మీ Google Sheetsలో స్మార్ట్ చిప్‌లను ఇన్‌సర్ట్ చేయండి

కింది వాటి గురించి సమాచారాన్ని చేర్చడానికి మీ Google Sheetsలో స్మార్ట్ చిప్‌లను ఇన్‌సర్ట్ చేయండి:

  • Gmail లేదా Google Workspace ఈమెయిల్ అడ్రస్‌లు కలిగి ఉన్న యూజర్‌లు
  • ఇతర Google Docs, Sheets, లేదా Slides ఫైల్స్
  • Google Calendar ఈవెంట్‌లు
  • స్థలాలు, మ్యాప్ దిశలు
  • Google Finance ఎంటిటీలు
  • YouTube వీడియోలు
  • రేటింగ్‌లు

మీ స్ప్రెడ్‌షీట్‌లో స్మార్ట్ చిప్‌తో, మీరు మరింత సమాచారం కోసం చిప్‌పై మౌస్ కర్సర్ ఉంచవచ్చు లేదా దాన్ని క్లిక్ చేయవచ్చు.

స్మార్ట్ చిప్‌లను జోడించండి

ముఖ్య గమనిక: మీరు స్మార్ట్ చిప్‌లో యూజర్‌ను @ ఉపయోగించి పేర్కొంటే, వారు మీ డాక్యుమెంట్‌కు ఆటోమేటిక్‌గా యాక్సెస్ పొందలేరు. మరొక యూజర్ యాక్సెస్‌ను పొందడానికి, మీ డాక్యుమెంట్‌ను షేర్ చేయండి.

  1. మీ కంప్యూటర్‌లో, Google Sheetsలో స్ప్రెడ్‌షీట్‌ను తెరవండి.
  2. "@"ను ఎంటర్ చేయండి.
  3. మీ ఆప్షన్‌ల పరిధిని తగ్గించడానికి, పాప్-అప్ లిస్ట్ నుండి ఎంచుకోండి లేదా ఎంటర్ చేయండి:
    • అక్షరాలు
    • నంబర్‌లు
    • చిహ్నాలు
  4. వీటిని జోడించడానికి:
    • వ్యక్తుల స్మార్ట్ చిప్: పేరు లేదా ఈమెయిల్‌ను ఎంటర్ చేయండి.
    • ఫైల్ స్మార్ట్ చిప్: ఫైల్ పేరు లేదా సంబంధిత కీవర్డ్‌లను ఎంటర్ చేయండి.
    • ఈవెంట్ స్మార్ట్ చిప్: క్యాలెండర్ ఈవెంట్ పేరు లేదా సంబంధిత కీవర్డ్‌లను ఎంటర్ చేయండి.
    • స్థలం స్మార్ట్ చిప్: స్థలం, అడ్రస్, లేదా లొకేషన్‌ను ఎంటర్ చేయండి.
    • Finance స్మార్ట్ చిప్: స్టాక్‌లు, మ్యూచువల్ ఫండ్‌లు, లేదా కరెన్సీల వంటి Google Finance ఎంటిటీల పేరును ఎంటర్ చేయండి.
    • రేటింగ్ చిప్: డ్రాప్‌డౌన్‌ల నుండి సున్నా నుండి ఐదు స్టార్‌ల రేటింగ్‌ను ఎంచుకోవడానికి "రేటింగ్"ను ఎంటర్ చేసి, చిప్‌పై క్లిక్ చేయండి.
  5. సమాచారాన్ని చూడటానికి, స్మార్ట్ చిప్‌పై మౌస్ కర్సర్‌ను ఉంచండి.

చిట్కా: మీరు ఒక సెల్‌లో టెక్స్ట్‌తో పాటు వివిధ రకాల చిప్‌లను ఇన్‌సర్ట్ చేయవచ్చు. ప్రస్తుతం పలు చిప్‌లతో సెల్స్‌కు లెక్కింపు రెఫరెన్స్ సపోర్ట్ చేయడం లేదు.

