పట్టికలను జోడించండి మరియు ఎడిట్ చేయండి

డాక్యుమెంట్ లేదా ప్రెజెంటేషన్‌లోని సమాచారాన్ని టేబుల్ ద్వారా నిర్వహించండి. మీరు టేబుల్‌లను జోడించవచ్చు, తొలగించవచ్చు ఇంకా టేబుల్ అడ్డు వరుసలు అలాగే నిలువు వరుసల సైజ్ ఇంకా స్టయిల్‌ను సర్దుబాటు చేయవచ్చు.

మీరు కంప్యూటర్‌లో Google Docs ఉపయోగిస్తుంటే, వీటిని కూడా మీరు చేయవచ్చు:

  • వరుసలను క్రమబద్ధీకరించడం
  • అడ్డు వరుసలు, నిలువు వరుసలను లాగి, తరలించవచ్చు
  • టేబుల్ హెడర్ అడ్డు వరుసలను పిన్ చేయవచ్చు, తద్వారా అవి ప్రతి పేజీ ఎగువున రిపీట్ అవుతాయి
  • పేజీల అంతటా సమాచారం ఓవర్ ఫ్లో కాకుండా నివారించవచ్చు

టేబుల్‌ను జోడించండి

  1. మీ కంప్యూటర్‌లో, డాక్యుమెంట్ లేదా ప్రెజెంటేషన్‌లోని స్లయిడ్‌ను తెరవండి.
  2. ఇన్‌సర్ట్ చేయండి ఆ తర్వాత టేబుల్ ఆ తర్వాత  మీరు ఎన్ని అడ్డు వరుసలు ఇంకా నిలువు వరుసలను జోడించాలనుకుంటున్నారో ఎంచుకోవడానికి క్లిక్ చేయండి.
    • టేబుల్‌లు గరిష్టంగా 20 x 20 సెల్‌లను కలిగి ఉండవచ్చు.
  3. మీ డాక్యుమెంట్‌కు టేబుల్ జోడించబడుతుంది.
అడ్డు వరుసలు లేదా నిలువు వరుసలను జోడించండి
  1. మీ కంప్యూటర్‌లో, డాక్యుమెంట్ లేదా ప్రెజెంటేషన్‌లోని స్లయిడ్‌ను తెరవండి.
  2. పట్టికలో సెల్‌పై కుడి క్లిక్ చేయండి.
  3. ఎంపిక చేయబడిన సెల్ పక్కన అడ్డు వరుస లేదా నిలువు వరుసను జోడించేందుకు, దీన్ని క్లిక్ చేయండి:
    • నిలువు వరుసను ఎడమవైపు చేర్చు
    • నిలువు వరుసను కుడివైపు చేర్చు
    • అడ్డు వరుసను ఎగువన చేర్చు
    • దిగువున అడ్డు వరుసను ఇన్‌సర్ట్ చేయండి
అడ్డు వరుసలు, నిలువు వరుసలు లేదా టేబుల్‌లను తొలగించండి
  1. మీ కంప్యూటర్‌లో, డాక్యుమెంట్ లేదా ప్రెజెంటేషన్‌లోని స్లయిడ్‌ను తెరవండి.
  2. మీరు తొలగించాలనుకుంటున్న అడ్డు వరుస లేదా నిలువు వరుస నుండి టేబుల్‌లోని సెల్‌ను కుడి క్లిక్ చేయండి.
  3. మెనూ నుండి, నిలువు వరుసను తొలగించండిఅడ్డు వరుసను తొలగించండి, లేదా టేబుల్‌ను తొలగించండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
టేబుల్‌ను తరలించండి
ముఖ్య గమనిక: Google Docsలో, మీ డాక్యుమెంట్ అనేది పేజీల ఫార్మాట్‌లో ఉందని నిర్ధారించుకోండి.
మీ టేబుల్‌ను తరలించడానికి, అలాగే ఒక స్థానంలో ఉంచడానికి, ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:
పాయింట్ చేసి లాగండి:
  1. టేబుల్‌ను తరలించండి అనే ఆప్షన్ కనిపించే వరకు టేబుల్ మాలల్లో పాయింట్ చేయండి.
  2. మీ టేబుల్‌ను లాగండి.
  3. టేబుల్‌ను మీకు కావాల్సిన స్థానంలో వదలండి.
క్విక్ లేఅవుట్‌లు:
  1. టేబుల్‌పై కుడి క్లిక్ చేయండి.
  2. టేబుల్ ప్రాపర్టీలు ఆ తర్వాత క్విక్ లేఅవుట్‌లు ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  3. లేఅవుట్ ఆప్షన్‌లలో ఒకదాన్ని ఎంచుకోండి.
టెక్స్ట్‌ను సర్దుబాటు చేయండి:
  1. టేబుల్‌పై కుడి క్లిక్ చేయండి.
  2. టేబుల్ ప్రాపర్టీలు ఆ తర్వాత టేబుల్ ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  3. “స్టయిల్” కింద టెక్స్ట్‌ను సర్దుబాటు చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:
    • టేబుల్, ఇంకా సర్దుబాటు చేసిన టెక్స్ట్ మధ్య ఖాళీ మొత్తాన్ని మార్చండి: "డాక్యుమెంట్ టెక్స్ట్ నుండి మార్జిన్‌ల" కింద, మార్జిన్ సైజ్‌ను తరలించండి.
    • టేబుల్‌ను దాని సర్దుబాటు చేసిన టెక్స్ట్‌తో అదే స్థానంలో ఉంచండి: “స్థానం” కింద, టెక్స్ట్‌ను తరలించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • పేజీలో టేబుల్‌ను అదే స్థానంలో ఉంచండి: “స్థానం” కింద, పేజీలో స్థిరం చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

