Google Docs, Sheets, Slides, అలాగే Jamboardలతో Google Meetను ఉపయోగించండి

Google Docs, Sheets, Slides, లేదా Jamboard నుండి, మీరు కింద పేర్కొన్న పనులు చేయవచ్చు:

  • Google Meet వీడియో మీటింగ్‌లో చేరవచ్చు
  • నేరుగా Google Meet వీడియో మీటింగ్‌లో ప్రెజెంట్ చేయవచ్చు

ముఖ్య గమనిక: Google Meet వీడియో మీటింగ్‌లో చేరడానికి లేదా Google Docs, Sheets, Slides, లేదా Jamboard నుండి ప్రెజెంట్ చేయడానికి, మీరు తప్పనిసరిగా కంప్యూటర్‌లో Chrome లేదా Edge బ్రౌజర్‌ను ఉపయోగించాలి.

మీ డాక్యుమెంట్, షీట్, Slides, లేదా Jamboard నుండి Google Meet వీడియో మీటింగ్‌లో చేరండి

  1. మీ కంప్యూటర్‌లో, కింద పేర్కొన్న ప్రోగ్రామ్‌లలో ఒక దానిలో ఫైల్‌ను తెరవండి:
  2. ఎగువ కుడి వైపున, Meet ను క్లిక్ చేయండి.
  3. ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:
    • షెడ్యూల్ చేయబడిన మీటింగ్‌లో చేరడానికి, మీరు చేరాలనుకుంటున్న మీటింగ్ పేరును క్లిక్ చేయండి.
    • మీటింగ్ కోడ్‌తో మీటింగ్‌లో చేరడానికి, మీటింగ్ కోడ్‌ను ఉపయోగించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి ఆ తర్వాత కోడ్‌ను ఎంటర్ చేయండి.
  4. మీటింగ్‌ను మీ డాక్యుమెంట్, స్ప్రెడ్‌షీట్, ప్రెజెంటేషన్, లేదా వైట్ బోర్డ్‌లోకి తీసుకురావడానికి, కాల్‌లో చేరండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. కుడి వైపున, సైడ్ ప్యానెల్ మీ మీటింగ్‌ను చూపిస్తుంది.​
    • మీరు "కాల్‌లో చేరండి"ని క్లిక్ చేసి ఉంటే, మీరు మీ ఫైల్‌ను ప్రెజెంట్ చేయలేరు లేదా ఇతర పార్టిసిపెంట్‌లు మీటింగ్‌ను ఎలా చూడాలి అనే దాన్ని మార్చలేరు.
  5. మీ డాక్యుమెంట్, స్ప్రెడ్‌షీట్, ప్రెజెంటేషన్, లేదా వైట్ బోర్డ్‌ను ప్రెజెంట్ చేయడానికి, దిగువ కుడి వైపున, స్క్రీన్‌ను షేర్ చేయండి స్క్రీన్‌ను షేర్ చేయండిని క్లిక్ చేసి, ఆపై మీరు ఉన్న ట్యాబ్‌ను క్లిక్ చేసి, ఆపై షేర్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • ముఖ్య గమనిక: మీరు మీ డాక్యుమెంట్, స్ప్రెడ్‌షీట్, ప్రెజెంటేషన్, లేదా వైట్ బోర్డ్ నుండి ట్యాబ్‌ను ప్రెజెంట్ చేసినప్పుడు, మీరు ప్రెజెంట్ చేసే ట్యాబ్‌ను మార్చలేరు. మీరు ప్రెజెంట్ చేసేటప్పుడు ట్యాబ్‌ల మధ్య మారడానికి, మీరు బదులుగా Google Meet నుండి ప్రెజెంట్ చేయవచ్చు.
  6. మీ ప్రెజెంటేషన్‌ను ఆపివేయడానికి, కింద కుడి వైపున, ప్రెజెంట్ చేయడాన్ని ఆపివేయండి ప్రెజెంటేషన్‌ను రద్దు చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీ ఫైల్ నుండి కొత్త Google Meet వీడియో మీటింగ్‌ను ప్రారంభించండి

