మీ వాయిస్‌తో టైప్ చేయండి

మీరు Google Docs లేదా Google Slides స్పీకర్ నోట్స్‌లో మాట్లాడటం ద్వారా టైప్ చేయవచ్చు, అలాగే ఎడిట్ చేయవచ్చు. ఈ ఫీచర్ Chrome, Firefox, Edge, Safari బ్రౌజర్‌ల తాజా వెర్షన్‌లతో పని చేస్తుంది.

1వ దశ: మీ మైక్రోఫోన్‌ను ఆన్ చేయండి

వాయిస్ టైపింగ్‌ను లేదా వాయిస్ కమాండ్‌లను ఉపయోగించడానికి మీ కంప్యూటర్ మైక్రోఫోన్ ఆన్‌లో ఉండి పని చేసే స్థితిలో ఉండాలి.

పరికరాలు, మైక్రోఫోన్‌లు భిన్నంగా ఉంటాయి, కాబట్టి సూచనల కోసం మీ కంప్యూటర్ మాన్యువల్‌ను తనిఖీ చేయండి. మైక్రోఫోన్ సెట్టింగ్‌లు అనేవి సాధారణంగా Macలోని సిస్టమ్ ప్రాధాన్యతలలో లేదా PC లోని కంట్రోల్ ప్యానెల్‌లో ఉంటాయి.

2వ దశ: వాయిస్ టైపింగ్‌ను ఉపయోగించండి

మీ వాయిస్‌తో టైప్ చేయండి

డాక్యుమెంట్‌లో వాయిస్ టైపింగ్‌ను ప్రారంభించండి

  1. మీ మైక్రోఫోన్ పని చేస్తుందో లేదో చెక్ చేయండి.
  2. Chrome బ్రౌజర్‌తో Google Docsలోని డాక్యుమెంట్‌ను తెరవండి.
  3. టూల్స్ ఆ తర్వాత వాయిస్ టైపింగ్ అనే ఆప్షన్‌లను క్లిక్ చేయండి. మైక్రోఫోన్ బాక్స్ కనిపిస్తుంది.
  4. మీరు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నప్పుడు, మైక్రోఫోన్‌ను క్లిక్ చేయండి.
  5. సాధారణ వాల్యూమ్, ఇంకా వేగంతో, స్పష్టంగా మాట్లాడండి (విరామ చిహ్నాన్ని ఉపయోగించడం గురించి మరింత సమాచారం కోసం కింద చూడండి).
  6. మీరు పూర్తి చేసిన తర్వాత, మళ్లీ మైక్రోఫోన్‌ను క్లిక్ చేయండి.

Slides స్పీకర్ నోట్స్‌లో వాయిస్ టైపింగ్‌ను ప్రారంభించండి

  1. మీ మైక్రోఫోన్ పని చేస్తుందో లేదో చెక్ చేయండి.
  2. Chrome బ్రౌజర్‌తో Google Slidesలోని ప్రెజెంటేషన్‌ను తెరవండి.
  3. టూల్స్ ఆ తర్వాత వాయిస్ టైప్ స్పీకర్ నోట్స్ అనే ఆప్షన్‌లను క్లిక్ చేయండి. స్పీకర్ నోట్స్ తెరుచుకొని, మైక్రోఫోన్ బాక్స్ కనిపిస్తుంది.
  4. మీరు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నప్పుడు, మైక్రోఫోన్‌ను క్లిక్ చేయండి.
  5. సాధారణ వాల్యూమ్, ఇంకా వేగంతో, స్పష్టంగా మాట్లాడండి (విరామ చిహ్నాన్ని ఉపయోగించడం గురించి మరింత సమాచారం కోసం కింద చూడండి).
  6. మీరు పూర్తి చేసిన తర్వాత, మళ్లీ మైక్రోఫోన్‌ను క్లిక్ చేయండి.

