పెద్ద డేటా సెట్‌ను తగ్గించడానికి లేదా డేటా పాయింట్‌ల మధ్య సంబంధాలను చూసేందుకు మీరు పివోట్ టేబుల్‌లను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, ఒక నిర్దిష్ట నెలలో ఏ విక్రేత అత్యధిక ఆదాయాన్ని తీసుకొచ్చారో పరిశీలించడానికి మీరు పివోట్ పట్టికను ఉపయోగించవచ్చు.
పివోట్ పట్టికలను జోడించండి లేదా ఎడిట్ చేయండి
- మీ కంప్యూటర్‌లో, స్ప్రెడ్‌షీట్‌ను Google షీట్‌లలో తెరవండి.
- మీరు ఉపయోగించాలనుకునే మూలాధార డేటాతో కూడిన సెల్‌లను ఎంచుకోండి. ముఖ్య గమనిక: ప్రతి నిలువు వరుసకు హెడర్ అవసరం.
- ఎగువ భాగంలో ఉన్న మెనూలో, ఇన్‌సర్ట్ చేయండి
పివోట్ టేబుల్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి. పివోట్ టేబుల్ షీట్ ఇప్పటికే తెరిచి ఉండకపోతే, దాన్ని క్లిక్ చేయండి.
- సైడ్ ప్యానెల్‌లో, "అడ్డు వరుసలు" లేదా "నిలువు వరుసలు" పక్కన ఉన్న జోడించు ఆప్షన్‌ను క్లిక్ చేసి, ఆపై ఒక విలువను ఎంచుకోండి.
- గమనిక: కొన్నిసార్లు, మీరు ఎంచుకున్న డేటా ఆధారంగా సిఫార్సు చేయబడిన పివోట్ టేబుల్‌లు మీకు కనిపిస్తాయి. పివోట్ టేబుల్‌ను జోడించడానికి, "సూచించబడినవి" కింద, పివోట్ టేబుల్‌ను ఎంచుకోండి.
- సైడ్ ప్యానెల్‌లో, "విలువలు" పక్కన ఉన్న జోడించు ఆప్షన్‌ను క్లిక్ చేసి, ఆపై మీరు మీ అడ్డు వరుసలు లేదా నిలువు వరుసలలో చూడాలనుకుంటున్న విలువను ఎంచుకోండి.
- మీ డేటా జాబితా చేయబడే, క్రమీకరించబడే, విస్తరించబడే లేదా ఫిల్టర్ చేయబడే విధానాన్ని మీరు మార్చవచ్చు. మీరు మార్చాలనుకుంటున్న దాని పక్కన ఉండే, కిందికి బాణం గుర్తును
క్లిక్ చేయండి.
డేటాను మార్చండి లేదా తీసివేయండి
- మీ కంప్యూటర్‌లో, Google Sheetsలో స్ప్రెడ్‌షీట్‌ను తెరవండి.
- పివోట్ టేబుల్ కింద పాప్-అప్ ఎడిట్ బటన్‌ను క్లిక్ చేయండి.
- సైడ్ ప్యానెల్‌లో, ఫీల్డ్‌లను మార్చండి లేదా తీసివేయండి:
- ఫీల్డ్‌ను తరలించడానికి , దానిని వేరొక విభాగంలోకి లాగండి.
- ఫీల్డ్‌ను తీసివేయడానికి, తీసివేయి
ఎంపికను క్లిక్ చేయండి.
- మీ పివోట్ టేబుల్ కోసం ఉపయోగించే డేటా పరిధిని మార్చడానికి, డేటా పరిధిని ఎంచుకోండి
ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
గమనిక: తీసుకోబడిన పివోట్ టేబుల్‌కు సంబంధించిన సోర్స్ డేటా సెల్‌లను మీరు మార్చినట్లయితే, అందుకు తగినట్లుగా పివోట్ టేబుల్ ఎప్పుడైనా రిఫ్రెష్ అవుతుంది.
పివోట్ పట్టికలో సెల్ కోసం మీరు మూలాధార డేటా అడ్డువరుసలను పరిశీలించవచ్చు.
- మీ కంప్యూటర్‌లో, Google Sheetsలో స్ప్రెడ్‌షీట్‌ను తెరవండి.
- పివోట్ టేబుల్ కింద పాప్-అప్ ఎడిట్ బటన్‌ను క్లిక్ చేయండి.
- మీరు మరింత వివరణాత్మకంగా చూడాలనుకుంటున్న సెల్‌ను రెండు సార్లు క్లిక్ చేయండి.
- సెల్‌లకు సంబంధించిన సోర్స్ డేటాతో మీకు ఒక కొత్త షీట్ కనిపిస్తుంది.
Calculated fields with SUM or a custom formula
- మీ కంప్యూటర్‌లో, Google Sheetsలో స్ప్రెడ్‌షీట్‌ను తెరవండి.
- పివోట్ టేబుల్ కింద పాప్-అప్ ఎడిట్ బటన్‌ను క్లిక్ చేయండి.
- సైడ్ ప్యానెల్‌లో, "విలువలు" ఆప్షన్‌కు పక్కన ఉన్న జోడించండి ఆప్షన్‌ను క్లిక్ చేసి
ఆపై గణించబడిన ఫీల్డ్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- SUM తో విలువను గణించండి: “దీని ప్రకారం సంక్షిప్తీకరించు” పక్కన ఉన్న, SUM ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- అనుకూల ఫార్ములాతో విలువను గణించండి: కనిపిస్తున్న ఫీల్డ్‌లో, ఫార్ములాను ఎంటర్ చేయండి. ఆపై, "దీని ప్రకారం సంక్షిప్తీకరించు" పక్కన ఉన్న అనుకూలం ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- దిగువున కుడి వైపున ఉన్న, జోడించు ఆప్షన్‌ను క్లిక్ చేయండి, అప్పుడు మీకు కొత్త నిలువు వరుస కనిపిస్తుంది.
చిట్కా: అనుకూల ఫార్ములాలు రాయడానికి, మీరు వీటిని ఉపయోగించవచ్చు:
- ఇతర నిలువు వరుసలు, ఉదాహరణకు,
=sum(Price)/counta(Product)
ఇక్కడ "ధర
", అలాగే "ప్రోడక్ట్
" అనేవి పివోట్ టేబుల్‌లోని ఫీల్డ్‌లు లేదా టేబుల్‌లోని అంతర్లీన విలువలు (కనెక్ట్ చేయబడిన షీట్‌లతో అందుబాటులో ఉంటాయి.)- Google Sheets ఫంక్షన్‌లు.
ముఖ్య గమనిక: మీరు స్పేస్‌లతో ఫీల్డ్ విలువలను ఉపయోగిస్తుంటే, మీ అనుకూల ఫార్ములాలో వాటిని కొటేషన్ గుర్తుల మధ్య ఉంచారని నిర్ధారించుకోండి. ఉదాహరణకు: ="h sdf"
.
ఉదాహరణ
సంబంధిత కథనాలు