షీట్‌లను రక్షించండి, దాచండి మరియు ఎడిట్ చేయండి

షీట్ లేదా పరిధిని సంరక్షించండి

స్ప్రెడ్‌షీట్‌లోని కంటెంట్‌ను ఇతరులు మార్చడం మీకు ఇష్టం లేకుంటే, మీరు దీనికి రక్షణను యాడ్ చేయవచ్చు. భద్రతాపరమైన ప్రమాణంగా దీనిని ఉపయోగించకూడదు. రక్షణ యాడ్ చేసిన స్ప్రెడ్‌షీట్‌ను ఇతరులు ప్రింట్ తీయగలరు, కాపీ చేయగలరు, అతికించగలరు, కాపీలు దిగుమతి చేయగలరు, ఎగుమతి చేయగలరు. మీరు విశ్వసించే వ్యక్తులతో మాత్రమే స్ప్రెడ్‌షీట్‌లను షేర్ చేయండి.

చిట్కా: "రక్షిత షీట్‌లు, పరిధులు" అనే ఆప్షన్ కనిపించకపోతే, మీరు Microsoft Office ఎడిటింగ్‌లో ఉండి ఉంటారు. రక్షిత షీట్‌లు, పరిధులను ఉపయోగించడానికి, మీ ఫైల్‌ను Google Sheetsకు మార్చండి. Microsoft Office ఎడిటింగ్, Microsoft Office ఫైళ్లను ఎలా మార్చాలి అనే విషయాల గురించి తెలుసుకోండి.

పరిధి లేదా షీట్‌ను రక్షించండి

ముఖ్య గమనిక: మీరు షీట్‌ను రక్షించినప్పుడు, మీరు వీటిని చేయలేరు:

  • సెల్‌ల ఫార్మాటింగ్‌ను ఒకే సమయంలో లాక్ చేయడం, ఇన్‌పుట్ విలువలను ఎడిట్ చేయడం కోసం యూజర్‌లను అనుమతించడం
  • పాస్‌వర్డ్‌తో డేటాను రక్షించడం
  1. Google Sheetsలో స్ప్రెడ్‌షీట్‌ను తెరవండి.
  2. డేటా ఆ తర్వాత షీట్‌లు, పరిధులను రక్షించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి. కుడి వైపున ఒక బాక్స్ తెరుచుకుంటుంది.
  3. 'షీట్ లేదా పరిధిని యాడ్ చేయి' క్లిక్ చేయండి లేదా ఇప్పటికే ఉన్న రక్షణపై క్లిక్ చేసి, దానిని ఎడిట్ చేయండి.
  4. పరిధికి రక్షణను యాడ్ చేయడానికి, 'పరిధి' క్లిక్ చేయండి. షీట్‌కు రక్షణను యాడ్ చేయడానికి, 'షీట్' క్లిక్ చేయండి.
    • పరిధి: మీరు రక్షణ కల్పిస్తున్న పరిధిని మార్చడానికి లేదా అందులోకి ప్రవేశించడానికి, స్ప్రెడ్‌షీట్ చిహ్నాన్ని క్లిక్ చేసి, స్ప్రెడ్‌షీట్‌లోని పరిధిని హైలైట్ చేయండి.
    • షీట్: రక్షణను యాడ్ చేయాల్సిన షీట్‌ను ఎంచుకోండి. మీరు షీట్‌లోని కొన్ని సెల్‌ల సెట్‌కు రక్షణ వద్దనుకుంటే, "నిర్దిష్ట సెల్‌లు తప్పితే" పక్కన ఉన్న బాక్స్‌ను ఎంచుకోండి.
  5. 'అనుమతులను సెట్ చేయి' లేదా 'అనుమతులను మార్చు' క్లిక్ చేయండి.
  6. మీరు ఎడిటింగ్‌ను ఎలా పరిమితం చేయాలనుకుంటున్నది ఎంచుకోండి:
    • ఎవరైనా ఎడిట్ చేసినప్పుడు హెచ్చరికను చూపించడానికి: "ఈ పరిధిని ఎడిట్ చేసినప్పుడు హెచ్చరికను చూపించు" ఎంచుకోండి. ఇది ఇతరులు ఎడిట్ చేయనివ్వకుండా బ్లాక్ చేయదు, కానీ వారు ఖచ్చితంగా ఎడిట్ చేయాలనుకుంటే నిర్ధారించాల్సిందిగా అడిగే సందేశం వారికి కనిపిస్తుంది.
    • పరిధి లేదా షీట్‌ను ఎవరెవరు ఎడిట్ చేయవచ్చో ఎంచుకోవడానికి: "ఈ పరిధిని ఎవరెవరు ఎడిట్ చేయవచ్చో నియంత్రించు" ఎంపికను ఎంచుకోండి. దీన్ని ఎంచుకోండి:
      • మీరు మాత్రమే: కేవలం మీరు (ఒకవేళ మీరు యజమాని కాకుంటే, యజమాని) మాత్రమే పరిధి లేదా షీట్‌ను ఎడిట్ చేయగలరు.
      • డొమైన్ మాత్రమే: మీరు కార్యాలయం లేదా పాఠశాల కోసం Google షీట్‌లను ఉపయోగిస్తున్నట్లయితే, మీ డొమైన్‌లోని వ్యక్తులు మాత్రమే పరిధి లేదా షీట్‌ను ఎడిట్ చేయగలరు. మీ డొమైన్‌లోని ప్రతి ఒక్కరూ స్ప్రెడ్‌షీట్‌ను ఎడిట్ చేయగలిగినప్పుడు మాత్రమే ఈ ఎంపిక అందుబాటులో ఉంటుంది.
      • అనుకూలం: కేవలం మీరు ఎంచుకునే వ్యక్తులు మాత్రమే పరిధిని లేదా షీట్‌ను ఎడిట్ చేయగలరు.
      • మరొక పరిధిలోని అనుమతులను కాపీ చేయండి: మీరు వేరే సెల్‌ల సెట్ లేదా షీట్‌పై సెటప్ చేసే అవే సూచనలను తిరిగి వినియోగించండి.
  7. సేవ్ చేయండి లేదా పూర్తయింది ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

