Chromeలో కుక్కీలను తొలగించండి, అనుమతించండి, మేనేజ్ చేయండి

మీరు ఇప్పటికే ఉన్న కుక్కీలను తొలగించడానికి, అన్ని కుక్కీలను అనుమతించడానికి లేదా బ్లాక్ చేయడానికి ఆప్షన్లను ఎంచుకోవచ్చు, అలాగే నిర్దిష్ట వెబ్‌సైట్‌ల కోసం ప్రాధాన్యతలను సెట్ చేయవచ్చు.

ముఖ్య గమనిక: మీరు ట్రాకింగ్ నుండి రక్షణ టెస్ట్ గ్రూప్‌లో భాగమైతే, మీకు "ట్రాకింగ్ నుండి రక్షణ" అనే థర్డ్-పార్టీ కుక్కీలను మేనేజ్ చేయడానికి కొత్త Chrome సెట్టింగ్‌ కనిపిస్తుంది. ట్రాకింగ్ నుండి రక్షణ గురించి మరింత తెలుసుకోండి.

కుక్కీలు అంటే ఏమిటి

మీరు సందర్శించే వెబ్‌సైట్‌లు క్రియేట్ చేసిన ఫైల్స్‌ను కుక్కీలు అంటారు. ఇవి, మీ సందర్శనకు సంబంధించిన సమాచారాన్ని సేవ్ చేసి, మీ ఆన్‌లైన్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత సులభతరం చేస్తాయి. ఉదాహరణకు, సైట్‌లు మిమ్మల్ని సైన్ ఇన్ అయి ఉండేలా చేయగలవు, మీ సైట్ ప్రాధాన్యతలను గుర్తుంచుకుంటాయి, లోకల్‌గా సందర్భోచితమైన కంటెంట్‌ను మీకు అందిస్తాయి.

2 రకాల కుక్కీలు ఉన్నాయి:

  • ఫస్ట్ పార్టీ కుక్కీలు: మీరు సందర్శించే సైట్ వీటిని క్రియేట్ చేస్తుంది. అడ్రస్ బార్‌లో సైట్ కనిపిస్తుంది.
  • థర్డ్-పార్టీ కుక్కీలు: ఇతర సైట్‌లు వీటిని క్రియేట్ చేస్తాయి. మీరు ఉపయోగించే సైట్ ఇతర సైట్‌ల నుండి కంటెంట్‌ను పొందుపరచగలదు, ఉదాహరణకు, ఇమేజ్‌లు, యాడ్స్, ఇంకా టెక్స్ట్. మీ ఎక్స్‌పీరియన్స్‌ను వ్యక్తిగతీకరించడానికి ఈ ఇతర సైట్‌లు ఏవైనా, కుక్కీలు, ఇతర డేటాను సేవ్ చేయగలవు.

కుక్కీలన్నింటినీ తొలగించండి

ముఖ్య గమనిక: మీరు కుక్కీలను తొలగిస్తే, మీ ఆధారాలను గుర్తుంచుకున్న సైట్‌ల నుండి మీరు సైన్ అవుట్ అయ్యే అవకాశం ఉంది, సేవ్ చేసిన మీ ప్రాధాన్యతలు తొలగించబడవచ్చు. కుక్కీని తొలగించిన ప్రతిసారి ఇది వర్తిస్తుంది.

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున ఉన్న, మరిన్ని మరిన్ని ఆ తర్వాత సెట్టింగ్‌లు Settings ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. గోప్యత, సెక్యూరిటీ ఆ తర్వాత థర్డ్-పార్టీ కుక్కీలు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • చిట్కా: మీరు ట్రాకింగ్ నుండి రక్షణ టెస్ట్ గ్రూప్‌లో భాగమైతే, బదులుగా ట్రాకింగ్ నుండి రక్షణ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. మొత్తం సైట్ డేటాను, అనుమతులను చూడండి ఆ తర్వాత మొత్తం డేటాను క్లియర్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. నిర్ధారించడానికి, తొలగించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