వాయిస్ టైపింగ్ చేసేటప్పుడు పొరపాట్లను సరిచేయండి

  • మీ వాయిస్‌తో టైప్ చేస్తున్నప్పుడు మీరు పొరపాటు చేసినట్లయితే, మైక్రోఫోన్‌ను ఆఫ్ చేయకుండానే మీరు పొరపాటు జరిగిన చోటుకి కర్సర్‌ను తరలించి దాన్ని పరిష్కరించవచ్చు.
  • పొరపాటును సరి చేసిన తర్వాత, మీరు కొనసాగించాలనుకుంటున్న చోటుకి తిరిగి కర్సర్‌ను తరలించవచ్చు.
  • సూచనల లిస్ట్‌ను చూడటానికి, బూడిద రంగులో కింది గీత ఉన్న పదాలను కుడి క్లిక్ చేయండి.

వాయిస్ టైపింగ్‌తో పని చేసే భాషలు

వాయిస్ టైపింగ్ ఈ భాషలు, అలాగే యాక్సెంట్స్‌లలో పని చేస్తుంది:

ఆఫ్రికాన్స్, అమ్హారిక్, అరబిక్, అరబిక్ (అల్జీరియా), అరబిక్ (బహ్రెయిన్), అరబిక్ (ఈజిప్ట్), అరబిక్ (ఇజ్రాయిల్), అరబిక్ (జోర్డాన్), అరబిక్ (కువైట్), అరబిక్ (లెబనాన్), అరబిక్ (మొరాకో), అరబిక్ (ఒమన్), అరబిక్ (పాలస్తీనా), అరబిక్ (కతర్), అరబిక్ (సౌదీ అరేబియా), అరబిక్ (ట్యునీషియా), అరబిక్ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్), అర్మేనియన్, అజర్బైజాన్, బహసా ఇండోనేషియా, బాస్క్, బెంగాలీ (బంగ్లాదేశ్), బెంగాలీ (ఇండియా), బల్గేరియన్, క్యాటలాన్, చైనీస్ (సరళీక్రితమైనది), చైనీస్ (సాంప్రదాయకమైనది), చైనీస్ (హాంకాంగ్), క్రోయేషియన్, చెక్, డేనిష్, డచ్, ఇంగ్లీష్ (ఆస్ట్రేలియా), ఇంగ్లీష్ (కెనడా), ఇంగ్లీష్ (ఘనా), ఇంగ్లీష్ (ఇండియా), ఇంగ్లీష్ (ఐర్లాండ్), ఇంగ్లీష్ (కెన్యా), ఇంగ్లీష్ (న్యూజిలాండ్), ఇంగ్లీష్ (నైజీరియా), ఇంగ్లీష్ (ఫిలిప్పీన్స్), ఇంగ్లీష్ (దక్షిణాఫ్రికా), ఇంగ్లీష్ (టాంజానియా), ఇంగ్లీష్ (UK), ఇంగ్లీష్ (US), ఫార్సీ, ఫిలిప్పినో, ఫిన్నిష్, ఫ్రెంచ్, గెలీసియన్, జార్జియన్, జర్మన్, గ్రీక్, గుజరాతీ, హిబ్రూ, హిందీ, హంగేరియన్, ఐస్లాండిక్, ఇటాలియన్, ఇటాలియన్ (ఇటలీ), ఇటాలియన్ (స్విట్జర్లాండ్), జాపనీస్, జావానీస్, కన్నడ, ఖ్మేర్, కొరియన్, లావోషియన్, లాత్వియన్, లిథుయేనియన్, మలయాళం, మలేషియన్, మరాఠీ, నేపాలీ, నార్వేజియన్, పోలిష్, పోర్చుగీస్ (బ్రెజిల్), పోర్చుగీస్ (పోర్చుగల్), పోర్చుగల్, రొమేనియన్ రష్యన్, స్లోవాక్, స్లోవేనియన్, సెర్బియన్, సింహళ, స్పానిష్, స్పానిష్ (అర్జెంటీనా), స్పానిష్ (బొలీవియా), స్పానిష్ (చిలీ), స్పానిష్ (కొలంబియా), స్పానిష్ (కోస్టా రికా), స్పానిష్ (ఈక్వెడార్), స్పానిష్ (ఎల్ సాల్వడార్), స్పానిష్ (స్పెయిన్), స్పానిష్ (US), స్పానిష్ (గ్వాటిమాలా), స్పానిష్ (హోండురాస్), స్పానిష్ (లాటిన్ అమెరికా), స్పానిష్ (మెక్సికో), స్పానిష్ (నికరాగువా), స్పానిష్ (పనామా), స్పానిష్ (పరాగ్వే), స్పానిష్ (పెరూ), స్పానిష్ (ప్యూర్టోరికో), స్పానిష్ (ఉరుగ్వే), స్పానిష్ (వెనిజులా), సండానీస్, స్వాహిలి (కెన్యా), స్వాహిలి (టాంజానియా), స్వీడిష్, తమిళం (ఇండియా), తమిళం (మలేషియా), తమిళం (సింగపూర్), తమిళం (శ్రీలంక), థాయ్, టర్కిష్, ఉక్రేనియన్, ఉర్దూ (ఇండియా), ఉర్దూ (పాకిస్థాన్), వియత్నామీస్, జులు.

