స్ప్రెడ్‌షీట్‌లో నంబర్‌లను ఫార్మాట్ చేయండి

మీరు Google షీట్‌లలో మీ డేటాని అనేక విధాలుగా ఫార్మాట్ చేయవచ్చు తద్వారా స్ప్రెడ్‌షీట్ మరియు దానిలోని కంటెంట్‌లు మీరు కోరుకున్న విధంగా ప్రదర్శించబడతాయి.

నంబర్‌లు, తేదీలు మరియు కరెన్సీలను ఆకృతీకరించండి

స్ప్రెడ్‌షీట్‌లో నంబర్‌లు, తేదీలు లేదా కరెన్సీల ఆకృతిని ఫార్మాట్ చేయడానికి లేదా మార్చడానికి:

  1. మీ కంప్యూటర్‌లో Google షీట్‌లలో స్ప్రెడ్‌షీట్‌ని తెరవండి.
  2. మీరు ఆకృతీకరించాలనుకుంటున్న లేదా సవరించాలనుకుంటున్న సెల్‌ల పరిధిని ఎంచుకోండి.
  3. ఫార్మాట్ ఆ తర్వాత నంబర్ క్లిక్ చేయండి.
  4. సెల్‌ల పరిధికి వర్తింపజేయడానికి ఆకృతిని ఎంచుకోండి.

నంబర్‌లు, తేదీలు మరియు కరెన్సీల అనుకూల ఆకృతీకరణ

మీరు కరెన్సీలు, తేదీలు మరియు నంబర్‌ల కోసం అనుకూల ఆకృతీకరణను వర్తింపజేయవచ్చు. వీటిలో ప్రతిదానికి, మీరు మీ స్ప్రెడ్‌షీట్ కోసం పనిచేసే ఆకృతిని కనుగొనడానికి ఫార్మాటింగ్ మెనుల్లో కనిపించే టెక్స్ట్ బాక్స్‌లలో శోధించవచ్చు. మీరు వెతుకుతున్నదాన్ని మీరు కనుగొనలేకపోతే, మీరు ఇప్పుడు మెనుల్లో మీ స్వంత అనుకూల ఆకృతీకరణను సృష్టించవచ్చు.

అనుకూల తేదీ ఆకృతీకరణ

మీ స్ప్రెడ్‌షీట్‌కు అనుకూల తేదీ లేదా సమయ ఆకృతిని వర్తింపచేయడానికి:

  1. మీ కంప్యూటర్‌లో Google షీట్‌లలో స్ప్రెడ్‌షీట్‌ని తెరవండి.
  2. మీరు ఫార్మాట్ చేయాలనుకుంటున్న డేటాను హైలైట్ చేయండి.
  3. ఫార్మాట్ ఆ తర్వాత నంబర్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. అనుకూల తేదీ, సమయం ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. ఫార్మాట్‌ను ఎంచుకోవడానికి మెనూ టెక్స్ట్ బాక్స్‌లో సెర్చ్ చేయండి. మీరు టెక్స్ట్ బాక్స్‌లో మీ స్వంత అనుకూల తేదీ లేదా సమయ ఆకృతిని కూడా జోడించవచ్చు.
  6. వర్తింపజేయి ఎంపికపై క్లిక్ చేయండి.

డిఫాల్ట్‌గా, పైకి కనిపించే సమయ మరియు తేదీ ఎంపికలు మీ స్ప్రెడ్‌షీట్ లొకేల్‌పై ఆధారపడి ఉంటాయి.

మీరు మీ ఆకృతీకరణకు మరింత వివరణాత్మక సమయ లేదా తేదీ విలువలను జోడించాలనుకుంటే, ఉదాహరణకు గంట లేదా నిమిషం, మెను టెక్స్ట్ బాక్స్ యొక్క కుడి మూలలోని డౌన్ యారోని క్లిక్ చేసి, అదనపు విలువను ఎంచుకోండి. విలువలోని బాణాలపై క్లిక్ చేసి, ఒక ఎంపికను ఎంచుకోవడం ద్వారా మీరు ఈ విలువల కోసం నిర్దిష్ట ఆకృతీకరణను సర్దుబాటు చేయవచ్చు. మీ ఆకృతీకరణ నుండి విలువను తొలగించాలంటే, విలువను క్లిక్ చేసి తొలగించు ఎంచుకోండి.

అనుకూల కరెన్సీ ఆకృతీకరణ

మీ స్ప్రెడ్‌షీట్‌కి అనుకూల కరెన్సీ ఆకృతిని వర్తింపజేయాలంటే:

  1. మీ కంప్యూటర్‌లో Google షీట్‌లలో స్ప్రెడ్‌షీట్‌ని తెరవండి.
  2. మీరు ఫార్మాట్ చేయాలనుకుంటున్న డేటాను హైలైట్ చేయండి.
  3. ఫార్మాట్ ఆ తర్వాత నంబర్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. అనుకూల కరెన్సీ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. ఫార్మాట్‌ను ఎంచుకోవడానికి మెనూ టెక్స్ట్ బాక్స్‌లో సెర్చ్ చేయండి. మీరు టెక్స్ట్ బాక్స్‌లో మీ స్వంత అనుకూల కరెన్సీ ఆకృతిని కూడా జోడించవచ్చు.
  6. వర్తింపజేయి ఎంపికపై క్లిక్ చేయండి.

