టెక్స్ట్, ఆబ్జెక్ట్‌లు, అలాగే బ్యాక్‌గ్రౌండ్‌ల రంగును మార్చండి

Google Docs, Sheets, లేదా Slides నుండి, మీరు వీటిని చేయవచ్చు:
  • టెక్స్ట్, ఆబ్జెక్ట్‌లు, అలాగే బ్యాక్‌గ్రౌండ్‌ల రంగును మార్చండి
  • HEX విలువ, RGB విలువ లేదా ఐడ్రాపర్ టూల్ ద్వారా అనుకూలమైన రంగును క్రియేట్ చేయండి

టెక్స్ట్ రంగును మార్చండి లేదా టెక్స్ట్‌ను హైలైట్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, కింద పేర్కొన్న ప్రోగ్రామ్‌లలో ఒక దానిలో ఫైల్‌ను తెరవండి:
  2. మీరు ఎడిట్ చేయాలనుకొనే టెక్స్ట్‌ను హైలైట్ చేయండి. 
  3. వీటిని ఎడిట్ చేయడానికి:
    • టెక్స్ట్ రంగు కోసం, టూల్‌బార్‌లో, టెక్స్ట్ రంగు రంగు వచనం ఆప్షన్‌ను క్లిక్ చేయండి. 
    • టెక్స్ట్‌ను హైలైట్ చేయడానికి, టూల్‌బార్‌లో, రంగును హైలైట్ చేయండి వచనాన్ని ప్రముఖంగా చూపు ఆప్షన్‌ను క్లిక్ చేయండి. ఇది Google Docs, ఇంకా Slidesలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
  4. ప్రీసెట్ రంగును ఎంచుకోండి లేదా అనుకూల రంగును క్రియేట్ చేయండి.

సెల్‌లు, టేబుల్స్, అలాగే టెక్స్ట్ బాక్స్‌ల రంగును మార్చండి

  1. మీ కంప్యూటర్‌లో, కింద పేర్కొన్న ప్రోగ్రామ్‌లలో ఒక దానిలో ఫైల్‌ను తెరవండి:
  2. టెక్స్ట్ బాక్స్‌పై క్లిక్ చేయండి లేదా మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న సెల్‌లను హైలైట్ చేయండి.
  3. వీటిని ఎడిట్ చేయడానికి:
    • సెల్‌లు లేదా బాక్స్ బ్యాక్‌గ్రౌండ్ రంగు కోసం, టూల్‌బార్‌లో, బ్యాక్‌గ్రౌండ్ రంగు రంగును పూరించు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • సెల్‌లు లేదా బాక్స్ అంచు రంగు కోసం, టూల్‌బార్‌లో, అంచు రంగు అంచు రంగు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
      • Google Sheetsలో, అంచులు అంచులు ఆ తర్వాత అంచుల రంగు అంచు రంగు ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  4. ప్రీసెట్ రంగును ఎంచుకోండి లేదా అనుకూల రంగును క్రియేట్ చేయండి.

అనుకూలమైన రంగును క్రియేట్ చేయండి

మీరు Hex లేదా RGB విలువలను ఎంటర్ చేయడం ద్వారా అనుకూల రంగును క్రియేట్ చేయవచ్చు లేదా మీ స్క్రీన్‌పై ఎక్కడి నుండైనా రంగును ఎంచుకోవడానికి మీరు ఐడ్రాపర్ టూల్‌ను ఉపయోగించవచ్చు. మీరు అనుకూలమైన రంగును క్రియేట్ చేసిన తర్వాత, మీరు ఆ రంగును ఆ ఫైల్‌లో ఎక్కడైనా ఉపయోగించగలరు.

అనుకూలమైన రంగును క్రియేట్ చేయడానికి Hex లేదా RGB విలువలను ఉపయోగించండి

  1. మీ కంప్యూటర్‌లో, కింద పేర్కొన్న ప్రోగ్రామ్‌లలో ఒక దానిలో ఫైల్‌ను తెరవండి:
  2. టూల్‌బార్‌లో, టెక్స్ట్ రంగు రంగు వచనం లేదా రంగు ఆప్షన్‌లతో ఏదైనా ఇతర టూల్‌ను క్లిక్ చేయండి. 
  3. “అనుకూలమైనది” ఆప్షన్ కింద, అనుకూలమైన రంగు Add a custom color ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. మీకు కావలసిన రంగు కోసం హెక్స్ కోడ్ లేదా RGB విలువలను ఎంటర్ చేయండి.
  5. సరే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

అనుకూలమైన రంగును ఎంచుకోవడానికి ఐడ్రాపర్ టూల్‌ను ఉపయోగించండి

ముఖ్య గమనిక: ఈ ఫీచర్ Chrome, అలాగే Edge బ్రౌజర్‌లలో సపోర్ట్ చేస్తుంది.

  1. మీ కంప్యూటర్‌లో, కింద పేర్కొన్న ప్రోగ్రామ్‌లలో ఒక దానిలో ఫైల్‌ను తెరవండి:
  2. టూల్‌బార్‌లో, టెక్స్ట్ రంగు రంగు వచనం లేదా రంగు ఆప్షన్‌లతో ఏదైనా ఇతర టూల్‌ను క్లిక్ చేయండి. 
  3. “అనుకూలమైనది” ఆప్షన్ కింద, అనుకూలమైన రంగు Pick a custom color ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. మీ స్క్రీన్‌పై ఏదైనా రంగును క్లిక్ చేయడానికి ఐడ్రాపర్ టూల్‌ను ఉపయోగించండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
8465130709011268673
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false