విద్యాపరమైన, డాక్యుమెంటరీ, శాస్త్రీయ లేదా కళాత్మక ప్రయోజనాల విషయంలో ఉన్న మినహాయింపుల గురించి తెలుసుకోండి

Google Drive, Docs, Sheets, Slides, Forms, అలాగే Sites వంటివి కంటెంట్‌ను క్రియేట్ చేసే విషయంలో, అలాగే పరస్పరం సహకరించుకునే విషయంలో వ్యక్తులకు సహాయపడటం కోసం డిజైన్ చేయబడ్డాయి. 

Google ప్రోడక్ట్‌లను ఉపయోగించే వారందరికీ సానుకూల ఎక్స్‌పీరియన్స్ అందేలా చూసుకోవడంలో దుర్వినియోగ సంబంధిత ప్రోగ్రామ్ పాలసీలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. 

కంటెంట్ మా పాలసీలను ఉల్లంఘిస్తోందని మేము నిర్ధారించినప్పుడు, మేము ఆ పాలసీలను అమలు చేస్తాము. దీని అర్థం:

  • కంటెంట్‌ను యాక్సెస్ చేయడంపై పరిమితులు విధించబడవచ్చు 
  • కంటెంట్‌ను తీసివేయవచ్చు
  • తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడినప్పుడు, Google ప్రోడక్ట్‌లను యాక్సెస్ చేసే విషయంలో యూజర్‌లపై పరిమితులు విధించబడవచ్చు లేదా వారి యాక్సెస్‌ను రద్దు చేయవచ్చు  

మేము విద్యాపరమైన, డాక్యుమెంటరీ, శాస్త్రీయ లేదా కళాత్మక (EDSA) కంటెంట్ విషయంలో ఈ పాలసీలకు మినహాయింపులు ఇవ్వవచ్చు.

EDSAకి అర్హత కంటెంట్‌కు ఉందో లేదో అంచనా వేయడం

కంటెంట్‌కు EDSA మినహాయింపు వర్తిస్తుందో, లేదో నిర్ణయించేటప్పుడు, మేము సందర్భాన్ని, అలాగే ఉద్దేశం తాలూకు సూచనలను అంచనా వేస్తాము. 

ESDA మినహాయింపు ఇవ్వడం సమర్థనీయమైనదేనా కాదా అనేది అర్థం చేసుకోవడానికి, మేము "5 Wలు, ఒక H" ఫ్రేమ్‌వర్క్‌ను ఉపయోగించి - ఎవరు, ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎలా - కంటెంట్‌ను అంచనా వేయవచ్చు. 

అంతే కాకుండా, ఉల్లంఘించే కంటెంట్ విషయంలో ప్రత్యామ్నాయ స్థానాన్ని అందించడం లేదా సదరు కంటెంట్ ఉల్లంఘిస్తోంది అనే వాదనను తిరస్కరించడం వంటి చర్యలు, EDSA కేటగిరీ కిందికే కంటెంట్ వస్తుందని తెలియజేయవచ్చు. 

కంటెంట్ EDSA మినహాయింపునకు లోబడి ఉండాలా, వద్దా అని నిర్ణయించడానికి, కంటెంట్‌తో పాటు, అనేక ఇతర అంశాలను ఉపయోగించడం జరుగుతుంది, ఆ అంశాలను ఈ కింద అందించడం జరిగింది: 

  • ఫైల్ లేదా ఫోల్డర్ టైటిల్
  • ఎడిటోరియల్ వాటర్‌మార్క్‌లు
  • కంటెంట్‌ను ఎంత సులభంగా యాక్సెస్ చేయవచ్చు 
    • లింక్ ఉన్న వారెవరైనా యాక్సెస్ చేయగల డాక్యుమెంట్‌లతో సహా అనేక మంది వ్యక్తులతో షేర్ చేయబడిన కంటెంట్‌ను, దాని ఓనర్ ఏ ఉద్దేశంతో అయితే క్రియేట్ చేశారో, ఆ ఉద్దేశంతో కాకుండా వేరే ఉద్దేశంతో ఉపయోగించే అవకాశం ఉంది. 

అయితే, కంటెంట్‌లో EDSA లక్షణాలు ఉన్నంత మాత్రాన, అంటే దాన్ని ప్రసార విభాగం లేదా అకడమిక్ పేపర్ స్టయిల్‌లో చూపించినంత మాత్రాన, అది ఖచ్చితంగా EDSAగా పరిగణించబడుతుందని చెప్పలేము. 

అన్ని పాలసీలూ EDSA మినహాయింపులను అనుమతించవని గమనించడం చాలా ముఖ్యం. EDSA మినహాయింపులు వీటికి వర్తించవు:

  • ఖాతా హైజాకింగ్
  • ఖాతా ఇన్‌యాక్టివిటీ
  • చట్టంలోని లొసుగుల దుర్వినియోగం
  • పిల్లలపై లైంగిక చర్యలు, పిల్లలపై దాడి
  • మాల్‌వేర్, అదే విధంగా ఉండే ఇతర హానికరమైన కంటెంట్
  • సమ్మతి లేకుండా రూపొందిన అభ్యంతరకర ఇమేజ్‌లు
  • ఫిషింగ్
  • స్పామ్
  • సిస్టమ్ జోక్యం, దుర్వినియోగం

EDSA అంచనాలకు సంబంధించిన ఉదాహరణలు

ఈ కింది టేబుల్‌లో ఊహాజనిత కంటెంట్ ఉంది, ఈ కంటెంట్‌లోని ఏ అంశాలను అయితే పాలసీ ఉల్లంఘనలుగా పరిగణించే అవకాశం ఉందో, ఆ అంశాలకు EDSA మినహాయింపు లభించే అవకాశం ఎంత మేరకు ఉందో ఈ టేబుల్ తెలుపుతుంది. 

