Google Docs నుండి టాస్క్‌లను కేటాయించండి

Docsలోని Tasks అర్హత గల ఆఫీస్ లేదా స్కూల్ ఖాతాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది, మీరు ప్రస్తుతం సైన్ ఇన్ చేసి లేరు. ఆఫీస్ లేదా స్కూల్ ఖాతాల గురించి మరింత తెలుసుకోండి.

మీ వర్క్ ఖాతాకు సైన్ ఇన్ చేయండి

మీరు అర్హత గల ఆఫీస్ లేదా స్కూల్ ఖాతాతో Google Docsను ఉపయోగిస్తుంటే, మీకు లేదా మీ డొమైన్‌లోని ఇతర యూజర్‌లకు మీరు టాస్క్‌లను కేటాయించవచ్చు. మీరు యూజర్‌లకు కేటాయించిన టాస్క్‌లు వారి వ్యక్తిగత Tasks లిస్ట్‌లో కనిపిస్తాయి. షేర్ చేసిన టాస్క్‌లలో ఎలా పని చేయాలో మరింత తెలుసుకోండి.

Google Docsలో టాస్క్‌ను కేటాయించండి

  1. మీ కంప్యూటర్‌లోని, Google Docsలో, డాక్యుమెంట్‌ను తెరవండి.
  2. డాక్యుమెంట్‌లో @Task ఎంటర్ చేసి Enter ఆప్షన్‌ను నొక్కండి.
  3. పాప్‌అప్ విండోలో, టాస్క్‌ను ఎంటర్ చేయండి.
    1. మీరు చెక్‌లిస్ట్ నుండి కూడా టాస్క్‌ను క్రియేట్ చేయవచ్చు.
      1. ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:
        • ఫార్మాట్ ఆ తర్వాతబుల్లెట్‌లు & నంబరింగ్ ఆ తర్వాత చెక్‌లిస్ట్ అనే ఆప్షన్‌లను ఎంపిక చేయండి.
        • డాక్యుమెంట్‌లో, @checklist అని ఎంటర్ చేసి, Enter నొక్కండి.
      2. చెక్‌లిస్ట్‌లో టాస్క్‌ను ఎంటర్ చేయండి.
      3. చెక్‌లిస్ట్ ఐటెమ్‌కు ఎడమ పక్కన, Tasksలకు జోడించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. ఒక పాప్-అప్ విండో కనిపిస్తుంది.
  4. "కేటాయించబడిన యూజర్" ఫీల్డ్‌లో, మీరు టాస్క్‌ను కేటాయించాలనుకుంటున్న యూజర్ పేరును ఎంటర్ చేయండి.
    • మీరు మీకు లేదా మీ డొమైన్‌లోని ఇతర యూజర్‌లకు టాస్క్‌ను కేటాయించవచ్చు.
  5. ఆప్షనల్: టాస్క్‌కు తేదీని సెట్ చేయడానికి, తేదీ అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి, క్యాలెండర్ నుండి తేదీని ఎంచుకోండి.
  6. టాస్క్‌ను కేటాయించడానికి, జోడించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

ముఖ్య గమనిక:

  • మీరు వేరొకరికి టాస్క్‌ను కేటాయించినప్పుడు, వారు మీ ఈమెయిల్ అడ్రస్‌తో కూడిన ఈమెయిల్ నోటిఫికేషన్‌ను అందుకుంటారు. టాస్క్‌కు సెట్ చేసిన తేదీ ఉంటే వారు టాస్క్‌ను వారి వ్యక్తిగత Tasks లిస్ట్‌లోను, అలాగే వారి Google Calendarలోను చూడగలరు. షేర్ చేసిన టాస్క్‌ల గురించి మరింత తెలుసుకోండి.
  • అజ్ఞాత యూజర్‌లు Google డాక్‌లో టాస్క్‌లను కేటాయించలేరు లేదా ఎడిట్ చేయలేరు.

Docsలో టాస్క్‌ను చూడండి లేదా ఎడిట్ చేయండి

  1. Google Docsలో, కేటాయించబడిన టాస్క్‌లతో ఉన్న డాక్యుమెంట్‌ను తెరవండి.
    • డాక్యుమెంట్ నుండి కేటాయించిన అన్ని టాస్క్‌లను చూడటానికి, టూల్స్ ఆ తర్వాత Tasks అనే ఆప్షన్‌కు వెళ్లండి. టాస్క్‌లు మీ స్క్రీన్ కుడి వైపున ప్రదర్శించబడతాయి. మీ డాక్యుమెంట్‌లోని టాస్క్‌కు స్క్రోల్ చేయడానికి, దాన్ని క్లిక్ చేయండి.
  2. కేటాయించిన చెక్‌లిస్ట్ ఐటెమ్‌కు ఎడమ వైపున, చిహ్నంపై మౌస్ కర్సర్ ఉంచండి.
    • టాస్క్ పూర్తయితే, దాని టైటిల్ తొలగించబడుతుంది.
  3. టాస్క్‌ను ఎడిట్ చేయడానికి:
    • టైటిల్: చెక్‌లిస్ట్ ఐటెమ్ టెక్స్ట్‌ను టైప్ చేసి, అప్‌డేట్ చేయడానికి Tab అనే ఆప్షన్‌ను నొక్కండి. 
    • కేటాయించబడిన యూజర్ లేదా టాస్క్ తేదీ: టాస్క్ కార్డ్ కింద ఎడమ వైపున, ఎడిట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
      • టాస్క్ కేటాయించబడిన యూజర్‌ను మీరు ఎడిట్ చేసినట్లయితే, మునుపటి కేటాయించబడిన యూజర్, అలాగే కొత్తగా కేటాయించబడిన యూజర్ ఇద్దరూ ఈమెయిల్ నోటిఫికేషన్‌ను అందుకుంటారు. 

