స్ప్రెడ్‌షీట్‌ని ఎడిట్ చేయండి & ఫార్మాట్ చేయండి


               

మీ బిజినెస్ కోసం అధునాతన Google Workspace ఫీచర్‌లు కావాలా?

ఈరోజే Google Workspaceను ట్రై చేయండి!

 

 

మీరు స్ప్రెడ్‌షీట్‌లో డేటాను జోడించవచ్చు, ఆ తర్వాత సెల్‌లు, అలాగే డేటాను ఎడిట్ లేదా ఫార్మాట్ చేయవచ్చు.

సెల్‌లో డేటాని సవరించండి

  1. Google షీట్‌లులో స్ప్రెడ్‌షీట్‌ని తెరవండి.
  2. ఖాళీగా ఉన్న సెల్‌ని క్లిక్ చేయండి, లేదా ఖాళీగా లేని సెల్‌ని రెండు-సార్లు క్లిక్ చేయండి.
  3. టైప్ చేయడాన్ని ప్రారంభించండి.
  4. ఐచ్ఛికం: సెల్‌లో మరో లైన్‌ని జోడించేందుకు Macలో ⌘ + Enter లేదా Windowsలో Ctrl + Enter నొక్కండి.
  5. మీరు పూర్తి చేసిన తర్వాత, Enter నొక్కండి.

ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సెల్‌లను ఫార్మాట్ చేయండి

  1. Google షీట్‌లులో స్ప్రెడ్‌షీట్‌ని తెరవండి.
  2. సెల్‌ని క్లిక్ చేసి, ఆ తర్వాత మీరు ఎంచుకోవాలనుకుంటున్న సమీపంలోని సెల్‌ల మీదుగా మీ మౌస్‌ని లాగండి లేదా Macలో లేదా Windowsలో Ctrl నొక్కిపట్టుకుని మరో సెల్‌ని క్లిక్ చేయండి.
  3. సెల్‌లో వచనం లేదా నంబర్‌లను ఫార్మాట్ చేసేందుకు, పైన ఉన్న టూల్‌బార్‌లోని ఎంపికలను ఉపయోగించండి.

మీ డేటాని ఫార్మాట్ చేయండి

మీ సెల్‌లు లేదా వచనాన్ని ఫార్మాట్ చేయడం కోసం ఇక్కడ కొన్ని ఎంపికలు ఉన్నాయి. మీరు ఈ ఎంపికలను డాక్యుమెంట్ పైన కనుగొనవచ్చు.

  • చర్యరద్దు చర్య రద్దు చేయి
  • మళ్లీ చేయి చర్య మళ్లీ చేయి
  • బోల్డ్ బోల్డ్
  • ఇటాలిక్ ఇటాలిక్
  • కొట్టివేత కొట్టివేత
  • ఫాంట్ లేదా ఫాంట్ పరిమాణాన్ని మార్చండి
  • రంగు వచనం టెక్స్ట్ రంగును మార్చండి
  • రంగును పూరించు సెల్ పూరణ రంగును మార్చండి
    • ఒకే రంగు
    • ప్రత్యామ్నాయ రంగులు
  • అంచులు సెల్ అంచులను మార్చండి
    • అంచు రంగు అంచు రంగును మార్చండి
    • అంచు శైలి అంచు స్టయిల్‌ను మార్చండి
  • సెల్‌లను విలీనం చేయండి సెల్‌లను విలీనం చేయండి
  • క్షితిజ సమాంతర వచన సమలేఖనాన్ని మార్చండి
  • నిలువు వచన సమలేఖనాన్ని మార్చండి
  • సెల్‌లో వచనాన్ని తిప్పండి
  • సర్దుబాటు సెల్‌లో వచనాన్ని సర్దుబాటు చేయండి

సెల్‌లో కొంత భాగం వచనాన్ని లేదా కంటెంట్‌ని ఫార్మాట్ చేసేందుకు సెల్‌ని రెండు సార్లు క్లిక్ చేసి, మీరు ఏమి ఫార్మాట్ చేయాలనుకుంటున్నారో ఎంచుకోండి, ఆ తర్వాత ఫార్మాటింగ్ ఎంపికను ఎంచుకోండి.

