మీ Google ఖాతా యాక్టివిటీ గురించి

జూన్ 1, 2021 తేదీన, వీటి కోసం అప్‌డేట్ చేసిన ప్రోడక్ట్ పాలసీలు ప్రభావంలోకి వస్తాయి:

 • Google Photos
 • Gmail
 • Google Drive, ఇందులో Google Docs, Sheets, Slides, Drawings, Forms, Jamboard, Sitesకి సంబంధించిన ఫైల్స్ కలిగి ఉంటుంది

ఈ పాలసీలు మీరు ఇన్‌యాక్టివ్‌గా ఉండే Google ప్రోడక్ట్‌లపై ప్రభావం చూపుతాయి. ఈ పాలసీలు వీలైనంత వరకు జూనా 1, 2023 నాటికి అమలులోకి వస్తాయి.

మీరు ఇన్‌యాక్టివ్‌గా అయినప్పుడు ఏం జరుగుతుంది

Gmail, Google Drive (Google Docs, Sheets, Slides, Drawings, Forms, Jamboard లేదా Sites ఫైల్‌లతో కలిపి) లేదా Google Photosలో మీరు 2 సంవత్సరాలు ఇన్‌యాక్టివ్‌గా ఉంటే,  ఆ ప్రోడక్ట్ నుంచి మీ మొత్తం కంటెంట్ తీసివేయబడవచ్చు. కానీ అలా జరగడానికి ముందు, మేము ఇలా చేస్తాము:

 • Google ప్రోడక్ట్‌లలోని ఇమెయిల్‌ను, నోటిఫికేషన్‌లను ఉపయోగించి మీకు నోటీస్ ఇస్తాము. కంటెంట్, తొలగింపునకు అర్హత పొందే తేదీకి కనీసం మూడు నెలల ముందు మేము మిమ్మల్ని సంప్రదిస్తాము. 
 • తొలగింపును నివారించడానికి మీకు అవకాశం ఇస్తాము (ప్రోడక్ట్‌లో యాక్టివ్‌గా ఉండటం ద్వారా)
 • మా సర్వీస్‌ల నుండి మీ కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి మీకు అవకాశం ఇస్తాము. మీ Google డేటాను ఎలా డౌన్‌లోడ్ చేయాలి అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

ఒకవేళ మీరు పేమెంట్ బకాయి లేదా కోటాకు సంబంధించిన సమస్యలేవీ లేని Google One మెంబర్ అయితే, మీరు యాక్టివ్‌గా పరిగణించబడతారు.

ముఖ్యమైనది: ఉదాహరణకు, మీరు Photosలో 2 సంవత్సరాల పాటు ఇన్‌యాక్టివ్‌గా ఉండి, Drive, Gmailలో యాక్టివ్‌గా ఉన్నట్లయితే, కేవలం మీ Google Photosలోని కంటెంట్ మాత్రమే తొలగించబడుతుంది. మీరు Gmailలో, అలాగే Google Driveలో (Google Docs, Sheets, Slides, Drawings, Forms, అలాగే Jamboard ఫైల్స్‌తో సహా) యాక్టివ్‌గా ఉన్నట్లయితే, ఆ ప్రోడక్ట్‌లలోని కంటెంట్ తొలగించబడదు. 

ఈ ప్రోడక్ట్‌లలో ఎలా యాక్టివ్‌గా ఉండవచ్చు

మీ డేటాను యాక్టివ్‌గా ఉంచడానికి సరళమైన దారి ఏంటంటే, వెబ్ లేదా Google యాప్ ద్వారా తరుచుగా Gmail, Google Photos, Google Drive (మరియు/లేదా Google Docs, Sheets, Slides, Drawings, Forms, Jamboard, Sites లాంటి సహకార కంటెంట్ క్రియేషన్ యాప్‌లు) సందర్శించాలి. సందర్శిస్తున్నప్పుడు మీరు ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయ్యి ఉన్నారని, సైన్ ఇన్ చేసి ఉన్నారని నిర్ధారించుకోండి.

మీ పరికరంలో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు సెటప్ చేయబడి ఉండవచ్చనే విషయాన్ని దయచేసి గమనించండి. యాక్టివిటీ అనేది ఖాతా ఆధారంగా పరిగణించబడుతుంది, పరికరం ఆధారంగా కాదు. మీరు ఏ ఖాతాలను అయితే యాక్టివ్‌గా ఉంచాలనుకుంటున్నారో, ఖాతాలన్నింటికీ సంబంధించిన సర్వీస్‌లను మీరు ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి.

