వచనం మరియు చిత్రాలను కాపీ చేసి అతికించండి

మీరు మీ ఫైల్‌ల మధ్య వచనం మరియు చిత్రాలను కాపీ చేసి అతికించవచ్చు — మీరు ఒక రకం ఫైల్ నుండి మరో రకం ఫైల్‌కి వెళుతున్నప్పుడు కూడా.

కుడి-క్లిక్ మెను లేదా కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించండి

మీరు కుడి-క్లిక్ మెనుతో కాపీ చేసి అతికించగలరు, కానీ భద్రతా కారణాల దృష్ట్యా, చాలా బ్రౌజర్‌లు మెనుల ద్వారా మీ కంప్యూటర్ క్లిప్ బోర్డ్‌ని ఉపయోగించడానికి (డాక్స్, షీట్‌లు మరియు స్లయిడ్‌లు వంటి) వెబ్ యాప్‌లను అనుమతించడం లేదు.

మీరు Chromeని ఉపయోగిస్తున్నట్లయితే

కాపీ చేసి అతికించేందుకు, కుడి-క్లిక్ మెనుని ఉపయోగించండి లేదా టూల్‌బార్‌లోని ఎడిట్ మెను నుండి "కాపీ చేయి" లేదా "అతికించు" ఎంచుకోండి.

మీరు వేరొక బ్రౌజర్‌ని ఉపయోగిస్తున్నట్లయితే

కాపీ చేసి అతికించడానికి, మీరు కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించగలరు:

 • PC: కాపీ చేసేందుకు Ctrl + c, కత్తిరించేందుకు Ctrl + x, మరియు అతికించడానికి Ctrl + v.
 • Mac: కాపీ చేసేందుకు ⌘ + c, కత్తిరించేందుకు ⌘ + x, మరియు అతికించేందుకు ⌘ + v.

అతికించడానికి మరిన్ని ఎంపికలు

చార్ట్‌లను కాపీ చేసి అతికించండి
 1. మీ కంప్యూటర్‌లో, Google షీట్‌లలో చార్ట్‌ని తెరవండి.
 2. చార్ట్ యొక్క ఎగువ కుడి మూలన, మరిన్ని మరిన్ని క్లిక్ చేయండి.
 3. చార్ట్‌ని కాపీ చేయి క్లిక్ చేయండి.
 4. చార్ట్‌ని అతికించేందుకు, ఎడిట్ క్లిక్ చేసి ఆ తర్వాత అతికించు క్లిక్ చేయండి. మీరు స్ప్రెడ్‌షీట్ వెలుపల అతికిస్తున్నట్లయితే, కాపీ చేసిన చార్ట్‌కి డేటాని లింక్ చేయాలో లేదో మిమ్మల్ని అడుగుతుంది.
వచన ఫార్మాటింగ్‌ని కాపీ చేయండి (పెయింట్ ఫార్మాట్)

మీరు పెయింట్ ఫార్మాట్ సాధనంతో, వచనం, సెల్‌లు లేదా ఆబ్జెక్ట్ యొక్క ఫార్మాటింగ్‌ని కాపీ చేయగలరు.

 1. మీ కంప్యూటర్‌లో, Google డాక్స్, షీట్‌లు లేదా స్లయిడ్‌ల ఫైల్‌ని తెరవండి.
 2. మీరు ఫార్మాట్‌ని కాపీ చేయాలనుకుంటున్న వచనం, సెల్‌ల పరిధి లేదా ఆబ్జెక్ట్‌ని ఎంచుకోండి.
 3. టూల్‌బార్‌లో, పెయింట్ ఫార్మాట్‌ని పెయింట్ ఫార్మాట్ క్లిక్ చేయండి. మీరు పెయింట్ ఫార్మాట్ మోడ్‌లో ఉన్నారని చూపేందుకు మీ కర్సర్ చిహ్నం మారుతుంది.
 4. మీరు దేని కోసం ఫార్మాటింగ్‌ని అతికించాలనుకుంటున్నారో ఎంచుకోండి.
 5. మీరు కాపీ చేసిన ఫార్మాటింగ్ లాగానే ఈ ఫార్మాటింగ్ మారుతుంది.

చిట్కా: బహుళ స్థలాలలో ఫార్మాటింగ్‌ని అతికించేందుకు, పెయింట్ ఫార్మాట్‌ని రెండు సార్లు క్లిక్ చేయండి పెయింట్ ఫార్మాట్. మీరు పూర్తి చేసిన తర్వాత, పెయింట్ ఫార్మాట్ పెయింట్ ఫార్మాట్ క్లిక్ చేయండి .

కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

ఎంచుకున్న వచనం యొక్క ఫార్మాటింగ్‌ని కాపీ చేసేందుకు:

 • Ctrl + Alt + c (Windows or Chrome OS) లేదా ⌘ + Option + c (Mac) నొక్కండి.

మీరు కాపీ చేసిన ఫార్మాటింగ్‌ని వేరొక ఎంచుకున్న వచనానికి వర్తింపజేసేందుకు:

 • Ctrl + Alt + v (Windows or Chrome OS) లేదా ⌘ + Option + v (Mac) నొక్కండి.
స్ప్రెడ్‌షీట్‌లో ప్రత్యేకంగా అతికించు ఎంపికను ఉపయోగించండి

సెల్‌లను కాపీ చేసేటప్పుడు ఏ ఫార్మాటింగ్ కాపీ చేయబడాలో నిర్ణయించేందుకు మీరు ప్రత్యేకంగా అతికించు ఎంపికను ఉపయోగించగలరు.

