పట్టికలను జోడించండి మరియు ఎడిట్ చేయండి

డాక్యుమెంట్ లేదా ప్రెజెంటేషన్‌లోని సమాచారాన్ని టేబుల్ ద్వారా నిర్వహించండి. మీరు టేబుల్‌లను జోడించవచ్చు, తొలగించవచ్చు ఇంకా టేబుల్ అడ్డు వరుసలు అలాగే నిలువు వరుసల సైజ్ ఇంకా స్టయిల్‌ను సర్దుబాటు చేయవచ్చు.

మీరు కంప్యూటర్‌లో Google Docs ఉపయోగిస్తుంటే, వీటిని కూడా మీరు చేయవచ్చు:

  • వరుసలను క్రమబద్ధీకరించడం
  • అడ్డు వరుసలు, నిలువు వరుసలను లాగి, తరలించవచ్చు
  • టేబుల్ హెడర్ అడ్డు వరుసలను పిన్ చేయవచ్చు, తద్వారా అవి ప్రతి పేజీ ఎగువున రిపీట్ అవుతాయి
  • పేజీల అంతటా సమాచారం ఓవర్ ఫ్లో కాకుండా నివారించవచ్చు

పట్టికను జోడించండి

  1. మీ iPhone లేదా iPadలో, Google డాక్స్ యాప్ లేదా Google స్లయిడ్‌ల యాప్‌ను తెరవండి.
  2. డాక్యుమెంట్ లేదా ప్రెజెంటేషన్‌ను తెరవండి.
  3. మీరు పట్టికను ఎక్కడ జోడించాలనుకుంటున్నారో నొక్కండి.
  4. ఎగువ కుడివైపున, జోడించు జోడించు నొక్కండి.
  5. పట్టిక పట్టిక నొక్కండి.
  6. మీరు మీ పట్టికలో ఉండాలనుకునే అడ్డు వరుసలు మరియు నిలువు వరుసల సంఖ్యను ఎంచుకోండి.
  7. పట్టికను చేర్చు నొక్కండి.

అడ్డు వరుసలు లేదా నిలువు వరుసలను జోడించండి

Google డాక్స్

  1. మీ iPhone లేదా iPadలో, Google డాక్స్ యాప్‌ను తెరవండి.
  2. డాక్యుమెంట్‌ని తెరవండి.
  3. పట్టికలో ఏదైనా సెల్‌ను నొక్కండి.
  4. ఫార్మాట్ చేయి ఫార్మాట్ నొక్కండి.
  5. "పట్టిక" క్రింద, క్రిందివాటిలో ఒకదాన్ని నొక్కండి:
    • నిలువు వరుస ఎడమవైపు నిలువు వరుసను ఎడమవైపు చొప్పించు
    • నిలువు వరుస కుడివైపు నిలువు వరుసను కుడివైపు చొప్పించు
    • అడ్డు వరుస ఎగువన అడ్డు వరుసను ఎగువ చొప్పించు
    • అడ్డు వరుస దిగువన అడ్డు వరుసను దిగువ చొప్పించు

Google స్లయిడ్‌లు

  1. మీ iPhone లేదా iPadలో, Google స్లయిడ్‌ల యాప్‌ను తెరవండి.
  2. ప్రెజెంటేషన్‌ను తెరవండి.
  3. పట్టికను నొక్కండి.
  4. అడ్డు వరుస లేదా నిలువు వరుస పక్కన బూడిదరంగు పట్టీని నొక్కండి.
  5. క్రిందివాటిలో ఒకదాన్ని నొక్కండి:
    • నిలువు వరుసను ఎడమవైపు చేర్చు నిలువు వరుసను ఎడమవైపు చొప్పించు
    • నిలువు వరుసను కుడివైపు చేర్చు నిలువు వరుసను కుడివైపు చొప్పించు
    • అడ్డు వరుసను ఎగువన చేర్చు అడ్డు వరుసను ఎగువ చొప్పించు
    • అడ్డు వరుసను దిగువన చేర్చు అడ్డు వరుసను దిగువ చొప్పించు

మీకు ఈ ఎంపికలు కనిపించకపోతే, మీరు మెనులో కుడివైపు బాణాన్ని నొక్కాల్సి ఉండవచ్చు.

అడ్డు వరుసలు, నిలువు వరుసలు లేదా పట్టికను తొలగించండి

Google డాక్స్

  1. మీ iPhone లేదా iPadలో, Google డాక్స్ యాప్‌ను తెరవండి.
  2. డాక్యుమెంట్‌ని తెరవండి.
  3. పట్టికను నొక్కండి.
  4. మీరు తొలగించాలనుకుంటున్న అడ్డు వరుస లేదా నిలువు వరుస పక్కన బూడిదరంగు పట్టీని నొక్కండి.
  5. నిలువు వరుసను తొలగించు, అడ్డు వరుసను తొలగించు లేదా పట్టికను తొలగించు నొక్కండి.

మీకు ఈ ఎంపికలు కనిపించకపోతే, మీరు మెనులో కుడివైపు బాణాన్ని నొక్కాల్సి ఉండవచ్చు.

Google స్లయిడ్‌లు

  1. మీ iPhone లేదా iPadలో, Google స్లయిడ్‌ల యాప్‌ను తెరవండి.
  2. ప్రెజెంటేషన్‌ను తెరవండి.
  3. పట్టికను నొక్కండి.
  4. మీరు తొలగించాలనుకుంటున్న అడ్డు వరుస లేదా నిలువు వరుస పక్కన బూడిదరంగు పట్టీని నొక్కండి.
  5. తొలగించు నొక్కండి.
  6. పట్టికను తొలగించడానికి, పట్టికను నొక్కి, ఆ తర్వాత తొలగించు నొక్కండి.

