ఇతర అప్లికేషన్‌ల నుండి థర్డ్-పార్టీ స్మార్ట్ చిప్‌లను ఇన్‌సర్ట్ చేయండి

మీరు Google Docsలోని @ మెనూతో థర్డ్-పార్టీ పార్ట్‌నర్ నుండి URLలను ప్రివ్యూ చేయవచ్చు లేదా స్మార్ట్ చిప్‌లో థర్డ్-పార్టీ రిసోర్స్‌లను క్రియేట్ చేయవచ్చు.

ముఖ్య గమనిక: సదరు అప్లికేషన్‌కు డెవలపర్ స్మార్ట్ చిప్‌ను ఎనేబుల్ చేసి ఉంటేనే, మీరు థర్డ్-పార్టీ స్మార్ట్ చిప్‌ను క్రియేట్ చేసి, ఉపయోగించగలరు. అంతే కాకుండా, మీరు లేదా మీ డొమైన్ అడ్మినిస్ట్రేటర్, ఆ అప్లికేషన్‌కు సంబంధించిన నిర్దిష్ట యాడ్-ఆన్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఒక యాడ్-ఆన్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి, ఎక్స్‌టెన్షన్‌లు ఆ తర్వాత యాడ్-ఆన్‌లు ఆ తర్వాత యాడ్-ఆన్‌లను పొందండికి ఆప్షన్‌లకు వెళ్లండి. మీరు యాడ్-ఆన్‌ను ఇన్‌స్టాల్ చేయలేకపోతే, మీరు మీ అడ్మినిస్ట్రేటర్‌ను సంప్రదించడానికి ట్రై చేయవచ్చు.

స్మార్ట్ చిప్‌లో థర్డ్-పార్టీ రిసోర్స్‌ను క్రియేట్ చేయండి

ముఖ్య గమనిక: ఇంటిగ్రేషన్ విభాగంలో థర్డ్-పార్టీ అప్లికేషన్‌ను కనుగొనడానికి, మీరు తప్పనిసరిగా థర్డ్-పార్టీ అప్లికేషన్ యాడ్-ఆన్‌ను ఇన్‌స్టాల్ చేసి ఉండాలి.

  1. మీ కంప్యూటర్‌లో, Google Docsలోని డాక్యుమెంట్‌ను తెరవండి.
  2. కొత్త రిసోర్స్‌ను క్రియేట్ చేయడానికి, “@”ను ఎంటర్ చేయండి.
  3. "ఇంటిగ్రేషన్" విభాగం కింద, మీ థర్డ్-పార్టీ అప్లికేషన్‌ను క్లిక్ చేయండి.
    చిట్కా: మీరు "@" గుర్తు తర్వాత థర్డ్-పార్టీ అప్లికేషన్ పేరును కూడా టైప్ చేయవచ్చు.
  4. ఫారమ్‌ను పూరించండి.
  5. క్రియేట్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

డెవలపర్‌గా థర్డ్-పార్టీ రిసోర్స్‌ను క్రియేట్ చేయండి.

స్మార్ట్ చిప్‌లతో లింక్‌ను ప్రివ్యూ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, థర్డ్-పార్టీ స్మార్ట్ చిప్ ఉన్న డాక్యుమెంట్‌ను Google Docsలో తెరవండి.
  2. వెబ్‌సైట్‌కు సంబంధించిన సమాచారాన్ని చూడటానికి స్మార్ట్ చిప్‌పై మౌస్ కర్సర్‌ను ఉంచండి లేదా దాన్ని క్లిక్ చేయండి.
    చిట్కా: మీరు యాడ్-ఆన్‌ను ఇన్‌స్టాల్ చేసి లేకపోతే, మీరు చిప్‌ను చూడగలుగుతారు, కానీ ఆ చిప్‌పై మౌస్ కర్సర్‌ను ఉంచినప్పుడు, మీకు మరింత సమాచారం కనిపించదు. యాడ్-ఆన్‌ను పొందడానికి, మీరు ఇన్‌స్టాల్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయవచ్చు.
  3. మీరు:
    • వెబ్‌సైట్‌కు వెళ్లాలనుకుంటే, స్మార్ట్ చిప్ టైటిల్‌ను క్లిక్ చేయండి.
    • URLను కాపీ చేయాలనుకుంటే, లింక్‌ను కాపీ చేయండి ని క్లిక్ చేయండి.
    • అప్లికేషన్ యాడ్-ఆన్ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే, యాడ్-ఆన్ సమాచారం సమాచారంను క్లిక్ చేయండి.

డెవలపర్‌గా స్మార్ట్ చిప్‌లతో ప్రివ్యూ లింక్‌లను క్రియేట్ చేయండి.

హైపర్‌లింక్‌ను థర్డ్-పార్టీ స్మార్ట్ చిప్‌గా మార్చండి

మీరు థర్డ్-పార్టీ అప్లికేషన్ కోసం యాడ్-ఆన్‌ను ఇన్‌స్టాల్ చేసి ఉంటే, మీరు మీ డాక్యుమెంట్‌లలో ఇప్పటికే ఉన్న URLలను స్మార్ట్ చిప్‌లుగా ఉపయోగించవచ్చు లేదా వాటిని స్మార్ట్ చిప్‌లుగా కూడా మార్చవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో, Google Docsలోని డాక్యుమెంట్‌ను తెరవండి.
  2. థర్డ్-పార్టీ వెబ్‌సైట్‌కు సంబంధించిన లింక్‌ను ఎంటర్ చేయండి.
  3. URLను స్మార్ట్ చిప్‌తో రీప్లేస్ చేయడానికి, Tabను నొక్కండి.
  4. వెబ్‌సైట్‌కు సంబంధించిన సమాచారాన్ని పొందటానికి URLను క్లిక్ చేయండి.
  5. (ఆప్షనల్) URLను స్మార్ట్ చిప్‌గా మార్చడానికి, URLను క్లిక్ చేయండి, ఆపై చిప్‌ను క్లిక్ చేయండి.
true
Visit the Learning Center

Using Google products, like Google Docs, at work or school? Try powerful tips, tutorials, and templates. Learn to work on Office files without installing Office, create dynamic project plans and team calendars, auto-organize your inbox, and more.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
16317948700639764070
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false