డ్రాయింగ్‌లను సృష్టించండి, చేర్చండి & ఎడిట్ చేయండి

కార్యాలయం లేదా పాఠశాల కోసం Google Docs నుండి మరిన్ని ప్రయోజనాలు పొందాలనుకుంటున్నారా? ఉచిత Google Workspace ట్రయల్ కోసం సైన్ అప్ చేయండి.

మీరు Google చిత్రలేఖనాలతో డ్రాయింగ్‌లను క్రియేట్ చేయవచ్చు, ఇన్సర్ట్ చేయవచ్చు, అలాగే ఎడిట్ చేయవచ్చు.

Google డాక్స్‌లో డ్రాయింగ్‌ని సృష్టించండి

 1. మీ కంప్యూటర్‌లో, డాక్యుమెంట్‌ని తెరవండి.
 2. ఎగువున ఎడమ వైపు, చేర్చు ఆ తర్వాత డ్రాయింగ్ ఆ తర్వాత కొత్తది క్లిక్ చేయండి.
 3. ఎడిటింగ్ సాధనాలతో రూపాలు, గీతలు లేదా వచనాన్ని చేర్చండి.

Google డిస్క్‌లో డ్రాయింగ్‌ని సృష్టించండి

 1. మీ కంప్యూటర్‌లో, డాక్యుమెంట్‌ని తెరవండి.
 2. ఎగువున ఎడమ వైపు, ఫైల్ ఆ తర్వాత కొత్తది ఆ తర్వాత డ్రాయింగ్ క్లిక్ చేయండి.
 3. ఎడిటింగ్ సాధనాలతో రూపాలు, గీతలు లేదా వచనాన్ని చేర్చండి.

Google డిస్క్ నుండి డ్రాయింగ్‌ని చేర్చండి

 1. మీ కంప్యూటర్‌లో, డాక్యుమెంట్‌ని తెరవండి.
 2. ఎగువున ఎడమ వైపు, చేర్చు ఆ తర్వాత డ్రాయింగ్ ఆ తర్వాత డ్రైవ్ నుండి క్లిక్ చేయండి.
 3. మీరు చేర్చాలనుకున్న డ్రాయింగ్‌ని క్లిక్ చేయండి. 
 4. ఎంచుకో క్లిక్ చేయండి.

చేర్చిన డ్రాయింగ్ అసలైన డ్రాయింగ్‌తో లింక్ చేయబడి ఉంటుంది. 

 • డ్రాయింగ్‌ని అప్‌డేట్ చేయండి: డ్రాయింగ్‌ని క్లిక్ చేయండి. ఎగువున కుడి వైపు, అప్‌డేట్ చేయి క్లిక్ చేయండి. 
 • డ్రాయింగ్‌ని అన్‌లింక్ చేయండి: డ్రాయింగ్‌ని క్లిక్ చేయండి. ఎగువ కుడి వైపు, అన్‌లింక్ చేయి క్లిక్ చేయండి అన్‌లింక్ చేయి.

ఎడిటింగ్ సాధనాలను ఉపయోగించండి

గీతలు, రూపాలు, వచన పెట్టెలు మరియు చిత్రాలను జోడించేందుకు మీరు ఎడిటింగ్ సాధనాలను ఉపయోగించగలరు.