టేబుల్స్ స్టయిల్స్‌ను మార్చండి

మీరు అడ్డు వరుసలు, నిలువు వరుసల పరిమాణం మార్చవచ్చు లేదా టేబుల్ అడ్డు వరుసలను క్రమబద్ధీకరించవచ్చు. మీరు విడిగా సెల్‌ల అంచు స్టయిల్‌ను, వాటి బ్యాక్‌గ్రౌండ్ రంగును కూడా మార్చవచ్చు.

అడ్డు వరుసలు, నిలువు వరుసల పరిమాణం మార్చండి

అడ్డు వరుస లేదా నిలువు వరుస పరిమాణం మార్చండి

  1. మీ కంప్యూటర్‌లో, డాక్యుమెంట్ లేదా ప్రెజెంటేషన్‌ను తెరవండి.
  2. మీ పట్టికలో, అడ్డు వరుస లేదా నిలువు వరుస యొక్క గ్రిడ్‌లైన్‌పై మీ కర్సర్‌ను తరలించండి.
  3. మీ కర్సర్ రెండు వైపుల బాణంగా మారినప్పుడు, మీకు కావాల్సిన పరిమాణానికి వచ్చే వరకు అడ్డు వరుస లేదా నిలువు వరుసను లాగండి.

అన్ని అడ్డు వరుసలను, నిలువు వరుసలను ఒకే సైజ్‌లో ఉండేలా చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, డాక్యుమెంట్‌ను లేదా ప్రెజెంటేషన్‌ను తెరవండి.
  2. పట్టికను కుడి క్లిక్ చేయండి.
  3. అడ్డు వరుసలను డిస్ట్రిబ్యూట్ చేయండి లేదా నిలువు వరుసలను డిస్ట్రిబ్యూట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
పట్టిక పరిమాణం మార్చండి

Google Docs

  1. మీ కంప్యూటర్‌లో, డాక్యుమెంట్‌ను తెరిచి టేబుల్‌లోని సెల్స్‌ను ఎంచుకోండి.
  2. ఫార్మాట్ ఆ తర్వాత టేబుల్ ఆ తర్వాత టేబుల్ ప్రాపర్టీలు అనే ఆప్షన్‌లకు వెళ్లండి. 
    1. మీరు టేబుల్‌పై కుడి-క్లిక్ చేసి, టేబుల్ ప్రాపర్టీలను కూడా ఎంచుకోవచ్చు.
  3. "నిలువు వరుస" లేదా "అడ్డు వరుస" కింద, హైలైట్ చేయబడిన అన్ని సెల్స్ కోసం మీకు కావలసిన వెడల్పు, అలాగే ఎత్తును ఎంటర్ చేయండి.
  4. సరే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