విరామ చిహ్నాన్ని జోడించండి

మీ టెక్స్ట్‌కు విరామ చిహ్నాలను జోడించడానికి వేర్వేరు పదబంధాలను మీరు ఉపయోగించవచ్చు. విరామ చిహ్నాలు ప్రతి భాషలోను అందుబాటులో ఉండకపోవచ్చు:
 

3వ దశ: వాయిస్ కమాండ్‌లను ఉపయోగించండి

మీరు వాయిస్ టైపింగ్‌ను ప్రారంభించిన తర్వాత, మీరు మీ డాక్యుమెంట్‌ను ఎడిట్ చేసి ఫార్మాట్ చేయడానికి మీరు కమాండ్‌లను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, "పేరాగ్రాఫ్‌ను ఎంపిక చేయి," "ఇటాలిక్స్" లేదా "లైన్ చివరకు వెళ్లు."

చిట్కాలు:

  • వాయిస్ కమాండ్‌లు ఇంగ్లీష్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఖాతా భాష, అలాగే డాక్యుమెంట్ భాష రెండూ తప్పనిసరిగా ఇంగ్లీష్‌లోనే ఉండాలి.
  • Slides స్పీకర్ నోట్స్‌లో వాయిస్ కమాండ్‌లు అందుబాటులో ఉండవు.

టెక్స్ట్‌ను ఎంపిక చేయి

టెక్స్ట్‌ను ఎంపిక చేయడానికి, ఈ కమాండ్‌లను చెప్పండి:

  • [పదం లేదా పదబంధాన్ని] ఎంపిక చేయి
  • అన్నింటిని ఎంపిక చేయి
  • మ్యాచ్ అయ్యే టెక్స్ట్ అంతటిని ఎంపిక చేయి
  • లిస్ట్ ఐటెమ్‌ను ఎంపిక చేయి
  • ప్రస్తుత స్థాయిలో లిస్ట్ ఐటెమ్‌లను ఎంపిక చేయి
  • తదుపరి అక్షరాన్ని ఎంపిక చేయి
  • తర్వాతి [number] అక్షరాలను ఎంపిక చేయి
  • చివరి అక్షరాన్ని ఎంపిక చేయి
  • చివరి [number] అక్షరాలను ఎంపిక చేయి
  • లైన్‌ను ఎంపిక చేయి
  • తర్వాతి లైన్‌ను ఎంపిక చేయి
  • తర్వాతి [number] లైన్‌లను ఎంపిక చేయి
  • చివరి లైన్‌ను ఎంపిక చేయి
  • చివరి [number] లైన్‌లను ఎంపిక చేయి
  • పేరాగ్రాఫ్‌ను ఎంపిక చేయి
  • తర్వాతి పేరాగ్రాఫ్‌ను ఎంపిక చేయి
  • తర్వాతి [number] పేరాగ్రాఫ్‌లను ఎంపిక చేయి
  • చివరి పేరాగ్రాఫ్‌ను ఎంపిక చేయి
  • చివరి [number] పేరాగ్రాఫ్‌లను ఎంపిక చేయి
  • పదాన్ని ఎంపిక చేయి
  • తర్వాతి పదాన్ని ఎంపిక చేయి
  • తర్వాతి [number] పదాలను ఎంపిక చేయి
  • చివరిగా టైప్ చేసిన పదాన్ని ఎంపిక చేయి
  • చివరి [number] పదాలను ఎంపిక చేయి
  • ఎంపికను తొలగించు
  • ఎంపిక రద్దు చేయి
  • ఏదీ వద్దును ఎంపిక చేయి

