మీ ఫారమ్‌ను ఎడిట్ చేయండి

మీరు ఫారమ్‌ను సృష్టించిన తర్వాత, ప్రశ్నలు, వివరణలు, చిత్రాలు మరియు వీడియోల వంటివి గరిష్టంగా 300 కంటెంట్ అంశాలను జోడించవచ్చు మరియు ఎడిట్ చేయవచ్చు. అంశం వారీగా మీ ఫారమ్‌ను నిర్వహించడానికి, మీరు గరిష్టంగా 75 విభాగాలను జోడించవచ్చు.

ప్రశ్నలు, శీర్షికలు & విభాగాలను జోడించండి

ప్రశ్నను జోడించండి
 1. Google ఫారమ్‌లలో, ఫారమ్‌ను తెరవండి.
 2. జోడించు జోడించు క్లిక్ చేయండి.
 3. ప్రశ్న శీర్షిక కుడివైపున, మీకు కావాల్సిన ప్రశ్న రకాన్ని ఎంచుకోండి.
 4. మీ ప్రశ్నకు సంభావ్య ప్రతిస్పందనలను టైప్ చేయండి. వ్యక్తులు సమాధానం చెప్పకుండా ఉండటాన్ని నిరోధించడానికి, అవసరం ఎంపికను ఆన్ చేయండి.
చిత్రం లేదా వీడియోను జోడించండి

ప్రశ్న లేదా సమాధానానికి చిత్రం లేదా వీడియోను జోడించండి

మీరు ప్రశ్నకు చిత్రాన్ని లేదా బహుళ ఎంపికలు లేదా చెక్‌బాక్స్ ప్రశ్నల కోసం సమాధానాన్ని జోడించవచ్చు.

 1. Google ఫారమ్‌లలో, ఫారమ్‌ను తెరవండి.
 2. ప్రశ్న లేదా సమాధానాన్ని క్లిక్ చేయండి.
 3. కుడివైపున, చిత్రాన్ని జోడించు చిత్రాన్ని చొప్పించు క్లిక్ చేయండి.
 4. చిత్రాన్ని అప్‌లోడ్ చేయండి లేదా ఎంచుకోండి.
 5. ఎంచుకోండి ఎంపికను క్లిక్ చేయండి.

చిత్రం లేదా వీడియో దానంతట అదే జోడించబడేలా చేయండి

మీరు మీ ఫారమ్‌కు చిత్రాన్ని లేదా YouTube వీడియోను జోడించవచ్చు. మీరు ప్రశ్నలకు వీడియోలను జోడించలేరు, కానీ ప్రశ్నకు ముందు లేదా తర్వాత వాటిని ఉంచవచ్చు.

 1. Google ఫారమ్‌లలో, ఫారమ్‌ను తెరవండి.
 2. చిత్రాన్ని జోడించడానికి, చిత్రాన్ని జోడించు చిత్రాన్ని చొప్పించు క్లిక్ చేయండి. వీడియోను జోడించడానికి, వీడియోను జోడించు Video క్లిక్ చేయండి.
 3. మీ చిత్రం లేదా వీడియోను ఎంచుకుని, ఎంచుకోండి ఎంపికను క్లిక్ చేయండి.
విభాగాన్ని జోడించండి

మీ ఫారమ్‌ను చదవడాన్ని మరియు పూరించడాన్ని విభాగాలు సులభతరం చేస్తాయి.

 1. Google ఫారమ్‌లలో, ఫారమ్‌ను తెరవండి.
 2. విభాగాన్ని జోడించు Section క్లిక్ చేయండి.
 3. కొత్త విభాగానికి పేరు పెట్టండి.
ప్రశ్న, చిత్రం లేదా విభాగాన్ని డూప్లికేట్ చేయండి

ప్రశ్నలు లేదా చిత్రాలు

 1. ప్రశ్న లేదా చిత్రాన్ని క్లిక్ చేయండి.
 2. డూప్లికేట్ కాపీ చేయి క్లిక్ చేయండి.

విభాగాలు

 1. విభాగం హెడర్‌ను క్లిక్ చేయండి.
 2. మరిన్ని మరిన్ని క్లిక్ చేయండి.
 3. విభాగానికి డూప్లికేట్‌ సృష్టించు క్లిక్ చేయండి.
మునుపటి ఫారమ్‌ల నుండి ప్రశ్నలను మళ్లీ ఉపయోగించండి
 1. Google ఫారమ్‌లలో, ఫారమ్‌ను తెరవండి.
 2. కుడివైపున, ప్రశ్నను జోడించు ప్రశ్నను జోడించు ఆ తర్వాతప్రశ్నలను దిగుమతి చేయి ప్రశ్నలను దిగుమతి చేయి క్లిక్ చేయండి.
 3. మీరు దిగుమతి చేయాలనుకునే ప్రశ్నలు గల ఫారమ్ ఆ తర్వాతఎంచుకోండి ఎంపికను క్లిక్ చేయండి.
 4. కుడివైపున, మీరు జోడించాలనుకునే ప్రతి ప్రశ్న పక్కన ఉన్న పెట్టెను క్లిక్ చేయండి.
 5. ప్రశ్నలను దిగుమతి చేయి క్లిక్ చేయండి.