ఇన్‌పుట్ బాక్స్ కూడి మూలన ఉన్న డ్రాప్-డౌన్ మెనుని క్లిక్ చేసి కోరుకున్న ఎంపికను ఎంచుకోవడం ద్వారా మీరు కరెన్సీకి సంబంధించి కొన్ని లక్షణాలను కూడా మార్చవచ్చు (ఉదాహరణకు, చూపాల్సిన డెసిమల్ స్థానాలు).

అనుకూల నంబర్ ఆకృతీకరణ

మీ స్ప్రెడ్‌షీట్‌కి అనుకూల నంబర్ ఆకృతిని వర్తింపజేయాలంటే:

  1. మీ కంప్యూటర్‌లో Google షీట్‌లలో స్ప్రెడ్‌షీట్‌ని తెరవండి.
  2. మీరు ఫార్మాట్ చేయాలనుకుంటున్న డేటాను హైలైట్ చేయండి.
  3. ఫార్మాట్ ఆ తర్వాత నంబర్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. అనుకూల నంబర్ ఫార్మాట్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. ఆకృతిని ఎంచుకోవడానికి మెను టెక్స్ట్ బాక్స్‌లో శోధించండి. మీరు టెక్స్ట్ బాక్స్‌లో మీ స్వంత అనుకూల నంబర్ ఆకృతిని కూడా జోడించవచ్చు.
  6. వర్తింపజేయి ఎంపికపై క్లిక్ చేయండి.

అనుకూల ఆకృతిని సృష్టించేటప్పుడు, ఆకృతీకరణ సెమికోలన్‌లచే వేరు చేయబడిన 4 భాగాలను కలిగి ఉంటుందని గమనించండి: పాజిటివ్;నెగటివ్;సున్నా;నాన్-న్యూమరిక్. ఆర్థిక ఆకృతులకు కూడా మద్దతు ఉంది.

ఆకృతి యొక్క కోరిన భాగంలో ఎక్కడైనా బ్రాకెట్‌లలో (ఉదాహరణకు, [ఎరుపు]) రంగును జోడించడం ద్వారా మీరు ఆకృతీకరణలో రంగులను ఉపయోగించవచ్చు, ఉదాహరణకు, పాజిటివ్ మరియు నెగటివ్ నంబర్‌ల మధ్య తేడాను గుర్తించడానికి. ఆకృతీకరణ రంగులను ఇంగ్లీష్‌లో ఉపయోగించాలి. ఉపయోగించగలిగిన రంగులు ఏవంటే:

అనుకూల నంబర్ ఆకృతిని సృష్టించడానికి ఉపయోగించే సాధారణ వాక్యనిర్మాణ అక్షరాల జాబితా ఇక్కడ ఉంది:

అక్షరం వివరణ
0 నంబర్‌లో ఒక అంకె. ఫలితాలలో విలువ లేని 0 కనిపిస్తుంది.
# నంబర్‌లో ఒక అంకె. ఫలితాలలో విలువ లేని 0 కనిపించదు.
? నంబర్‌లో ఒక అంకె. విలువ లేని 0 ఫలితాలలో ఖాళీ వలే కనిపిస్తుంది.
$ నంబర్‌లను డాలర్ విలువ వలే ఆకృతీకరిస్తుంది.
.(ఫుల్‌స్టాప్)

దశాంశ విభజనతో నంబర్‌లను ఫార్మాట్ చేస్తుంది.

  • స్ప్రెడ్‌షీట్ లొకేల్ అనేది అన్ని సంఖ్యా విలువలకు దశాంశ విభజనగా ఏ అక్షరాన్ని ఉపయోగించాలో నిర్ణయిస్తుంది.
  • మీరు సంఖ్యా కీప్యాడ్‌లో దశాంశ కీని నొక్కినప్పుడు, స్ప్రెడ్‌షీట్ లొకేల్ ఇన్‌సర్ట్ చేసిన అక్షరాన్ని కూడా నిర్ణయిస్తుంది.
,(కామా) నంబర్‌లను వేల విభజనతో ఆకృతీకరిస్తుంది.
/ నంబర్‌లను భిన్నం వలే ఆకృతీకరిస్తుంది.
% నంబర్‌లను శాతం వలే ఆకృతీకరిస్తుంది
E నంబర్‌లను ఘాతాంకంగా ఆకృతీకరిస్తుంది.
"వచనం" సూత్రానికి వచనాన్ని జోడిస్తుంది. కోరుకున్న వచనం కనిపించాలంటే దానిని కొటేషన్‌లలో చేర్చండి.
@

సెల్‌లో నమోదు చేసిన వచనాన్ని ప్రదర్శిస్తుంది.

*

సెల్‌లోని మిగతా ఖాళీని పూరించడానికి ఈ అక్షరాన్ని పునరావృతం చేస్తుంది.

_ (అండర్‌స్కోర్)

కింది అక్షరానికి సమానమైన వెడల్పు ఉండే స్పేస్‍ను జోడిస్తుంది.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15255167779147225468
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false