మీ డాక్యుమెంట్‌ను ఫార్మాట్ చేయండి

మీ డాక్యుమెంట్‌ను ఫార్మాట్ చేయడానికి, ఈ కమాండ్‌లను చెప్పండి:

టెక్స్ట్ ఫార్మాటింగ్

  • ముఖ్య శీర్షికను వర్తింపజేయండి [1–6]
  • సాధారణ టెక్స్ట్‌ను వర్తింపజేయండి
  • ఉపశీర్షికను వర్తింపజేయండి
  • శీర్షికను వర్తింపజేయండి
  • బోల్డ్
  • ఇటాలిక్ చేయడం
  • ఇటాలిక్స్
  • కొట్టివేత
  • సబ్‌స్క్రిప్ట్
  • సూపర్‌స్క్రిప్ట్
  • కింది గీత
  • పెద్ద అక్షరాలు
  • శీర్షిక రకం
  • చిన్న అక్షరాలు

టెక్స్ట్ రంగు, హైలైట్ చేయడం

  • టెక్స్ట్ రంగు [color]
  • హైలైట్
  • హైలైట్ [color]
  • బ్యాక్‌గ్రౌండ్ రంగు [color]
  • హైలైట్‌ను తీసివేయి
  • బ్యాక్‌గ్రౌండ్ రంగు తీసివేయి
చిట్కా: అందుబాటులో ఉన్న రంగులు: ఎరుపు రొండు, ఎరుపు బెర్రీ రంగు, నారింజ రంగు, పసుపు రంగు, ఆకుపచ్చ రంగు, నీలి ఆకుపచ్చ రంగు, నీలి రంగు, కార్న్‌ఫ్లవర్ నీలి రంగు, ఊదా రంగు, మెజెంటా రంగు, నలుపు రంగు, తెలుపు రంగు, ఇంకా బూడిద రంగు. నలుపు, తెలుపు మినహా అన్ని రంగుల కోసం, మీరు "ముదురు ఊదా రంగు 3" వంటి 1-3 (బూడిద రంగు అయితే, 1-4) నంబర్‌లతో పాటు "లేత" లేదా "ముదురు" రంగులను జోడించవచ్చు. మీరు "హైలైట్" అని మాత్రమే చెప్తే, హైలైట్ అనేది పసుపు రంగులో అవుతుంది.

ఫాంట్ సైజ్

  • ఫాంట్ సైజ్‌ను తగ్గించు
  • ఫాంట్ సైజ్‌ను పెంచు
  • ఫాంట్ సైజ్ [6-400]
  • పెద్దగా చేయి
  • చిన్నదిగా చేయి

పేరాగ్రాఫ్ ఫార్మాటింగ్

  • ఇండెంట్‌ను తగ్గించు
  • ఇండెంట్‌ను పెంచు
  • లైన్ స్పేసింగ్ [1-100]
  • లైన్ స్పేసింగ్ డబుల్
  • లైన్ స్పేసింగ్ సింగిల్

అమరిక

  • మధ్యకు అమర్చు
  • అమరికను సర్దుబాటు చేయి
  • ఎడమ వైపునకు అమర్చు
  • కుడి వైపునకు అమర్చు
  • మధ్య అమరిక
  • ఎడమ అమరిక
  • కుడి అమరిక

నిలువు వరుసలు

  • 1 నిలువు వరుసను వర్తింపజేయి
  • 2 నిలువు వరుసలను వర్తింపజేయి
  • 3 నిలువు వరుసలను వర్తింపజేయి
  • నిలువు వరుస ఆప్షన్‌లు
  • నిలువు వరుస విభజనను ఇన్‌సర్ట్ చేయి

