దుర్వినియోగ సంబంధిత ప్రోగ్రామ్ పాలసీలు, ఆంక్షలు

కింది ప్రోగ్రామ్ పాలసీలు అనేవి Drive, Docs, Sheets, Slides, Forms మరియు కొత్త సైట్‌లకు వర్తిస్తాయి. Google ప్రోడక్ట్‌లను ఉపయోగించే ప్రతిఒక్కరికీ సానుకూల అనుభవాన్ని అందించడంలో ఈ పాలసీలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. 
 
ఈ సేవలను అందించే మా సామర్థ్యాలకు ఆటంకం కలిగించే దుర్వినియోగాలను మేము అరికట్టాలి, అందుకోసమే ఈ లక్ష్యాన్ని సాధించడంలో మాకు సహాయపడటానికి ప్రతిఒక్కరు ఈ కింది పాలసీలకు కట్టుబడి ఉండాలని మేము కోరుతున్నాము. పాలసీ ఉల్లంఘన గురించి మాకు తెలియజేసిన తర్వాత, మేము కంటెంట్‌ను రివ్యూ చేసి, ఆపై కంటెంట్‌కు యాక్సెస్‌ను నియంత్రించడం, కంటెంట్‌ను తీసివేయడం, Google ప్రోడక్ట్‌లకు యూజర్ కలిగి ఉన్న యాక్సెస్‌ను పరిమితం చేయడం లేదా ఉపసంహరించడం వంటి చర్యలు తీసుకోవచ్చు.
 
మేము ఈ పాలసీలను వర్తింపజేస్తున్నప్పుడు కళాత్మక, విద్యా సంబంధ, డాక్యుమెంటరీ సంబంధ లేదా శాస్త్రవిజ్ఞాన సంబంధ పరిశీలనల ఆధారంగా లేదా ఇలాంటి కంటెంట్‌పై చర్య తీసుకోకపోవడం వలన ఇతరులు పొందే గణనీయమైన ప్రయోజనాల ఆధారంగా మినహాయింపులను ఇస్తాము.

స్టోరేజ్ కోటా పరిమితులను మించిపోయిన ఖాతాలపై మేము చర్య తీసుకోవచ్చు. ఉదాహరణకు, మీరు మీ స్టోరేజ్ కోటాను మించిపోతే లేదా సరిపడే అదనపు స్టోరేజ్‌ను పొందడంలో విఫలమైతే మేము కొత్త అప్‌లోడ్‌లను తిరస్కరించవచ్చు, ఉన్న కంటెంట్‌ను కుదించవచ్చు లేదా కంటెంట్‌ను తొలగించవచ్చు. స్టోరేజ్ కోటాల గురించి ఇక్కడ మరింత చదవండి.
 
ఈ పాలసీలు మారే అవకాశం ఉన్నందున, ఎప్పటికప్పుడు వీటిని చెక్ చేస్తూ ఉండాలని గుర్తుంచుకోండి. మరింత సమాచారం కోసం దయచేసి Google సర్వీస్ నియమాలు కూడా చూడండి.

దుర్వినియోగాన్ని రిపోర్ట్ చేయండి

దిగువ పేర్కొన్న విధానాలను ఎవరైనా ఉల్లంఘిస్తున్నారని మీరు భావిస్తే, దుర్వినియోగం గురించి నివేదించండి.

కాపీరైట్ ఉల్లంఘన లేదా ఇతర చట్టపరమైన సమస్యలను రిపోర్ట్ చేయడానికి, దయచేసి ఈ టూల్‌ని ఉపయోగించండి. ఇది వర్తించే చట్టాల ప్రకారం Google సర్వీస్‌ల నుండి తప్పనిసరిగా తీసివేయాల్సి ఉంటుందని మీరు భావించే కంటెంట్ గురించి రిపోర్ట్ చేసే ప్రాసెస్‌లో మీకు మార్గనిర్దేశం చేస్తుంది.

ప్రోగ్రామ్ పాలసీలు

ఖాతా హైజాకింగ్
ఇతర యూజర్ యొక్క ఖాతాను వారి అనుమతి లేకుండా యాక్సెస్ చేయకూడదు. ఖాతా హైజాకింగ్ గురించి మాకు సమాచారం అందితే, మేము తగిన చర్య తీసుకునే అవకాశం ఉంది, దీని ప్రకారం మా ప్రోడక్ట్‌లలో కొన్నింటికి యాక్సెస్‌ని తీసివేయడం లేదా మీ Google ఖాతాను డిజేబుల్ చేయడం కూడా చేయవచ్చు.
ఖాతా ఇన్‌యాక్టివిటీ
యాక్టివ్‌గా ఉండటానికి ప్రోడక్ట్‌ను ఉపయోగించండి. యాక్టివిటీలో భాగంగా కనీసం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ప్రోడక్ట్‌కు సంబంధించిన కంటెంట్‌ను యాక్సెస్ చేయడం లేదా ప్రోడక్ట్‌లో కొత్త కంటెంట్‌ను స్టోర్ చేయడం వంటివి ఉంటాయి. ఇన్‌యాక్టివ్‌గా ఉన్న ఖాతాలపై మేము చర్య తీసుకోవచ్చు, అందులో భాగంగా ప్రోడక్ట్ నుండి మీ కంటెంట్‌ను తొలగించవచ్చు. ఇక్కడ మరింత తెలుసుకోండి.
పిల్లల లైంగిక వేధింపులు, పీడించడం

పిల్లలను పాడు చేసే లేదా వారిపై దుష్ప్రభావం చూపే కంటెంట్‌ను క్రియేట్ చేయవద్దు, అప్‌లోడ్ చేయవద్దు లేదా పంపిణీ చేయవద్దు. పిల్లలను లైంగికంగా వేధించే కంటెంట్ అంతా దీనిలో భాగమే అవుతుంది. పిల్లలను పాడు చేసే అవకాశం ఉన్న కంటెంట్‌ను కలిగి ఉన్న Google ప్రోడక్ట్‌ గురించి రిపోర్ట్ చేయడానికి, “దుర్వినియోగాన్ని రిపోర్ట్ చేయి” క్లిక్ చేయండి. మీకు కంటెంట్ ఇంటర్నెట్‌లో ఇంకెక్కడైనా కనిపిస్తే, దయచేసి మీ దేశంలోని సంబంధిత ఏజెన్సీని నేరుగా కాంటాక్ట్ చేయండి.