నిర్దిష్ట కుక్కీలను తొలగించండి

సైట్ నుండి కుక్కీలను తొలగించండి
  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున ఉన్న, మరిన్ని మరిన్ని ఆ తర్వాత సెట్టింగ్‌లు Settings ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. గోప్యత, సెక్యూరిటీ ఆ తర్వాత థర్డ్-పార్టీ కుక్కీలు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • చిట్కా: మీరు ట్రాకింగ్ నుండి రక్షణ టెస్ట్ గ్రూప్‌లో భాగమైతే, బదులుగా ట్రాకింగ్ నుండి రక్షణ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. మొత్తం సైట్ డేటాను, అనుమతులను చూడండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. ఎగువ కుడి వైపున, వెబ్‌సైట్ పేరు కోసం సెర్చ్ చేయండి.
  6. సైట్‌కు కుడి వైపున ఉన్న, "తొలగించండి" Removeని క్లిక్ చేయండి.
  7. నిర్ధారించడానికి, తొలగించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
ప్రత్యేక కాల వ్యవధి మధ్య కుక్కీలను తొలగించండి
  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున ఉన్న, మరిన్ని, మరిన్ని ఆ తర్వాత బ్రౌజింగ్ డేటాను క్లియర్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. ఎగువున, "సమయ పరిధి" పక్కన ఉన్న డ్రాప్‌డౌన్‌ను క్లిక్ చేయండి.
  4. ఒక సమయ వ్యవధిని ఎంచుకోండి, ఉదాహరణకు చివరి గంట లేదా చివరి రోజు.
  5. కుక్కీలు, ఇతర సైట్ డేటా ఆప్షన్‌ను ఎంచుకోండి.
  6. అన్ని ఇతర ఐటెమ్‌ల ఎంపికను తీసివేయండి.
  7. డేటాను క్లియర్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీ కుక్కీ సెట్టింగ్‌లను మార్చండి

ముఖ్య గమనిక: కుక్కీలను సేవ్ చేయడానికి మీరు సైట్‌లకు అనుమతినివ్వకపోతే, సైట్‌లు మీరు ఊహించిన విధంగా పని చేయకపోవచ్చు. ఫస్ట్ పార్టీ కుక్కీలను మేనేజ్ చేయడానికి, పరికరంలోని సైట్ డేటా గురించి మరింత తెలుసుకోండి.

మీరు ఏ సైట్‌లో అయినా కుక్కీలను అనుమతించవచ్చు లేదా బ్లాక్ చేయవచ్చు.

థర్డ్-పార్టీ కుక్కీలను అనుమతించడం లేదా బ్లాక్ చేయడం

మీరు థర్డ్-పార్టీ కుక్కీలను ఆటోమేటిక్‌గా అనుమతించవచ్చు లేదా బ్లాక్ చేయవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున ఉన్న, మరిన్ని మరిన్ని ఆ తర్వాత సెట్టింగ్‌లు Settings ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. గోప్యత, సెక్యూరిటీ ఆ తర్వాత థర్డ్-పార్టీ కుక్కీలు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:
    • థర్డ్-పార్టీ కుక్కీలను అనుమతించండి.
    • అజ్ఞాత మోడ్‌లో థర్డ్-పార్టీ కుక్కీలను బ్లాక్ చేయండి.
    • థర్డ్ పార్టీ కుక్కీలను బ్లాక్ చేయండి.
      • మీరు థర్డ్-పార్టీ కుక్కీలను బ్లాక్ చేస్తే, మీ మినహాయింపుల లిస్ట్‌లో సైట్‌ను అనుమతిస్తే మినహా ఇతర సైట్‌ల నుండి థర్డ్-పార్టీ కుక్కీలన్నీ బ్లాక్ చేయబడతాయి.
నిర్దిష్ట సైట్‌కు సంబంధించిన థర్డ్-పార్టీ కుక్కీలను అనుమతించండి
ముఖ్య గమనిక: మీరు ఆఫీస్‌లో లేదా స్కూల్‌లో Chromebookను ఉపయోగిస్తున్నట్లయితే, మీరు ఈ సెట్టింగ్‌ను మార్చలేకపోవచ్చు. మరింత సహాయం కోసం, మీ అడ్మినిస్ట్రేటర్‌ను సంప్రదించండి.

