షీట్‌లను రక్షించండి, దాచండి మరియు ఎడిట్ చేయండి

షీట్ లేదా పరిధిని సంరక్షించండి

షీట్ లేదా పరిధిని సంరక్షించడానికి, కంప్యూటర్‌లో Google షీట్‌లను ఉపయోగించండి.

షీట్‌లను వీక్షించే వీలు లేకుండా దాచండి

గణనల కోసం ఇతర షీట్‌లు ఉపయోగించుకునే పాతవి లేదా ప్లేస్‌హోల్డర్‌లు అయిన షీట్‌లను మీరు దాచవచ్చు.

షీట్‌ను దాచడమూ షీట్‌ను సంరక్షించడమూ ఒకటే కాదు. స్ప్రెడ్‌షీట్ ఎడిటర్‌లు అందరూ ఈ షీట్‌లను చూపగలరు మరియు వీక్షించగలరు. స్ప్రెడ్‌షీట్ వీక్షకులు దాచబడిన షీట్‌లను చూడలేరు.

షీట్‌ను దాచండి లేదా చూపండి

షీట్‌ను దాచడానికి:

  1. స్ప్రెడ్‌షీట్‌ను Google షీట్‌ల యాప్‌లో తెరవండి.
  2. మీరు దాచాలనుకుంటున్న షీట్‌ను నొక్కండి.
  3. షీట్ ట్యాబ్‌లో, కిందికి బాణం గుర్తును కిందికి బాణం నొక్కండి.
  4. 'దాచు' నొక్కండి. మీ స్ప్రెడ్‌షీట్‌లో రెండు లేదా అంతకంటే ఎక్కువ షీట్‌లు లేకుంటే ఈ ఎంపిక చూపబడదు.
  5. మీ షీట్ వీక్షణ నుండి దాచబడుతుంది.

షీట్‌ను చూపడానికి:

  1. దిగువున ఎడమ వైపు, 'మెనూ' నొక్కండి.
  2. మీరు ఇకపై దాచకూడదనుకునే షీట్ పేరుపై నొక్కండి.
  3. మీ స్ప్రెడ్‌షీట్ దిగువున మీ షీట్ కనిపిస్తుంది.

మీరు, మీ స్ప్రెడ్‌షీట్‌ల వీక్షకులు లేదా స్ప్రెడ్‌షీట్ ఎడిటర్‌లు ఒక షీట్ యొక్క కాపీని రూపొందిస్తే, దాచన షీట్‌లు భద్రపరచబడతాయి, కానీ వారు షీట్‌లను చూపగలిగేలా ఎంచుకోగలుగుతారు.

స్ప్రెడ్‌షీట్‌లను, దాచిన షీట్‌లతో పాటు దిగుమతి, ఎగుమతి చేయండి

మీరు వీటిని చేస్తే తప్పితే, దాచిన షీట్‌లు అలాగే దాచబడి ఉంటాయి:

  • స్ప్రెడ్‌షీట్‌ను .pdf, .xls లేదా .ods ఫైల్ రూపంలో ఎగుమతి చేసినట్లయితే.
  • స్ప్రెడ్‌షీట్‌ను .xls, .xlsx లేదా .ods ఫార్మాట్‌లో దిగుమతి చేసినట్లయితే.

షీట్‌లను ఎడిట్ చేయండి

షీట్‌ను కాపీ చేయండి

స్ప్రెడ్‌షీట్‌లో షీట్‌ను కాపీ చేయడానికి:

  1. స్ప్రెడ్‌షీట్‌ను Google షీట్‌ల యాప్‌లో తెరవండి.
  2. షీట్ ట్యాబ్‌లో, కిందికి బాణం గుర్తును కిందికి బాణం నొక్కండి.
  3. డూప్లికేట్ ఎంపికను నొక్కండి.
షీట్‌ల క్రమం మార్చండి

స్ప్రెడ్‌షీట్‌లో షీట్‌ల క్రమం మార్చడానికి:

  1. స్ప్రెడ్‌షీట్‌ను Google షీట్‌ల యాప్‌లో తెరవండి.
  2. షీట్ ట్యాబ్‌లో, కిందికి బాణం గుర్తును కిందికి బాణం నొక్కండి.
  3. 'ఎడమకు జరుపు' లేదా 'కుడికి జరుపు' ఎంపికలను నొక్కండి.
షీట్‌కు పేరు మార్చండి

స్ప్రెడ్‌షీట్‌లోని షీట్‌కు పేరు మార్చడానికి:

  1. స్ప్రెడ్‌షీట్‌ను Google షీట్‌ల యాప్‌లో తెరవండి.
  2. షీట్ ట్యాబ్‌లో, కిందికి బాణం గుర్తును కిందికి బాణం నొక్కండి.
  3. పేరు మార్చు ఎంపికను నొక్కండి.
  4. కొత్త పేరును నమోదు చేయండి, ఆపై సరే నొక్కండి.
షీట్ ట్యాబ్‌కు రంగును యాడ్ చేయండి

మీ షీట్ ట్యాబ్‌లను సులభంగా వేరు చేసి సూచించడానికి, వాటికి రంగును యాడ్ చేయండి.

  1. స్ప్రెడ్‌షీట్‌ను Google షీట్‌ల యాప్‌లో తెరవండి.
  2. షీట్ ట్యాబ్‌లో, కిందికి బాణం గుర్తును కిందికి బాణం నొక్కండి.
  3. 'ట్యాబ్ రంగు' నొక్కండి.
  4. రంగుపై నొక్కి, ఆపై షీట్‌పై నొక్కడం ద్వారా ఎడిటింగ్‌ను కొనసాగించండి.
షీట్‌ను తొలగించండి
  1. స్ప్రెడ్‌షీట్‌ను Google షీట్‌ల యాప్‌లో తెరవండి.
  2. షీట్ ట్యాబ్‌లో, కిందికి బాణం గుర్తును కిందికి బాణం నొక్కండి.
  3. తొలగించు నొక్కండి. షీట్ తొలగించబడుతుంది.
true
Visit the Learning Center

Using Google products, like Google Docs, at work or school? Try powerful tips, tutorials, and templates. Learn to work on Office files without installing Office, create dynamic project plans and team calendars, auto-organize your inbox, and more.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
18334441584314799586
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false