లిస్ట్‌లు

  • బుల్లెట్‌లతో కూడిన లిస్ట్‌ను క్రియేట్ చేయి
  • నంబర్‌లతో కూడిన లిస్ట్‌ను క్రియేట్ చేయి
  • బుల్లెట్‌ను ఇన్‌సర్ట్ చేయి
  • నంబర్‌ను ఇన్‌సర్ట్ చేయి

ఫార్మాటింగ్‌ను తీసివేయి

  • ఫార్మాటింగ్‌ను క్లియర్ చేయి
  • ఫార్మాటింగ్‌ను తీసివేయి
  • బోల్డ్‌ను తీసివేయి
  • ఇటాలిక్స్‌ను తీసివేయి
  • కొట్టివేతను తీసివేయి
  • కింద గీతను తీసివేయి

మీ డాక్యుమెంట్‌ను ఎడిట్ చేయండి

మీ డాక్యుమెంట్‌ను ఎడిట్ చేయడానికి, ఈ కమాండ్‌లను చెప్పండి:

  • కాపీ చేయి
  • కత్తిరించు
  • పేస్ట్ చేయి
  • తొలగించు
  • చివరి పదాన్ని తొలగించు
  • [పదం లేదా పదబంధం]ను తొలగించు
  • లింక్‌ను ఇన్‌సర్ట్ చేయి అని చెప్పి [ఆపై మీరు ఉపయోగించాలనుకొనే URLను చెప్పండి]
  • లింక్‌ను కాపీ చేయి
  • లింక్‌ను తొలగించు
  • విషయ సూచికను ఇన్‌సర్ట్ చేయి
  • విషయ సూచికను తొలగించు
  • విషయ సూచికను అప్‌డేట్ చేయి
  • కామెంట్‌ను ఇన్‌సర్ట్ చేయి అని చెప్పి [ఆపై కామెంట్‌ను చెప్పండి]
  • బుక్‌మార్క్‌ను ఇన్‌సర్ట్ చేయి
  • సమీకరణాన్ని ఇన్‌సర్ట్ చేయి
  • ఫుటర్‌ను ఇన్‌సర్ట్ చేయి
  • ఫుట్‌నోట్‌ను ఇన్‌సర్ట్ చేయి
  • హెడర్‌ను ఇన్‌సర్ట్ చేయి
  • అడ్డ గీతను ఇన్‌సర్ట్ చేయి
  • పేజీల మధ్య విరామాన్ని ఇన్‌సర్ట్ చేయి

చిట్కాలు:

  • మీరు "తొలగించు" అని మాత్రమే చెప్తే, మీరు కర్సర్ ముందు ఉన్న పదం తొలగిపోతుంది.
  • మీరు URLకి చెందిన టెక్స్ట్‌ను ఎంపిక చేసి, "లింక్‌ను ఇన్‌సర్ట్ చేయి" అని చెప్తే, ఆ ఎంపిక చేసిన టెక్స్ట్ హైపర్‌లింక్‌గా మారుతుంది.

టేబుల్స్‌ను జోడించండి, అలాగే ఎడిట్ చేయండి

టేబుల్స్‌ను జోడించి, ఎడిట్ చేయడానికి, ఈ కమాండ్‌లను చెప్పండి:

  • టేబుల్‌ను ఇన్‌సర్ట్ చేయి
  • [1-20] అడ్డు వరుసలు [1-20] నిలువు వరుసలు గల టేబుల్‌ను ఇన్‌సర్ట్ చేయి
  • అడ్డు వరుసను ఇన్‌సర్ట్ చేయి
  • నిలువు వరుసను ఇన్‌సర్ట్ చేయి
  • కొత్త నిలువు వరుసను ఇన్‌సర్ట్ చేయి
  • ఎడమ వైపున నిలువు వరుసను ఇన్‌సర్ట్ చేయి
  • కొత్త అడ్డు వరుసను ఇన్‌సర్ట్ చేయి
  • పైన అడ్డు వరుసను ఇన్‌సర్ట్ చేయి
  • కింద అడ్డు వరుసను ఇన్‌సర్ట్ చేయి
  • నిలువు వరుసను తొలగించు
  • అడ్డు వరుసను తొలగించు
  • టేబుల్‌ను తొలగించు
  • నిలువు వరుసను తీసివేయి
  • అడ్డు వరుసను తీసివేయి
  • టేబుల్‌ను తీసివేయి
  • టేబుల్ నుండి నిష్క్రమించు