యాక్టివిటీకి సంబంధించిన ఉదాహరణలు

Gmail

 • Gmailకు సంబంధించిన Android, iOS, లేదా వెబ్ యాప్‌లో సైన్ ఇన్ చేసి ఉండటం అలాగే ఆన్‌లైన్ యాక్టివిటీ చేయడం. ఉదాహరణకు, మీరు యాప్‌ను ఉపయోగించి:
  • మీ ఇన్‌బాక్స్‌ను చూడటం
  • ఇమెయిల్‌ను తెరవడం 
  • ఇమెయిల్‌ను పంపడం  
  • ఆర్కైవ్ చేయడం, తొలగించడం, లేబుల్ చేయడం, చదివినట్లుగా మార్క్ చేయడం, స్టార్ పెట్టడం, లేదా ఏవైనా ఇతర ఇమెయిల్ చర్యలను చేయడం
  • మీ ఇన్‌బాక్స్‌కు సంబంధించి బ్యాక్‌గ్రౌండ్ సింక్‌లను చేయడం, ఈ బ్యాక్‌గ్రౌండ్ సింక్‌లను Gmailకు సంబంధించిన Android, iOS యాప్‌లు చేస్తాయి
 • కింద పేర్కొనబడిన వాటిని చేసే API లేదా థర్డ్-పార్టీ మెయిల్ క్లయింట్ ద్వారా ఇమెయిల్‌ను యాక్సెస్ చేయడం:
  • ఇమెయిల్‌లను లోడ్ చేస్తుంది
  • ఇమెయిల్‌ను పంపుతుంది
  • ఆర్కైవ్ చేస్తుంది, తొలగిస్తుంది, లేబుల్ చేస్తుంది, చదివినట్లుగా మార్క్ చేస్తుంది, స్టార్ పెడుతుంది, లేదా ఏవైనా ఇతర ఇమెయిల్ చర్యలను చేస్తుంది.
 • ఇమెయిల్ ఫార్వర్డ్ చేయడాన్ని ఆన్ చేస్తుంది లేదా దాన్ని రన్నింగ్‌లోనే ఉంచుతుంది 

Google Drive (Google Docs, Sheets, Slides, Drawings, Forms, Jamboard, అలాగే Sites లాంటి సహకార కంటెంట్ క్రియేషన్ యాప్‌లతో సహా)

 • ఏదైనా ప్రామాణీకరించబడిన వినియోగం. దీనిలో ఇవి ఉంటాయి:
  • Android, iOS లేదా వెబ్‌లో Driveను లోడ్ చేయడం
  • Driveతో ఒక యాడ్-ఆన్‌ను లేదా థర్డ్-పార్టీ యాప్‌ను ఉపయోగించడం
  • Drive File Stream లేదా 'బ్యాకప్ మరియు సింక్' వంటి ఏదైనా సింక్ క్లయింట్ సహాయంతో యూజర్ పరికరం నుండి కంటెంట్‌ను సింక్ చేయడం
  • ఇతర యాప్ నుండి Driveను ఉపయోగించడం (Drive ఫైల్స్‌ను ఇమెయిల్‌లకు అటాచ్ చేయడం, Driveలో ఫైల్స్‌ను ప్రివ్యూ చేయడం మొదలైనవాటికి)
  • Driveలో స్టోర్ చేయబడిన ఫైల్ మీద ఏదైనా యాక్టివిటీని పూర్తి చేయడం, ఉదాహరణకు, క్రియేట్ చేయడం, ఎడిట్ చేయడం, చూడటం, షేర్ చేయడం లేదా కామెంట్ చేయడం
  • Google Docs, Sheets, Slides, Drawings, Forms, Jamboard, అలాగే Sites లాంటి ఏదైనా సహకార కంటెంట్ క్రియేషన్ యాప్‌లను ఉపయోగించడం

Google Photos

 • Photosకు సంబంధించిన Android లేదా వెబ్ యాప్‌లో సైన్ ఇన్ చేసి ఉండటం అలాగే ఆన్‌లైన్ యాక్టివిటీ చేయడం. ఉదాహరణకు, మీరు యాప్‌ను ఉపయోగించి ఇవి చేయవచ్చు:
  • బ్యాకప్ చేయబడిన మీ గ్యాలరీని చూడవచ్చు
  • ఫోటోను లేదా వీడియోను షేర్ చేయడం
  • ఆల్బమ్‌ను లేదా ఫోటో బుక్‌ను క్రియేట్ చేయడం
 • ఫోటోను లేదా వీడియోను బ్యాకప్ చేయవచ్చు

తరుచుగా అడిగే ప్రశ్నలు

G Suite/వర్క్‌స్పేస్ ఖాతాలకు, అలాగే కన్జ్యూమర్ ఖాతాలకు కూడా ఈ పాలసీలు వర్తిస్తాయా?
లేదు, ఈ పాలసీలు G Suite లేదా Workspace ఖాతాలకు వర్తించవు.
నా డేటాను తొలగించే ముందు మీరు నాకు సమాచారం ఏమైనా ఇస్తారా? 
మీ ఖాతా ఈ పాలసీ మార్పునకు లోబడి ఉన్నట్లయితే, మీ కంటెంట్ తొలగించబడే ముందు, మేము మీకు నోటీస్‌ను చాలా ముందుగానే (కనీసం మూడు నెలల ముందు) అందజేస్తాము. మీ ఇమెయిల్ అడ్రస్ ద్వారా, అలాగే నోటిఫికేషన్‌ల ద్వారా మేము మిమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేస్తాము. మీ Google ఖాతా కోసం ఇమెయిల్ అడ్రస్‌లను మేనేజ్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.
ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి నేను యాక్టివ్‌గా ఉండగలనో లేదో నాకు తెలియదు. నేను ఏమి చేయాలి?