తేదీలను మరింత సులభంగా ఉపయోగించడానికి @ను ఉపయోగించండి

  1. మీ కంప్యూటర్‌లో, Google Sheetsలో స్ప్రెడ్‌షీట్‌ను తెరవండి.
  2. తేదీలను ఇన్‌సర్ట్ చేయడానికి, ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:
  • “@”ను ఎంటర్ చేసి, ఆపై “తేదీల విభాగం” కింద, పాప్-అప్ లిస్ట్ నుండి ఎంచుకోండి.
  • కింద పేర్కొన్న వాటిని ఇన్‌పుట్ చేయండి:
    • @date: తేదీ సెలెక్టర్‌ను తెరుస్తుంది
    • @today: ఈరోజు తేదీను చూపుతుంది
    • @yesterday: నిన్నటి తేదీను చూపుతుంది
    • @tomorrow: రేపటి తేదీను చూపుతుంది
    • @monday, @next tuesday, or @last wednesday వంటి సంబంధిత తేదీ

చిట్కా: తేదీ సెలెక్టర్‌ను తెరవడానికి, తేదీని రెండు సార్లు క్లిక్ చేయండి.

ఈమెయిల్స్, లింక్‌లు & మరిన్నింటిని స్మార్ట్ చిప్‌లకు మార్చండి

వ్యక్తుల స్మార్ట్ చిప్‌లను జోడించండి

మెనూ నుండి ఇన్‌సర్ట్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Google Sheetsలో స్ప్రెడ్‌షీట్‌ను తెరవండి.
  2. ఈమెయిల్ అడ్రస్‌లు ఉన్న సెల్స్ పరిధిని ఎంచుకోండి.
  3. ఎగువున, ఇన్‌సర్ట్ చేయండి ఆ తర్వాత స్మార్ట్ చిప్‌లు ఆ తర్వాత వ్యక్తుల చిప్‌నకు మార్చండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కా: సెల్ మెనూ నుండి ఇన్‌సర్ట్ చేయడానికి, సెల్‌పై కుడి క్లిక్ చేయండి. స్మార్ట్ చిప్‌లు ఆ తర్వాత వ్యక్తుల చిప్‌నకు మార్చండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మార్చడానికి Tabను నొక్కండి

సెల్‌కు ఈమెయిల్ అడ్రస్‌ను పేస్ట్ చేయండి, వ్యక్తుల చిప్‌ను క్రియేట్ చేయడానికి Tab‌ను నొక్కండి.

ఫైల్ స్మార్ట్ చిప్‌లను జోడించండి

మెనూ నుండి ఇన్‌సర్ట్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Google Sheetsలో స్ప్రెడ్‌షీట్‌ను తెరవండి.
  2. ఫైల్ లింక్‌లతో ఉన్న సెల్స్ పరిధిని ఎంచుకోండి.
  3. ఎగువున, ఇన్‌సర్ట్ చేయండి ఆ తర్వాత స్మార్ట్ చిప్‌లు ఆ తర్వాత ఫైల్ చిప్‌నకు మార్చండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కా: సెల్ మెనూ నుండి ఇన్‌సర్ట్ చేయడానికి, సెల్‌పై కుడి క్లిక్ చేయండి. స్మార్ట్ చిప్‌లు ఆ తర్వాత ఫైల్ చిప్‌నకు మార్చండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

సెల్ నుండి ఇన్‌సర్ట్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Google Sheetsలో స్ప్రెడ్‌షీట్‌ను తెరవండి.
  2. ఫైల్ ప్రివ్యూ‌ను కనుగొనడానికి, ఫైల్ లింక్ ఉన్న సెల్‌పై మౌస్ కర్సర్‌ను ఉంచండి.
  3. ప్రివ్యూ కింద, URLను రీప్లేస్ చేయండి ఆ తర్వాత చిప్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మార్చడానికి Tabను నొక్కండి

ఫైల్ లింక్‌ను సెల్‌కు పేస్ట్ చేయండి, ఫైల్ చిప్‌ను క్రియేట్ చేయడానికి Tab‌ను నొక్కండి.

