మీరు Google డిస్క్‌లో నిల్వ చేసే ఫైల్‌లు మరియు ఫోల్డర్‌లను ఎవరితోనైనా షేర్ చేయవచ్చు.
దశ 1: మీరు షేర్ చేయాలనుకునే ఫైల్‌ను కనుగొనండి
ఒక ఫైల్‌ను షేర్ చేయండి
- కంప్యూటర్‌లో, Google డిస్క్, డాక్స్, షీట్‌లు లేదా స్లయిడ్‌లకు వెళ్లండి.
- మీరు షేర్ చేయాలనుకునే ఫైల్‌ను క్లిక్ చేయండి.
- షేర్ చేయి లేదా
షేర్ చేయి ఎంపికను క్లిక్ చేయండి.
- కంప్యూటర్‌లో, drive.google.com లింక్‌కు వెళ్లండి.
- మీ కీబోర్డ్‌లో, Shift నొక్కి ఉంచి, ఆపై రెండు లేదా అంతకంటే ఎక్కువ ఫైల్‌లను ఎంచుకోండి.
- ఎగువభాగంలో కుడివైపున, షేర్ చేయి
క్లిక్ చేయండి.
ఫైల్‌లను ఫోల్డర్‌కు జోడించడం ఎలాగో తెలుసుకుని, మొత్తం ఫోల్డర్‌ను షేర్ చేయండి.
Google ఫారమ్‌లలో ఇతర రకాల ఫైల్ల కంటే విభిన్న రకమైన షేరింగ్ ఎంపికలు ఉన్నాయి.
దశ 2: ఎవరితో షేర్ చేయాలి & వారు మీ ఫైల్‌ను ఎలా ఉపయోగించగలరు అనేవి ఎంచుకోండి
నిర్దిష్ట వ్యక్తులతో షేర్ చేయండి
- "వ్యక్తులు" ఎంపికలో, మీరు షేర్ చేయాలనుకుంటున్న ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి.
- గమనిక: మీరు Google ఖాతా కాని ఇమెయిల్ చిరునామాతో షేర్ చేస్తే, వారు ఫైల్‌ను కేవలం చూడగలరు.
- మీ ఫైల్‌లో ఎవరైనా ఏమి చేయగలగాలనేది ఎంచుకోవడానికి, కిందికి బాణం
క్లిక్ చేయండి.
- మీరు వ్యక్తులకు ఇమెయిల్ పంపకూడదనుకుంటే, అధునాతనం క్లిక్ చేసి, వ్యక్తులకు తెలియజేయి పెట్టె ఎంపికను తీసివేయండి. మీరు వ్యక్తులకు తెలియజేసేలా ఎంచుకుంటే, మీరు నమోదు చేసే ప్రతి ఇమెయిల్ చిరునామా ఇమెయిల్‌లో చేర్చబడుతుంది.
- పంపు క్లిక్ చేయండి.
మీరు మీ ఫైల్‌కు లింక్‌ను ఇతర వ్యక్తులకు పంపవచ్చు, అప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఎవరైనా ఆ లింక్‌తో దానిని ఉపయోగించగలరు. మీరు ఫైల్‌కు లింక్‌ను షేర్ చేసినప్పుడు, మీ పేరు ఆ ఫైల్ యజమానిగా చూపబడుతుంది.
- ఎగువభాగంలో కుడివైపున, షేర్ చేయదగిన లింక్‌ను పొందండి ఎంపికను క్లిక్ చేయండి.
- "లింక్ కలిగి ఉన్న ఎవరైనా" ఎంపిక పక్కన, కిందికి బాణం
క్లిక్ చేయండి.
- లింక్‌ను కాపీ చేసి, ఇమెయిల్‌లో లేదా మీరు దానిని షేర్ చేయాలనుకునే ఏదైనా స్థలంలో అతికించండి.
ఇంటర్నెట్లో ఎవరైనా మీ ఫైల్‌ను వెతకగల, కనుగొనగల, తెరవగల సామర్థ్యాలు కలిగి ఉండాలని మీరు కోరుకుంటే, ఫైల్‌ను పబ్లిక్‌గా షేర్ చేయవచ్చు. మీరు ఫైల్‌ను పబ్లిక్‌గా షేర్ చేసినప్పుడు, మీ పేరు ఆ ఫైల్ యజమానిగా చూపబడుతుంది.
- షేర్ చేయగల లింక్‌ను పొందండి ఎంపికను క్లిక్ చేయండి.
- "లింక్ కలిగి ఉన్న ఎవరైనా" ఎంపిక పక్కన, కిందికి బాణం
క్లిక్ చేయండి.
- మరిన్ని
ఆన్ - వెబ్‌లో పబ్లిక్ ఎంపికను క్లిక్ చేయండి.
- సేవ్ చేయి క్లిక్ చేయండి.
- వ్యక్తులకు ఎలాంటి స్థాయి యాక్సెస్‌ను మీరు ఇవ్వాలనుకుంటున్నారో ఎంచుకోండి. ఇతరులు ఫైల్‌లను ఎలా చూడవచ్చు, వ్యాఖ్యానించవచ్చు లేదా ఎడిట్ చేయవచ్చు అనే వాటి గురించి మరింత తెలుసుకోండి.
