Google Sheetsలో ఎర్రర్ మెసేజ్‌ను పరిష్కరించండి: “మీ మార్పులను సేవ్ చేయడం సాధ్యపడదు. దయచేసి మీ ఇటీవలి ఎడిట్‌లను కాపీ చేసి, ఆపై మీ మార్పులను పూర్వస్థితికి మార్చండి."

మీరు Google Sheetsలో “మీ మార్పులను సేవ్ చేయడం సాధ్యపడదు. దయచేసి మీ ఇటీవలి ఎడిట్‌లను కాపీ చేసి, ఆపై మీ మార్పులను పూర్వస్థితికి మార్చండి” అనే ఈ మెసేజ్‌ను చూస్తే, ఆ మెసేజ్‌కు కారణం మీ మార్పులను సేవ్ చేయడానికి సర్వర్‌కు చాలా సమయం పట్టిందని అర్థం. మీ ప్రోగ్రెస్‌ను కొనసాగించడానికి ఇక్కడ కొన్ని సూచనలను అందించాము.

ఇంటర్నెట్ కనెక్షన్ సమస్యలు

మీ మార్పులను కాపీ చేసి, రీలోడ్ చేయండి

మీ ఇంటర్నెట్ కనెక్షన్‌లో లోపం ఈ ఎర్రర్ మెసేజ్‌ను ట్రిగ్గర్ చేయవచ్చు. మీ కనెక్షన్‌ను రీస్టోర్ చేయడానికి, ఈ దశలను ట్రై చేయండి:

  1. మీ సేవ్ చేయని అన్ని మార్పులను కాపీ చేయండి.
  2. షీట్‌ను రీలోడ్ చేయండి.
  3. మీ మునుపటి మార్పులను పేస్ట్ చేయండి.
  4. ఎర్రర్ మళ్లీ కనిపిస్తే, మీ ఇంటర్నెట్ నుండి డిస్‌కనెక్ట్ చేసి, ఆపై మళ్లీ కనెక్ట్ చేయండి.

మీ Chrome లేదా Microsoft Edge బ్రౌజర్‌లో ఆఫ్‌లైన్ మోడ్‌ను ఆన్ చేయండి 

మీ పనిని కొనసాగించడానికి, మీరు ఆఫ్‌లైన్ మోడ్‌కు మారవచ్చు. ఆఫ్‌లైన్ మోడ్ మీ పనిని మీ పరికరంలో లోకల్‌గా సేవ్ చేస్తుంది. మీ పరికరం స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్‌ను రీస్టోర్ చేసినప్పుడు మీ అన్ని లోకల్ మార్పులు క్లౌడ్‌కు అప్‌లోడ్ చేయబడతాయి. ఆఫ్‌లైన్ మోడ్‌ను ఎలా ఆన్ చేయాలనే దాని గురించి మరింత తెలుసుకోండి

పెద్ద మొత్తంలో డేటా లేదా ఇమేజ్‌లను ఇన్‌పుట్ చేయండి

పెద్ద మొత్తంలో డేటాను దిగుమతి చేయడానికి దిగుమతి ఫంక్షన్‌లను ఉపయోగించండి

మీరు పెద్ద మొత్తంలో డేటాను ఇన్‌పుట్ చేసినప్పుడు, కాపీ చేసి, పేస్ట్ చేయడానికి బదులుగా, మరింత ప్రభావవంతమైన, విశ్వసనీయమైన దిగుమతి ఫంక్షన్‌లను ఉపయోగించండి. వివిధ దిగుమతి అవసరాలకు సపోర్ట్ చేసే విస్తృత పరిధి దిగుమతి ఫంక్షన్‌లను Google Sheets అందిస్తుంది.

  • IMPORTRANGE - పేర్కొన్న స్ప్రెడ్‌షీట్ నుండి పరిధిలోని సేల్స్‌ను దిగుమతి చేస్తుంది.
  • IMPORTDATA - .csv లేదా .tsv ఫార్మాట్‌లో ఇచ్చిన url వద్ద డేటాను దిగుమతి చేస్తుంది.
  • IMPORTHTML - HTML పేజీలో ఉన్న టేబుల్ లేదా లిస్ట్ నుండి డేటాను దిగుమతి చేస్తుంది.
  • IMPORTFEED - RSS లేదా ATOM ఫీడ్‌ను దిగుమతి చేస్తుంది.