మరింత విస్తృత పరిధిలో, పిల్లలకు ప్రమాదకరంగా పరిణమించే విధంగా మా ప్రోడక్ట్‌లను వినియోగించడాన్ని Google నిషేధిస్తుంది. పిల్లల పట్ల భయంకరమైన ప్రవర్తనతో సహా, ఈ విధమైనవి వాటి కోవలోకి వస్తాయి:

 • ‘చిన్నారులను అనైతిక శృంగారానికి లోబరచుకోవడం’ (ఉదాహరణకు, ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో, లైంగిక సంపర్కం కోసం మరియు/లేదా వారికి లైంగిక చిత్రాలను పంపడం కోసం ఆన్‌లైన్‌లో ఆ చిన్నారితో స్నేహం చేయడం);
 • ‘లైంగిక బెదిరింపు’ (ఉదాహరణకు, చిన్నారులు ఆంతరంగికంగా, నగ్నంగా ఉన్న ఇమేజ్‌లు అక్రమంగా లేదా రహస్యంగా సంపాదించి, వాటిని ఉపయోగించి బెదిరించడం లేదా బ్లాక్‌మెయిల్ చేయడం); 
 • మైనర్‌ల లైంగికీకరణ (ఉదాహరణకు, పిల్లల లైంగిక వేధింపులను లేదా పిల్లలను లైంగిక దుర్వినియోగానికి దారితీసే రీతిలో చిత్రీకరించడం, ప్రోత్సహించే ఇమేజ్‌లు); అలాగే 
 • చిన్నారుల అక్రమ రవాణా (ఉదాహరణకు, వాణిజ్యపరమైన లైంగిక దుర్వినియోగం చేసే నిమిత్తం చిన్నారి కోసం వాణిజ్య ప్రకటనలు లేదా విన్నపాలు).  

 
మేము ఈ విధమైన కంటెంట్‌ను తొలగించి, ఆ తర్వాత ఇందులో భాగంగా తప్పిపోయిన & పీడింపబడే పిల్లల జాతీయ కేంద్రానికి రిపోర్ట్ చేయడం, ప్రోడక్ట్ ఫీచర్‌ల యాక్సెస్ పరిమితం చేయడం, ఖాతాలు డిజేబుల్ చేయడం లాంటి తగిన చర్యలు తీసుకుంటాము. చిన్నారి ప్రమాదంలో ఉన్నారని లేదా వేధింపు, పీడించడం లేదా అక్రమ రవాణా చేయబడుతున్నారని మీరు విశ్వసిస్తే, వెంటనే పోలీసులను కాంటాక్ట్ చేయండి. 

మోసం

మా పాలసీలను పక్కదారి పట్టించడం, మీ ఖాతాపై విధించిన నియంత్రణలను ఎత్తివేయడం లేదా ఇతర Google ప్రోడక్ట్‌లలో తొలగించబడిన కంటెంట్‌ను పంపిణీ చేయడానికి ఉద్దేశించిన చర్యలలో ఎంగేజ్ కావద్దు.

దీనిలో వీటితో పాటు మిగిలినవి కూడా ఉంటాయి:

 • గతంలో నిషేధించబడిన ప్రవర్తనలో ఎంగేజ్ కావడానికి ఉద్దేశించిన పలు ఖాతాలు లేదా ఇతర పద్ధతులను క్రియేట్ చేయడం లేదా ఉపయోగించడం.
 • Google Play డెవలపర్ పాలసీల ద్వారా సస్పెండ్ చేయబడిన యాప్‌లను పబ్లిక్‌గా షేర్ చేయడం.
 • YouTube కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను పాటించని వీడియోలను పబ్లిక్‌గా షేర్ చేయడం.

మోసాన్ని గురించి మాకు తెలియజేయబడితే, మేము తగిన చర్య తీసుకోవచ్చు, ఇందులో ఫైళ్లను షేర్ చేయడాన్ని పరిమితం చేయడం, మా ప్రోడక్ట్‌లలో కొన్నిటికి యాక్సెస్‌ను తొలగించడం లేదా మీ Google ఖాతాను డిజేబుల్ చేయడం వంటివి ఉండవచ్చు.