- పూర్తయింది క్లిక్ చేయండి.
Google ఖాతాకు సైన్ ఇన్ చేయని వ్యక్తులు మీ ఫైల్‌లో అనామక జంతువుల రూపంలో చూపబడతారు. అనామక జంతువుల గురించి మరింత తెలుసుకోండి.
100 మంది కంటే ఎక్కువ వ్యక్తులతో ఒక ఫైల్‌ను షేర్ చేయండి & సహకరించండి
100 మంది దాకా వీక్షణ, ఎడిట్ లేదా కామెంట్ అనుమతులు గల వ్యక్తులు, Google డాక్స్, Sheets లేదా స్లయిడ్ల ఫైల్ మీద ఒకేసారి పని చేయవచ్చు. ఒక ఫైల్‌ను 100 మంది కంటే ఎక్కువ వ్యక్తులు యాక్సెస్ చేస్తున్నప్పుడు, ఆ ఫైల్ యజమానితో పాటు, ఎడిటింగ్ అనుమతులు ఉన్న కొందరు యూజర్‌లు మాత్రమే ఫైల్‌ను ఎడిట్ చేయగలరు.
100 మంది కంటే ఎక్కువ వ్యక్తులతో ఒక ఫైల్‌ను షేర్ చేయడానికి, సహకరించడానికి:
ఫైల్‌ను ప్రచురించండి
- మీరు ఫైల్‌ను ఒకేసారి అనేక మంది చూసేలా చేయాలంటే, దాన్ని ప్రచురించండి, ఆపై దానికి ఒక లింక్‌ను సృష్టించి, వీక్షకులకు షేర్ చేయండి. ఫైల్‌ను ఎడిట్ లేదా కామెంట్ చేయాలనుకొనే వ్యక్తులకు మీరు ఎడిట్ యాక్సెస్‌ను ఇవ్వవచ్చు. ఫైల్‌ను ప్రచురించడం ఎలాగో తెలుసుకోండి.
- ఫైల్‌ను ప్రచురిస్తే, అది వెబ్‌లో ఉన్న ప్రతిఒక్కరికీ కనబడుతుంది. ప్రైవేట్ లేదా గోప్యమైన సమాచారాన్ని ప్రచురిస్తున్నప్పుడు జాగ్రత్త వహించండి. మీకు కార్యాలయం లేదా పాఠశాల ద్వారా ఖాతా ఉంటే, ప్రచురించబడిన ఫైల్‌ను ఎవరు చూడవచ్చో దానిని మీ అడ్మినిస్ట్రేటర్ పరిమితం చేయవచ్చు. మీరు అడ్మినిస్ట్రేటర్ అయితే, వెబ్‌లోకి డాక్యుమెంట్లను ఎవరు ప్రచురించవచ్చు అనే విషయాన్ని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి.
- వెబ్ నుండి ఒక ఫైల్‌ను తీసివేయడానికి, దానిని ప్రచురించడం తప్పనిసరిగా ఆపివేయాల్సి ఉంటుంది. ఫైల్‌ను ప్రచురించడం ఎలా ఆపివేయాలో తెలుసుకోండి.
- సహకారులతో ఫైల్‌ను షేర్ చేయడాన్ని ఆపడానికి, షేరింగ్ అనుమతులను ఎలా మార్చాలో తెలుసుకోండి.
Google సైట్‌ను సృష్టించండి
- అనేక మంది వ్యక్తులతో సమాచారాన్ని షేర్ చేసుకోవడానికి, Google సైట్‌ను సృష్టించండి. మీరు డాక్యుమెంట్లను, స్ప్రెడ్షీట్లను అలాగే ప్రెజెంటేషన్లను సైట్లో పొందుపరచవచ్చు, వీటిని భారీ సంఖ్యలో యూజర్‌లు చూడగలరు. సైట్లో డాక్యుమెంట్లను ఎలా పొందుపరచాలో తెలుసుకోండి.
- మీ సైట్‌కు అధిక ట్రాఫిక్ వస్తుందని ఒకవేళ మీరు ఊహించినట్లయితే, మొదట మీ డాక్యుమెంట్‌ను Google డాక్స్, Sheets లేదా స్లయిడ్‌లలో ప్రచురించండి, తర్వాత ప్రచురించబడిన సదరు URLను Google Sitesలో పొందుపరచండి. ఫైల్‌ను ప్రచురించడం ఎలాగో తెలుసుకోండి.