Google స్లయిడ్‌లు

  1. మీ కంప్యూటర్‌లో, ప్రెజెంటేషన్‌ను తెరిచి, పట్టికను క్లిక్ చేయండి.
  2. మీ మౌస్‌ను పట్టికలోని ఏదైనా మూలకు తరలించండి.
  3. మీ కర్సర్ రెండు వైపుల బాణంగా మారినప్పుడు, క్లిక్ చేసి, ఏదైనా దిశలో లాగండి.
టేబుల్‌లో విడివిడిగా సెల్‌లకు స్టయిల్‌ను జోడించండి
  1. మీ కంప్యూటర్‌లో, డాక్యుమెంట్ లేదా ప్రెజెంటేషన్‌ను తెరవండి.
  2. మీరు మార్చాలనుకుంటున్న సెల్‌లను ఎంచుకోండి.
  3. టూల్‌బార్‌లో, మీరు మార్చాలనుకుంటున్న శైలిని క్లిక్ చేయండి:
    • అంచు రంగు అంచు రంగు
    • అంచు వెడల్పు లేదా అంచు మందం అంచు డాష్
    • అంచు డాష్ అంచు యొక్క మందం
    • బ్యాక్‌గ్రౌండ్ రంగు లేదా నింపే రంగు నిండినది

Google Docsలో, మీరు సెల్‌కు చెందిన వర్టికల్ అమరిక, అలాగే ప్యాడింగ్‌ను కూడా మార్చవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో, డాక్యుమెంట్‌ను తెరిచి, టేబుల్‌పై క్లిక్ చేయండి.
  2. ఫార్మాట్ ఆ తర్వాత టేబుల్ ఆ తర్వాత టేబుల్ ప్రాపర్టీలు అనే ఆప్షన్‌లకు వెళ్లండి. 
    1. మీరు టేబుల్‌పై కుడి-క్లిక్ చేసి, టేబుల్ ప్రాపర్టీలను కూడా ఎంచుకోవచ్చు.
  3. "సెల్" కింద, మీరు వర్టికల్ అమరికను ఎంచుకుని, సెల్ ప్యాడింగ్‌ను ఎంటర్ చేయవచ్చు.
Google Docsలో అడ్డు వరుసలను క్రమపద్ధతిలో అమర్చండి
  1. మీ కంప్యూటర్‌లో, Google Docsలోని డాక్యుమెంట్‌ను తెరవండి.
  2. టేబుల్‌పై కుడి క్లిక్ చేయండి.
  3. టేబుల్‌ను క్రమపద్ధతిలో అమర్చండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. టేబుల్‌ను ఆరోహణ క్రమంలో అమర్చండి లేదా టేబుల్‌ను అవరోహణ క్రమంలో అమర్చండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

మీరు టేబుల్ కంట్రోల్‌ల ద్వారా నేరుగా అడ్డు వరుసలను త్వరగా క్రమబద్ధీకరించవచ్చు:

  1. టేబుల్‌లో పైన ఉండే అడ్డు వరుసలో మౌస్ కర్సర్ ఉంచండి.
  2. టేబుల్‌ను క్రమపద్ధతిలో అమర్చండి ని క్లిక్ చేయండి. 
  3. ఆరోహణ క్రమంలో అమర్చండి లేదా అవరోహణ క్రమంలో అమర్చండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

చిట్కా: మీ టేబుల్ హెడర్ అడ్డు వరుసలను క్రమబద్ధీకరించడాన్ని నివారించడం కోసం, హెడర్ అడ్డు వరుసలు పిన్ చేయడానికి ఇవ్వబడిన సూచనలను ఫాలో చేయండి. పిన్ చేయబడిన అడ్డు వరుసలు ఏవైనా, క్రమబద్ధీకరించబడవు.

టేబుల్‌లను నిర్మించండి

మీరు అడ్డు వరుసలు, నిలువు వరుసలను తరలించవచ్చు లేదా సెల్‌లను ఒకదానితో ఒకటి విలీనం చేయవచ్చు. Google Docsలో, మీరు మల్టిపుల్ పేజీలను దాటే పెద్ద టేబుల్‌లను కలిగి ఉంటే, మీరు పేజీల ఎగువన హెడర్ అడ్డు వరుసలను కూడా పిన్ చేయవచ్చు, అంతే కాకుండా అడ్డు వరుసలు ఓవర్ ఫ్లో కాకుండా వాటిని నిరోధించవచ్చు.