రక్షిత సెల్స్‌ను చూడటానికి, వీక్షణ ఆ తర్వాత చూడండి ఆ తర్వాత రక్షిత పరిధులు ఆప్షన్‌ను క్లిక్ చేయండి. సెల్స్‌పై చారల ఆకారంలో ఉన్న బ్యాక్‌గ్రౌండ్ కనిపిస్తుంది.

పరిధి లేదా షీట్‌కు ఎవరు రక్షణను యాడ్ చేయవచ్చు
  • మీరు స్ప్రెడ్‌షీట్‌ను కలిగి ఉంటే: పరిధులు, షీట్‌లను ఎవరెవరు మార్చవచ్చనేది మీరు నిర్ణయించగలరు.
  • మీరు ఒక స్ప్రెడ్‌షీట్‌ను ఎడిట్ చేయగలిగేట్లయితే: పరిధులు, షీట్‌లను ఎవరెవరు ఎడిట్ చేయవచ్చనేది మీరు నిర్ణయించవచ్చు, కానీ యజమానుల నుండి అనుమతులు తీయలేరు.
  • మీరు స్ప్రెడ్‌షీట్‌ను చూడగలిగేట్లయితే లేదా కామెంట్ చేయగలిగేట్లయితే: మీరు ఎలాంటి మార్పులను చేయలేరు.
రక్షణ గల షీట్ కాపీని ఎడిట్ చేయండి
  • మీరు ఎడిట్ చేయగలిగేట్లయితే: మీరు రక్షణ గల షీట్ కాపీని రూపొందించగలరు, వర్క్‌బుక్‌ను కాపీ చేయగలరు, లేదంటే కొత్త వెర్షన్‌ను అప్‌లోడ్ చేయగలరు.
  • మీరు చూడటానికి అనుమతిని కలిగి ఉండి, ఎడిట్ చేయగల అధికారం లేకుంటే: మీరు స్ప్రెడ్‌షీట్‌కు చెందిన కాపీని రూపొందించగలరు.