ఆబ్జెక్ట్‌లను సమలేఖనం చేయండి & పరిమాణం మార్చండి

మీరు కోరుకున్న చోటికి ఆబ్జెక్ట్‌ను తరలించండి లేదా దాని సైజ్‌ను మార్చండి. ఒక ఆబ్జెక్ట్ మరొక ఆబ్జెక్ట్‌కు సమానమైన సైజ్‌లో ఉన్నప్పుడు, ఆబ్జెక్ట్‌ల మధ్య సమానమైన స్పేస్‌తో ఏ విధంగా సర్దుబాటు చేయబడతాయో అదే విధంగా లైన్‌లు కనిపిస్తాయి.
సెల్‌లో సంఖ్యలు, తేదీలను ఫార్మాట్ చేయండి
  1. ఫార్మాట్ చేయాల్సిన సెల్‌ను ఎంచుకోండి.
  2. ఎగువున, ఫార్మాట్ ఆ తర్వాత సంఖ్యను క్లిక్ చేయండి.
  3. కనిపించే మెనూ నుండి, మీకు కావలసిన ఫార్మాట్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
    • మీకు కావలసిన ఫార్మాట్ ఆప్షన్, లిస్ట్ చేయబడకపోతే: కనిపించే మెనూ దిగువున, "అనుకూల తేదీ, సమయం", "అనుకూల సంఖ్య ఫార్మాట్" వంటి అనుకూల ఆప్షన్‌లను క్లిక్ చేయండి.

స్ప్రెడ్‌షీట్‌లో సంఖ్యలను ఫార్మాట్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.

రూపాన్ని జోడించండి

మీరు రూపాలతో ఉన్న పూర్తి స్ప్రెడ్‌షీట్‌కు చెందిన ఫార్మాట్‌కు మార్పులను వర్తింపజేయవచ్చు.

  1. Google Sheetsలో స్ప్రెడ్‌షీట్‌ను తెరవండి.
  2. ఎగువున, ఫార్మాట్ ఆ తర్వాతరూపం ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. అందుబాటులో ఉన్న రూపాన్ని ఎంచుకోండి లేదా మీ స్వంత రూపాన్ని క్రియేట్ చేయడానికి అనుకూలంగా మార్చండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

గమనికలు:

  • మీరు అనుకూల రూపాన్ని క్రియేట్ చేస్తే, అత్యంత ఇటీవలి వెర్షన్ సేవ్ చేయబడుతుంది.
  • మీ ప్రస్తుత రూపంలోని రంగులు టెక్స్ట్, పూరింపు రంగు ఎంపికలలో అందుబాటులో ఉంటాయి.

రూపం ద్వారా ప్రభావితమైన మీ స్ప్రెడ్‌షీట్‌లోని భాగాలు

  • టెక్స్ట్ ఫాంట్, గ్రిడ్ టెక్స్ట్, ఛార్ట్‌లు, పివోట్ టేబుల్స్ రంగు
  • గ్రిడ్ వచనం యొక్క హైపర్‌లింక్ రంగు
  • ఛార్ట్ బ్యాక్‌గ్రౌండ్ రంగు
  • ఛార్ట్‌లలోని సిరీస్‌ల రంగు
  • పివోట్ టేబుల్ బ్యాక్‌గ్రౌండ్

గమనిక: మీ స్ప్రెడ్‌షీట్‌లో మీరు ఒక ఐటెమ్ ఫార్మాట్‌ను మార్చినట్లయితే, అది రూపాన్ని ఓవర్‌రైడ్ చేస్తుంది.

సంబంధిత లింక్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
17754471077760411068
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false