మీకు ఈ ఎంపికలు కనిపించకపోతే, మీరు మెనులో కుడివైపు బాణాన్ని నొక్కాల్సి ఉండవచ్చు.

పట్టికలో సెల్‌లను విలీనం చేయండి

Google డాక్స్

  1. మీ iPhone లేదా iPadలో, Google డాక్స్ యాప్‌ను తెరవండి.
  2. డాక్యుమెంట్‌ని తెరవండి.
  3. పట్టికను నొక్కండి.
  4. మీరు విలీనం చేయాలనుకుంటున్న అడ్డు వరుస లేదా నిలువు వరుస పక్కన బూడిదరంగు పట్టీని నొక్కండి.
    • అడ్డు వరుసలు మరియు నిలువు వరుసల కలయికను విలీనం చేయడానికి, మూలన కనిపించే నీలం రంగు చుక్కను నొక్కి, లాగండి.
  5. ఫార్మాట్ ఫార్మాట్ ఆ తర్వాత పట్టిక నొక్కండి.
  6. దిగువన, సెల్‌లను విలీనం చేయి ఎంపికను ఆన్ చేయండి.

గమనిక: సెల్‌ల విలీనాన్ని తీసివేయడానికి, సెల్‌లను విలీనం చేయి ఎంపికను ఆఫ్ చేయండి.

Google స్లయిడ్‌లు

  1. మీ iPhone లేదా iPadలో, Google స్లయిడ్‌ల యాప్‌ను తెరవండి.
  2. ప్రెజెంటేషన్‌ను తెరవండి.
  3. మీరు విలీనం చేయాలనుకుంటున్న సెల్‌లను హైలైట్ చేయండి.
  4. సెల్‌లను విలీనం చేయి నొక్కండి.

మీకు ఈ ఎంపికలు కనిపించకపోతే, మీరు మెనులో కుడివైపు బాణాన్ని నొక్కాల్సి ఉండవచ్చు.

పట్టికల పరిమాణం మార్చండి మరియు శైలిని జోడించండి

అడ్డు వరుసలు మరియు నిలువు వరుసల పరిమాణం మార్చండి

Google డాక్స్

  1. మీ iPhone లేదా iPadలో, Google డాక్స్ యాప్‌ను తెరవండి.
  2. డాక్యుమెంట్‌ను తెరవండి.
  3. ఇప్పటికే ఉన్న పట్టికను నొక్కండి.
  4. మీరు మార్చాలనుకుంటున్న అడ్డు వరుస లేదా నిలువు వరుసలో సెల్‌ను నొక్కండి.
  5. ఫార్మాట్‌ను నొక్కి, ఫార్మాట్ ఆ తర్వాత పట్టిక నొక్కండి.
  6. అడ్డు వరుస మరియు నిలువు వరుస పరిమాణాన్ని మార్చడానికి, "కనిష్ట అడ్డు వరుస ఎత్తు" మరియు "నిలువు వరుస వెడల్పు" ఎంపికల పక్కన ఉన్న పైకి మరియు కిందికి బాణాలను నొక్కండి.

Google స్లయిడ్‌లు

  1. మీ iPhone లేదా iPadలో, Google స్లయిడ్‌ల యాప్‌ను తెరవండి.
  2. ప్రెజెంటేషన్‌ను తెరవండి.
  3. ఇప్పటికే ఉన్న పట్టికను నొక్కండి.
  4. మీరు మార్చాలనుకుంటున్న అడ్డు వరుస హెడర్ లేదా నిలువు వరుస హెడర్‌ను నొక్కండి.
  5. అడ్డు వరుస లేదా నిలువు వరుస పరిమాణాన్ని మార్చడానికి, అడ్డు వరుస లేదా నిలువు వరుస హెడర్ అంచున ఉన్న గీతలను పట్టుకుని, లాగండి.

పట్టిక పరిమాణం మార్చండి

Google డాక్స్

  1. మీ iPhone లేదా iPadలో, Google డాక్స్ యాప్‌ను తెరవండి.
  2. డాక్యుమెంట్‌ను తెరవండి.
  3. ఇప్పటికే ఉన్న పట్టికను నొక్కండి.
  4. పట్టిక ఎగువభాగం ఎడమవైపున, చతురస్రాన్ని నొక్కండి.
  5. పట్టిక అంచు చుట్టూ, బూడిదరంగు పట్టీలను తాకి, లాగండి.

Google స్లయిడ్‌లు

  1. మీ iPhone లేదా iPadలో, Google స్లయిడ్‌ల యాప్‌ను తెరవండి.
  2. ప్రెజెంటేషన్‌ను తెరవండి.
  3. మీరు పరిమాణం మార్చాలనుకునే పట్టికను నొక్కండి.
  4. పట్టిక మూలలలో, నీలంరంగు చతురస్రాలను పట్టుకుని, లాగండి.

పట్టికలో విడివిడిగా సెల్‌లకు శైలిని జోడించండి

  1. మీ iPhone లేదా iPadలో, Google డాక్స్ యాప్ లేదా Google స్లయిడ్‌ల యాప్‌ను తెరవండి.
  2. డాక్యుమెంట్ లేదా ప్రెజెంటేషన్‌ను తెరవండి.
  3. మీరు మార్చాలనుకుంటున్న సెల్‌లను నొక్కండి.
  4. ఫార్మాట్‌ను నొక్కి, ఫార్మాట్ ఆ తర్వాత పట్టిక నొక్కండి.
  5. మీరు మార్చాలనుకుంటున్న శైలిని నొక్కండి:
    • రంగు పూరణ
    • అంచు రంగు
    • అంచు వెడల్పు లేదా అంచు మందం
    • అంచు గీత
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
17936801327636279301
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false