ప్రమాదకరమైన లేదా చట్టవ్యతిరేకమైన యాక్టివిటీలు
చటవిరుద్ధ కార్యకలాపాల్లో పాలుపంచుకోవడానికి లేదా మనుషులకు, జంతువులకు తీవ్రమైన, తక్షణ హాని కలిగించే యాక్టివిటీలు, వస్తువులు, సర్వీస్‌లు లేదా సమాచారం గురించి ప్రమోట్ చేయడానికి ఈ ప్రోడక్ట్‌ను ఉపయోగించకండి. విద్యాపరమైన విషయాలు, డాక్యెమెంటరీలు, శాస్త్రీయమైన లేదా కళాత్మక ప్రయోజనాల కోసం ఈ కంటెంట్ గురించిన సాధారణ సమాచారాన్ని మేము అనుమతించినప్పటికీ, ఆ విధమైన కంటెంట్ నేరుగా హాని కలిగించేది అయినా లేదా అక్రమ కార్యకలాపాలకు పురిగొల్పేది అయిన పక్షంలో మేము దానిపై పరిమితులు విధిస్తాము. చట్టవిరుద్ధ కార్యకలాపాల గురించి మాకు సమాచారం అందితే, మేము తగిన చర్య తీసుకుంటాము, ఇందులో భాగంగా మీ గురించి సంబంధిత అధికార యంత్రాంగాలకు రిపోర్ట్ చేయడం, మా ప్రోడక్ట్‌లలో కొన్నింటికి మీరు కలిగి ఉన్న యాక్సెస్‌ని తీసివేయడం లేదా మీ Google ఖాతాను డిజేబుల్ చేయడం లాంటి చర్యలు తీసుకుంటాము.
పీడించడం, జులుం చలాయించడం, బెదిరింపులు
ఇతరులను పీడించడం, జులుం చలాయించడం, లేదా బెదిరించడం చేయవద్దు. ఇలాంటి యాక్టివిటీలలో పాల్గొనమని ఇతరులను ప్రోత్సహించడం లేదా రెచ్చగొట్టడం కోసం ఈ ప్రోడక్ట్‌ను ఉపయోగించడానికి కూడా మేము అనుమతించము. దీని ప్రకారం హానికరమైన దుర్వినియోగం కోసం ఒకరిని ఏకాకిని చేయడం, తీవ్రమైన హాని కలిగిస్తామని బెదిరించడం, అవాంఛిత విధానంలో ఎవరినైనా లైంగికంగా వేధించడం, బెదిరింపులకు పాల్పడటానికి, చౌకబారుగా వ్యవహరించడానికి లేదా హింసాత్మక లక్ష్యాలు లేదా విషాదాలకు గురైన వారిని అవమానించడానికి ఒక వ్యక్తి యొక్క ప్రైవేట్ సమాచారాన్ని బహిర్గతం చేయడం, ఈ విధమైన యాక్టివిటీలకు పాల్పడేలా ఇతరులను రెచ్చగొట్టడం లేదా ఇతర మార్గాలలో ఎవరినైనా పీడించడం కూడా నిషిద్ధం. చాలా చోట్ల ఆన్‌లైన్ వేధింపు కూడా చట్ట విరుద్ధమని, అలాగే పీడించిన వారికి, పీడింపులకు గురైనవారికి తీవ్రమైన ఆఫ్‌లైన్ పరిణామాలు ఉండవచ్చని గుర్తుంచుకోండి. హాని చేస్తామనే బెదిరింపులు లేదా ఇతర ప్రమాదకర పరిస్థితుల గురించి మాకు సమాచారం అందితే, మేము తగిన చర్య తీసుకునే అవకాశం ఉంది, దీని ప్రకారం మీ గురించి సంబంధిత అధికార యంత్రాంగాలకు రిపోర్ట్ చేయడం, మా ప్రోడక్ట్‌లలో కొన్నింటికి యాక్సెస్‌ని తీసివేయడం లేదా మీ Google ఖాతాను డిజేబుల్ చేయడం లాంటివి కూడా చేయవచ్చు.
విద్వేషాలు పెంచే కంటెంట్
విద్వేషాలు పెంచే కంటెంట్‌లో ఎంగేజ్ కావొద్దు. విద్వేషాలు పెంచే కంటెంట్ అంటే జాతి లేదా జాతి మూలం, మతం, వైకల్యం, వయస్సు, జాతీయత, ముసలితనం, లింగ గుర్తింపు, లింగం, లింగ నిర్ధారణ లేదా దైహిక వివక్ష లేదా సామాజిక వివక్షకు గురి చేసే అంశాల ఆధారంగా వ్యక్తులు లేదా సమూహాలకు వ్యతిరేకంగా ద్వేషాన్ని ప్రేరేపించే, వివక్షను ప్రోత్సహించే లేదా అటువంటి సమూహాలను లేదా వ్యక్తులను అణచివేయడాన్ని ప్రోత్సహించే కంటెంట్.
మరొక వ్యక్తిలా నటించడం, తప్పుదోవ పట్టించడం

ఒక వ్యక్తిలా, సంస్థలా నటించకండి; తప్పుగా ప్రాతినిధ్యం వహించకండి. దీని ప్రకారం, మీరు ప్రాతినిధ్యం వహించని ఎవరైనా వ్యక్తి లేదా సంస్థలుగా నటిస్తూ ఒక యూజర్/సైట్ గుర్తింపు, అర్హతలు, యాజమాన్య హక్కు, ప్రయోజనం, ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లు లేదా బిజినెస్ గురించి తప్పుదోవ పట్టించే సమాచారాన్ని అందించడం లాంటివి కూడా చేయకూడదు.

అలాగే ఇతర దేశాల్లోని యూజర్‌లకు రాజకీయాలు, సామాజిక సమస్యలు లేదా సాధారణ ప్రజలను ప్రభావితం చేసే ముఖ్యమైన విషయాలు ఉన్న కంటెంట్‌ను అందిస్తున్నప్పుడు, మీ స్వదేశం గురించి తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ఇవ్వడం లేదా మీ దేశం వివరాలను దాచి పెట్టడం లేదా మీకు సంబంధించిన ఇతర ముఖ్యమైన విషయాలను వెల్లడించకుండా తమ యాజమాన్య హక్కు లేదా ప్రాథమిక ఉద్దేశ్యం గురించి తప్పుదోవ పట్టించే లేదా దాచి పెట్టే ఖాతాలు లేదా కంటెంట్‌ను అందించకూడదు. పేరడీలు, వ్యంగ్య రచనలు, మారు పేర్లు లేదా కలం పేర్లను మేము అనుమతిస్తాము - కేవలం మీ గుర్తింపు విషయంలో ప్రేక్షకులను తప్పుదారి పట్టించే కంటెంట్‌ను నివారించండి.

మాల్‌వేర్, ఇతర హానికరమైన కంటెంట్
నెట్‌వర్క్‌లు, సర్వర్‌లు, ఎండ్ యూజర్ పరికరాలు లేదా ఇతర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు హాని కలిగించే లేదా అంతరాయాలు కలిగించే ఏదైనా కంటెంట్‌ను లేదా మాల్‌వేర్‌ను పంపించవద్దు. దీని ప్రకారం మాల్‌వేర్, వైరస్‌లు, వినాశకరమైన కోడ్ లేదా ఇతర హానికరమైన లేదా అవాంఛిత సాఫ్ట్‌వేర్ లేదా సారూప్యత కలిగిన కంటెంట్ ప్రత్యక్ష హోస్టింగ్, పొందుపరచడం లేదా వ్యాప్తి చేయడం లాంటివి కూడా చేయకూడదు. అలాగే వైరస్‌లను వ్యాప్తి చేసే, పాప్-అప్‌లను కలిగించే, యూజర్ అనుమతి లేకుండానే సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసే లేదా అలా కాకుంటే, యూజర్‌లపై ప్రభావం చూపే హానికరమైన కోడ్ లాంటి కంటెంట్ కూడా అందించకూడదు. మరింత సమాచారం కోసం మా సురక్షిత బ్రౌజింగ్ పాలసీలను చూడండి.
తప్పుదారి పట్టించే కంటెంట్