మీ డాక్యుమెంట్ అంతటా కర్సర్‌ను తరలించండి

మీ డాక్యుమెంట్ అంతటా కర్సర్‌ను తరలించడానికి, ఈ కమాండ్‌లను చెప్పండి:

1వ భాగం 2వ భాగం 3వ భాగం

ఉదాహరణ:

పేరాగ్రాఫ్

చివరికి వెళ్ళు

పేర్కొన్న చోటుకి వెళ్లు

పేర్కొన్న చోటుకి తరలించు

చివరికి

ప్రారంభానికి

పేరాగ్రాఫ్

నిలువు వరుస

లైన్

అడ్డు వరుస

టేబుల్

డాక్యుమెంట్

పేర్కొన్న చోటుకి వెళ్లు

పేర్కొన్న చోటుకి తరలించు

తర్వాత

మునుపటి

అక్షరం

నిలువు వరుస

ఫుట్‌నోట్

ఫార్మాటింగ్‌ను మార్చు

శీర్షిక

శీర్షిక [1-6]

ఇమేజ్

లైన్

లింక్

లిస్ట్

లిస్ట్ ఐటెమ్

స్పెల్లింగ్ తప్పు

పేరాగ్రాఫ్

అడ్డు వరుస

టేబుల్

పదం

పేజీ

వెళ్లు

తరలించు

ఫార్వర్డ్

బాక్‌వార్డ్

[number] అక్షరాలు

[number] పదాలు

వెళ్లు

తరలించు

పైకి

కిందకి

[number] లైన్‌లు

[number] పేరాగ్రాఫ్‌లు

స్క్రోల్ చేయండి

  • కిందకు స్క్రోల్ చేయి
  • పైకి స్క్రోల్ చేయి

వాయిస్ టైపింగ్‌ను ఆపండి

వాయిస్ టైపింగ్‌ను ఆపివేయడానికి "వినటం ఆపివేయి" అని చెప్పండి.

వాయిస్ టైపింగ్‌ను కొనసాగించండి

కర్సర్‌ను పేరాగ్రాఫ్ చివరకు తరలించి వాయిస్ టైపింగ్‌ను మళ్లీ ప్రారంభించడానికి, "కొనడాగించు" అని చెప్పండి.

కర్సర్‌ను నిర్దిష్ట పదం లేదా పదబంధం చివరకు తరలించడానికి, "[పదం లేదా పదబంధం]తో కొనసాగించు" అని చెప్పండి.

వాయిస్ టైపింగ్‌ను కొనసాగించడానికి మీరు చెప్పగల అన్ని కమాండ్‌లు ఇక్కడ ఉన్నాయి:

  • కొనసాగించు
  • [పదం లేదా పదబంధం]తో కొనసాగించు
  • పేరాగ్రాఫ్ చివరికి వెళ్లు
  • పేరాగ్రాఫ్ చివరికి తరలించు
  • లైన్ చివరికి వెళ్లు
  • లైన్ చివరికి తరలించు
  • [పదం]కు వెళ్లు
సహాయాన్ని తెరవడానికి కమాండ్‌లు

మీ డాక్యుమెంట్‌లో వాయిస్ కమాండ్‌ల లిస్ట్‌ను తెరవడానికి, ఈ కమాండ్‌లను చెప్పండి:

  • వాయిస్ టైపింగ్ సహాయం
  • వాయిస్ కమాండ్‌ల లిస్ట్
  • అన్ని వాయిస్ కమాండ్‌లను చూపు
మాట్లాడండి (యాక్సెసిబిలిటీ కోసం)

ఈ కమాండ్‌లను ఉపయోగించడానికి, స్క్రీన్ రీడర్ సపోర్ట్‌ను ఆన్ చేయండి. హెడ్‌ఫోన్స్‌ను ధరించడం ఉత్తమం, తద్వారా స్క్రీన్ రీడర్ ఫీడ్‌బ్యాక్ అనేది మీ డాక్యుమెంట్‌లో టైప్ చేయబడదు.