  1. మీ కంప్యూటర్‌లో, Google Docs, Sheets, Slides, లేదా Jamboardలో ఒక ఫైల్‌ను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, Meet ను క్లిక్ చేయండి.
  3. కొత్త మీటింగ్‌ను ప్రారంభించడానికి, కొత్త మీటింగ్‌ను ప్రారంభించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. కుడి వైపున, సైడ్ ప్యానెల్ మీ మీటింగ్‌ను చూపిస్తుంది.
  4. మీ మీటింగ్‌కు వ్యక్తులను ఆహ్వానించడానికి, అలాగే:
    • కాల్‌లో ఇతర వ్యక్తులను జోడించడానికి: “ఈ వీడియో కాల్ మాత్రమే” పక్కన, కాపీ చేయండి ని క్లిక్ చేయండి.
    • ఇతర వ్యక్తులను కాల్‌లో జోడించి, ఫైల్‌లో సహకరించుకోవడానికి: “ఈ ఫైల్, వీడియో కాల్” పక్కన, కాపీ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. మీ డాక్యుమెంట్, స్ప్రెడ్‌షీట్, ప్రెజెంటేషన్, లేదా వైట్ బోర్డ్‌ను ప్రెజెంట్ చేయడానికి, కింద కుడి వైపున, స్క్రీన్‌ను షేర్ చేయండి స్క్రీన్‌ను షేర్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేసి, ఆపై మీరు ఉన్న ట్యాబ్‌ను క్లిక్ చేసి, ఆపై షేర్ చేయండి​ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • మీ ప్రెజెంటేషన్‌ను ఆపివేయడానికి, కింద కుడి వైపున, ప్రెజెంట్ చేయడాన్ని ఆపివేయండి ప్రెజెంటేషన్‌ను రద్దు చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • ముఖ్య గమనిక: మీరు మీ డాక్యుమెంట్, స్ప్రెడ్‌షీట్, ప్రెజెంటేషన్, లేదా వైట్ బోర్డ్ నుండి ట్యాబ్‌ను ప్రెజెంట్ చేసినప్పుడు, మీరు ప్రెజెంట్ చేసే ట్యాబ్‌ను మార్చలేరు. మీరు ప్రెజెంట్ చేసేటప్పుడు ట్యాబ్‌ల మధ్య మారడానికి, మీరు బదులుగా Google Meet నుండి ప్రెజెంట్ చేయవచ్చు.
  6. మీ వీడియో మీటింగ్ నుండి నిష్క్రమించడానికి, కింద కుడి వైపున, కాల్ నుండి నిష్క్రమించండి కాల్‌ను ముగించు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీ ఫైల్‌కు Google Meet వీడియో మీటింగ్‌ను బదిలీ చేయండి