మీరు థర్డ్-పార్టీ కుక్కీలను ఆటోమేటిక్‌గా బ్లాక్ చేసినప్పటికీ, నిర్దిష్ట సైట్‌కు సంబంధించిన కుక్కీలను అనుమతించవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున ఉన్న మరిన్ని మరిన్ని ఆ తర్వాత సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. గోప్యత, సెక్యూరిటీ ఆ తర్వాత థర్డ్-పార్టీ కుక్కీలు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • చిట్కా: మీరు ట్రాకింగ్ నుండి రక్షణ టెస్ట్ గ్రూప్‌లో భాగమైతే, బదులుగా ట్రాకింగ్ నుండి రక్షణ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. "థర్డ్-పార్టీ కుక్కీలను ఉపయోగించడానికి అనుమతి ఉంది," పక్కన ఉన్న జోడించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. వెబ్ అడ్రస్‌ను ఎంటర్ చేయండి.
    • పూర్తి డొమైన్ కోసం మినహాయింపును క్రియేట్ చేయడానికి, డొమైన్ పేరుకు ముందు [*.]ను ఇన్‌సర్ట్ చేయండి. ఉదాహరణకు, [*.]google.com అనేది drive.google.com, calendar.google.comలకు సరిపోతుంది.
    • http://తో ప్రారంభం కాని IP అడ్రస్ లేదా వెబ్ అడ్రస్‌ను కూడా మీరు చేర్చవచ్చు.
  6. జోడించండి ఆప్షన్‌ను ఎంచుకోండి.

మీకు ఇకపై అవసరం లేని మినహాయింపును తీసివేయడానికి, వెబ్‌సైట్‌కు కుడి వైపున ఉన్న తీసివేయండి Removeని క్లిక్ చేయండి.

నిర్దిష్ట సైట్‌కు సంబంధించిన థర్డ్-పార్టీ కుక్కీలను తాత్కాలికంగా అనుమతించండి
మీరు థర్డ్-పార్టీ కుక్కీలను బ్లాక్ చేస్తే, కొన్ని సైట్‌లు మీరు అనుకున్న విధంగా పని చేయకపోవచ్చు. మీరు ఉపయోగించే నిర్దిష్ట సైట్‌కు తాత్కాలికంగా థర్డ్-పార్టీ కుక్కీలను అనుమతించవచ్చు.
  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. అడ్రస్ బార్‌లో, ఎగువున:
    • థర్డ్-పార్టీ కుక్కీలను అనుమతించడానికి: బ్లాక్ చేయబడిన థర్డ్-పార్టీ కుక్కీలు లేదా ట్రాకింగ్ నుండి రక్షణను ఎంచుకుని, థర్డ్-పార్టీ కుక్కీలను ఆన్ చేయండి.
    • థర్డ్-పార్టీ కుక్కీలను బ్లాక్ చేయడానికి: అనుమతించబడిన థర్డ్-పార్టీ కుక్కీలు లేదా ట్రాకింగ్ నుండి రక్షణను ఎంచుకుని Preview థర్డ్-పార్టీ కుక్కీలను ఆన్ చేయండి.
  3. డైలాగ్ బాక్స్‌ను మూసివేసి, పేజీని రీలోడ్ చేయడానికి, మూసివేయండి Close ఆప్షన్‌ను ఎంచుకోండి. మీరు దాన్ని మూసివేయడానికి డైలాగ్ బాక్స్ వెలుపల ఎక్కడైనా క్లిక్ చేయండి.
  4. పేజీ మళ్లీ లోడ్ అయిన తర్వాత, అడ్రస్ బార్ మీ సెట్టింగ్‌ల ఆధారంగా “థర్డ్-పార్టీ కుక్కీలు అనుమతించబడ్డాయి,” “థర్డ్-పార్టీ కుక్కీలు బ్లాక్ చేయబడ్డాయి,” లేదా “థర్డ్-పార్టీ కుక్కీలు పరిమితం చేయబడ్డాయి” అని చూపుతుంది.

