మీరు ఇలాంటి ఫైల్‌లను సృష్టించవచ్చు, కనుగొనవచ్చు మరియు డౌన్‌లోడ్ చేయవచ్చు:
- డాక్యుమెంట్‌లు
- స్ప్రెడ్‌షీట్‌లు
- ప్రెజెంటేషన్‌లు
- ఫారమ్‌లు
- వీడియోలు
మీ ఫైల్స్ ఎడిట్ చేయడానికి, షేర్ చేయడానికి ఇతరులతో కలిసి పనిచేయడానికి అందుబాటులో ఉన్నాయి. Google Driveలో ఫైల్స్‌ను ఎలా కనుగొనాలో తెలుసుకోండి.
ముఖ్య గమనిక: ఫిషింగ్ లేదా మాల్‌వేర్ ఉన్నట్లు అనుమానించిన ఫైల్‌ను మీరు తెరవడానికి ట్రై చేస్తే, మీరు హెచ్చరికను పొందవచ్చు. మీరు ఫైల్‌ను తెరిచినప్పుడు జాగ్రత్త వహించండి.
ఫైల్‌ని సృష్టించండి
- మీ కంప్యూటర్‌లో, Google Docs, Sheets, Slides, Forms లేదా Vids మొదటి స్క్రీన్‌ను తెరవండి.
- క్రియేట్ చేయండి
ని క్లిక్ చేయండి.
మీరు ఇవి కూడా చేయవచ్చు:
ఫైల్‌ను సేవ్ చేయండి
- మీరు ఆన్‌లైన్‌లో ఉండి టైప్ చేస్తున్నప్పుడు, మీరు చేసే మార్పులను Google ఆటోమేటిక్‌గా సేవ్ చేస్తుంది. మీకు 'సేవ్ చేయి' బటన్ అవసరం లేదు.
- మీరు ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి లేకపోతే, మీ మార్పులను సేవ్ చేసేందుకు మీరు ఆఫ్‌లైన్ యాక్సెస్‌ను సెటప్ చేయవచ్చు.
- ఒకసారి Docs, Sheets, Slides, లేదా Formsకు ఆఫ్‌లైన్ యాక్సెస్‌ను ఆన్ చేశాక, మీరు టెక్స్ట్‌ను ఎంటర్ చేసినప్పుడు మార్పులు మీ పరికరంలో సేవ్ అవుతాయి, మళ్లీ కనెక్ట్ చేసిన తర్వాత Driveలో సేవ్ అవుతాయి.
- మీరు Google Vidsలో ఫైల్‌ను .mp4గా సేవ్ చేయవచ్చు. "షేర్ చేయండి" పక్కన ఉన్న క్విక్ షేరింగ్ చర్యలు
Driveకు ఎగుమతి చేయండి
ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
ఫైల్‌ని వీక్షించండి
మీరు ఏదైనా కంప్యూటర్‌లో మరియు Microsoft® Word, Excel, లేదా PowerPoint ఫైల్‌ల లాంటి ఇతర డాక్యుమెంట్‌లలో సృష్టించిన లేదా తెరిచిన ఫైల్‌లను వీక్షించేందుకు:
చిట్కా: మీరు ఇతరులు ఎవరికైనా మీ ఫైల్‌ని షేర్ చేసినట్లయితే, వారు మార్పులు చేసినప్పుడు అవి కూడా పొందుతారు.
ఫైల్ పేరు మార్చండి
మీరు కొత్త డాక్యుమెంట్‌ను, స్ప్రెడ్‌షీట్‌ను లేదా ప్రజెంటేషన్‌ను, లేదా వీడియోను క్రియేట్ చేసినప్పుడు, దాని పేరు ఆటోమేటిక్‌గా “పేరులేని డాక్యుమెంట్,” “పేరులేని స్ప్రెడ్‌షీట్,” లేదా “పేరులేని ప్రజెంటేషన్” లేదా “పేరులేని వీడియో” అని ఉంటుంది. ఫైల్ పేరు మార్చడానికి:
- ఫైల్ ఎగువున ఉన్న పేరును క్లిక్ చేయండి.
- కొత్త పేరును టైప్ చేయండి.
- Enterను నొక్కండి.
చిట్కా: మీరు ఇతరులు ఎవరికైనా మీ ఫైల్‌ని షేర్ చేసినట్లయితే, వారు మార్పులు చేసినప్పుడు అవి కూడా పొందుతారు.
ఫైల్ యొక్క కాపీని రూపొందించండి
- మీ కంప్యూటర్‌లో, Google Docs, Sheets, Slides, Forms లేదా Vids మొదటి స్క్రీన్‌ను తెరవండి.
- మీరు ఏ ఫైల్‌కు అయితే కాపీని క్రియేట్ చేయాలనుకుంటున్నారో, దానిని తెరవండి.
- మెనూలో, ఫైల్
కాపీని రూపొందించును క్లిక్ చేయండి.
- ఒక పేరును టైప్ చేసి, దానిని ఎక్కడ సేవ్ చేయాలో ఎంచుకోండి.
- మీరు డాక్యుమెంట్, స్ప్రెడ్‌షీట్, ప్రజెంటేషన్, లేదా వీడియో నుండి కామెంట్‌లను కాపీ చేయాలనుకుంటే, కామెంట్‌లు, సూచనలను కాపీ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. మీకు కావాలంటే, మీ కొత్త కాపీలో పరిష్కరించిన కామెంట్‌లను, సూచనలను కూడా చేర్చవచ్చు.
- సరే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
ఫైల్ యొక్క కాపీని డౌన్‌లోడ్ చేయండి
- మీ కంప్యూటర్‌లో, Google Docs, Sheets, Slides, Forms లేదా Vids మొదటి స్క్రీన్‌ను తెరవండి.
- ఒక డాక్యుమెంట్‌ను, స్ప్రెడ్‌షీట్‌ను, ప్రజెంటేషన్‌ను లేదా వీడియోను తెరవండి.
- ఎగువున, ఫైల్
డౌన్‌లోడ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- Google Vidsలో, ఫైల్
MP4గా డౌన్‌లోడ్ చేయండి క్లిక్ చేయండి.
- Google Vidsలో, ఫైల్
- ఫైల్ రకాన్ని ఎంచుకోండి. ఫైల్ మీ కంప్యూటర్‌లో డౌన్‌లోడ్ అవుతుంది.
- చిట్కా: Vids ఫైల్స్ .mp4లుగా డౌన్‌లోడ్ అవుతాయి, అలాగే అవి సాధారణంగా పెద్దగా ఉంటాయి, కాబట్టి డౌన్‌లోడ్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది.
చిట్కా: Chromeలో పెద్ద Google డాక్స్ ఫైల్‌ని .pdf ఫైల్‌గా డౌన్‌లోడ్ చేసేందుకు:
- మీ కంప్యూటర్‌లో, Google డాక్యుమెంట్ తెరవండి.
- ఎగువున, ఫైల్
ప్రింట్ క్లిక్ చేయండి.
- ఎడమ వైపు, "గమ్యస్థానం" ప్రక్కన, PDFగా సేవ్ చేయి ఎంచుకోండి.
- ఎగువన, సేవ్ చేయి క్లిక్ చేయండి.