మీరు స్ప్రెడ్‌షీట్‌లో స్మార్ట్ చిప్‌లను ఇన్‌సర్ట్ చేసినప్పుడు, మీరు స్మార్ట్ చిప్‌ల నుండి డేటాను ప్రత్యేక అడ్డు వరుసలు లేదా నిలువు వరుసలలోకి వెలికితీయవచ్చు.
- మీ కంప్యూటర్‌లో, Google Sheetsలో స్ప్రెడ్‌షీట్‌ను తెరవండి.
- ఒకే చిప్ ఉన్న సెల్‌ను లేదా ప్రతి ఒక్క దానిలోను చిప్‌ను కలిగి ఉన్న సెల్స్ పరిధిని ఎంచుకోండి.
- ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:
- సెల్ లేదా సెల్స్ డేటాను వెలికితీయండి ఆప్షన్‌లపై క్లిక్ చేయండి.
- డేటా > డేటా వెలికితీత ఆప్షన్‌లపై క్లిక్ చేయండి.
- "వెలికితీయాల్సిన డేటా" ఆప్షన్ కింద, మీరు వెలికితీయాలనుకొనే డేటా రకాలను ఎంచుకోండి.
- “ఇక్కడికి వెలికితీయండి” ఆప్షన్ కింద, వెలికితీసిన డేటా కోసం సెల్ లేదా సెల్స్ పరిధిని ఎంచుకోండి.
సింటాక్స్‌తో డేటాను వెలికితీయండి
వినియోగ నమూనా
A2.Location
A2.[Creation Time]
A2:A4.Title
సింటాక్స్
Cell_or_range.data_type
Cell_or_range
: ఒక స్మార్ట్ చిప్‌ను కలిగి ఉన్న సెల్ లేదా ఒకొక్క దానిలో స్మార్ట్ చిప్‌ను కలిగి ఉన్న ఒకే రకమైన సెల్స్ పరిధి.Data_type
: ఎంచుకున్న సెల్ లేదా సెల్స్ పరిధి నుండి వెలికితీయాల్సిన డేటా రకం.
ఉదాహరణ
ఈ ఫార్ములాను B2లో ఇన్‌పుట్ చేయండి: =A2.[file name]
ఈ ఫార్ములాను C2లో ఇన్‌పుట్ చేయండి: =A2.[creation time]
ఈ ఫార్ములాను D2లో ఇన్‌పుట్ చేయండి: =A2.[last modified time]
ఫలితం:
A |
B |
C |
D |
|
1 |
చిప్ |
ఫైల్ పేరు |
క్రియేట్ చేసిన సమయం |
చివరిగా ఎడిట్ చేసిన సమయం |
2 |
<file chip> |
నమూనా చిప్ వెలికితీత డాక్యుమెంట్ |
1/25/2023 13:22:29 |
1/25/2023 13:22:41 |
స్మార్ట్ చిప్ నుండి డేటాను వెలికితీయండి
- మీ కంప్యూటర్‌లో, Google Sheetsలో స్ప్రెడ్‌షీట్‌ను తెరవండి.
- ఒకే చిప్‌ను కలిగి ఉన్న సెల్‌పై మౌస్ కర్సర్‌ను ఉంచండి.
- కుడి వైపున సైడ్‌బార్‌ను తెరవడానికి డేటా వెలికితీత ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- "వెలికితీయాల్సిన డేటా" ఆప్షన్ కింద, మీరు వెలికితీయాలనుకొనే డేటా రకాలను ఎంచుకోండి.
- “ఇక్కడికి వెలికితీయండి” ఆప్షన్ కింద, వెలికితీసిన డేటా కోసం సెల్ లేదా సెల్స్ పరిధిని ఎంచుకోండి.
వెలికితీసిన డేటాను రిఫ్రెష్ చేయండి
సెల్స్ నుండి వెలికితీసిన డేటాను రిఫ్రెష్ చేయడానికి:
- మీ కంప్యూటర్‌లో, Google Sheetsలో స్ప్రెడ్‌షీట్‌ను తెరవండి.
- ఒకే చిప్ ఉన్న సెల్‌ను లేదా ఒకొక్క దానిలో చిప్‌ను కలిగి ఉన్న సెల్స్ పరిధిని ఎంచుకోండి.
- సెల్‌పై కుడి క్లిక్ చేసి స్మార్ట్ చిప్‌లు డేటాను రిఫ్రెష్ చేయండి ఆప్షన్‌లను ఎంచుకోండి.
డేటా వెలికితీత సైడ్‌బార్ నుండి వెలికితీసిన డేటాను రిఫ్రెష్ చేతియడానికి:
- మీ కంప్యూటర్‌లో, Google Sheetsలో స్ప్రెడ్‌షీట్‌ను తెరవండి.
- ఒకే చిప్ ఉన్న సెల్‌ను లేదా ఒకొక్క దానిలో చిప్‌ను కలిగి ఉన్న సెల్స్ పరిధిని ఎంచుకోండి.
- ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:
- సెల్ లేదా సెల్స్ డేటాను వెలికితీయండి ఆప్షన్‌లపై క్లిక్ చేయండి.
- డేటా > డేటా వెలికితీత ఆప్షన్‌లపై క్లిక్ చేయండి.
- రిఫ్రెష్ చేసి, మేనేజ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- మీరు రిఫ్రెష్ చేయాలనుకొనే స్మార్ట్ చిప్‌ల డేటాను కనుగొనండి.
- డేటాను రిఫ్రెష్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి
మీరు వెలికితీయగల డేటా రకాలు
కింది చిప్‌ల గురించి సమాచారాన్ని చేర్చడానికి మీరు మీ Google Sheetsలోని స్మార్ట్ చిప్‌ల నుండి డేటాను వెలికితీయవచ్చు:
వక్తుల స్మార్ట్ చిప్
సమాచారం డొమైన్ ప్రొఫైల్స్ వచ్చే సమాచారం.
- ఈమెయిల్
- పేరు
- లొకేషన్*
- ఫోన్*
- టైటిల్*
ఫైల్ స్మార్ట్ చిప్
Google Driveలోని మీ ఫైల్‌ల నుండి వచ్చే సమాచారం.
- MIME రకం
- URL
- ఫైల్ పేరు
- ఓనర్*
- క్రియేట్ చేసిన సమయం*
- వీరి ద్వారా చివరిగా ఎడిట్ చేయబడింది*
- చివరిగా ఎడిట్ చేసిన సమయం*
ఈవెంట్ స్మార్ట్ చిప్
మీ క్యాలెండర్‌లోని ఈవెంట్‌ల నుండి వచ్చే సమాచారం.
- URL
- సారాంశం
- క్రియేటర్*
- వివరణ*
- తేదీ/సమయం*
- లొకేషన్*
- ఆహ్వానితులు*