యూజర్‌లను మోసం చేసే, తప్పుదోవ పట్టించే లేదా సందిగ్ధతకు గురిచేసే కంటెంట్‌ను పంపిణీ చేయకూడదు. వాటిలో ఇవి ఉంటాయి:

పౌర, ప్రజాస్వామ్య ప్రక్రియలకు సంబంధించిన తప్పుదోవ పట్టించే కంటెంట్: ప్రజాస్వామ్య ప్రక్రియలపై లేదా పౌర సంబంధ ప్రక్రియలపై నమ్మకాన్ని, వాటిలో పాలుపంచుకోవడాన్ని చెప్పుకోదగిన రీతిలో బలహీనపరిచగలిగే, తప్పుగా ఉన్నట్లు నిరూపించే కంటెంట్. పబ్లిక్ వోటింగ్ ప్రక్రియలు, వయసు/పుట్టిన స్థలాన్ని బట్టి రాజకీయ అభ్యర్థుల అర్హతలు, ఎన్నికల ఫలితాలు,లేదా జనాభా లెక్కలలో పాల్గొనడానికి సంబంధించి, ప్రభుత్వ అధికారిక రికార్డులకు విరుద్దంగా ఉన్న సమాచారం ఇందులో భాగంగా ఉంటుంది. అలాగే రాజకీయాలలో ప్రముఖంగా ఉన్న వ్యక్తి లేదా ప్రభుత్వ అధికారి మరణించారని లేదా ప్రమాదానికి గురి అయ్యారని లేదా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని చేసే తప్పుడు క్లెయిమ్‌లు కూడా అనుమతించబడవు.

కుట్రపూరిత సిద్ధాంతాలకు సంబంధించిన తప్పుదారి పట్టించే కంటెంట్: వ్యక్తులు లేదా గ్రూప్‌లు క్రమపద్ధతిలో విస్తృతమైన హాని కలిగించే చర్యలకు పాల్పడుతున్నారనే నమ్మకాలకు విశ్వసనీయతను ప్రోత్సహించే లేదా అందించే కంటెంట్. ఈ కంటెంట్ గణనీయమైన సాక్ష్యాలతో విరుద్ధంగా ఉంది, అలాగే దీనిలో హింసకు దారితీసే లేదా ప్రేరేపించే అంశాలు ఉన్నాయి.

హానికరమైన ఆరోగ్య పద్ధతులకు సంబంధించి తప్పుదారి పట్టించే కంటెంట్: వ్యక్తులకు తీవ్ర శారీరక లేదా మానసిక హాని కలిగించే లేదా ప్రజల ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే చర్యల్లో ఇతరులను పాల్గొనమని ప్రచారం చేస్తూ లేదా ప్రోత్సహిస్తూ తప్పుదారి పట్టించే ఆరోగ్యపరమైన లేదా వైద్యపరమైన కంటెంట్.

దురుద్దేశ్యంతో మార్చబడిన మీడియా: యూజర్‌లను తప్పుదోవ పట్టించే విధంగా సాంకేతికంగా వంచించబడి లేదా వశం చేసుకోబడి, తద్వారా తీవ్రమైన ప్రతికూల పరిస్థితిని, అసాధారణమైన హానిని తలపెట్టగల మీడియా.

 

