ఫారమ్ ప్రతిస్పందనలను వీక్షించండి మరియు నిర్వహించండి

మీరు Google ఫారమ్‌లతో ఫారమ్‌కి వచ్చే ప్రతిస్పందనలను వీక్షించవచ్చు మరియు పరిమితం చేయవచ్చు.

ప్రతిస్పందనలను వీక్షించండి

మీరు మీ ఫారమ్‌కి వచ్చిన ప్రతిస్పందనలను 4 మార్గాలలో చూడవచ్చు:

ప్రశ్న ఆధారంగా ప్రతిస్పందనలను వీక్షించండి
 1. Google ఫారమ్‌లలో ఫారమ్‌ని తెరవండి.
 2. ఫారమ్ పై భాగాన, ప్రతిస్పందనలు క్లిక్ చేయండి.
 3. సారాంశం క్లిక్ చేయండి.
వ్యక్తి ఆధారంగా ప్రతిస్పందనలను వీక్షించండి

వ్యక్తి ఆధారంగా సమాధానాలు చూడండి, మీరు ఫారమ్‌ని ఒకటి కంటే ఎక్కువ సార్లు సమర్పించడానికి వ్యక్తులను అనుమతించి ఉంటే, సమర్పణ ఆధారంగా చూడండి.

 1. Google ఫారమ్‌లలో ఫారమ్‌ని తెరవండి.
 2. ఫారమ్ పై భాగాన, ప్రతిస్పందనలు క్లిక్ చేయండి.
 3. ఇన్‌డివిడ్యువల్ క్లిక్ చేయండి.
 4. ప్రతిస్పందనల మధ్య మారడానికి మునుపటివి Previous లేదా తదుపరివి Next క్లిక్ చేయండి.

గమనిక: ప్రతిస్పందనల జాబితా నుండి ఎంపిక చేసుకోవడానికి క్రిందకి చూపుతున్న బాణం గుర్తుని కిందికి బాణం క్లిక్ చేయండి.

స్ప్రెడ్‌షీట్‌లో అన్ని ప్రతిస్పందనలను వీక్షించండి

స్ప్రెడ్‌షీట్‌లో అన్ని ప్రతిస్పందనలను సులభంగా చూడండి.

 1. Google ఫారమ్‌లలో ఫారమ్‌ని తెరవండి.
 2. ఫారమ్ పై భాగాన, ప్రతిస్పందనలు క్లిక్ చేయండి.
 3. పైన కుడివైపున, స్ప్రెడ్‌షీట్‌ని సృష్టించు Google షీట్‌లకు ఎగుమతి చేయి క్లిక్ చేయండి.

Google షీట్‌లలో వివిధ ట్యాబ్‌లలో Google ఫారమ్‌ల ప్రతిస్పందనలను క్రమీకరించడం గురించి వీడియో ట్యుటోరియల్ చూసేందుకు, మా సహాయ ఫోరమ్‌ని సందర్శించండి.

అన్ని ప్రతిస్పందనలను CSV ఫైల్ వలె డౌన్‌లోడ్ చేయండి
 1. Google ఫారమ్‌లలో ఫారమ్‌ని తెరవండి.
 2. ఫారమ్ పై భాగాన, ప్రతిస్పందనలు క్లిక్ చేయండి.
 3. మరిన్ని మరిన్ని ఆ తర్వాత ప్రతిస్పందనలను డౌన్‌లోడ్ చేయండి (.csv) క్లిక్ చేయండి.

ప్రతిస్పందనలను నిర్వహించండి

ప్రతిస్పందనలను సేకరించడం నిలిపివేయండి
 1. Google ఫారమ్‌లలో ఫారమ్‌ని తెరవండి.
 2. ఎగువన, ప్రతిస్పందనలును క్లిక్ చేయండి.
 3. "ప్రతిస్పందనలను ఆమోదించడం" ఆన్ నుండి ఆఫ్‌కి మార్చండి.

మీరు దీనిని ఆఫ్ చేసిన తర్వాత, మీరు "ప్రతిస్పందనలు" ట్యాబ్‌లో "ప్రతిస్పందనలను అంగీకరించడం లేదు" అనే సందేశాన్ని చూస్తారు.

ప్రతిస్పందన నోటిఫికేషన్‌లను ఆన్ చేయండి లేదా ఆఫ్ చేయండి
 1. Google ఫారమ్‌లలో ఫారమ్‌ని తెరవండి.
 2. ఎగువన, ప్రతిస్పందనలును క్లిక్ చేయండి.
 3. మరిన్ని క్లిక్ చేయండి మరిన్ని.
 4. కొత్త ప్రతిస్పందనల కోసం ఇమెయిల్ నోటిఫికేషన్‌లను పొందండిని క్లిక్ చేయండి.

చిట్కా: మరిన్ని నోటిఫికేషన్‌ల ఎంపికలను పొందేందుకు మరియు ప్రతిస్పందనదారులకు అనుకూల ఫాలో అప్ ఇమెయిల్‌లను పంపేందుకు, ఫారమ్ నోటిఫికేషన్‌ల యాడ్-ఆన్‌ని డౌన్‌లోడ్ చేయండి.

ప్రతిస్పందనదారుల ఇమెయిల్ చిరునామాలను సేకరించండి

మీ ఫారమ్‌ని పూరించే వ్యక్తుల నుండి ఇమెయిల్ చిరునామాలను రికార్డ్ చేయండి. ఎవరైనా మీ సర్వేలో పాల్గొంటే, వారు ఫారమ్‌ని సమర్పించే ముందు వారి ఇమెయిల్ చిరునామాని నమోదు చేయాల్సి ఉంటుంది.

మీరు కార్యాలయం ద్వారా లేదా పాఠశాల ద్వారా Google ఖాతాని ఉపయోగించినట్లయితే, ప్రతిస్పందనదారులు వారి వినియోగదారు పేరు స్వయంచాలకంగా సేకరించబడుతుందని వివరించే సందేశాన్ని ఎగువన చూస్తారు.

 1. Google ఫారమ్‌లలో ఫారమ్‌ని తెరవండి.
 2. ఎగువ కుడివైపున, సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు క్లిక్ చేయండి.
 3. "ఇమెయిల్ చిరునామా సేకరించు" ప్రక్కన ఉన్న పెట్టెను ఎంచుకోండి.
Google ఫారమ్‌ల నుండి ఛార్ట్‌లను కాపీ చేసి పేస్ట్ చేయండి

మీ ఫారమ్ మీ "ప్రతిస్పందనలు" విభాగంలో ఛార్ట్‌లను సృష్టిస్తే, మీరు వాటిని ఇతర ఫైల్‌లలో కాపీ చేసి అతికించవచ్చు.

 1. Google ఫారమ్‌లలో ఫారమ్‌ని తెరవండి.
 2. ప్రతిస్పందనలు క్లిక్ చేయండి.
 3. ఛార్ట్ యొక్క ఎగువ కుడి భాగంలో, కాపీ చేయి Make a copy క్లిక్ చేయండి.
 4. మీకు నచ్చిన చోట ఛార్ట్‌ని పేస్ట్ చేయండి.
ఇది సహాయకరంగా ఉందా?
మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?