Google Formsతో ఫీడ్‌బ్యాక్‌ను సేకరించండి
- సమాచారాన్ని పెద్ద మొత్తంలో మీరు సేకరించాలనుకుంటే, Google ఫారమ్‌ను సృష్టించండి. ప్రతిస్పందనలు ఒక Google షీట్‌లో రికార్డ్ చేయబడతాయి. ప్రతిస్పందనలతో పని చేయవలసిన వ్యక్తులకు మాత్రమే ఎడిట్ యాక్సెస్‌ను ఇవ్వండి. ప్రతిస్పందనలను 100 మంది కంటే ఎక్కువ వ్యక్తులు చూసేలా చేయాలంటే, స్ప్రెడ్‌షీట్‌ను వెబ్‌లో ప్రచురించండి, ఆపై దానికి ఒక లింక్‌ను సృష్టించి, వీక్షకులకు షేర్ చేయండి. ఫైల్‌ను ప్రచురించడం ఎలాగో తెలుసుకోండి.
అనేక మంది వ్యక్తులతో షేర్ చేయబడిన డాక్యుమెంట్‌లతో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించండి
ఒకవేళ మీ డాక్యుమెంట్ అనేక మందితో షేర్ చేయబడి ఉండి, అది క్రాష్ అవుతున్నా లేదా త్వరగా అప్‌డేట్ కాకపోయినా, ఈ పరిష్కార ప్రక్రియ చిట్కాలను ట్రై చేయండి:
- వ్యక్తులను డాక్యుమెంట్ లేదా స్ప్రెడ్‌షీట్‌లో కామెంట్ చేయడానికి అనుమతించే బదులు, Google ఫారమ్‌ను సృష్టించి, ఫీడ్‌బ్యాక్‌ను సేకరించండి. Google ఫారమ్‌ను ఎలా సృష్టించాలో తెలుసుకోండి.
- మీరు డాక్యుమెంట్ యొక్క కాపీని చేస్తున్నట్లయితే, అందులో పరిష్కరించబడిన కామెంట్‌లు ఇంకా సూచనలను చేర్చవద్దు. కాపీని ఎలా చేయాలో తెలుసుకోండి.
- పాత సమాచారాన్ని తొలగించండి లేదా డేటాను ఒక కొత్త డాక్యుమెంట్‌లోకి తరలించండి.
- వారు డాక్యుమెంట్‌ను ఉపయోగించనప్పుడు దాన్ని మూసివేయమని వీక్షకులను అడగండి.
- ప్రచురించబడిన డాక్యుమెంట్‌లో అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని మాత్రమే చేర్చండి. చిన్న డాక్యుమెంట్‌లు వేగంగా లోడ్ అవుతాయి.
- డాక్యుమెంట్‌కు 'ఎడిట్ యాక్సెస్' ఉన్న వ్యక్తుల సంఖ్యను తగ్గించండి.
- ఒకవేళ సమాచారాన్ని అనేక డాక్యుమెంట్‌ల నుండి సేకరిస్తున్నట్లయితే, ఎక్కువ మంది వ్యక్తులతో షేర్ చేయడానికి కొత్త 'వీక్షణ మాత్రమే' డాక్యుమెంట్‌ను సృష్టించండి.
ఫైల్‌ను షేర్ చేయగల విధానాన్ని పరిమితం చేయండి
మీరు ఎవరైనా ఒకరితో ఫైల్‌ను షేర్ చేసినప్పుడు, వారు దీనితో ఏమి చేయగలరనే దాన్ని మీరు ఎంచుకోవచ్చు.
- వీక్షణ: వ్యక్తులు ఫైల్‌ను చూడగలరు, కానీ దానిని మార్చలేరు లేదా ఇతరులతో షేర్ చేయలేరు.
- కామెంట్: వ్యక్తులు ఫైల్‌పై కామెంట్‌లు, సూచనలు చేయగలరు, కానీ దానిని మార్చలేరు లేదా ఇతరులతో షేర్ చేయలేరు.
- ఎడిట్: వ్యక్తులు ఫైల్‌కు మార్పులు చేయగలరు, సూచనలను ఆమోదించగలరు లేదా తిరస్కరించగలరు, దానిని ఇతరులతో షేర్ చేయగలరు.
మీరు ఫైల్‌కు లింక్‌ను షేర్ చేస్తున్నప్పుడు, అది ఎంత విస్తృతంగా షేర్ చేయబడాలనేది మీరు నియంత్రించండి. మీ Google ఖాతా అనేది కార్యాలయం, పాఠశాల లేదా Gmailలో ఏ రకానికి చెందినదనే దాన్ని బట్టి ఈ ఎంపికలు ఉంటాయి.
- ఆన్ - వెబ్‌లో పబ్లిక్: ఎవరైనా సరే వారి Google ఖాతాకు సైన్ ఇన్ చేయకుండానే మీ ఫైల్‌ను Googleలో వెతకగలరు మరియు దానికి యాక్సెస్ పొందగలరు.
- ఆన్ - లింక్ కలిగి ఉన్న ఎవరైనా: మీ ఫైల్‌కు లింక్‌ను కలిగి ఉన్న ఎవరైనా వారి Google ఖాతాకు సైన్ ఇన్ చేయకుండానే దానిని ఉపయోగించగలరు.
- ఆఫ్ - నిర్దిష్ట వ్యక్తులు: మీరు ఫైల్‌ను ఎవరికి షేర్ చేస్తారో ఆ వ్యక్తులు మాత్రమే దానిని ఉపయోగించగలరు.