మీ ఫారమ్‌లో టెక్స్ట్‌ను ఫార్మాట్ చేయండి

మీరు మీ ఫారమ్‌లోని టెక్స్ట్‌కు లింక్‌లు, నంబర్‌లు గల లిస్ట్‌లు, బుల్లెట్‌లతో కూడిన లిస్ట్‌లను జోడించవచ్చు. మీరు మీ టెక్స్ట్‌ను బోల్డ్ చేయవచ్చు, ఇటాలిక్ చేయవచ్చు, అలాగే అండర్‌లైన్ చేయవచ్చు.

ముఖ్య గమనిక: మీరు టైటిల్స్, ప్రశ్నలు, అలాగే వివరణలలో మాత్రమే టెక్స్ట్‌ను ఫార్మాట్ చేయగలరు. మీరు సమాధాన ఆప్షన్‌లను ఫార్మాట్ చేయలేరు.

టెక్స్ట్‌ను బోల్డ్, ఇటాలిక్, అండర్‌లైన్ చేయండి
  1. మీ కంప్యూటర్‌లో, Google Formsలో ఒక ఫారమ్‌ను తెరవండి.
  2. మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న ఐటెమ్‌ను క్లిక్ చేయండి.
  3. మీరు మార్చాలనుకుంటున్న టెక్స్ట్‌ను ఎంచుకోండి.
  4. టెక్స్ట్‌ను ఫార్మాట్ చేయండి.
    • బోల్డ్ చేయడానికి: బోల్డ్ బోల్డ్ను క్లిక్ చేయండి.
    • ఇటాలిక్ చేయడానికి: ఇటాలిక్ ఇటాలిక్ను క్లిక్ చేయండి.
    • అండర్‌లైన్ చేయడానికి: అండర్‌లైన్ కింది గీతను క్లిక్ చేయండి.
నంబర్‌లు గల లిస్ట్ లేదా బుల్లెట్‌లతో కూడిన లిస్ట్‌ను జోడించండి
  1. మీ కంప్యూటర్‌లో, Google Formsలో ఒక ఫారమ్‌ను తెరవండి.
  2. మీరు లిస్ట్‌ను జోడించాలనుకుంటున్న వివరణపై క్లిక్ చేయండి.
  3. లిస్ట్‌ను ఎంచుకోండి:
    • నంబర్‌లు గల లిస్ట్‌ను జోడించడానికి: నంబర్‌లు గల లిస్ట్ అంకెలు ఉన్న జాబితాను క్లిక్ చేయండి.
    • బుల్లెట్‌లతో కూడిన లిస్ట్‌ను జోడించడానికి: బుల్లెట్‌లతో కూడిన లిస్ట్ బుల్లెట్ ఉన్న జాబితాను క్లిక్ చేయండి.
  4. మీరు ఆప్షన్‌ను కనుగొనలేకపోతే, మరిన్ని మరిన్ని ఆ తర్వాత వివరణ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
లింక్‌లను జోడించండి, ఎడిట్ చేయండి, లేదా తీసివేయండి

ఒక లింక్‌ను జోడించండి

  1. మీ కంప్యూటర్‌లో, Google Formsలో ఒక ఫారమ్‌ను తెరవండి.
  2. మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న ఐటెమ్‌ను క్లిక్ చేయండి.
  3. మీకు లింక్ ఎక్కడ కావాలో క్లిక్ చేయండి లేదా మీరు లింక్ చేయాలనుకుంటున్న టెక్స్ట్‌ను ఎంచుకోండి.
  4. లింక్‌ను ఇన్‌సర్ట్ చేయండి Insert linkని క్లిక్ చేయండి.
  5. "దీనికి లింక్" కింద, URL లేదా ఈమెయిల్ అడ్రస్‌ను ఎంటర్ చేయండి లేదా వెబ్‌సైట్ కోసం సెర్చ్ చేయండి.
  6. సరే అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

లింక్‌లను మార్చండి లేదా తీసివేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Google Formsలో ఒక ఫారమ్‌ను తెరవండి.
  2. మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న లింక్‌ను క్లిక్ చేయండి.
    • మార్చడానికి: లింక్‌ను ఎడిట్ చేయండి సవరించుని క్లిక్ చేయండి.
    • తీసివేయడానికి: లింక్‌ను తీసివేయండి ని క్లిక్ చేయండి.
టెక్స్ట్‌పై ఉన్న ఫార్మాటింగ్‌ను తీసివేయండి
  1. మీ కంప్యూటర్‌లో, Google Formsలో ఒక ఫారమ్‌ను తెరవండి.
  2. మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న ఐటెమ్‌ను క్లిక్ చేయండి.
  3. మీరు మార్చాలనుకుంటున్న టెక్స్ట్‌ను ఎంచుకోండి.
  4. ఫార్మాటింగ్‌ను తీసివేయండి ని క్లిక్ చేయండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
14730461341799957108
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false