Chromeలో కుక్కీలను తొలగించండి, అనుమతించండి, మేనేజ్ చేయండి

మీరు ఇప్పటికే ఉన్న కుక్కీలను తొలగించడానికి, అన్ని కుక్కీలను అనుమతించడానికి లేదా బ్లాక్ చేయడానికి ఆప్షన్లను ఎంచుకోవచ్చు, అలాగే నిర్దిష్ట వెబ్‌సైట్‌ల కోసం ప్రాధాన్యతలను సెట్ చేయవచ్చు.

ముఖ్య గమనిక: మీరు ట్రాకింగ్ నుండి రక్షణ టెస్ట్ గ్రూప్‌లో భాగమైతే, మీకు "ట్రాకింగ్ నుండి రక్షణ" అనే థర్డ్-పార్టీ కుక్కీలను మేనేజ్ చేయడానికి కొత్త Chrome సెట్టింగ్‌ కనిపిస్తుంది. ట్రాకింగ్ నుండి రక్షణ గురించి మరింత తెలుసుకోండి.

కుక్కీలు అంటే ఏమిటి

మీరు సందర్శించే వెబ్‌సైట్‌లు క్రియేట్ చేసిన ఫైల్స్‌ను కుక్కీలు అంటారు. ఇవి, మీ సందర్శనకు సంబంధించిన సమాచారాన్ని సేవ్ చేసి, మీ ఆన్‌లైన్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత సులభతరం చేస్తాయి. ఉదాహరణకు, సైట్‌లు మిమ్మల్ని సైన్ ఇన్ అయి ఉండేలా చేయగలవు, మీ సైట్ ప్రాధాన్యతలను గుర్తుంచుకుంటాయి, లోకల్‌గా సందర్భోచితమైన కంటెంట్‌ను మీకు అందిస్తాయి.

2 రకాల కుక్కీలు ఉన్నాయి:

  • ఫస్ట్ పార్టీ కుక్కీలు: మీరు సందర్శించే సైట్ వీటిని క్రియేట్ చేస్తుంది. అడ్రస్ బార్‌లో సైట్ కనిపిస్తుంది.
  • థర్డ్-పార్టీ కుక్కీలు: ఇతర సైట్‌లు వీటిని క్రియేట్ చేస్తాయి. మీరు ఉపయోగించే సైట్ ఇతర సైట్‌ల నుండి కంటెంట్‌ను పొందుపరచగలదు, ఉదాహరణకు, ఇమేజ్‌లు, యాడ్స్, ఇంకా టెక్స్ట్. మీ ఎక్స్‌పీరియన్స్‌ను వ్యక్తిగతీకరించడానికి ఈ ఇతర సైట్‌లు ఏవైనా, కుక్కీలు, ఇతర డేటాను సేవ్ చేయగలవు.

అన్ని కుక్కీలనూ క్లియర్ చేయండి

మీరు కుక్కీలను తీసివేసినట్లయితే, వెబ్‌సైట్‌ల నుండి మీరు సైన్ అవుట్ అవుతారు అలాగే సేవ్ చేసిన మీ ప్రాధాన్యతలు తొలగించబడవచ్చు.

  1. మీ iPhone లేదా iPadలో, Chrome Chromeను తెరవండి.
  2. మరిన్ని మరిన్ని ఆ తర్వాత సెట్టింగ్‌లుసెట్టింగ్‌లును ట్యాప్ చేయండి.
  3. గోప్యత, సెక్యూరిటీ ఆ తర్వాత బ్రౌజింగ్ డేటాను క్లియర్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. కుక్కీలు, సైట్ డేటాను ఎంచుకోండి. 
  5. ఇతర ఐటెమ్‌ల ఎంపికను తీసివేయండి.
  6. బ్రౌజింగ్ డేటాను క్లియర్ చేయండి ఆ తర్వాత బ్రౌజింగ్ డేటాను క్లియర్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  7. పూర్తయింది ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
17000373449537196545
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
237
false
false