మీరు Google Meet వీడియో మీటింగ్‌ను నేరుగా అదే పరికరంలోని మీ డాక్యుమెంట్, షీట్, లేదా Slides ట్యాబ్‌కు బదిలీ చేయవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో, Google Meetకు వెళ్లండి.
  2. మీటింగ్‌లో చేరండి.
  3. మీరు Google Meet వీడియో మీటింగ్‌ను బదిలీ చేయాలనుకుంటున్న ఫైల్‌ను Google Docs, Sheets, Slides , లేదా Jamboardలో తెరవండి.
  4. ఎగువ కుడి వైపున, Meet ను క్లిక్ చేయండి.
  5. కాల్‌ను ఇక్కడకు తీసుకురండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • మీరు వీడియో మీటింగ్‌ను డాక్యుమెంట్, స్ప్రెడ్‌షీట్, ప్రెజెంటేషన్, లేదా వైట్ బోర్డ్‌లోకి తీసుకువచ్చినప్పుడు, అది మీ ట్యాబ్‌ను ప్రెజెంట్ చేయదు.
    • మీ డాక్యుమెంట్, స్ప్రెడ్‌షీట్, ప్రెజెంటేషన్, లేదా వైట్ బోర్డ్‌ను ప్రెజెంట్ చేయడానికి, దిగువ కుడి వైపున, స్క్రీన్‌ను షేర్ చేయండి స్క్రీన్‌ను షేర్ చేయండిని క్లిక్ చేసి, ఆపై మీరు ఉన్న ట్యాబ్‌ను క్లిక్ చేసి, ఆపై షేర్ చేయండి​ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
      • ముఖ్య గమనిక: మీరు మీ డాక్యుమెంట్, స్ప్రెడ్‌షీట్, ప్రెజెంటేషన్, లేదా వైట్ బోర్డ్ నుండి ట్యాబ్‌ను ప్రెజెంట్ చేసినప్పుడు, మీరు ప్రెజెంట్ చేసే ట్యాబ్‌ను మార్చలేరు. మీరు ప్రెజెంట్ చేసేటప్పుడు ట్యాబ్‌ల మధ్య మారడానికి, మీరు బదులుగా Google Meet నుండి ప్రెజెంట్ చేయవచ్చు.
  6. మీ వీడియో మీటింగ్ నుండి నిష్క్రమించడానికి, కింద కుడి వైపున, కాల్ నుండి నిష్క్రమించండి కాల్‌ను ముగించు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
మీ ఫైల్ నుండి Google Meet వీడియో మీటింగ్‌కి ప్రెజెంట్ చేయండి

 మీరు నేరుగా Google Docs, Sheets, Slides, లేదా Jamboardలోని ఫైల్ నుండి Google Meet వీడియో మీటింగ్‌లో ప్రెజెంట్ చేయవచ్చు. మీరు ఈ ఆప్షన్‌ను ఉపయోగించినప్పుడు, మీ మైక్, స్పీకర్, కెమెరా అందుబాటులో ఉండవు.

  1. Google Meet వీడియో మీటింగ్‌లో చేరండి.
  2. Docs, SheetsSlides, లేదా Jamboardలో ఒక ఫైల్‌ను తెరవండి.
  3. ఎగువున, Meet ను క్లిక్ చేయండి.
  4. ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:
  5. ఈ ట్యాబ్‌ను మాత్రమే ప్రెజెంట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • ముఖ్య గమనిక: మీరు ఇప్పటికే మీటింగ్‌ను తెరవని సమయంలో, మీరు ఈ ట్యాబ్‌ను మాత్రమే ప్రెజెంట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేస్తే, మీరు మీ ఫైల్‌ను ప్రెజెంట్ చేస్తారు, కానీ ఫైల్ ట్యాబ్‌లో Google Meet వీడియో మీటింగ్‌ను చూడలేరు. మీరు ప్రెజెంట్ చేసేటప్పుడు మీ డాక్యుమెంట్, స్ప్రెడ్‌షీట్, ప్రెజెంటేషన్, లేదా వైట్ బోర్డ్‌ను, అలాగే Google Meet వీడియో మీటింగ్‌ను ఒకే ట్యాబ్‌లో చూడటానికి, Docs, Sheets, లేదా Slides నుండి వీడియో మీటింగ్‌లో చేరడానికి సంబంధించిన దశలను ఫాలో అవ్వండి.
  6. మీరు ఉన్న ట్యాబ్‌ను ఎంచుకోండి.
  7. ట్యాబ్‌ను షేర్ చేయడానికి, షేర్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • ముఖ్య గమనిక: మీరు మీ డాక్యుమెంట్, స్ప్రెడ్‌షీట్, ప్రెజెంటేషన్, లేదా వైట్ బోర్డ్ నుండి ట్యాబ్‌ను ప్రెజెంట్ చేసినప్పుడు, మీరు ప్రెజెంట్ చేసే ట్యాబ్‌ను మార్చలేరు. మీరు ప్రెజెంట్ చేసేటప్పుడు ట్యాబ్‌ల మధ్య మారడానికి, మీరు బదులుగా Google Meet నుండి ప్రెజెంట్ చేయవచ్చు.
  8. Meetలోకి తిరిగి వచ్చి, మీరు ప్రెజెంట్ చేసిన కంటెంట్‌ను మీటింగ్‌లో నేరుగా చూడండి.