సమ్మతి లేని అందరికీ తగని ఇమేజ్‌లు (NCEI)
ఎవరైనా వ్యక్తి నగ్నంగా ఉన్న, లైంగికరంగా బహిర్గతమైన లేదా చాటుగా ఉండవలసిన, లైంగిక సంబంధిత ఇమేజ్‌లు లేదా వీడియోలను సదరు వ్యక్తి సమ్మతి లేకుండా స్టోర్ చేయకూడదు లేదా పంపిణీ చేయకూడదు. ఎవరైనా ఆంతరంగికమైన, నగ్నంగా ఉన్న, లైంగికంగా బహిర్గతమై ఉన్న లేదా బహిర్గతం చేయకూడని, చాటుగా ఉండవలసిన మీ లైంగిక ఇమేజ్ లేదా వీడియోను పంపి ఉంటే, దయచేసి మాకు ఇక్కడ రిపోర్ట్ చేయండి.
వ్యక్తిగతమైన, గోప్యమైన సమాచారం
ఇతర వ్యక్తుల వ్యక్తిగత లేదా గోప్యమైన సమాచారాన్ని అధికారిక మంజూరు లేకుండా స్టోర్ చేయవద్దు లేదా పంపిణీ చేయవద్దు. ​U.S సోషల్ సెక్యూరిటీ నంబర్‌లు, బ్యాంక్ ఖాతా సంఖ్యలు, క్రెడిట్ కార్డ్ నంబర్‌లు, సంతకాల ఇమేజ్‌లు, వ్యక్తిగత ఆరోగ్య డాక్యుమెంట్‌లు లాంటి సున్నితమైన సమాచారాన్ని వినియోగించడం దీని కోవలోకి వస్తుంది. జాతీయ ID నెంబర్‌లు లిస్ట్ చేసిన ప్రభుత్వ వెబ్‌సైట్‌ల లాంటి చోట్ల ఈ సమాచారం ఇతరత్రా ఇంటర్నెట్ లేదా పబ్లిక్ రికార్డ్‌లలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది, అలాంటి అనేక సందర్భాలలో మేము సాధారణంగా అమలు చర్యలను ప్రాసెస్ చేయము.
ఫిషింగ్
ఈ ప్రోడక్ట్‌ని ఫిషింగ్ కోసం వినియోగించవద్దు. అదే విధంగా, పాస్‌వర్డ్‌లు, ఆర్థిక వివరాలు, సామాజిత భద్రతా సంఖ్యలు లాంటి సున్నితమైన వ్యక్తిగత సమాచారం అభ్యర్థించడానికి లేదా సేకరించడానికి కూడా దీనిని వినియోగించవద్దు. 
నియంత్రిత వస్తువులు, సర్వీస్‌లు
​నియంత్రిత వస్తువులు, సర్వీస్‌లను విక్రయించడం, అడ్వర్టైజ్ చేయడం లేదా విక్రయ సదుపాయం కల్పించడం చేయకూడదు. మద్యం, జూదం, ఔషధాలు, అనుమతి లేని మందులు, పొగాకు, మందుగుండు, ఆయుధాలు, లేదా ఆరోగ్య/వైద్య పరికరాలతో సహా నియంత్రిత వస్తువులు, సర్వీస్‌లు.
అందరికీ తగని లైంగిక విషయం
నగ్నత్వం, గ్రాఫిక్స్‌లో లైంగిక చర్యలు, అశ్లీలమైన మెటీరియల్స్ లాంటి అందరికీ తగని లైంగిక విషయాలు కలిగి ఉండే కంటెంట్‌ని పంపిణీ చేయకూడదు. దీని ప్రకారం వాణిజ్యపరమైన అశ్లీల సైట్‌లకు మళ్లించడం కూడా చేయకూడదు. మేము విద్యా విషయాలు, డాక్యుమెంటరీ, శాస్త్రవిజ్ఞానం లేదా కళాత్మక ప్రయోజనాల కోసం నగ్నత్వాన్ని అనుమతిస్తాము.
స్పామ్
స్పామ్ పంపవద్దు. దీని ప్రకారం అవాంఛితమైన ప్రచార సంబంధిత లేదా వాణిజ్యపరమైన కంటెంట్, ఆటోమేటెడ్ ప్రోగ్రామ్ ద్వారా రూపొందించిన అవాంఛిత కంటెంట్, అవాంఛిత పునరావృత కంటెంట్, అర్థం లేని కంటెంట్ లేదా సామూహిక అభ్యర్ధనగా కనిపించే ఏదీ కూడా పంపకూడదు.
సిస్టమ్ జోక్యం, దుర్వినియోగం
ఈ ప్రోడక్ట్‌ను దుర్వినియోగం చేయవద్దు, అలాగే నెట్‌వర్క్‌లు, పరికరాలు లేదా Google, ఇతర వాటికి సంబంధించిన ఇతరత్రా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్వహణకు హాని చేయవద్దు, దిగజార్చవద్దు లేదా ప్రతికూల ప్రభావం పడేలా చేయవద్దు. దీని ప్రకారం ప్రోడక్ట్ లేదా దాని సర్వీస్‌లను ఏదైనా అంశంతో దిగజార్చడం, డిజేబుల్ చేయడం లేదా ప్రతికూలంగా అంతరాయం కలిగించడం కూడా చేయకూడదు. సిస్టమ్ సంబంధిత వాటిలో జోక్యం, దుర్వినియోగం గురించి మాకు సమాచారం అందితే, మేము తగిన చర్య తీసుకునే అవకాశం ఉంది, దీని ప్రకారం మా ప్రోడక్ట్‌లలో కొన్నింటికి యాక్సెస్‌ని తీసివేయడం లేదా మీ Google ఖాతాను డిజేబుల్ చేయడం లాంటివి కూడా చేయవచ్చు.
ఉగ్రవాద కార్యకలాపాలు
ఉగ్రవాద సంస్థలు రిక్రూట్‌మెంట్‌తో సహా ఎటువంటి ఇతర ప్రయోజనాల కోసం కూడా ఈ ప్రోడక్ట్‌ను ఉపయోగించడానికి అనుమతి లేదు. ఉగ్రవాద సంబంధిత కంటెంట్, అంటే ఉగ్ర కార్యకలాపాలు ప్రోత్సహించడం, హింసను రెచ్చగొట్టడం లేదా ఉగ్ర దాడుల గురించి సంబరాలు చేసుకోవడం లాంటి కంటెంట్‌ గురించి కూడా మేము యూజర్‌పై చర్య తీసుకునే అవకాశం ఉంది. విద్యాపరమైన విషయాలు, డాక్యుమెంటరీలు, శాస్త్రవిజ్ఞానం లేదా కళాత్మక ప్రయోజనాల కోసం ఉగ్రవాద సంబంధిత కంటెంట్‌ను స్టోర్ చేస్తుంటే లేదా పంపిణీ చేస్తుంటే తగిన సమాచారాన్ని అందించడానికి జాగ్రత్త వహించండి, అప్పుడు వీక్షకులు సందర్భాన్ని అర్థం చేసుకుంటారు.
మైనర్‌ల అనధికారిక ఇమేజ్‌లు
పిల్లల తల్లిదండ్రులు, సంరక్షకులు లేదా చట్టబద్ధమైన ప్రతినిధి నుండి స్పష్టమైన సమ్మతి లేకుండా చిన్నారుల ఇమేజ్‌లు స్టోర్ చేయవద్దు లేదా పంపిణీ చేయవద్దు. ఒక చిన్నారి ఇమేజ్‌ని ఆవశ్యకమైన సమ్మతి పొందకుండా స్టోర్ చేస్తే లేదా పంపిణీ చేస్తే, దయచేసి దాని గురించి మాకు ఇక్కడ రిపోర్ట్ చేయండి.
హింసతో పాటు, రక్తపాతం ఉండటం
దిగ్భ్రాంతికి గురి చేయడం, సంచలనాత్మకం చేయడం ప్రధానోద్దేశంగా లేదా అసంగతంగా నిజ జీవితాలలోని మనుషులు లేదా జంతువులపై జరిపే హింస లేదా రక్తపాతం నిండి ఉండే కంటెంట్‌ను స్టోర్ చేయకూడదు లేదా పంపిణీ చేయకూడదు. దీని ప్రకారం చిన్నాభిన్నమైన లేదా ఛేదించబడిన శవాల క్లోజప్ ఫుటేజ్ వంటి అల్ట్రా-గ్రాఫిక్ హింస కూడా అనుమతించబడదు. గణనీయమైన స్థాయిలో రక్తపాతం కలిగి ఉండే కంటెంట్ లాంటి గ్రాఫిక్ మెటీరియల్‌ని విద్యాపరమైన విషయాలు, డాక్యుమెంటరీలలో, శాస్త్రీయమైన లేదా కళాత్మక సందర్భాలలో అనుమతించవచ్చు, కానీ ప్రజలు పూర్తిగా అర్థం చేసుకునేలా సరిపడేంత సమాచారాన్ని అందించి, జాగ్రత్త వహించండి. కొన్ని సందర్భాలలో మితిమీరిన హింస లేదా దిగ్భ్రాంతికరంగా ఉన్న కంటెంట్‌ - ఎలాంటి సందర్భంలో తీసినప్పటికీ కూడా - మా ప్లాట్‌ఫామ్‌లలో అనుమతించము. చిట్టచివరిగా, మీ కంటెంట్‌లో ఇతరులను హింసాత్మక చర్యల వైపునకు ప్రోత్సహించకండి.

