ప్రింట్ చేయండి లేదా పేజీ సెటప్‌ని మార్చండి

డాక్యుమెంట్, స్ప్రెడ్‌షీట్ లేదా ప్రెజెంటేషన్‌ని ప్రింట్ చేయండి

మీరు Chrome లేదా Safari లాంటి బ్రౌజర్‌లను ఉపయోగించి Google డాక్స్, షీట్‌లు లేదా స్లయిడ్‌లను ప్రింట్ చేయగలరు.

Chromeలో ప్రింట్ చేయండి

డాక్యుమెంట్‌ని ప్రింట్ చేయండి
 1. మీ కంప్యూటర్‌లో, Google డాక్స్‌లో డాక్యుమెంట్‌ని తెరవండి.
 2. ఫైల్ ఆ తర్వాత ప్రింట్ చేయి క్లిక్ చేయండి.
 3. తెరవబడిన విండోలో, మీ ప్రింట్ సెట్టింగ్‌లను ఎంచుకోండి.
 4. ప్రింట్ చేయి క్లిక్ చేయండి.
స్ప్రెడ్‌షీట్‌ని ప్రింట్ చేయండి
 1. మీ కంప్యూటర్‌లో Google షీట్‌లలో స్ప్రెడ్‌షీట్‌ని తెరవండి.
 2. ఫైల్ ఆ తర్వాత ప్రింట్ చేయి క్లిక్ చేయండి.
 3. ఐచ్ఛికం: మార్జిన్‌లు లేదా పేజీ ఓరియంటేషన్ లాంటి మీ ప్రింట్ సెట్టింగ్‌లను ఎంచుకోండి.
 4. తర్వాత క్లిక్ చేయండి.
 5. తెరవబడిన విండోలో, మీ ప్రింట్ సెట్టింగ్‌లను ఎంచుకోండి.
 6. ప్రింట్ చేయి క్లిక్ చేయండి.

ప్రెజెంటేషన్‌ను ప్రింట్ చేయండి

 1. మీ కంప్యూటర్‌లో, Google స్లయిడ్‌లలో ప్రెజెంటేషన్‌ను తెరవండి.
 2. ఫైల్ క్లిక్ చేయండి.
  • మార్పులు లేకుండా ప్రింట్ చేయండి: ప్రింట్ చేయి క్లిక్ చేయండి.
  • ఓరియంటేషన్‌ని సర్దుబాటు చేయండి: టూల్‌బార్‌లో, ఆ తర్వాత ప్రింట్ సెట్టింగ్‌లు మరియు పరిదృశ్యం క్లిక్ చేయండి హ్యాండ్‌అవుట్ ఆ తర్వాత ల్యాండ్‌స్కేప్ క్లిక్ చేయండి.
  • స్పీకర్ గమనికలతో ప్రింట్ చేయండి: టూల్‌బార్‌లో ఆ తర్వాత ప్రింట్ సెట్టింగ్‌లు మరియు పరిదృశ్యంక్లిక్ చేయండి గమనికలతో కూడిన 1 స్లయిడ్ క్లిక్ చేయండి.
 3. ప్రింట్ చేయి క్లిక్ చేయండి.
 4. తెరవబడిన విండోలో, మీ ప్రింట్ సెట్టింగ్‌లను ఎంచుకోండి.
 5. ప్రింట్ చేయి క్లిక్ చేయండి.

Firefox లేదా Safariలో ప్రింట్ చేయండి

మీ ఫైల్‌ని PDFగా ప్రింట్ చేయండి

 1. మీ కంప్యూటర్‌లో, మీరు ప్రింట్ చేయాలనుకుంటున్న డాక్యుమెంట్, ప్రెజెంటేషన్ లేదా స్ప్రెడ్‌షీట్‌ని తెరవండి.
 2. ఫైల్ ఆ తర్వాత ప్రింట్ చేయి క్లిక్ చేయండి.
  • డాక్యుమెంట్ లేదా ప్రెజెంటేషన్: PDF ఫైల్ స్వయంచాలకంగా డౌన్‌లోడ్ చేయబడుతుంది.
  • స్ప్రెడ్‌షీట్: తెరవబడిన విండోలో, మీ ప్రింట్ సెట్టింగ్‌లను ఎంచుకోండి. ఆ తర్వాత తర్వాత క్లిక్ చేయండి. PDF ఫైల్ స్వయంచాలకంగా డౌన్‌లోడ్ చేయబడుతుంది.
 3. డౌన్‌లోడ్ పూర్తయిన తర్వాత, ఫైల్‌ని తెరవండి.
 4. మీ PDF వ్యూయర్‌లో, ఫైల్ ఆ తర్వాత ప్రింట్ చేయికి వెళ్లండి.
 5. తెరవబడిన విండోలో, మీ ప్రింట్ సెట్టింగ్‌లను ఎంచుకోండి.
 6. ప్రింట్ చేయి క్లిక్ చేయండి.

మీ ఫైల్‌ను మరో ఫైల్ ఫార్మాట్‌లో ప్రింట్ చేయండి

 1. మీ కంప్యూటర్‌లో, మీరు ప్రింట్ చేయాలనుకుంటున్న డాక్యుమెంట్, స్ప్రెడ్‌షీట్ లేదా ప్రెజెంటేషన్‌ని తెరవండి.
 2. ఫైల్ ఆ తర్వాత దీని వలె డౌన్‌లోడ్ చేయి క్లిక్ చేయండి.
 3. మీరు కోరుకునే ఫైల్ ఫార్మాట్‌ని ఎంచుకోండి.
 4. మీ కంప్యూటర్‌లో, డౌన్‌లోడ్ చేయబడిన ఫైల్‌ని ఎంచుకుని, దానిని తెరవండి.
 5. డౌన్‌లోడ్ చేయబడిన ఫైల్‌ని ప్రింట్ చేయండి.

Google డాక్ యొక్క పేజీ సెటప్‌ని మార్చండి

 1. మీ కంప్యూటర్‌లో, Google డాక్స్‌లో డాక్యుమెంట్‌ని తెరవండి.
 2. టూల్‌బార్‌లో, ఫైల్ ఆ తర్వాత పేజీ సెటప్ క్లిక్ చేయండి.
 3. మీరు మార్చాలనుకుంటున్న సెట్టింగ్‌కి వెళ్లండి:
  • ఓరియంటేషన్
  • కాగితం పరిమాణం
  • పేజీ రంగు
  • మార్జిన్‌లు
 4. మీ మార్పులు చేయండి.
 5. సరే క్లిక్ చేయండి.
 6. ఐచ్ఛికం: మీరు ఎంచుకున్న సెట్టింగ్‌లతో కొత్త డాక్యుమెంట్‌లు తెరవబడేలా చేయడానికి, డిఫాల్ట్‌గా సెట్ చేయి క్లిక్ చేయండి.

Google షీట్‌లు: మీరు స్ప్రెడ్‌షీట్‌ని ప్రింట్ చేసేటప్పుడు ఓరియంటేషన్, పేపర్ పరిమాణం మరియు మార్జిన్‌లను మార్చండి.

Google స్లయిడ్‌లు: మీ స్లయిడ్‌ల పరిమాణాన్ని మార్చండి.

ఇది సహాయకరంగా ఉందా?
మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?