గీత గీయండి
 1. పేజీ ఎగువున, గీతను ఎంచుకో కనుగొని క్లిక్ చేయండి.
 2. మీరు కోరుకునే గీత రకాన్ని ఎంచుకోండి.
 3. గీతను మీ డ్రాయింగ్‌పై ఉంచండి:
  • గీత, ఎల్బో కనెక్టర్, కర్వ్‌డ్ కనెక్టర్ లేదా బాణం గుర్తు: ప్రారంభించేందుకు క్లిక్ చేసి, ఆపై కాన్వాస్ మీదుగా లాగండి.
  • వంకర గీత లేదా పాలీలైన్: ప్రారంభించేందుకు క్లిక్ చేసి, ఆపై మీరు గీతను వంచాలనుకుంటున్న ప్రతి చోట క్లిక్ చేయండి. రెండు-సార్లు క్లిక్ చేయండి లేదా ముగించేందుకు రూపాన్ని పూర్తిచేయండి.
  • పిచ్చి గీతలు: ప్రారంభించేందుకు క్లిక్ చేసి, ఆపై కాన్వాస్ మీదుగా లాగండి.
 4. ఎంచుకో క్లిక్ చేయండి.
ఆకారాన్ని గీయండి
 1. పేజీ ఎగువున, ఆకారాన్ని కనుగొని క్లిక్ చేయండి.
 2. మీరు ఉపయోగించాలనుకుంటున్న ఆకారాన్ని ఎంచుకోండి.
 3. మీ ఆకారాన్ని చిత్రించేందుకు కాన్వాస్‌పై క్లిక్ చేసి లాగండి.
వచనాన్ని చేర్చు
 1. పేజీ ఎగువన, చేర్చు క్లిక్ చేయండి.
  • కాన్వాస్‌పై వచనాన్ని ఒక ఆకారంగా ఉంచడానికి, వర్డ్ ఆర్ట్ క్లిక్ చేయండి
  • వచనాన్ని పెట్టెలో లేదా ఒక నిర్బంధ ప్రదేశంలో ఉంచేందుకు, వచన పెట్టెను క్లిక్ చేసి మీరు దానిని ఉంచాలనుకున్న చోట క్లిక్ చేయండి.
 2. మీ వచనాన్ని టైప్ చేసి Enter నొక్కండి.
 3. మీరు వర్డ్ ఆర్ట్ లేదా వచన పెట్టెను ఎంచుకోవచ్చు, పరిమాణం మార్చవచ్చు మరియు ఫార్మాట్ చేయవచ్చు, లేదా వచనానికి బోల్డ్ లేదా ఇటాలిక్స్ లాంటి శైలులను వర్తింపజేయవచ్చు.
చిత్రాన్ని చేర్చండి
 1. పేజీ ఎగువున, చిత్రాన్ని కనుగొని క్లిక్ చేయండి.
 2. చిత్రాన్ని ఎంచుకోవడానికి లేదా అప్‌లోడ్ చేయడానికి సూచనలను అనుసరించండి.
 3. మీరు చిత్రాన్ని తరలించవచ్చు మరియు ఏదైనా ఇతర ఆకారం వలె ఫార్మాట్ చేయవచ్చు.
  • చిత్రాన్ని తరలించండి: దానిని కాన్వాస్‌పై లాగండి.
  • చిత్రం పరిమాణం మార్చండి: మూలలలో ఉన్న నీలి రంగు పెట్టెలను లాగండి.
  • చిత్రాన్ని తిప్పండి: ఆకారం వెలుపల ఉన్న నీలి రంగు చుక్కను లాగండి. ఒకేసారి 15° తిప్పేందుకు Shiftని నొక్కి పట్టుకోండి.
  • అంచు రంగు, గీత మందం లేదా అంచు/గీత శైలి మార్చండి: కాన్వాస్ ఎగువున ఉన్న బటన్‌లను ఉపయోగించండి.

ఆకారాలను ఎంచుకుని ఫార్మాట్ చేయండి

 1. మీ కంప్యూటర్‌లో, Google డిస్క్‌లో డ్రాయింగ్‌ని తెరవండి.
 2. పేజీ ఎగువున, ఎంచుకో కనుగొని క్లిక్ చేయండి.
 3. కాన్వాస్ పైన, మీరు మార్చాలనుకుంటున్న ఆకారం, గీత లేదా వచన పెట్టెను క్లిక్ చేయండి.
  • ఆకారాన్ని తరలించండి: దానిని కాన్వాస్‌పై లాగండి.
  • ఆకారం పరిమాణం మార్చండి: మూలలలో ఉన్న నీలి రంగు పెట్టెలను లాగండి.
  • గీతను తిప్పండి: మూలలలో ఉన్న నీలి రంగు చుక్కలను లాగండి. గీతలను ఈ విధంగా తిప్పవచ్చు.
  • ఆకారాన్ని తిప్పండి: ఆకారం వెలుపల ఉన్న నీలి రంగు చుక్కను లాగండి. ఒకేసారి 15° తిప్పేందుకు Shiftని నొక్కి పట్టుకోండి.
  • పూరణ రంగు, గీత రంగు, గీత మందం లేదా అంచు/గీత శైలి మార్చండి: కాన్వాస్ ఎగువున ఉన్న బటన్‌లను ఉపయోగించండి.
  • వచనాన్ని ఆకారం లోపల పెట్టండి: సంవృత ఆకారాన్ని రెండు సార్లు నొక్కి టైప్ చేయడం ప్రారంభించండి.

ఆకారాన్ని కాపీ చేయండి

ఆకారాన్ని కాపీ చేసేందుకు, Option (Macsలో) లేదా Ctrl (Windowsలో) నొక్కి పట్టుకోండి మరియు కాపీని కొత్త స్థానానికి లాగండి.

మీ డ్రాయింగ్ పరిమాణాన్ని మార్చండి

 1. మీ కంప్యూటర్‌లో, Google డిస్క్‌లో డ్రాయింగ్‌ని తెరవండి.
 2. మెనుకి వెళ్లి ఫైల్ ఆ తర్వాత పేజీ సెటప్ క్లిక్ చేయండి.
 3. డ్రాప్‌డౌన్ మెను నుండి పరిమాణాన్ని ఎంచుకోండి. మీ స్వంత పరిమాణాన్ని ఎంచుకోవడానికి, అనుకూలం ఎంచుకోండి.
ఇది సహాయకరంగా ఉందా?
మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయి
శోధనను మూసివేయి
Google యాప్‌లు
ప్రధాన మెనూ
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
35
false