అంశాలను తొలగించండి లేదా ఎడిట్ చేయండి

ప్రశ్న, హెడర్ లేదా వివరణను ఎడిట్ చేయడానికి, మీరు మార్చాలనుకునే వచనాన్ని క్లిక్ చేయండి.

ప్రశ్న, చిత్రం లేదా విభాగాన్ని తొలగించండి

ప్రశ్నలు లేదా చిత్రాలు

 1. ప్రశ్న లేదా చిత్రాన్ని క్లిక్ చేయండి.
 2. తొలగించు తొలగించు క్లిక్ చేయండి.

విభాగం

 1. విభాగం హెడర్‌ను క్లిక్ చేయండి.
 2. మరిన్ని మరిన్ని క్లిక్ చేయండి.
 3. విభాగాన్ని తొలగించు క్లిక్ చేయండి.
విభాగం క్రమాన్ని మార్చండి
 1. మీరు ఒక విభాగం కంటే ఎక్కువ కలిగి ఉన్నట్లయితే, క్రమాన్ని మార్చవచ్చు.
 2. ఏదైనా విభాగం ఎగువ కుడివైపున, మరిన్ని మరిన్ని క్లిక్ చేయండి.
 3. విభాగాన్ని తరలించు క్లిక్ చేయండి.
 4. విభాగాన్ని తరలించడానికి, పైకి ఎగువ బాణం లేదా కిందికి క్రింది బాణం క్లిక్ చేయండి.
చర్య రద్దు చేయండి
 1. మీరు ఇటీవలి మార్పును చర్య రద్దు చేయాలనుకుంటే:
 2. మీ ఫారమ్‌లో ఎగువ కుడివైపున, మరిన్ని మరిన్ని క్లిక్ చేయండి.
 3. చర్య రద్దు చేయి చర్యరద్దు క్లిక్ చేయండి.

ప్రశ్నలు మరియు సమాధానాలను యాదృచ్ఛికంగా క్రమం చేయండి

మీ ఫారమ్‌ను పూరించే ప్రతిఒక్కరికి ప్రశ్నలు మరియు సమాధానాలు భిన్నమైన క్రమంలో కనిపించేలా మీరు చేయవచ్చు.

 

గమనిక: ఒక ఇమెయిల్ చిరునామాకు ఒకసారి మాత్రమే ప్రశ్నలు మరియు సమాధానాలు షఫుల్ చేయబడతాయి. ప్రతి చిరునామాను విడిగా నమోదు చేసినట్లు, అలాగే Google గుంపుకు పంపబడనట్లు నిర్ధారించుకోండి.

 

ప్రశ్నల క్రమాన్ని షఫుల్ చేయండి

మీ ప్రశ్నలు నిర్దిష్ట క్రమంలో ఉన్నట్లయితే, మీరు మీ ప్రశ్నలను షఫుల్ చేయకూడదు.

 1. ఎగువ భాగంలో, సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు క్లిక్ చేయండి.
 2. ప్రెజెంటేషన్ క్లిక్ చేయండి.
 3. ప్రశ్న క్రమాన్ని షఫుల్ చేయి క్లిక్ చేయండి.
సమాధాన ఎంపికలను షఫుల్ చేయండి

మీరు బహుళ ఎంపికలు, చెక్‌బాక్స్ మరియు డ్రాప్-డౌన్ ప్రశ్నలకు సమాధానాలను షఫుల్ చేయవచ్చు.

 1. మీరు సమాధానాలను షఫుల్ చేయాలనుకునే ప్రశ్నను క్లిక్ చేయండి.
 2. దిగువ కుడివైపున, మరిన్ని మరిన్ని క్లిక్ చేయండి.
 3. ఎంపికల క్రమాన్ని షఫుల్ చేయి క్లిక్ చేయండి.

మీ డిఫాల్ట్ సెట్టింగ్‌లను మార్చండి

ప్రతి కొత్త ఫారమ్‌ను రూపొందించేటప్పుడు, అవే సెట్టింగ్‌లను ఉపయోగించండి:

 1. Google ఫారమ్‌లలో, ఫారమ్‌ను తెరవండి.
 2. ఎగువభాగంలో, మరిన్ని మరిన్నిఆ తర్వాతప్రాధాన్యతలు క్లిక్ చేయండి.
 3. మీరు ఆన్ చేసే ఏ సెట్టింగ్ అయినా కొత్త ఫారమ్‌కు డిఫాల్ట్ అవుతుంది.
ఇది సహాయకరంగా ఉందా?
మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?