ఈవెంట్ స్మార్ట్ చిప్‌లను జోడించండి

మెనూ నుండి ఇన్‌సర్ట్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Google Sheetsలో స్ప్రెడ్‌షీట్‌ను తెరవండి.
  2. క్యాలెండర్ ఈవెంట్ లింక్‌లతో ఉన్న సెల్స్ పరిధిని ఎంచుకోండి.
  3. ఎగువున, ఇన్‌సర్ట్ చేయండి ఆ తర్వాత స్మార్ట్ చిప్‌లు ఆ తర్వాత క్యాలెండర్ ఈవెంట్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కా: సెల్ మెనూ నుండి ఇన్‌సర్ట్ చేయడానికి, సెల్‌పై కుడి క్లిక్ చేయండి. స్మార్ట్ చిప్‌లు ఆ తర్వాత క్యాలెండర్ ఈవెంట్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

సెల్ నుండి ఇన్‌సర్ట్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Google Sheetsలో స్ప్రెడ్‌షీట్‌ను తెరవండి.
  2. ఈవెంట్ ప్రివ్యూ‌ను చూడటానికి, క్యాలెండర్ ఈవెంట్ లింక్ ఉన్న సెల్‌పై మౌస్ కర్సర్‌ను ఉంచండి.
  3. ప్రివ్యూ కింద, URLను రీప్లేస్ చేయండి ఆ తర్వాత చిప్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
ప్రదేశ సంబంధిత స్మార్ట్ చిప్‌లను జోడించండి

మెనూ నుండి ఇన్‌సర్ట్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Google Sheetsలో స్ప్రెడ్‌షీట్‌ను తెరవండి.
  2. Google మ్యాప్ లింక్‌లతో ఉన్న సెల్స్ పరిధిని ఎంచుకోండి.
  3. ఎగువున, ఇన్‌సర్ట్ చేయండి ఆ తర్వాత స్మార్ట్ చిప్‌లు ఆ తర్వాత ప్రదేశ సంబంధిత చిప్‌నకు మార్చండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కా:సెల్ మెనూ నుండి ఇన్‌సర్ట్ చేయడానికి, సెల్‌పై కుడి క్లిక్ చేయండి. స్మార్ట్ చిప్‌లు ఆ తర్వాత ప్రదేశ సంబంధిత చిప్‌నకు మార్చండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

సెల్ నుండి ఇన్‌సర్ట్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Google Sheetsలో స్ప్రెడ్‌షీట్‌ను తెరవండి.
  2. మ్యాప్ ప్రివ్యూను చూడటానికి, మ్యాప్ లింక్ ఉన్న సెల్‌పై మౌస్ కర్సర్‌ను ఉంచండి.
  3. ప్రివ్యూ కింద, URLను రీప్లేస్ చేయండి ఆ తర్వాత చిప్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మార్చడానికి Tabను నొక్కండి

మ్యాప్ లింక్‌ను సెల్‌కు పేస్ట్ చేయండి, స్థలం చిప్‌ను క్రియేట్ చేయడానికి Tab‌ను నొక్కండి.

ఫైనాన్స్ స్మార్ట్ చిప్‌లను జోడించండి

మెనూ నుండి ఇన్‌సర్ట్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Google Sheetsలో స్ప్రెడ్‌షీట్‌ను తెరవండి.
  2. Google Finance ఎంటిటీలు ఉన్న సెల్స్ పరిధిని ఎంచుకోండి.
  3. ఎగువున, ఇన్‌సర్ట్ చేయండి ఆ తర్వాత స్మార్ట్ చిప్‌లు ఆ తర్వాత Finance అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కా: సెల్ మెనూ నుండి ఇన్‌సర్ట్ చేయడానికి, సెల్‌పై కుడి క్లిక్ చేయండి. స్మార్ట్ చిప్‌లు ఆ తర్వాత Finance అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

