మీరు Google సేవా నిబంధనలు లేదా ప్రోగ్రామ్ విధానాల ఉల్లంఘనగా పరిగణించే ప్రవర్తన గురించి రిపోర్ట్ చేయవచ్చు. ఇలాంటి ఉల్లంఘనలు:
- స్పామ్, మాల్వేర్, ఫిషింగ్
- హింస
- ద్వేషపూరిత ప్రసంగం
- ఉగ్రవాద కంటెంట్
- వేధింపు, జులుం చలాయించడం, బెదిరింపులు
- అనుచితమైన లైంగిక అంశాలు
- పిల్లలను పాడు చేసేవి
- మరొక వ్యక్తిలా నటించడం
- వ్యక్తిగత మరియు గోప్యమైన సమాచారం
- చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలు
- బహిరంగ ప్రసారం
- కాపీరైట్ ఉల్లంఘన
- కంటెంట్‌ను వినియోగించడం, సమర్పించడం
దుర్వినియోగంగా రిపోర్ట్ చేయండి
మీ కంప్యూటర్ నుండి దుర్వినియోగ కంటెంట్‌ను మీరు రిపోర్ట్ చేయవచ్చు.
Google డాక్స్, షీట్లు, స్లయిడ్లు లేదా ఫారమ్‌లుGoogle డాక్స్, షీట్లు లేదా స్లయిడ్లు
ఉల్లంఘనను రిపోర్ట్ చేయడానికి:
- ఫైల్‌ను తెరవండి.
- సహాయం మెను క్లిక్ చేయండి.
- దుర్వినియోగం/కాపీరైట్ రిపోర్ట్ చేయిను ఎంచుకోండి.
- ఫైల్లో కనుగొన్న దుర్వినియోగ రకాన్ని ఎంచుకోండి. ప్రతి దుర్వినియోగ రకానికి ఒక వివరణ ఉంటుంది, దాని సహాయంతో మా విధానాలను ఫైల్ ఉల్లంఘిస్తుందో లేదో మీరు నిశ్చయించుకోవచ్చు.
- 'దుర్వినియోగ నివేదికను సమర్పించు' ఎంపికను క్లిక్ చేయండి.
Google ఫారమ్‌లు
ఉల్లంఘనను రిపోర్ట్ చేయడానికి:
- ఫారమ్ దిగువున, దుర్వినియోగాన్ని రిపోర్ట్ చేయి ఎంపికను క్లిక్ చేయండి.
- ఫారమ్‌లో కనుగొన్న దుర్వినియోగ రకాన్ని ఎంచుకోండి.
- 'దుర్వినియోగ నివేదికను సమర్పించు' ఎంపికను క్లిక్ చేయండి.
'Google సైట్లు'తో రూపొందించిన, 'Google డిస్క్'లో హోస్ట్ చేసిన వెబ్సైట్లలోని దుర్వినియోగ కంటెంట్‌ను మీరు రిపోర్ట్ చేయవచ్చు. మా ప్రోగ్రామ్ విధానాలకు సంబంధించిన కొన్ని ఉల్లంఘనలు:
దుర్వినియోగం గురించి నేరుగా Google సైట్ నుండి రిపోర్ట్ చేయడానికి, పేజీ దిగువున ఉన్న 'దుర్వినియోగాన్ని రిపోర్ట్ చేయి' ఎంపికను క్లిక్ చేయండి.
Google డిస్క్‌లో నిల్వ చేయబడిన PDFలు, చిత్రాలు లేదా ఇతర కంటెంట్‌ను మీరు రిపోర్ట్ చేయవచ్చు. మీరు ఫోల్డర్ల గురించి రిపోర్ట్ చేయలేరు.
ఉల్లంఘనను రిపోర్ట్ చేయడానికి:
- కంప్యూటర్లో, drive.google.com లింక్‌కు వెళ్లండి.
- మీరు నివేదించాలనుకుంటున్న ఫైల్‌పై కుడి క్లిక్ చేసి,
'దుర్వినియోగాన్ని రిపోర్ట్ చేయి' ఎంపికను క్లిక్ చేయండి.
- ఫైల్లో కనుగొన్న దుర్వినియోగ రకాన్ని ఎంచుకోండి. ప్రతి దుర్వినియోగ రకానికి ఒక వివరణ ఉంటుంది, దాని సహాయంతో మా విధానాలను ఫైల్ ఉల్లంఘిస్తుందో లేదో మీరు నిశ్చయించుకోవచ్చు.
- 'దుర్వినియోగ నివేదికను సమర్పించు' ఎంపికను క్లిక్ చేయండి.
రిపోర్ట్ చేయడం వలన ఫైల్ తీసివేయబడుతుంది లేదా Google తరఫున ఏదొక చర్య తీసుకోబడుతుందని ఎటువంటి హామీ లేదు. మీరు విభేదించే కంటెంట్ లేదా అనుచితంగా భావించే కంటెంట్ అన్ని వేళలా Google సేవా నిబంధనలు లేదా ప్రోగ్రామ్ విధానాలను ఉల్లంఘించదు.
దుర్వినియోగ అంశాలపై మేము తీసుకోగల చర్యలు
- ఖాతా నుండి ఫైల్‌ను తీసివేయడం.
- ఫైల్ షేరింగ్‌ను పరిమితం చేయడం.
- ఫైల్‌ను ఎవరు వీక్షించాలనేది పరిమితం చేయడం.
- ఒకటి లేదా మరిన్ని Google ఉత్పత్తులకు యాక్సెస్‌ను డిజేబుల్ చేయడం.
- Google ఖాతాను తొలగించడం.
- చట్టవిరుద్ధమైన అంశాల గురించి సముచిత న్యాయ పరిరక్షణ వ్యవస్థలకు రిపోర్ట్ చేయడం.
ఉల్లంఘన గురించి అప్పీల్ చేయండి
మీకు చెందిన పైల్‌కు ఉల్లంఘన నోటీసు వచ్చి ఉంటే, ఆ ఉల్లంఘన గురించి సమీక్షను అభ్యర్థించవచ్చు.