియు నిలువు వరుసలను కలిగి ఉంటుంది). మీరు మీ సెల్‌లలోని విలువలను ఒక నిర్దిష్ట క్రమంలో సమూహపరచాలనుకుంటే, మీరు మీ స్ప్రెడ్‌షీట్‌లో శ్రేణులను ఉపయోగించవచ్చు.
కొన్ని ఫంక్షన్‌లు శ్రేణులను అందిస్తాయి ఉదాహరణకు, IMPORTRANGE
పేర్కొన్న పరిధిని మరొక స్ప్రెడ్‌షీట్ నుండి దిగుమతి చేయడం ద్వారా విలువల శ్రేణిని అందిస్తుంది. మీరు IMPORTRANGE
ని ఉపయోగించి ఫార్ములా రాసేటప్పుడు, మీరు దాని శ్రేణి ఫలితాలు కుడి మరియు కింద ఉన్న సెల్‌లలోకి వ్యాపించడాన్ని చూస్తారు.
(ఉదా. A1:B6) అనే పరిధిని ఇన్‌పుట్ పారామీటర్‌గా తీసుకునే ఏ ఫంక్షన్ అయినా దాని స్థానంలో శ్రేణిని కూడా అంగీకరిస్తుంది. ఉదాహరణకు, SPARKLINE
విలువలను నిర్దేశించడానికి ఒక పరిధిని మొదటి పారామీటర్‌గా తీసుకుంది అనుకుందాం. మీరు IMPORTRANGE
యొక్క శ్రేణి ఫలితాన్ని SPARKLINE యొక్క
ఇన్‌పుట్‌గా ఉపయోగించవచ్చు.
=SPARKLINE(IMPORTRANGE(...))
శ్రేణులను సృష్టించండి
మీరు బ్రాకెట్‌లను { } ఉపయోగించడం ద్వారా మీ స్ప్రెడ్‌షీట్‌లోని ఫార్ములాలో మీ స్వంత శ్రేణులను కూడా సృష్టించుకోవచ్చు. విలువలు ఏ క్రమంలో ప్రదర్శించబడాలో నిర్ణయించడానికి మీరు ఈ కింది విరామచిహ్నాలను ఉపయోగిస్తున్నప్పుడు, విలువలను సమూహపరచడానికి బ్రాకెట్‌లు మిమ్మల్ని అనుమతిస్తాయి:
- కామాలు: అడ్డు వరుస డేటాను ఒక శ్రేణిలో వ్రాయడంలో మీకు సహాయపడటానికి నిలువు వరుసలను వేరు చేస్తాయి. ఉదాహరణకు,
={1, 2}
నంబర్ 1ని మొదటి సెల్‌లో ఉంచుతుంది మరియు నంబర్ 2ని కొత్త నిలువ వరుసకి కుడివైపు ఉన్న సెల్‌లో ఉంచుతుంది. - సెమికోలన్‌లు: నిలువు వరుస డేటాను ఒక శ్రేణిలో వ్రాయడంలో మీకు సహాయపడటానికి అడ్డు వరుసలను వేరు చేస్తాయి. ఉదాహరణకు,
={1; 2}
నంబర్ 1ని మొదటి సెల్‌లో ఉంచుతుంది మరియు నంబర్ 2ని కొత్త అడ్డు వరుసకి కింద ఉన్న సెల్‌లో ఉంచుతుంది.
గమనిక: కామాలను దశాంశ విభాజకాలుగా ఉపయోగించే దేశాలకు (ఉదాహరణకు €1,00), శ్రేణులను సృష్టించేటప్పుడు కామాలు బ్యాక్‌స్లాష్‌లతో (\) భర్తీ చేయబడతాయి.
మీరు ఇదే విరామచిహ్నాన్ని ఉపయోగించి బహుళ పరిధులను ఒక నిరంతర పరిధిగా చేర్చవచ్చు. ఉదాహరణకు, A1-A10 విలువలను, D1-D10 విలువలతో కలపడానికి, మీరు ఈ కింది ఫార్ములాను ఉపయోగించి నిరంతర నిలువు వరుసలో ఒక పరిధిని సృష్టించవచ్చు: ={A1:A10; D1:D10}
ఇప్పటికే ఉన్న ఫార్ములాలకు శ్రేణులను జోడించడం
మీ ఫార్ములాలు అందించే ఫలితాలను ఒక క్రమపధ్ధతిలో అడ్డు వరుసలు లేదా నిలువు వరుసలుగా నిర్వహించడానికి మీరు బ్రాకెట్‌లను ఉపయోగించి ఇప్పటికే ఉన్న ఇతర ఫార్ములాలతో కూడా శ్రేణులను ఉపయోగించవచ్చు.
ఉదాహరణకు, ={SUM(A1:A10), SUM(B1:B10)}
రెండు విలువలను అందిస్తుంది. మొదటి సెల్ A1 నుండి A10 వరకు గల మొత్తాన్ని కలిగి ఉంటుంది, కుడి వైపున ఉన్న సెల్ B1 నుండి B10 వరకు గల మొత్తాన్ని కలిగి ఉంటుంది.