డాక్యుమెంట్‌లో శీర్షిక, ముఖ్య శీర్షిక లేదా కంటెంట్‌ల పట్టికను జోడించండి

కార్యాలయం లేదా పాఠశాల కోసం Google Docs నుండి మరిన్ని ప్రయోజనాలు పొందాలనుకుంటున్నారా? ఉచిత Google Workspace ట్రయల్ కోసం సైన్ అప్ చేయండి.

మీరు మీ డాక్యుమెంట్‌ని శీర్షికలు, ముఖ్య శీర్షికలు మరియు విషయాల పట్టిక వంటి వచన శైలులతో నిర్వహించవచ్చు. మీరు వచన శైలుల యొక్క ఫాంట్ మరియు పరిమాణాన్ని అనుకూలీకరించవచ్చు మరియు మీ శైలులను డిఫాల్ట్‌లుగా సెట్ చేయవచ్చు.

విషయాల పట్టికను జోడించండి, మార్చండి లేదా తొలగించండి

మీరు విషయాల పట్టికతో మీ డాక్యుమెంట్ నిర్మాణాన్ని చూడవచ్చు. విషయాల పట్టికలోని ప్రతి అంశం మీ డాక్యుమెంట్ ముఖ్య శీర్షికలు లేదా శీర్షికతో లింక్ చేయబడతాయి.

విషయాల పట్టికను జోడించండి లేదా తొలగించండి
 1. మీ కంప్యూటర్‌లో, Google డాక్స్‌లో డాక్యుమెంట్‌ను తెరవండి.
 2. విషయాల పట్టిక ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నారో క్లిక్ చేయండి.
 3. చేర్చు ఆ తర్వాత కంటెంట్‌ల పట్టిక క్లిక్ చేయండి.
 4. కంటెంట్‌ల పట్టిక ఎలా కనిపించాలని కోరుకుంటున్నారో ఎంచుకోండి.

దానిని తొలగించేందుకు, కుడి-క్లిక్ చేసి కంటెంట్‌ల పట్టికను తొలగించు క్లిక్ చేయండి.

మీ కంటెంట్‌ల పట్టికను సవరించండి

కంటెంట్‌ల పట్టిక మీ డాక్యుమెంట్‌లోని శీర్షికలు మరియు ముఖ్య శీర్షికలను ప్రతిబింబిస్తుంది.

 1. మీ కంప్యూటర్‌లో, Google డాక్స్‌లో డాక్యుమెంట్‌ను తెరవండి.
 2. మీ డాక్యుమెంట్‌లో ముఖ్య శీర్షికను జోడించండి.
 3. రీఫ్రెష్ చేయి రిఫ్రెష్ చేయి క్లిక్ చేయండి. మీ కంటెంట్‌ల పట్టికలో మార్పు నవీకరించబడుతుంది.

శీర్షిక లేదా ముఖ్య శీర్షికను రూపొందించండి

వచన శైలిని మార్చండి
 1. మీ కంప్యూటర్‌లో, Google డాక్స్‌లో డాక్యుమెంట్‌ను తెరవండి.
 2. మీరు మార్చాలనుకుంటున్న వచనాన్ని ఎంచుకోండి.
 3. ఆకృతి ఆ తర్వాత పేరాగ్రాఫ్ శైలులను క్లిక్ చేయండి.
 4. వచన శైలిని క్లిక్ చేయండి:
  • సాధారణ వచనం
  • శీర్షిక
  • ఉపశీర్షిక
  • ముఖ్య శీర్షిక 1-6
 5. ‘వచన శైలిని' వర్తింపజేయి క్లిక్ చేయండి.
అనుకూల వచన శైలిని ఉపయోగించండి
 1. మీ కంప్యూటర్‌లో, Google డాక్స్‌లో డాక్యుమెంట్‌ను తెరవండి.
 2. మీరు ఉపయోగించాలనుకుంటున్న శైలితో ఉన్న వచనాన్ని ఎంచుకోండి.
 3. ఆకృతి ఆ తర్వాత పేరాగ్రాఫ్ శైలులు సాధారణ వచనం లేదా ఆ తర్వాత ముఖ్య శీర్షిక 1-6 ఆ తర్వాత సరిపోలే విధంగా ‘ముఖ్య శీర్షికను' నవీకరించండి క్లిక్ చేయండి.
 4. ఒకే వచన రకంతో ఉన్న మీ డాక్యుమెంట్‌లోని వచనం మొత్తం, ఉదాహరణకు "ముఖ్య శీర్షిక 4" లేదా "సాధారణ వచనం" వంటివి మీ ప్రారంభ ఎంపికకు సరిపోలేలా నవీకరించబడతాయి.

గమనిక: మీరు సాధారణ వచనం యొక్క శైలిని మార్చినట్లయితే, ముఖ్య శీర్షిక ఫాంట్‌లు కూడా కొత్త శైలికి మార్చబడతాయి.

డిఫాల్ట్ శైలిని సెట్ చేయండి మరియు మార్చండి

మీ కంప్యూటర్‌లో, Google డాక్స్‌లో డాక్యుమెంట్‌ను తెరవండి.

 • డిఫాల్ట్ శైలిని సెట్ చేయండి: ఆకృతి ఆ తర్వాత పేరాగ్రాఫ్ శైలులు ఆ తర్వాత ఎంపికలు ఆ తర్వాత నా డిఫాల్ట్ శైలుల వలే సేవ్ చేయి క్లిక్ చేయండి.
 • డిఫాల్ట్ శైలిని వర్తింపజేయండి: ఆకృతి ఆ తర్వాత పేరాగ్రాఫ్ శైలులు ఆ తర్వాత ఎంపికలు ఆ తర్వాత నా డిఫాల్ట్ శైలులను ఉపయోగించు క్లిక్ చేయండి.
 • అసలైన దానిని Google శైలితో పునఃస్థాపించండి: ఆకృతి ఆ తర్వాత పేరాగ్రాఫ్ శైలులు ఆ తర్వాత ఎంపికలు ఆ తర్వాత శైలులను రీసెట్ చేయి క్లిక్ చేయండి.

సంబంధిత లింక్‌లు

ఇది సహాయకరంగా ఉందా?
మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?