అదనపు పాలసీలు

కంటెంట్‌ను వినియోగించడం, సమర్పించడం

టెంప్లేట్ గ్యాలరీ యొక్క పాలసీలు

Google డాక్స్‌లో మూడవ పక్ష కంటెంట్‌ను ప్రదర్శించే గ్యాలరీలు ఉండవచ్చు ("కంటెంట్ గ్యాలరీలు"). కంటెంట్ గ్యాలరీలు అన్నవి కేవలం టెంప్లేట్ గ్యాలరీలకు పరిమితం కాకుండా Google దాని నిర్ణయానుసారం మీకు అందుబాటులో ఉంచాలనుకునే ఏ గ్యాలరీనైనా కలిగి ఉంటాయి.
కంటెంట్ గ్యాలరీలు ("గ్యాలరీ కంటెంట్")లో అందుబాటులో ఉండే టెంప్లేట్‌లు లాంటి కంటెంట్, సమాచారం Google లేదా మూడవ పక్షాల ద్వారా రూపొందించినది. మీకు, గ్యాలరీ కంటెంట్ సృష్టికర్తలకు మధ్యన వ్యవహారంలో, ఏవైనా మేధో సంపత్తి లేదా యాజమాన్య హక్కులు వాటి సృష్టికర్తలకు ఉంటాయి.
గ్యాలరీ కంటెంట్: (ఎ) అనేది కేవలం సూచన లాగా సేవను అందించడానికి ఉధ్దేశించినది; (బి) ఇది వృత్తిపరమైన సలహా లేదా నిర్దిష్టమైన, అధికారికమైన సమాచారం లేదా దిశానిర్దేశానికి ప్రత్మామ్నాయం కాదు.
గ్యాలరీ కంటెంట్ మీ ప్రయోజనాల కోసం పని చేస్తుందని గానీ లేదా దీనిలో వైరస్‌లు, బగ్‌లు లేదా ఇతర అడ్డంకులు ఉండవని గానీ Google వాగ్దానం చేయదు. గ్యాలరీ కంటెంట్ అన్నది "ఉన్నదున్నట్లుగా", ఎటువంటి అధికార పత్రం లేకుండా అందించబడుతుంది. కంటెంట్ గ్యాలరీని ఉపయోగించడం వలన ఏవైనా ఇబ్బందులు తలెత్తినా వాటిని మీరే భరించాల్సి ఉంటుంది. గ్యాలరీ కంటెంట్‌కు సంబంధించినంత వరకు Google, దాని సరఫరాదారుల నుండి ఎటువంటి విస్పష్ట హామీలు, హామీలు, షరతులు ఇవ్వబడవు. విక్రయార్హత, నిర్దిష్ట ప్రయోజనానికి సంబంధించిన యోగ్యత, పనివాడి తరహా పద్ధతి, హోదా, ఉల్లంఘన రహితం కోవలోకి వచ్చే వాటికి సంబంధించి చట్టం ద్వారా అమలులోనున్న అధికార పత్రాలు, షరతులను అమలులో ఉన్న చట్టాల ప్రకారం అనుమతించబడే పరిధి మేరకు Google మినహాయిస్తుంది.
మీరు కంటెంట్ గ్యాలరీలలో భాగం కావడానికి కంటెంట్‌ను సమర్పించాలనుకుంటే, మీ Gallery సమర్పణ అంశాలను Google Docsలో హోస్ట్ చేయడానికి, లింక్ చేయడానికి, దానిలో చేర్చడానికి Google, దాని అనుబంధ సంస్థలకు మీరు ఇందుమూలంగా నేరుగా అధికారం మంజూరు చేస్తున్నారు, అలాగే దిగువున పేర్కొన్నట్లుగా Gallery సమర్పణలోని హక్కులను వినియోగించుకోవడానికి Googleకు, దాని ఎండ్ యూజర్‌లకు ప్రపంచవ్యాప్తంగా, రాయల్టీ రహితంగా, ఎలాంటి మినహాయింపులు ఉండని లైసెన్స్‌ను మంజూరు చేస్తున్నారు:
 • గ్యాలరీ సమర్పణ అంశాలను పునరుత్పాదించడానికి;
 • గ్యాలరీ సమర్పణ నుండి ఉత్పన్నమయ్యే అంశాలను సృష్టించడానికి, వాటిని పునరుత్పాదించడానికి;
 • గ్యాలరీ సమర్పణ అంశాలను బహిరంగంగా ప్రదర్శించడానికి, దాని కాపీలను పంపిణీ చేయడానికి;
 • గ్యాలరీ సమర్పణ నుండి ఉత్పన్నమయ్యే అంశాలను బహిరంగంగా ప్రదర్శించడానికి, వాటి కాపీలను పంపిణీ చేయడానికి.