రక్షణను తీసివేయండి

  1. Google షీట్‌లో, డేటా ఆ తర్వాత షీట్‌లు, పరిధులను రక్షించండిని క్లిక్ చేయండి.
  2. కనిపించే కుడి వైపున ఉన్న ప్యానెల్‌లో, రక్షణను కలిగి ఉన్న అన్ని పరిధులను చూడటానికి, రద్దు చేయిని క్లిక్ చేయండి.
  3. మీరు తొలగించాలనుకున్న రక్షణను కనుగొనండి ఆ తర్వాత తొలగించును క్లిక్ చేయండి.

షీట్‌లను వీక్షించే వీలు లేకుండా దాచండి

గణనల కోసం ఇతర షీట్‌లు ఉపయోగించుకునే పాతవి లేదా ప్లేస్‌హోల్డర్‌లు అయిన షీట్‌లను మీరు దాచవచ్చు.

షీట్‌ను దాచడమూ షీట్‌ను సంరక్షించడమూ ఒకటే కాదు.

  • స్ప్రెడ్‌షీట్ ఎడిటర్‌లు అందరూ ఈ షీట్‌లను చూపగలరు మరియు వీక్షించగలరు.
  • స్ప్రెడ్‌షీట్ వీక్షకులు దాచబడిన షీట్‌లను చూడలేరు. ఎవరైనా స్ప్రెడ్‌షీట్ కాపీని రూపొందించినప్పుడు, షీట్‌లు దాచబడి ఉంటాయి, కానీ వారు షీట్‌లను చూపగలుగుతారు.
షీట్‌ను దాచండి లేదా చూపండి

షీట్‌ను దాచడానికి:

  1. 'Google షీట్‌ల'లో స్ప్రెడ్‌షీట్‌ను తెరవండి.
  2. మీరు దాచాలనుకుంటున్న షీట్‌ను క్లిక్ చేయండి.
  3. షీట్ ట్యాబ్‌లో, కిందికి బాణం గుర్తును కిందికి బాణం క్లిక్ చేయండి.
  4. 'షీట్‌ను దాచు' క్లిక్ చేయండి. మీ స్ప్రెడ్‌షీట్‌లో రెండు లేదా అంతకంటే ఎక్కువ షీట్‌లు లేకుంటే ఈ ఎంపిక చూపబడదు.

షీట్‌ను చూపడానికి:

  1. వీక్షణ ఆ తర్వాత [name]ను చూడండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి. మీ స్ప్రెడ్‌షీట్‌లో దాచిన షీట్‌లు ఏవీ లేకుంటే, ఈ ఆప్షన్ లేత బూడిదరంగులో కనిపిస్తుంది.
  2. మీరు ఇకపై దాచకూడదనుకునే షీట్‌ను క్లిక్ చేయండి.
  3. స్ప్రెడ్‌షీట్ తిరిగి చూపబడుతుంది.
స్ప్రెడ్‌షీట్‌లను, దాచిన షీట్‌లతో పాటు దిగుమతి, ఎగుమతి చేయండి

మీరు వీటిని చేస్తే తప్పితే, దాచిన షీట్‌లు అలాగే దాచబడి ఉంటాయి:

  • స్ప్రెడ్‌షీట్‌ను .pdf, .xls లేదా .ods ఫైల్ రూపంలో ఎగుమతి చేసినట్లయితే.
  • స్ప్రెడ్‌షీట్‌ను .xls, .xlsx లేదా .ods ఫార్మాట్‌లో దిగుమతి చేసినట్లయితే.
  • స్ప్రెడ్‌షీట్‌ను "/htmlview" పారామీటర్‌తో htmlకు ఎగుమతి చేయడం: మీరు URLలో పేజీ పారామీటర్ (#gid=N)ను యాడ్ చేస్తే, దాచిన షీట్ చూపబడుతుంది.
  • స్ప్రెడ్‌షీట్‌ను పబ్లిష్ చేయండి.