టేబుల్‌లో సెల్‌లను విలీనం చేయండి

మీరు శీర్షికలను సృష్టించడానికి, హెడర్‌లను జోడించడానికి లేదా అనేక సెల్‌లలోని సమాచారాన్ని ఒకదానిలో ఉంచడానికి సెల్‌లను కలపవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో, డాక్యుమెంట్ లేదా ప్రెజెంటేషన్‌ను తెరవండి.
  2. మీరు విలీనం చేయాలనుకుంటున్న సెల్స్‌ను హైలైట్ చేయడానికి క్లిక్ చేసి, లాగండి.
  3. సెల్స్ పైన కుడి క్లిక్ చేయండి.
  4. సెల్స్‌ను విలీనం చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. 

సెల్స్ విలీనం తీసివేయడానికి:

  1. మీరు విలీనం తీసివేయాలనుకుంటున్న సెల్స్‌ను హైలైట్ చేయడానికి క్లిక్ చేసి, లాగండి.
  2. హైలైట్ చేసిన సెల్స్ పైన కుడి క్లిక్ చేయండి.
  3. సెల్స్ విలీనం తీసివేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

Google Docsలో టేబుల్ సెల్స్‌ను విభజించండి

  1. మీ కంప్యూటర్‌లో, డాక్యుమెంట్‌ను తెరవండి.
  2. సెల్ పైన కుడి క్లిక్ చేయండి.
  3. సెల్‌ను విభజించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. మీకు కావాల్సిన అడ్డు వరుసలు, నిలువు వరుసల సంఖ్యను ఎంటర్ చేయండి.
  5. విభజించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
Google Docsలో టేబుల్ అడ్డు వరుసలను, నిలువు వరుసలను తరలించండి

అడ్డు వరుసను తరలించండి

  1. మీ కంప్యూటర్‌లో, Google Docsలోని డాక్యుమెంట్‌ను తెరవండి.
  2. టేబుల్ లోని ఎడమ కాలమ్‌లో మౌస్ కర్సర్ ఉంచండి.
  3. చేయి గుర్తు కనిపించే వరకు, లాగే చిహ్నం పై మీ కర్సర్‌ను ఉంచండి.
  4. అడ్డు వరుసను క్లిక్ చేసి, పైకి లేదా క్రిందికి లాగడం ద్వారా దాని కొత్త లొకేషన్‌కు మార్చండి. 

నిలువు వరుసను తరలించండి

  1. మీ కంప్యూటర్‌లో, Google Docsలోని డాక్యుమెంట్‌ను తెరవండి.
  2. టేబుల్‌లో పైన ఉండే అడ్డు వరుసలో మౌస్ కర్సర్ ఉంచండి.
  3. చేయి గుర్తు కనిపించే వరకూ, లాగే చిహ్నం పై మీ కర్సర్‌ను ఉంచండి.
  4. నిలువు వరుసను క్లిక్ చేసి ఎడమ వైపుకు లేదా కుడి వైపుకు లాగడం ద్వారా దాని కొత్త లొకేషన్‌కు మార్చండి 
Google Docsలో హెడర్ అడ్డు వరుసలను పిన్ చేయండి

మీకు పొడవైన టేబుల్ ఉన్నట్లయితే, ప్రతి పేజీ ఎగువ భాగాన రిపీట్ అయ్యే టేబుల్ అడ్డు వరుసలను మీరు హెడర్ అడ్డు వరుసలుగా మార్చవచ్చు. మీరు పేజీ లేని ఫార్మాట్‌లో ఉన్న డాక్యుమెంట్‌పై పని చేస్తున్నట్లయితే, విండో ఎగువ భాగంలో కనిపిస్తూ ఉండేలా టేబుల్ అడ్డు వరుసలను పిన్ చేయవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో, Google Docsలోని డాక్యుమెంట్‌ను తెరవండి.
  2. మీ టేబుల్‌లో ఎక్కడైనా క్లిక్ చేయండి.
  3. ఫార్మాట్ ఆ తర్వాత టేబుల్ ఆ తర్వాత టేబుల్ ప్రాపర్టీలు అనే ఆప్షన్‌కు వెళ్ళండి. 
    1. మీరు టేబుల్‌పై కుడి-క్లిక్ చేసి, టేబుల్ ప్రాపర్టీలను కూడా ఎంచుకోవచ్చు.
  4. "అడ్డు వరుస" కింద, హెడర్ అడ్డు వరుస(లు) పిన్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకొని, మీరు పిన్ చేయాలనుకుంటున్న అడ్డు వరుసల సంఖ్యను పేర్కొనండి.
  5. మార్పులను వర్తింపజేయడానికి, సరే అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. 