Docsలో టాస్క్ పూర్తయినట్లు గుర్తు పెట్టండి

  1. Google Docsలో కేటాయించబడిన టాస్క్‌లతో ఉన్న డాక్యుమెంట్‌ను తెరవండి.
  2. కేటాయించిన చెక్‌లిస్ట్ ఐటెమ్‌ను కనుగొనండి.
  3. డాక్యుమెంట్‌లోని చెక్‌బాక్స్‌పై క్లిక్ చేయండి.
    • డాక్యుమెంట్‌లో టాస్క్ పూర్తయినట్లు మార్క్ చేయబడితే, అది కేటాయించబడిన యూజర్ వ్యక్తిగత Tasks లిస్ట్‌లో పూర్తయినట్లు చూపబడుతుంది, అలాగే వారికి ఈమెయిల్ నోటిఫికేషన్ వస్తుంది.

Docsలో టాస్క్‌ను తొలగించండి

  1. Google Docsలో కేటాయించబడిన టాస్క్‌లతో ఉన్న డాక్యుమెంట్‌ను తెరవండి.
  2. కేటాయించిన చెక్‌లిస్ట్ ఐటెమ్‌కు ఎడమ వైపున, చిహ్నంపై పాయింట్ చేయండి.
  3. తొలగించండి తీసివేయండి ఆ తర్వాత నిర్ధారించండి అనే ఆప్షన్‌లను క్లిక్ చేయండి.

చిట్కాలు

  • డాక్యుమెంట్‌లో టాస్క్ తొలగించబడితే, అది కేటాయించబడిన యూజర్ వ్యక్తిగత Tasks లిస్ట్‌లో కనిపించదు. అది ఇప్పటికే పూర్తి కాకపోతే, కేటాయించబడిన యూజర్ ఈమెయిల్ నోటిఫికేషన్‌ను అందుకుంటారు.
  • డాక్యుమెంట్‌లో చెక్‌లిస్ట్ ఐటెమ్ తొలగించబడి, టాస్క్ ముందుగా తొలగించబడనట్లయితే, అది కేటాయించబడిన యూజర్ వ్యక్తిగత Tasks లిస్ట్‌లో ఇప్పటికీ కనిపిస్తుంది. టాస్క్‌ను చూసి, తొలగించడానికి, టూల్స్ ఆ తర్వాత Tasks అనే ఆప్షన్‌లను క్లిక్ చేయండి.

Docsలో టాస్క్‌లకు అప్‌డేట్‌లను మేనేజ్ చేయండి

చెక్‌లిస్ట్ ఐటెమ్‌కు ఎడమ వైపున ఉన్న చిహ్నంపై, నీలం రంగు చుక్క కనిపించవచ్చు. ఇది ఈ కింది సందర్భాలలో జరగవచ్చు:

  • ఎవరైనా డాక్యుమెంట్‌లో చెక్‌లిస్ట్ ఐటెమ్‌ను అప్‌డేట్ చేసి, టాస్క్‌ను అప్‌డేట్ చేయనప్పుడు.
  • టాస్క్‌ను కేటాయించిన యూజర్ Tasksలో టాస్క్ టైటిల్‌ను అప్‌డేట్ చేసి, డాక్యుమెంట్‌లో చెక్‌లిస్ట్ టెక్స్ట్‌ను అప్‌డేట్ చేయనప్పుడు.
  • ఎవరైనా డాక్యుమెంట్‌ను మునుపటి వెర్షన్‌కు మార్చినప్పుడు.

సమస్యను పరిష్కరించి, నీలం రంగు చుక్కను తీసివేయడానికి:

  1. నీలం రంగు చుక్కతో ఉన్న టాస్క్‌పై పాయింట్ చేయండి.
  2. పాప్-అప్ విండోకు కింద కుడి వైపున, అప్‌డేట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కా: కేటాయించబడిన యూజర్ వారి వ్యక్తిగత Tasks లిస్ట్‌లో టాస్క్‌ను అప్‌డేట్ చేసి లేదా తొలగించి, డాక్యుమెంట్‌కు ఎడిట్ యాక్సెస్ లేకపోతే కూడా టాస్క్ చిహ్నంపై నీలం రంగు చుక్క కనిపించవచ్చు.

టాస్క్ నోటిఫికేషన్‌లను మార్చండి

మీరు డాక్యుమెంట్‌లో టాస్క్‌ల కోసం అందుకొనే నోటిఫికేషన్‌లను మార్చవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో, Google డాక్, షీట్ లేదా స్లయిడ్‌ను తెరవండి.
  2. కుడి వైపు మూలన, కామెంట్ హిస్టరీ వ్యాఖ్యలను తెరువు అనే ఆప్షన్‌ను తెరవండి.
  3. నోటిఫికేషన్ సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. మీరు నోటిఫికేషన్‌లను ఎప్పుడు అందుకోవాలనుకుంటున్నారో ఎంచుకోండి.
    • అన్ని కామెంట్‌లు, టాస్క్‌లు : ఏవైనా టాస్క్‌లు క్రియేట్ చేసినప్పుడు లేదా మార్చినప్పుడు.
    • మీ కోసం కామెంట్‌లు టాస్క్‌లు: మీరు జోడించబడిన టాస్క్‌లు లేదా కామెంట్‌లకు ఇతరులు రిప్లయి చేసినప్పుడు.
    • ఏ నోటిఫికేషన్‌లు వద్దు: ఆ ఫైల్‌కు సంబంధించిన కామెంట్‌లు లేదా టాస్క్‌ల గురించి ఎప్పుడూ ఈమెయిల్స్‌ను పొందరు.

సంబంధిత ఆర్టికల్స్

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
14532689170944338104
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false