షీట్‌లను ఎడిట్ చేయండి

చిట్కా: షీట్‌లో పలు ట్యాబ్‌లలో మీరు అనేక చర్యలను అమలు చేయవచ్చు, అవి:

  • కాపీ చేయడం
  • తొలగించడం
  • డూప్లికేట్‌ను రూపొందించడం
  • దాచడం
  • ట్యాబ్‌లను తరలించడం

అనేక చర్యల కోసం, మీ కీబోర్డ్‌లో Shift నొక్కండి, ట్యాబ్‌లను ఎంచుకోండి and then మీరు అమలు చేయాలనుకుంటున్న చర్యను క్లిక్ చేయండి.

షీట్‌ను కాపీ చేయండి

మీరు షీట్‌ను స్ప్రెడ్‌షీట్‌లో కాపీ చేయవచ్చు. కాపీలను అదే స్ప్రెడ్‌షీట్‌లో లేదా వేరొక స్ప్రెడ్‌షీట్‌లో రూపొందించవచ్చు.

షీట్‌ను మరొక స్ప్రెడ్‌షీట్‌లోకి కాపీ చేయడానికి:

  1. షీట్ ట్యాబ్‌లో, కిందికి బాణం గుర్తును కిందికి బాణం క్లిక్ చేయండి.
  2. 'దీనిలోకి కాపీ చేయి' క్లిక్ చేయండి.
  3. జాబితా నుండి గమ్యస్థానం స్ప్రెడ్‌షీట్‌ను ఎంచుకోండి.
  4. ఎంచుకోండి' ఎంపికను క్లిక్ చేయండి.

స్ప్రెడ్‌షీట్‌లో షీట్‌ను కాపీ చేయడానికి:

  1. షీట్ ట్యాబ్‌లో, కిందికి బాణం గుర్తును కిందికి బాణం క్లిక్ చేయండి.
  2. 'డూప్లికేట్' క్లిక్ చేయండి.
  3. అసలు షీట్ పక్కన ఉన్న కొత్త ట్యాబ్‌లో డూప్లికేట్ షీట్ కనిపిస్తుంది.
షీట్‌ల క్రమం మార్చండి

స్ప్రెడ్‌షీట్‌లో షీట్‌ల యొక్క క్రమాన్ని మార్చడానికి, మీరు కోరుకునే క్రమంలోకి వచ్చే వరకు షీట్ ట్యాబ్‌ను క్లిక్ చేసి, లాగండి.

షీట్‌కు పేరు మార్చండి

స్ప్రెడ్‌షీట్‌లో షీట్ పేరును మార్చడానికి, షీట్ ట్యాబ్‌లోని వచనంపై రెండు సార్లు క్లిక్ చేసి, కొత్త పేరును టైప్ చేయండి.

షీట్ ట్యాబ్‌కు రంగును యాడ్ చేయండి

మీ షీట్ ట్యాబ్‌లను సులభంగా వేరు చేసి సూచించడానికి, వాటికి రంగును యాడ్ చేయండి.

  1. షీట్ ట్యాబ్‌లో, కిందికి బాణం గుర్తును కిందికి బాణం క్లిక్ చేయండి.
  2. 'రంగును మార్చు' ఎంపికను క్లిక్ చేయండి.
  3. ఒక రంగును ఎంపిక చేసుకోండి.
షీట్‌ను తొలగించండి
  1. మీరు తీసివేయాలనుకుంటున్న షీట్‌ను క్లిక్ చేయండి.
  2. షీట్ ట్యాబ్‌లో, కిందికి బాణం గుర్తును కిందికి బాణం క్లిక్ చేయండి.
  3. తొలగించు క్లిక్ చేయండి.
  4. సరే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
true
Visit the Learning Center

Using Google products, like Google Docs, at work or school? Try powerful tips, tutorials, and templates. Learn to work on Office files without installing Office, create dynamic project plans and team calendars, auto-organize your inbox, and more.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
10008976826965765757
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false