మీ ఫైల్ నుండి వీడియో మీటింగ్ కోసం లింక్‌లను షేర్ చేయండి

మీరు Google Meet వీడియో మీటింగ్‌లో ఉండి, Google Docs, Sheets, లేదా Slides ఫైల్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, మీరు ఫైల్ లింక్‌ను మీటింగ్ పార్టిసిపెంట్‌లందరికీ షేర్ చేయవచ్చు. మీరు వీడియో మీటింగ్ కోసం URLను కూడా షేర్ చేయవచ్చు.

Docs, Sheets, లేదా Slides ఫైల్ కోసం లింక్‌ను షేర్ చేయండి
మీరు Meet చాట్ ద్వారా మీ ఫైల్ లింక్‌ను మీటింగ్ పార్టిసిపెంట్‌లందరితో షేర్ చేయవచ్చు.
  1. మీ కంప్యూటర్‌లో, కింద పేర్కొన్న ప్రోగ్రామ్‌లలో ఒక దానిలో ఫైల్‌ను తెరవండి:
  2. మీ ఫైల్ నుండి Google Meet వీడియో మీటింగ్‌లో చేరండి లేదా మీ ఫైల్ నుండి వీడియో మీటింగ్‌లో ప్రెజెంట్ చేయండి.
  3. మీరు కింద పేర్కొన్న విధంగా చేసినట్లయితే:
    • మీ ఫైల్‌ను వీడియో మీటింగ్‌లో ప్రెజెంట్ మాత్రమే చేసినట్లయితే, ఎగువ కుడి వైపున, స్క్రీన్‌ను షేర్ చేయండి స్క్రీన్‌ను షేర్ చేయండిని క్లిక్ చేయండి.
    • మీ ఫైల్ నుండి కాల్‌లో చేరినట్లయితే, ఎగువ కుడి వైపున, ను క్లిక్ చేయండి.
  4. మీటింగ్ చాట్‌లో ఫైల్‌ను షేర్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. మీకు స్వంతమైన లేదా ఎడిట్ యాక్సెస్ ఉన్న ఫైల్‌కు మీటింగ్ పార్టిసిపెంట్‌కు యాక్సెస్ లేకుంటే, పాప్-అప్ విండో కనిపించవచ్చు. మీ ఫైల్‌కు సంబంధించి వ్యక్తులకు ఏ యాక్సెస్ రోల్‌ను అసైన్ చేయాలో నిర్ణయించడానికి, వీక్షకులు, కామెంట్ చేయగల వ్యక్తి, లేదా ఎడిటర్ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
    • చిట్కా: మీరు క్యాలెండర్ ఈవెంట్‌ను కలిగి ఉంటే లేదా సవరించడానికి యాక్సెస్‌ను కలిగి ఉంటే, క్యాలెండర్ ఈవెంట్‌కు ఫైల్ కూడా జోడించబడుతుంది. మీరు ఫైల్‌ను జోడించవద్దని అనుకుంటే, "ఫైల్‌ను క్యాలెండర్ ఈవెంట్‌కు జోడించండి" ఆప్షన్ ఎంపికను తొలగించండి.
  6. Meet చాట్‌లో షేర్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

వీడియో మీటింగ్ కోసం లింక్‌ను షేర్ చేయండి

  • వీడియో మీటింగ్‌ను షేర్ చేయండి:
    1. ఎగువ కుడి వైపున, మరిన్ని మరిన్ని ఆ తర్వాత వ్యక్తులు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    2. “ఇతరులను జోడించడానికి లింక్‌ను షేర్ చేయండి” నుండి, ఈ వీడియో కాల్ మాత్రమే అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  • వీడియో మీటింగ్, అలాగే ఫైల్‌ను షేర్ చేయండి:
    1. కుడి వైపున, మరిన్ని మరిన్ని ఆ తర్వాత వ్యక్తులు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    2. “ఇతరులను జోడించడానికి లింక్‌ను షేర్ చేయండి” నుండి, ఈ ఫైల్, వీడియో కాల్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

పరిష్కార ప్రక్రియ చిట్కాల గురించి తెలుసుకోండి

"నాకు ఆడియో లేదా వీడియో సమస్యలు ఉన్నాయి."