మీరు Google తుది వినియోగదారులకు అందించే లైసెన్స్ కాలపరిమితి లేకుండా శాశ్వతమైనదని అంగీకరిస్తున్నారు. ఇంకా, స్పష్టంగా తెలియజేయడానికి, మీరు Google డాక్స్ ద్వారా సమర్పించిన గ్యాలరీ సమర్పణను సిండికేట్‌గా కలపడానికి, ఆ గ్యాలరీ సమర్పణను Google ద్వారా అందించబడే ఏవైనా సేవలతో అనుబంధంగా ఉపయోగించడానికి Google హక్కును కలిగి ఉంది, మీరు Googleకు ఆ హక్కును మంజూరు చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా Google డాక్స్ కంటెంట్ గ్యాలరీల ద్వారా గ్యాలరీ సమర్పణ పంపిణీని నిలిపివేసే హక్కును కలిగి ఉంటారు; అయితే, ఈ సేవా నిబంధనల ప్రకారం Google తుది వినియోగదారులకు ఇచ్చిన లైసెన్స్‌లను ఉపసంహరించుకోవడానికి అలాంటి నిర్ణయాలు ఉపయోగపడవు. Google డాక్స్ కంటెంట్ గ్యాలరీల ద్వారా గ్యాలరీ సమర్పణ పంపిణీని ఆపివేయడానికి, మీరు తప్పనిసరిగా సేవలో అందించబడే తీసివేత ఫంక్షన్‌లను ఉపయోగించుకోవాలి, ఇలాంటి సందర్భాల్లో గ్యాలరీ సమర్పణ తీసివేత సహేతుకమైన సమయం వరకు ప్రభావంలో ఉంటుంది.

మీరు వీటికి సూచిస్తూ, (ఎ) మీరు Google డాక్స్ ద్వారా సమర్పించే అన్ని గ్యాలరీ సమర్పణలను అందించడానికి అవసరమైన చట్టసంబంధిత హక్కులన్నీ మీరు కలిగి ఉన్నారని లేదా మీరు పొందారని, అలాగే Google తుది వినియోగదారులకు గ్యాలరీ సమర్పణ అందుబాటులో ఉన్నంత కాలం ఈ హక్కులను పాటిస్తారని; (బి) మీరు Google డాక్స్ ద్వారా సమర్పించే అన్ని గ్యాలరీ సమర్పణలు పోస్ట్ చేసిన ప్రోగ్రామ్ విధానాలను పాటిస్తాయని హామీ ఇస్తున్నారు.

మీరు Google డాక్స్ ద్వారా సమర్పించే గ్యాలరీ సమర్పణ దేనికీ యాజమాన్య హక్కును Google క్లెయిమ్ చేయదు. మీరు ఇప్పటికే గ్యాలరీ సమర్పణలో కలిగి ఉన్న మేధోసంపత్తి హక్కులన్నింటితో సహా కాపీరైట్‌ను, ఇతర హక్కులను కలిగి ఉంటారు. ఆ హక్కులను పరిరక్షించాల్సిన, అమలు చేయాల్సిన బాధ్యత మీపై ఉంటుందని, మీ తరఫున Google ఆ బాధ్యత వహించాల్సిన అవసరం లేదని అంగీకరిస్తున్నారు.

మీరు సమర్పించే ఏదైనా గ్యాలరీ సమర్పణకు మీరు పూర్తి బాధ్యులని (దీనికి సంబంధించి, మీతో లేదా మూడవ పక్షంతో Googleకు ఎటువంటి బాధ్యత ఉండదని) మీరు అంగీకరిస్తున్నారు. మీ గ్యాలరీ సమర్పణను యాక్సెస్ చేసే Google తుది వినియోగదారులు ఎవరి ద్వారా అయినా తదనంతర వినియోగం లేదా దుర్వినియోగానికి Google ఏ విధంగానూ బాధ్యత వహించదు.

ఏదైనా లేదా అన్ని గ్యాలరీ సమర్పణలను దాని స్వంత నిర్ణయానుసారం తీసివేయగల హక్కును Google కలిగి ఉంది.

Google మీ టెంప్లేట్ సమర్పణలను ఎలా ఉపయోగించగలదు

మీరు కంటెంట్ గ్యాలరీలలో భాగం కావడానికి కంటెంట్‌ను సమర్పించాలనుకుంటే, మీ గ్యాలరీ సమర్పణ అంశాలను Google డాక్స్‌లో హోస్ట్ చేయడానికి, లింక్ చేయడానికి, దానిలో చేర్చడానికి Google, దాని అనుబంధ సంస్థలకు మీరు ఇందుమూలంగా నేరుగా అధికారం మంజూరు చేస్తున్నారు, అలాగే దిగువున పేర్కొన్నట్లుగా గ్యాలరీ సమర్పణలోని హక్కులను వినియోగించుకోవడానికి Googleకు, దాని తుది వినియోగదారులకు ప్రపంచవ్యాప్తంగా, రాయల్టీ రహితంగా, ఎలాంటి మినహాయింపులు ఉండని లైసెన్స్‌ను మంజూరు చేస్తున్నారు:

 • గ్యాలరీ సమర్పణ అంశాలను పునరుత్పాదించడానికి;
 • గ్యాలరీ సమర్పణ నుండి ఉత్పన్నమయ్యే అంశాలను సృష్టించడానికి, వాటిని పునరుత్పాదించడానికి;
 • గ్యాలరీ సమర్పణ అంశాలను బహిరంగంగా ప్రదర్శించడానికి, దాని కాపీలను పంపిణీ చేయడానికి;
 • గ్యాలరీ సమర్పణ నుండి ఉత్పన్నమయ్యే అంశాలను బహిరంగంగా ప్రదర్శించడానికి, వాటి కాపీలను పంపిణీ చేయడానికి.