  • కర్సర్ లొకేషన్‌ను చదివి వినిపించు
  • కర్సర్ లొకేషన్ నుండి చదివి వినిపించు
  • ఎంపిక చేసిన దానిని చదివి వినిపించు
  • ఎంపిక ఫార్మాటింగ్‌ను చదివి వినిపించు
  • టేబుల్ అడ్డు వరుస, నిలువు వరుస ముఖ్య శీర్షికలను చదివి వినిపించు
  • టేబుల్ సెల్ లొకేషన్‌ను చదివి వినిపించు
  • టేబుల్ నిలువు వరుస ముఖ్య శీర్షికను చదివి వినిపించు
  • టేబుల్ అడ్డు వరుస ముఖ్య శీర్షికను చదివి వినిపించు

పరిష్కరించండి

వాయిస్ టైపింగ్ పని చేయకపోతే, ఈ దశలను ట్రై చేయండి.

"మీరు చెప్పేది వినడంలో మాకు సమస్య ఉంది"

"మీరు చెప్పేది వినడంలో మాకు సమస్య ఉంది" అనే ఎర్రర్ మెసేజ్ మీకు కనిపిస్తే, ఇక్కడ పేర్కొన్న వాటిని ట్రై చేయండి:

  • నిశబ్దంగా ఉన్న రూమ్‌లోకి వెళ్లండి.
  • బాహ్య మైక్రోఫోన్‌ను ప్లగ్-ఇన్ చేయండి.
  • మీ మైక్రోఫోన్‌లో ఇన్‌పుట్ వాల్యూమ్‌ను సర్దుబాటు చేయండి.

మైక్రోఫోన్ పని చేయడం లేదు

మీ కంప్యూటర్‌లో మైక్రోఫోన్ పని చేయకపోతే, ఇక్కడ పేర్కొన్న వాటిని ట్రై చేయండి:

  • ఆ మైక్రోఫోన్ చెడిపోలేదు అని నిర్ధారించుకోండి.
  • మీ కంప్యూటర్ సిస్టమ్ ప్రాధాన్యతలలో మైక్రోఫోన్ సెట్టింగ్‌లను చెక్ చేయండి.
  • మీ మైక్రోఫోన్ ప్లగ్-ఇన్ చేయబడిందని, మరొక అప్లికేషన్ ఉపయోగించడంలేదు అనేది చెక్ చేయండి.
  • నిశబ్దంగా ఉన్న రూమ్‌లోకి వెళ్లండి.
  • మీ కంప్యూటర్‌ను రీస్టార్ట్ చేయండి.

వాయిస్ కమాండ్‌లు పని చేయడం లేదు

వాయిస్ కమాండ్‌లు పని చేయకపోతే, ఇక్కడ పేర్కొన్న వాటిని ట్రై చేయండి:

  • మరింత నెమ్మదిగా, స్పష్టంగా మాట్లాడండి
  • ప్రతి కమాండ్‌కు ముందు, ఆ తర్వాత పాజ్ ఇవ్వండి. మీరు ఇచ్చిన కమాండ్ ఒక క్షణం పాటు డాక్యుమెంట్‌లో కనిపించవచ్చు. ఉదాహరణకు, మీరు "అంతటిని ఎంపిక చేయి" అని చెప్తే, టెక్స్ట్ అంతటిని ఎంపిక చేసే ముందు "అంతటిని ఎంపిక చేయి" అనే కమాండ్ డాక్యుమెంట్‌లో కనిపిస్తుంది.
  • మైక్రోఫోన్ అత్యంత ఇటీవల ఇచ్చిన కమాండ్‌ను కలిగి ఉన్న బబుల్‌ను చూపుతుంది. Docs లేదా Slides సరైన కమాండ్‌ను విన్నట్లుగా వెరిఫై చేసుకోండి. అలా కాకపోతే, మీరు కేవలం "రద్దు చేయి" అని చెప్పవచ్చు.
true
Visit the Learning Center

Using Google products, like Google Docs, at work or school? Try powerful tips, tutorials, and templates. Learn to work on Office files without installing Office, create dynamic project plans and team calendars, auto-organize your inbox, and more.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
1527604674576646136
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false