మీరు నేరుగా టేబుల్ నుండి, కావలసిన అడ్డు వరుసలను కూడా త్వరగా పిన్ చేయవచ్చు:

  1. మీ కంప్యూటర్‌లో, Google Docsలోని డాక్యుమెంట్‌ను తెరవండి.
  2. మీరు పిన్ చేయాలనుకుంటున్న అడ్డు వరుసపై కుడి-క్లిక్ చేసి, ఈ అడ్డు వరుస వరకు పిన్ హెడర్‌ను ఎంచుకోండి
    1. మీరు పిన్ చేయాలనుకుంటున్న అడ్డు వరుస ఎడమ వైపు మౌస్ కర్సర్ ఉంచి, ఈ అడ్డు వరుస వరకు పిన్ హెడర్ ను ఎంచుకోవచ్చు.

అడ్డు వరుసలను అన్‌పిన్ చేయండి

  1. టేబుల్‌లోని ఏదైనా అడ్డు వరుసను కుడి క్లిక్ చేయండి
  2. హెడర్ అడ్డు వరుసలను అన్‌పిన్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి
Google Docsలో టేబుల్‌లోని అడ్డు వరుసలను విడదీయలేని విధంగా చేయండి

మీరు పలు పేజీలను దాటే పెద్ద టేబుల్‌ను కలిగి ఉన్నట్లయితే, మీరు టేబుల్ అడ్డు వరుసలోని సమాచారాన్ని పేజీల మధ్య విరామాలలో విభజించాలనుకుంటున్నారో లేదో ఎంచుకోవచ్చు. 

ముఖ్య గమనిక: పేజీ లేని ఫార్మాట్‌లో ఉన్న డాక్యుమెంట్‌లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు. ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి, మీ డాక్యుమెంట్ అనేది పేజీల ఫార్మాట్‌లో ఉందని నిర్ధారించుకోండి.

  1. టేబుల్ అడ్డు వరుసను ఎంచుకోండి. 
  2. ఫార్మాట్ ఆ తర్వాత టేబుల్ ఆ తర్వాత టేబుల్ ప్రాపర్టీలు అనే ఆప్షన్‌లకు వెళ్లండి. 
    1. మీరు టేబుల్‌పై కుడి-క్లిక్ చేసి, టేబుల్ ప్రాపర్టీలను కూడా ఎంచుకోవచ్చు.
  3. "అడ్డు వరుస" కింద, పేజీలలో అడ్డు వరుస ఓవర్ ఫ్లో అయ్యేలా అనుమతించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి/ఎంపికను తీసివేయండి.
  4. మార్పులను వర్తింపజేయడానికి, సరే అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
Google Docsలో టేబుల్ అమరికను మార్చండి
  1. మీ కంప్యూటర్‌లో, డాక్యుమెంట్‌ను తెరిచి, టేబుల్‌పై క్లిక్ చేయండి.
  2. ఫార్మాట్ ఆ తర్వాత టేబుల్ ఆ తర్వాత టేబుల్ ప్రాపర్టీలు అనే ఆప్షన్‌లకు వెళ్లండి. 
    1. మీరు టేబుల్‌పై కుడి-క్లిక్ చేసి, టేబుల్ ప్రాపర్టీలను కూడా ఎంచుకోవచ్చు.
  3. "టేబుల్" కింద, ఎడమ వైపు, మధ్యస్తం, లేదా కుడి వైపు ఎంపిక చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15991254444511972706
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false