పాలసీ

EDSA మినహాయింపునకు అవకాశం

EDSA మినహాయింపు ఏ కేటగిరీలో ఇవ్వవచ్చు

హింస, రక్తపాతం

ఎక్కువ అవకాశం ఉంది

సమయం, ప్రదేశంతో సహా ఫోటో పేరు వంటి స్పష్టమైన వివరాలు గల, బాంబు దాడి కారణంగా గాయాలపాలైన వ్యక్తులు ఉన్న ఫోటో. డాక్యుమెంటరీ

ప్రమాదకరం, అలాగే చట్టవిరుద్ధం: స్వీయ హాని

ఎక్కువ అవకాశం ఉంది

స్వీయ హానికి సంబంధించిన ప్రవర్తన గురించి ప్రమోట్ చేయకుండా, ఆ స్వీయ హానికి సంబంధించి వ్యక్తిగత కష్టాలను షేర్ చేసే డాక్యుమెంట్. డాక్యుమెంటరీ

ప్రమాదకరం, అలాగే చట్టవిరుద్ధం: ప్రమాదకరమైన పదార్థాలు

ఎక్కువ అవకాశం ఉంది

పేలుడు పదార్థాల గురించి వివరించే కెమిస్ట్రీ టెక్స్ట్‌బుక్. విద్య 

విద్వేషాలు పెంచే కంటెంట్

ఎక్కువ అవకాశం ఉంది

అధికారిక వార్తల అవుట్‌లెట్‌కు సంబంధించిన వాటర్‌మార్క్ గల, విద్వేషకరమైన గ్రూప్ చేసే మార్చ్‌కు సంబంధించిన వీడియో, ఈ వీడియోకు మార్చ్ జరిగిన ప్రదేశం, తేదీలను సూచించే వివరణాత్మక టైటిల్ ఉంది. డాక్యుమెంటరీ

లైంగికపరంగా అందరికీ తగని కంటెంట్

ఎక్కువ అవకాశం ఉంది

'వీరోచిత నగ్నత్వం' స్టయిల్‌లో ఉండే పాలరాతి గ్రీకు విగ్రహాల ఫోటోలు. కళాత్మకమైనది 

 

Google Drive, Docs, Sheets, అలాగే Slidesలో గోప్యత, సెక్యూరిటీ 

మీరు Google Drive, Docs, Sheets, అలాగే Slidesలో సేవ్ చేసిన కంటెంట్ మీకు ప్రైవేట్‌గా ఉంటుంది, మీరు షేర్ చేయాలని ఎంచుకుంటే తప్ప ఇతరులకు అది కనిపించదు. మీరు ఫైళ్లను కొంతమంది సహకారులతో షేర్ చేయడం నుండి వాటిని పబ్లిక్‌గా యాక్సెస్ చేయగలిగేలా సెట్ చేయడం వరకు అనేక మార్గాల్లో ఫైళ్లను షేర్ చేయవచ్చు. 

ఫైళ్లకు సంబంధించిన లింక్‌లు ఉన్న వారెవరికైనా ఆ ఫైళ్లు అందుబాటులో ఉన్నప్పుడు, మీరు కంటెంట్‌ను ఏ ప్రయోజనాలతో లేదా ఏ ఉద్దేశంతో అయితే క్రియేట్ చేశారో, ఆ ప్రయోజనాలతో లేదా ఉద్దేశంతో కాకుండా ఆ కంటెంట్‌ను వేరే విధంగా ఉపయోగించడం కానీ లేదా అర్థం చేసుకోవడం కానీ జరగవచ్చని దయచేసి గమనించండి. 

ముఖ్య గమనిక: మీ కంటెంట్‌ను ఎల్లప్పుడూ జాగ్రత్తగా లేబుల్ చేయడమే కాకుండా, అది సందర్భోచితంగా ఉండేలా కూడా చూసుకోండి, ప్రత్యేకించి ఇతరులతో షేర్ చేస్తున్నప్పుడు ఇది మరీ ముఖ్యమని గమనించండి. ఏ సమయంలోనైనా, మీరు షేరింగ్‌ను ఆపివేయవచ్చు, పరిమితం చేయవచ్చు లేదా మార్చవచ్చు.

ఉల్లంఘనలను రిపోర్ట్ చేయడం, అప్పీల్ చేయడం ఎలా

మీ ఫైల్ Google సర్వీస్ నియమాలను లేదా ప్రోగ్రామ్ పాలసీలను ఉల్లంఘిస్తోందని మీకు నోటిఫికేషన్ వస్తే, కానీ అది పొరపాటుగా వచ్చిందని మీకు అనిపిస్తే, మీరు అప్పీల్‌ను రిక్వెస్ట్ చేయవచ్చు. ఉల్లంఘన విషయంలో రివ్యూను రిక్వెస్ట్ చేయండి.

మా పాలసీలను ఉల్లంఘిస్తున్నట్లు కనిపించే కంటెంట్‌ను రివ్యూ చేయమని కూడా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు.


 
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
1861896621340231585
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false