ముఖ్య గమనిక: Excel ఫైళ్లను దిగుమతి చేయడానికి ఈ దిగుమతి ఫంక్షన్‌లు ఉపయోగించబడవు. Google Sheetsలో Excel ఫైళ్లతో ఎలా పని చేయాలి అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

నేరుగా కాపీ, చేసి పేస్ట్ చేయడానికి బదులుగా మీ Excel ఫైల్‌ను Google Driveకు దిగుమతి చేయండి

మీరు Excel ఫైల్ నుండి నేరుగా Google స్ప్రెడ్‌షీట్‌కు కాపీ చేసి, పేస్ట్ చేస్తే, మీరు ఎర్రర్‌ను కూడా చూడవచ్చు. మీ Excel ఫైల్‌ను ఈ కింది విధంగా దిగుమతి చేసుకోవాలని మేము మీకు సూచిస్తున్నాము:

  1. Sheetsలో, కొత్త స్ప్రెడ్‌షీట్‌ను క్రియేట్ చేయండి, లేదా ఇప్పటికే ఉన్న స్ప్రెడ్‌షీట్‌ను తెరవండి.
  2. ఫైల్ ఆ తర్వాత దిగుమతి చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. Excel ఫైల్‌ను ఎంచుకోండి.
  4. ఎంచుకోండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. దిగుమతి చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి:
    • కొత్త స్ప్రెడ్‌షీట్‌ను క్రియేట్ చేయండి
    • కొత్త షీట్(ల)ను ఇన్‌సర్ట్ చేయండి
    • స్ప్రెడ్‌షీట్‌ను రీప్లేస్ చేయండి
  6. డేటాను దిగుమతి చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  7. ప్రాంప్ట్ చేయబడితే, ఇప్పుడే తెరవండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

Google Sheetsలో Excel ఫైళ్లతో ఎలా పని చేయాలి అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

ఇమేజ్‌లను నేరుగా కాపీ చేసి, పేస్ట్ చేయడానికి బదులుగా, ఇమేజ్‌లను దిగుమతి చేయడానికి ఇమేజ్‌ను ఇన్‌సర్ట్ చేయండి అనే ఆప్షన్‌ను ఉపయోగించండి

ఇమేజ్‌లను దిగుమతి చేయడానికి, ఇమేజ్‌లను కాపీ చేసి, పేస్ట్ చేయడానికి మరింత ప్రభావవంతమైన మార్గంగా "ఇమేజ్‌ను ఇన్‌సర్ట్ చేయి"ని ఉపయోగించండి.

మీరు Sheetsలో ఇమేజ్‌లను పేస్ట్ చేయడానికి ట్రై చేసి, అది ఎర్రర్ మెసేజ్‌ను ట్రిగ్గర్ చేసినట్లయితే, ఈ దశలను ట్రై చేయండి:

  1. మీ మార్పును పూర్వస్థితికి మార్చండి.
  2. షీట్‌ను రీలోడ్ చేయండి.
  3. మీరు ఇమేజ్‌ను జోడించాలనుకుంటున్న సెల్‌ను క్లిక్ చేయండి.
  4. ఇన్‌సర్ట్ చేయండి ఆ తర్వాత ఇమేజ్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. 
  5. మీ ఇమేజ్‌ను సెల్‌లో లేదా సెల్స్‌లో ఉంచాలా అని అంశాన్ని ఎంచుకోండి.
    • ఇమేజ్‌లు ఉన్న సెల్స్ టెక్స్ట్‌ను కూడా కలిగి ఉండకూడదు.
  6. ఇమేజ్‌ను ఎంచుకోండి లేదా స్నాప్‌షాట్ తీయండి.
  7. తెరవండి లేదా ఎంచుకోండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
Sheetsకు సంబంధించిన పరిమితులను మించకూడదు

మీ ఇన్‌పుట్ డేటా Sheets పరిమితులను మించిపోయినప్పుడు, అది ఈ ఎర్రర్ మెసేజ్‌ను ట్రిగ్గర్ చేయవచ్చు. Google Sheetsలో పరిమితుల గురించి మరింత తెలుసుకోండి

 

మీకు "ఏదో తప్పు జరిగింది. రీలోడ్ చేయండి" లేదా "ఫైల్‌ను లోడ్ చేయడం సాధ్యపడదు" వంటి వేరొక ఎర్రర్ మెసేజ్ కనిపిస్తే, Sheets ఎర్రర్‌లకు సంబంధించిన పరిష్కార ప్రక్రియ గురించి మరింత తెలుసుకోండి

ఇది సహాయకరంగా ఉందా?
మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
Visit the Learning Center

Using Google products, like Google Docs, at work or school? Try powerful tips, tutorials, and templates. Learn to work on Office files without installing Office, create dynamic project plans and team calendars, auto-organize your inbox, and more.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయి
Google యాప్‌లు
ప్రధాన మెనూ
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
35
false
false