కేవలం ఒక స్ప్రెడ్‌షీట్‌లో మాత్రమే ప్రత్యేకంగా అతికించు ఎంపిక పనిచేస్తుంది. మీరు ఒక స్ప్రెడ్‌షీట్‌లో సెల్‌లను కాపీ చేసి మరొక ట్యాబ్‌లో తెరవబడి ఉన్న స్ప్రెడ్‌షీట్‌లో ప్రత్యేకంగా అతికించు ఎంపికను ఉపయోగించలేరు.

 1. మీ కంప్యూటర్‌లో, Google షీట్‌లలో స్ప్రెడ్‌షీట్‌ను తెరవండి.
 2. మీరు అతికించాలనుకుంటున్న డేటాని కాపీ చేసి దానిని మీరు అతికించాల్సిన సెల్‌లో కర్సర్‌ని పెట్టండి.
 3. ఎడిట్ ఆ తర్వాత ప్రత్యేకంగా అతికించు క్లిక్ చేయండి.
 4. క్రింది వాటి నుండి ఎంచుకోండి:
  • విలువలను మాత్రమే అతికించు: అసలైన సెల్‌ల పరిధిలోని వచనాన్ని మాత్రమే అతికిస్తుంది.
  • ఫార్మాట్‌ని మాత్రమే అతికించు: పెయింట్ ఆకృతి సాధనాన్ని ఉపయోగించినట్లుగానే ఈ ఎంపికను ఉపయోగించవచ్చు -- ఇది సెల్ ఫార్మాటింగ్‌ని మాత్రమే కాపీ చేస్తుంది, మరియు ఇప్పటికే ఉన్న వచనాన్ని లేదా ఫార్ములాలను మార్చదు.
  • అంచులు మినహా అన్నీ అతికించు: సెల్ అంచులను తప్ప మిగతావన్నీ అతికిస్తుంది.
  • నిలువు వరుస వెడల్పులను మాత్రమే అతికించు: అసలైన వాటికి సరిపోలే విధంగా ఎంచుకున్న నిలువు వరుసల పరిమాణాన్ని మారుస్తుంది. 
  • ఫార్ములాని మాత్రమే అతికించు: కాపీ చేసిన సెల్‌ల పరిధిలో ఉన్న ఫార్ములాలను అతికిస్తుంది, ఫార్ములాల యొక్క గణన ఫలితాలను అతికించదు.
  • డేటా ప్రామాణీకరణను మాత్రమే అతికించు: ఇప్పటికే ఉన్న ఫార్మాటింగ్, ఫార్ములాలు లేదా వచనాన్ని మార్చకుండా, సెల్‌ల పరిధిలో డేటా ప్రామాణీకరణ నియమాన్ని అతికిస్తుంది.
  • షరతులతో కూడిన ఫార్మాటింగ్‌ని మాత్రమే అతికించు: సెల్‌ల పరిధికి షరతులతో కూడిన ఫార్మాటింగ్ నియమాలను మాత్రమే వర్తింపజేస్తుంది.
  • స్థాన పరివర్తనాన్ని అతికించు: కాపీ చేసిన సెల్‌ల యొక్క తిప్పిన వెర్షన్‌ను అతికిస్తుంది. ఉదాహరణకు, మీరు సెల్‌ల నిలువు వరుసను కాపీ చేసి స్థాన పరివర్తనాన్ని అతికించు ఎంపికను ఉపయోగించినట్లయితే, అది వాటిని అడ్డు వరుసలో అతికిస్తుంది, అడ్డు వరుసలో ఉన్న వాటిని నిలువు వరుసలో ఉంచుతుంది.

కంటెంట్‌ని అతికించిన తర్వాత ఫార్మాట్‌ని ఎంచుకోండి

మీరు కంటెంట్‌ని అతికించిన తర్వాత దానిని ఫార్మాట్ చేయవచ్చు.

 1. మీ కంప్యూటర్‌లో, Google షీట్‌లలో స్ప్రెడ్‌షీట్‌ను తెరవండి.
 2. స్ప్రెడ్‌షీట్‌లో, మీరు అతికించాలనుకుంటున్న కంటెంట్‌ని కాపీ చేయండి.
 3. అదే స్ప్రెడ్‌షీట్‌లో కంటెంట్‌ని అతికించండి.
 4. డిఫాల్ట్‌గా, కంటెంట్ యొక్క అసలైన ఫార్మాటింగ్ అలాగే ఉంచబడుతుంది. ఫార్మాటింగ్‌ని మార్చేందుకు, అతికించు Paste క్లిక్ చేయండి.
 5. ఎంపికను ఎంచుకోండి:
  • విలువలను మాత్రమే అతికించు: అసలైన సెల్‌ల పరిధిలో ఉన్న వచనాన్ని మాత్రమే అతికిస్తుంది.
  • ఫార్మాట్‌ని మాత్రమే అతికించు: పెయింట్ ఆకృతి సాధనాన్ని ఉపయోగించినట్లుగానే ఈ ఎంపికను ఉపయోగించవచ్చు -- ఇది సెల్ ఫార్మాటింగ్‌ని మాత్రమే కాపీ చేస్తుంది, మరియు ఇప్పటికే ఉన్న వచనాన్ని లేదా ఫార్ములాలను మార్చదు.
ఇది సహాయకరంగా ఉందా?
మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?