ఫైల్‌ని సృష్టించండి, కనుగొనండి లేదా డౌన్‌లోడ్ చేయండి

కార్యాలయం లేదా పాఠశాల కోసం Google Docs నుండి మరిన్ని ప్రయోజనాలు పొందాలనుకుంటున్నారా? ఉచిత Google Workspace ట్రయల్ కోసం సైన్ అప్ చేయండి.

మీరు ఇలాంటి ఫైల్‌లను సృష్టించవచ్చు, కనుగొనవచ్చు మరియు డౌన్‌లోడ్ చేయవచ్చు:

 • డాక్యుమెంట్‌లు
 • స్ప్రెడ్‌షీట్‌లు
 • ప్రెజెంటేషన్‌లు
 • ఫారమ్‌లు

మీ ఫైల్‌లు ఎడిట్ చేయడానికి, షేర్ చేయడానికి మరియు ఇతరులతో కలిసి పనిచేయడానికి అందుబాటులో ఉన్నాయి.

ఫైల్‌ని సృష్టించండి

 1. మీ కంప్యూటర్‌లో, Google డాక్స్, షీట్‌లు, స్లయిడ్‌లు, లేదా ఫారమ్‌ల హోమ్ స్క్రీన్ తెరవండి.
 2. సృష్టించు కూడిక చిహ్నం క్లిక్ చేయండి.

మీరు టెంప్లేట్ నుండి కూడా డాక్యుమెంట్‌ని సృష్టించవచ్చు.

ఫైల్‌‍ను సేవ్ చేయండి

మీరు ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు, మీరు టైప్ చేస్తే మీ Google ఫైల్‌లు సేవ్ చేయబడతాయి. మీకు సేవ్ చేయి బటన్ అవసరం లేదు.

మీరు ఇంటర్నెట్‌కి కనెక్ట్ చేయబడకపోతే, మీ మార్పులను సేవ్ చేసేందుకు మీరు ఆఫ్‌లైన్ యాక్సెస్‌ని సెటప్ చేయగలరు.
చిట్కా: Google షీట్‌లలో సేవ్ చేయడానికి, మీరు టైప్ చేసిన సెల్ వెలుపల క్లిక్ చేయండి. 

ఫైల్‌ని వీక్షించండి

మీరు ఏదైనా కంప్యూటర్‌లో మరియు Microsoft® Word, Excel, లేదా PowerPoint ఫైల్‌ల లాంటి ఇతర డాక్యుమెంట్‌లలో సృష్టించిన లేదా తెరిచిన ఫైల్‌లను వీక్షించేందుకు:

 1. మీ కంప్యూటర్‌లో, Google డాక్స్, షీట్‌లు, లేదా స్లయిడ్‌లు హోమ్ స్క్రీన్ తెరవండి.
 2. మీరు వీక్షించాలనుకుంటున్న డాక్యుమెంట్, స్ప్రెడ్‌షీట్ లేదా ప్రెజెంటేషన్‌లను క్లిక్ చేయండి.

చిట్కా: మీరు ఇతరులు ఎవరికైనా మీ ఫైల్‌ని షేర్ చేసినట్లయితే, వారు మార్పులు చేసినప్పుడు అవి కూడా పొందుతారు.

ఫైల్ పేరు మార్చండి

మీరు కొత్త డాక్యుమెంట్, స్ప్రెడ్‌షీట్, లేదా ప్రెజెంటేషన్‌ని సృష్టించినప్పుడు, దానికి ఆటోమేటిక్‌గా "పేరు పెట్టని డాక్యుమెంట్", "పేరు పెట్టని స్ప్రెడ్‌షీట్" లేదా "పేరు పెట్టని ప్రెజెంటేషన్" అని పేరు ఉంటుంది. ఫైల్‌కి పేరు మార్చేందుకు:

 1. ఫైల్ ఎగువున పేరును క్లిక్ చేయండి.
 2. కొత్త పేరును టైప్ చేయండి.
 3. Enter నొక్కండి.

చిట్కా: మీరు ఇతరులు ఎవరికైనా మీ ఫైల్‌ని షేర్ చేసినట్లయితే, వారు మార్పులు చేసినప్పుడు అవి కూడా పొందుతారు.

ఫైల్ యొక్క కాపీని రూపొందించండి

 1. మీ కంప్యూటర్‌లో, Google డాక్స్, షీట్‌లు, స్లయిడ్‌లు, లేదా ఫారమ్‌ల హోమ్ స్క్రీన్ తెరవండి.
 2. మీరు ఒక కాపీని రూపొందించాలనుకుంటున్న ఫైల్‌ని తెరవండి.
 3. మెనూలో, ఫైల్ ఆ తర్వాత కాపీని రూపొందించును క్లిక్ చేయండి.
 4. పేరును టైప్ చేసి దానిని ఎక్కడ సేవ్ చేయాలో ఎంచుకోండి.
  • మీరు ఒక డాక్యుమెంట్, స్ప్రెడ్‌షీట్ లేదా ప్రెజెంటేషన్ నుండి కామెంట్‌లను కాపీ చేయాలనుకుంటే, కామెంట్‌లు, సూచనలను కాపీ చేయిని క్లిక్ చేయండి. మీకు కావాలంటే, మీ కొత్త కాపీలో పరిష్కరించబడిన కామెంట్‌లు, సూచనలను కూడా చేర్చవచ్చు.
 5. సరేని క్లిక్ చేయండి.

ఫైల్ యొక్క కాపీని డౌన్‌లోడ్ చేయండి

 1. మీ కంప్యూటర్‌లో, Google డాక్స్, షీట్‌లు, స్లయిడ్‌లు, లేదా ఫారమ్‌ల హోమ్ స్క్రీన్ తెరవండి.
 2. డాక్యుమెంట్, స్ప్రెడ్‌షీట్ లేదా ప్రెజెంటేషన్‌లను తెరవండి.
 3. ఎగువున, ఫైల్ ఆ తర్వాత దీని వలె డౌన్‌లోడ్ చేయి క్లిక్ చేయండి.
 4. ఫైల్ రకాన్ని ఎంచుకోండి. ఫైల్ మీ కంప్యూటర్‌లో డౌన్‌లోడ్ అవుతుంది.

చిట్కా: Chromeలో పెద్ద Google డాక్స్ ఫైల్‌ని .pdf ఫైల్‌గా డౌన్‌లోడ్ చేసేందుకు:

 1. మీ కంప్యూటర్‌లో, Google డాక్యుమెంట్‌ తెరవండి.
 2. ఎగువున, ఫైల్ ఆ తర్వాత ప్రింట్ క్లిక్ చేయండి. 
 3. ఎడమ వైపు, "గమ్యస్థానం" ప్రక్కన, PDFగా సేవ్ చేయి ఎంచుకోండి.
 4. ఎగువన, సేవ్ చేయి క్లిక్ చేయండి.  
ఇది సహాయకరంగా ఉందా?
మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?