జీవితంలో జరిగే కొన్ని సంఘటనల వల్ల, మీరు మీ ఫోన్‌కు లేదా కంప్యూటర్‌కు చాలా ఎక్కువ కాలం పాటు దూరంగా ఉండాల్సి రావచ్చు అని మేము అర్థం చేసుకోగలము. అందుకనే, మేము మీ ఖాతాను ఇన్‌యాక్టివ్ ఖాతాగా పరిగణించే ముందు 2 సంవత్సరాల వ్యవధిని సెట్ చేశాము. 

మీరు ఇన్‌యాక్టివ్ అయిన పక్షంలో, మీ డేటాను మేనేజ్ చేసుకోవడానికి మరో మార్గం కోసం ఇన్‌యాక్టివ్ ఖాతా మేనేజర్‌ను ఉపయోగించడాన్ని పరిశీలించండి. ఖాతా గురించి మీకు రిమైండర్‌లను పంపించడంతో పాటు, మీరు ఇకపై మీ ఖాతాను ఉపయోగించలేకపోతే, దానికి ఏమి జరగాలో మీరు ఈ టూల్ ద్వారా మేనేజ్ చేయవచ్చు. మీరు మీ ఖాతాను ఉపయోగించడం ఆపివేస్తే, మీ డేటాను డౌన్‌లోడ్ చేయడానికి మీరు ఒక విశ్వసనీయ కాంటాక్ట్‌ను కూడా సెటప్ చేసుకోవచ్చు, తొలగింపునకు మీ ఖాతా అర్హత పొందడానికి ముందే మీరు ఇలా చేయవచ్చు. 

అదనంగా, మీరు ముందుగానే మీ డేటాను డౌన్‌లోడ్ చేసుకొని, ఏ సమయంలో అయినా దాన్ని బ్యాకప్ చేసుకోవచ్చు.

నాకు ప్రియమైన వారు చనిపోతే నేను వారి కంటెంట్‌ను ఎలా భద్రపరచాలి?

వారి ఆన్‌లైన్ ఖాతాలను ఎలా మేనేజ్ చేయాలి అనే విషయానికి సంబంధించి స్పష్టమైన సూచనలను ఇవ్వకుండా మరణించే వ్యక్తులు చాలా మంది ఉంటారని మేము గుర్తించాము. మరణించిన యూజర్ ఖాతాలోని కంటెంట్‌ను అందించడానికి, Google వారి రక్తసంబంధీకులతో లేదా ప్రతినిధులతో (కొన్ని సందర్భాలలో) కలిసి పని చేయగలదు. మరణించిన యూజర్‌కు చెందిన డేటాను రిక్వెస్ట్ చేయడానికి సంబంధించిన మా ప్రాసెస్ గురించి మరింత తెలుసుకోండి. 

మీరు మరణించినప్పుడు లేదా చాలా కాలం పాటు మీ ఖాతా ఇన్‌యాక్టివ్‌గా ఉన్నప్పుడు, మీ డేటాతో ఏ విధంగా వ్యవహరించాలో ముందుగానే మాకు తెలియజేయడానికి, ఇన్‌యాక్టివ్ ఖాతా మేనేజర్ గురించి మరింత తెలుసుకోండి.  

 • గమనిక: ఇన్‌యాక్టివ్ ఖాతా మేనేజర్ సెట్టింగ్‌లు, మా ఇన్‌యాక్టివ్, కోటాకు మించి వినియోగానికి సంబంధించిన పాలసీలను ఓవర్‌రైడ్ చేయవు.
నాకు ఒక ఖాతా ఉంది, అది ఇన్‌యాక్టివ్‌గా ఉందనిపిస్తోంది, దాని పాస్‌వర్డ్‌ను మర్చిపోయాను - నేను ఎలా సైన్ ఇన్ చేయాలి?
మీరు అరుదుగా ఉపయోగించే ఖాతాకు మీ పాస్‌వర్డ్ గుర్తు లేకుంటే, మీ ఐడెంటిటీని వెరిఫై చేసి, మీ పాస్‌వర్డ్‌ని రీసెట్ చేయడానికి, Google ఖాతా రికవరీని సందర్శించండి. విజయవంతంగా సైన్ ఇన్ చేయడానికి మరింత సహాయం కోసం, ఖాతా రికవరీ చిట్కాలను చూడండి.
ఇది సహాయకరంగా ఉందా?
మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయి
శోధనను మూసివేయి
Google యాప్‌లు
ప్రధాన మెనూ
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
35
false