  • మీరు మీ డాక్యుమెంట్, స్ప్రెడ్‌షీట్, ప్రెజెంటేషన్, లేదా వైట్ బోర్డ్ ట్యాబ్‌లో ఆడియోను వినలేకపోతే, సైట్ మ్యూట్ చేయబడిందో లేదో చెక్ చేయండి:
    1. ఎగువున, ట్యాబ్‌పై కుడి క్లిక్ చేయండి.
    2. సైట్‌ను అన్‌మ్యూట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  • మీ డాక్యుమెంట్, స్ప్రెడ్‌షీట్, లేదా ప్రెజెంటేషన్‌లో మీ మైక్రోఫోన్ లేదా కెమెరా పని చేయకుంటే, "docs.google.com" కోసం కెమెరా లేదా మైక్రోఫోన్ యాక్సెస్ బ్లాక్ చేయబడిందా అనే అంశాన్ని చెక్ చేయండి.

"నేను నా అన్ని Google Meet ఫీచర్‌లను ఉపయోగించలేకపోతున్నాను."

  • మీరు Google Meet వీడియో మీటింగ్‌ను డాక్యుమెంట్, స్ప్రెడ్‌షీట్, లేదా ప్రెజెంటేషన్‌లోకి తీసుకువచ్చినప్పుడు, కొన్ని Google Meet ఫీచర్‌లు అందుబాటులో ఉండవు. ఉదాహరణకు, మీరు వీటిని చేయలేరు:
    • మీ బ్యాక్‌గ్రౌండ్‌ను మార్చలేరు
    • పోల్స్, ప్రశ్నోత్తరాల సెషన్‌లను క్రియేట్ చేయలేరు
  • ఈ ఫీచర్‌లను ఉపయోగించడానికి, మీరు మీ డాక్యుమెంట్, స్ప్రెడ్‌షీట్, ప్రెజెంటేషన్, లేదా వైట్ బోర్డ్ నుండి మీ వీడియో మీటింగ్‌ను Google Meetకు తరలించవచ్చు. ఎగువ కుడి వైపున, పాప్-ఔట్ Open in new (pop out) ను క్లిక్ చేయండి.

"నేను వేరే ట్యాబ్‌ను ప్రెజెంట్ చేయలేకపోతున్నాను."

మీరు మీ డాక్యుమెంట్, స్ప్రెడ్‌షీట్, ప్రెజెంటేషన్, లేదా వైట్ బోర్డ్ నుండి ట్యాబ్‌ను ప్రెజెంట్ చేసినప్పుడు, మీరు తప్పనిసరిగా ఆ ఫైల్‌కు సంబంధించిన ట్యాబ్‌ను ఎంచుకోవాలి. మీరు మరొక విండో లేదా ట్యాబ్‌ను ఎంచుకుంటే, మీరు ట్యాబ్‌ను ప్రెజెంట్ చేయలేరు. మీరు ప్రెజెంట్ చేసేటప్పుడు ట్యాబ్‌ల మధ్య మారడానికి, మీరు బదులుగా Google Meet నుండి ప్రెజెంట్ చేయవచ్చు.

సంబంధిత ఆర్టికల్స్

true
Visit the Learning Center

Using Google products, like Google Docs, at work or school? Try powerful tips, tutorials, and templates. Learn to work on Office files without installing Office, create dynamic project plans and team calendars, auto-organize your inbox, and more.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
12978140337950776130
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false