Google Docs, Slides, Drawingsలలో మార్క్‌డౌన్‌ను ఉపయోగించండి

మీ Google Docs, Slides, Drawingsకు ఫార్మాటింగ్ ఎలిమెంట్‌లను త్వరగా జోడించడానికి మీరు మార్క్‌డౌన్‌ను ఉపయోగించవచ్చు. మార్క్‌డౌన్‌తో, మీరు కింద పేర్కొన్న వాటిని జోడించడానికి టెక్స్ట్‌ను ఫార్మాట్ చేయవచ్చు:

  • ఇటాలిక్స్ 
  • బోల్డ్
  • కొట్టివేత
  • లింక్‌లు

Google Docsలో, మీరు విభిన్న హెడ్డింగ్‌లను క్రియేట్ చేయడానికి మార్క్‌డౌన్‌ను కూడా ఉపయోగించవచ్చు.

మార్క్‌డౌన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Google Docs, Google Slides, లేదా Google Drawingsలో ఫైల్‌ను తెరవండి.
  2. టూల్స్ ఆ తర్వాత ప్రాధాన్యతలకు వెళ్లండి.
  3. “మార్క్‌డౌన్‌ను ఆటోమేటిక్‌గా గుర్తించు” పక్కన ఉన్న బాక్స్‌ను ఎంచుకోండి/ఎంపికను తీసివేయండి.

మార్క్‌డౌన్‌తో టెక్స్ట్‌ను ఇటాలిక్ చేయండి, బోల్డ్ చేయండి, అలాగే కొట్టివేయండి

  • టెక్స్ట్‌ను ఇటాలిక్‌గా ఫార్మాట్ చేయడానికి, రెండువైపులా ఒక నక్షత్రం గుర్తు లేదా అండర్‌స్కోర్ ఉంచి మధ్యలో టెక్స్ట్‌ను ఉంచండి.
  • టెక్స్ట్‌ను ఇటాలిక్‌గా ఫార్మాట్ చేయడానికి, రెండువైపులా రెండు నక్షత్రాలు లేదా అండర్‌స్కోర్‌లను ఉంచి టెక్స్ట్‌ను మధ్యలో ఉంచండి.
  • టెక్స్ట్‌ను ఇటాలిక్, బోల్డ్‌గా ఫార్మాట్ చేయడానికి, టెక్స్ట్‌ను మూడు నక్షత్రాలు లేదా అండర్‌స్కోర్‌ల మధ్యలో ఉంచండి.
  • టెక్స్ట్‌ను కొట్టివేత‌గా ఫార్మాట్ చేయడానికి, సింగిల్ టిల్డ్ గుర్తు మధ్యలో టెక్స్ట్‌ను ఉంచండి.

మార్క్‌డౌన్‌లో టెక్స్ట్

అది కనిపించే విధానం

ఈ టెక్స్ట్ _ఇటాలిక్_. 

ఈ టెక్స్ట్ *ఇటాలిక్*.

ఈ టెక్స్ట్ ఇటాలిక్.

ఈ టెక్స్ట్ __బోల్డ్__. 

ఈ టెక్స్ట్ **బోల్డ్**.

ఈ టెక్స్ట్ బోల్డ్.

ఈ టెక్స్ట్ ___ఇటాలిక్, బోల్డ్___. 

ఈ టెక్స్ట్ ***ఇటాలిక్, బోల్డ్***.

ఈ టెక్స్ట్ ఇటాలిక్, బోల్డ్.

ఈ టెక్స్ట్ ~కొట్టివేయబడింది~లో ఉంది.

ఈ టెక్స్ట్ కొట్టివేయబడిందిలో ఉంది.

మార్క్‌డౌన్‌తో లింక్‌లను జోడించండి

మార్క్‌డౌన్‌తో లింక్‌ను క్రియేట్ చేయడానికి: 

  1. లింక్ చేయబడిన టెక్స్ట్‌ను బ్రాకెట్‌లలో రాయండి (ఉదా. [Google Docs]).
  2. బ్రాకెట్‌లలో రాసిన టెక్స్ట్ తర్వాత, URLను కుండలీకరణాల్లో రాయండి (ఉదా. (https://docs.google.com/document/)).
    • ముఖ్య గమనిక: బ్రాకెట్‌లలో టెక్స్ట్, కుండలీకరణాల్లో URL మధ్య స్పేస్‌ను చేర్చవద్దు.

మార్క్‌డౌన్‌లో టెక్స్ట్

అది కనిపించే విధానం

ఫైల్‌ను [Google Docs](https://docs.google.com/document/)లో తెరవండి.

ఫైల్‌ను Google Docsలో తెరవండి.

Google Docsలో మార్క్‌డౌన్‌తో హెడ్డింగ్‌లను క్రియేట్ చేయండి

మీరు Google Docsలో ఉన్నట్లయితే, మీరు గరిష్ఠంగా 6 విభిన్న హెడ్డింగ్‌లను క్రియేట్ చేయడానికి కూడా మార్క్‌డౌన్‌ను ఉపయోగించవచ్చు.

హెడ్డింగ్‌ను క్రియేట్ చేయడానికి,

  1. పేరాగ్రాఫ్ ప్రారంభంలో ఆరంభించండి.
  2. మీ హెడ్డింగ్ టెక్స్ట్ ముందు నంబర్ గుర్తులను (#) జోడించండి. మీరు ఉపయోగించే నంబర్ గుర్తుల సంఖ్య హెడ్డింగ్ స్థాయికి అనుగుణంగా ఉంటుంది.
    • ఉదాహరణకు, హెడ్డింగ్ 2ను క్రియేట్ చేయడానికి, రెండు నంబర్ గుర్తులను ఉపయోగించండి (ఉదా., ## నా హెడర్).
  3. మీ హెడ్డింగ్ టెక్స్ట్‌ను రాయండి.
    • ముఖ్య గమనిక: మీరు నంబర్ గుర్తు(లు), హెడ్డింగ్ టెక్స్ట్‌ల మధ్య స్పేస్‌ను చేర్చారని నిర్ధారించుకోండి.

మార్క్‌డౌన్‌లో టెక్స్ట్

అది కనిపించే విధానం

# హెడ్డింగ్ 1

హెడ్డింగ్ 1

## హెడ్డింగ్ 2

హెడ్డింగ్ 2

### హెడ్డింగ్ 3

హెడ్డింగ్ 3

#### హెడ్డింగ్ 4

హెడ్డింగ్ 4

##### హెడ్డింగ్ 5

హెడ్డింగ్ 5

###### హెడ్డింగ్ 6

హెడ్డింగ్ 6

సంబంధిత ఆర్టికల్స్

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
7390973230684203522
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false