మీరు Google తుది వినియోగదారులకు అందించే లైసెన్స్ కాలపరిమితి లేకుండా శాశ్వతమైనదని అంగీకరిస్తున్నారు. ఇంకా, స్పష్టంగా తెలియజేయడానికి, మీరు Google డాక్స్ ద్వారా సమర్పించిన గ్యాలరీ సమర్పణను సిండికేట్‌గా కలపడానికి, ఆ గ్యాలరీ సమర్పణను Google ద్వారా అందించబడే ఏవైనా సేవలతో అనుబంధంగా ఉపయోగించడానికి Google హక్కును కలిగి ఉంది, మీరు Googleకు ఆ హక్కును మంజూరు చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా Google డాక్స్ కంటెంట్ గ్యాలరీల ద్వారా గ్యాలరీ సమర్పణ పంపిణీని నిలిపివేసే హక్కును కలిగి ఉంటారు; అయితే, ఈ సేవా నిబంధనల ప్రకారం Google తుది వినియోగదారులకు ఇచ్చిన లైసెన్స్‌లను ఉపసంహరించుకోవడానికి అలాంటి నిర్ణయాలు ఉపయోగపడవు. Google డాక్స్ కంటెంట్ గ్యాలరీల ద్వారా గ్యాలరీ సమర్పణ పంపిణీని ఆపివేయడానికి, మీరు తప్పనిసరిగా సేవలో అందించబడే తీసివేత ఫంక్షన్‌లను ఉపయోగించుకోవాలి, ఇలాంటి సందర్భాల్లో గ్యాలరీ సమర్పణ తీసివేత సహేతుకమైన సమయం వరకు ప్రభావంలో ఉంటుంది.

మీరు వీటికి సూచిస్తూ, (ఎ) మీరు Google డాక్స్ ద్వారా సమర్పించే అన్ని గ్యాలరీ సమర్పణలను అందించడానికి అవసరమైన చట్టసంబంధిత హక్కులన్నీ మీరు కలిగి ఉన్నారని లేదా మీరు పొందారని, అలాగే Google తుది వినియోగదారులకు గ్యాలరీ సమర్పణ అందుబాటులో ఉన్నంత కాలం ఈ హక్కులను పాటిస్తారని; (బి) మీరు Google డాక్స్ ద్వారా సమర్పించే అన్ని గ్యాలరీ సమర్పణలు పోస్ట్ చేసిన ప్రోగ్రామ్ విధానాలను పాటిస్తాయని హామీ ఇస్తున్నారు.

మీరు Google డాక్స్ ద్వారా సమర్పించే గ్యాలరీ సమర్పణ దేనికీ యాజమాన్య హక్కును Google క్లెయిమ్ చేయదు. మీరు ఇప్పటికే గ్యాలరీ సమర్పణలో కలిగి ఉన్న మేధోసంపత్తి హక్కులన్నింటితో సహా కాపీరైట్‌ను, ఇతర హక్కులను కలిగి ఉంటారు. ఆ హక్కులను పరిరక్షించాల్సిన, అమలు చేయాల్సిన బాధ్యత మీపై ఉంటుందని, మీ తరఫున Google ఆ బాధ్యత వహించాల్సిన అవసరం లేదని అంగీకరిస్తున్నారు.

మీరు సమర్పించే ఏదైనా గ్యాలరీ సమర్పణకు మీరు పూర్తి బాధ్యులని (దీనికి సంబంధించి, మీతో లేదా మూడవ పక్షంతో Googleకు ఎటువంటి బాధ్యత ఉండదని) మీరు అంగీకరిస్తున్నారు. మీ గ్యాలరీ సమర్పణను యాక్సెస్ చేసే Google తుది వినియోగదారులు ఎవరి ద్వారా అయినా తదనంతర వినియోగం లేదా దుర్వినియోగానికి Google ఏ విధంగానూ బాధ్యత వహించదు.

ఏదైనా లేదా అన్ని గ్యాలరీ సమర్పణలను దాని స్వంత నిర్ణయానుసారం తీసివేయగల హక్కును Google కలిగి ఉంది.

పూర్తి Google సర్వీస్ నియమాలు చదవండి.

కాపీరైట్ ఉల్లంఘన
కాపీరైట్ చట్టాలను గౌరవించండి. ప్రామాణీకరణ లేకుండా కాపీరైట్ చేసిన కంటెంట్‌ను షేర్ చేయవద్దు లేదా కాపీరైట్ చేసిన కంటెంట్‌ను యూజర్‌లు అనధికారికంగా డౌన్‌లోడ్‌లు చేసుకోగల సైట్‌ల లింక్‌లను అందించవద్దు. కాపీరైట్ ఉల్లంఘన ఆరోపణలకు సంబంధించిన స్పష్టమైన నోటీసులకు ప్రతిస్పందించడం మా పాలసీ. కాపీరైట్‌తో సహా మేధోసంపత్తి హక్కులను పునరావృతంగా ఉల్లంఘిస్తే, తత్ఫలితంగా ఖాతా తొలగించబడవచ్చు. మీరు Google యొక్క కాపీరైట్ పాలసీల ఉల్లంఘనను గుర్తిస్తే, కాపీరైట్ ఉల్లంఘన గురించి రిపోర్ట్ చేయండి.
కంటెంట్ పంపిణీ 

Google Drive, వీడియో కంటెంట్‌ను స్టోర్ చేయడానికి, షేర్ చేయడానికి, అలాగే స్ట్రీమ్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది, కానీ దానిని కంటెంట్ పంపిణీ నెట్‌వర్క్‌కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించకూడదు. భారీ స్థాయిలో పబ్లిక్ స్ట్రీమింగ్‌కి, YouTube సరిగ్గా సరిపోతుంది. భారీ స్థాయిలో పబ్లిక్ స్ట్రీమింగ్ కోసం Google Driveను ఉపయోగిస్తున్నట్లు కనిపించినప్పుడు, అది దాని వినియోగాన్ని పరిమితం చేస్తుంది. పదేపదే జరిగే ఉల్లంఘనలు అదనపు చర్యకు దారితీయవచ్చు, ఇందులో భాగంగా మీ ఖాతాను లేదా Google Driveను ఉపయోగించగల సామర్థ్యాన్ని ఉపసంహరించడం కూడా జరగవచ్చు.

మీ సౌకర్యార్థం మా పాలసీల అనువాద రూపాలు అందించాము. ఈ పాలసీ వచన రూపం, అలాగే పాలసీ ఇంగ్లీష్ భాష వచన రూపం మధ్య ఏదైనా తేడా ఉండే, సదరు పాలసీ యొక్క ఇంగ్లీష్ భాష వెర్షన్‌కి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. 

ఇది సహాయకరంగా ఉందా?
మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయి
శోధనను మూసివేయి
Google యాప్‌లు
ప్రధాన మెనూ
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
35
false