YouTube స్మార్ట్ చిప్‌లను జోడించండి

సెల్ నుండి ఇన్‌సర్ట్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Google Sheetsలో స్ప్రెడ్‌షీట్‌ను తెరవండి.
  2. YouTube వీడియో ప్రివ్యూను చూడటానికి, YouTube వీడియో లింక్ ఉన్న సెల్‌పై మౌస్ కర్సర్‌ను ఉంచండి.
  3. ప్రివ్యూ కింద, URLను రీప్లేస్ చేయండి ఆ తర్వాత చిప్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మార్చడానికి Tabను నొక్కండి

YouTube వీడియో లింక్‌ను సెల్‌లో పేస్ట్ చేసి, YouTube చిప్‌ను క్రియేట్ చేయడానికి Tabను నొక్కండి.

రేటింగ్ స్మార్ట్ చిప్‌లను జోడించండి

మెనూ నుండి ఇన్‌సర్ట్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Google Sheetsలో స్ప్రెడ్‌షీట్‌ను తెరవండి.
  2. సున్నా నుండి ఐదు మధ్య ఇంటిజర్ విలువలతో ఉన్న సెల్స్ పరిధిని ఎంచుకోండి.
  3. ఎగువున, ఇన్‌సర్ట్ చేయండి ఆ తర్వాత స్మార్ట్ చిప్‌లు ఆ తర్వాత రేటింగ్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కా: సెల్ మెనూ నుండి ఇన్‌సర్ట్ చేయడానికి, సెల్‌పై కుడి క్లిక్ చేయండి. స్మార్ట్ చిప్‌లు ఆ తర్వాత రేటింగ్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కాలు:

  • మీరు చిప్‌లకు కింద పేర్కొన్నటువంటి ఫార్మాట్ మార్పులను చేయవచ్చు:
    • రంగు
    • సైజ్
    • ఫాంట్ స్టయిల్
  • ఫార్మాటింగ్‌ను తీసివేయడానికి, ఎగువున, ఫార్మాట్ ఆ తర్వాత ఫార్మాటింగ్‌ను క్లియర్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

డ్రాప్‌డౌన్ చిప్‌లను జోడించండి

మీరు పలు ఆప్షన్‌లను ప్రదర్శించే డ్రాప్‌డౌన్ చిప్‌లను జోడించవచ్చు, అలాగే అనుకూలంగా మార్చవచ్చు.

డ్రాప్‌డౌన్‌ను జోడించండి లేదా ఎడిట్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Google Sheetsలో స్ప్రెడ్‌షీట్‌ను తెరవండి.
  2. ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:
    • “@”ను ఎంటర్ చేసి, మెనూలో, కాంపోనెంట్స్ విభాగంలో, డ్రాప్‌డౌన్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • ఎగువున, ఇన్‌సర్ట్ చేయండి ఆ తర్వాత డ్రాప్‌డౌన్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • డేటా ఆ తర్వాత డేటా ప్రామాణీకరణ ఆ తర్వాత నియమాన్ని జోడించండి ని క్లిక్ చేయండి.
    • సెల్‌పై కుడి క్లిక్ చేయండి ఆ తర్వాత డ్రాప్‌డౌన్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. డ్రాప్‌డౌన్‌కు మార్పులు చేయడానికి, డ్రాప్‌డౌన్‌ను క్లిక్ చేసి, ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. డ్రాప్‌డౌన్ ఆప్షన్‌లను ఎడిట్ చేయడానికి, డ్రాప్‌డౌన్ఆ తర్వాత బటన్‌ను ఎడిట్ చేయండి ని క్లిక్ చేయండి.

సెల్‌లోని డ్రాప్‌డౌన్ లిస్ట్‌ను ఎలా క్రియేట్ చేయాలో మరింత తెలుసుకోండి.

true
Visit the Learning Center

Using Google products, like Google Docs, at work or school? Try powerful tips, tutorials, and templates. Learn to work on Office files without installing Office, create dynamic project plans and team calendars, auto-organize your inbox, and more.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
10401801228156230275
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false