చిట్కాలు:

మీ యాక్టివిటీని యాక్సెస్ చేయడానికి సంబంధిత సైట్‌లకు అనుమతినివ్వండి
ఒక దానితో మరొక దానికి సంబంధం కలిగిన సైట్‌ల గ్రూప్‌ను కంపెనీ నిర్వచించగలదు. ఉదాహరణకు, మీరు acme-music.example, acme-video.example మధ్య మారుతున్నప్పుడు మీరు సైన్ ఇన్ అయ్యి ఉండాలని కంపెనీ అనుకోవచ్చు.
మీరు థర్డ్-పార్టీ కుక్కీలను అనుమతిస్తే: కంటెంట్‌ను వ్యక్తిగతీకరించడం కోసం లేదా సైట్‌లన్నింటిలో మిమ్మల్ని సైన్ ఇన్ చేసి ఉంచడం కోసం మీ యాక్టివిటీని యాక్సెస్ చేయడానికి సంబంధిత సైట్‌లకు అనుమతినిస్తారు.
మీరు థర్డ్-పార్టీ కుక్కీలను బ్లాక్ చేస్తే: ఇది తరచుగా సైట్‌ల మధ్య ఈ రకమైన కనెక్షన్‌ను ఏర్పడకుండా చేస్తుంది. మీ అనుభవాన్ని మెరుగుపరుచుకోవడానికి అదే గ్రూప్‌లో ఉన్న సైట్‌లను అనుమతిస్తూనే, థర్డ్-పార్టీ కుక్కీలను బ్లాక్ చేయవచ్చు.
సంబంధిత సైట్‌లు గల గ్రూప్‌లను నిర్వచించే కంపెనీల పూర్తి లిస్ట్‌ను మీరు GitHub‌లో కనుగొనవచ్చు. సంబంధిత సైట్‌లు, థర్డ్-పార్టీ కుక్కీల గురించి మరింత తెలుసుకోండి.
ముఖ్య గమనిక: మీరు “థర్డ్-పార్టీ కుక్కీలను అనుమతించండి” అనే ఆప్షన్‌ను ఎంచుకుంటే, అప్పుడు సంబంధిత సైట్‌లు గల గ్రూప్ మీ యాక్టివిటీని ఆటోమేటిక్‌గా గ్రూప్‌లో షేర్ చేయవచ్చు.
ముఖ్య గమనిక: మీ సెట్టింగ్‌లలో “ట్రాకింగ్ నుండి రక్షణ” ఉన్నట్లయితే, అప్పుడు సంబంధిత సైట్‌ల గ్రూప్ ఆటోమేటిక్‌గా గ్రూప్‌లో మీ యాక్టివిటీని షేర్ చేయగలదు.

గ్రూప్‌లో మీ యాక్టివిటీని చూడటానికి సంబంధిత సైట్‌లకు అనుమతి ఇవ్వడానికి:

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, మరిన్ని మరిన్ని ఆ తర్వాత సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. గోప్యత, సెక్యూరిటీ ఆ తర్వాత థర్డ్-పార్టీ కుక్కీలు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. థర్డ్-పార్టీ కుక్కీలను బ్లాక్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  5. గ్రూప్‌లో మీ యాక్టివిటీని చూడటానికి సంబంధిత సైట్‌లకు అనుమతినివ్వండి అనే ఆప్షన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

అదే గ్రూప్‌లో ఉన్న సంబంధిత సైట్‌లను చూడటానికి:

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, మరిన్ని మరిన్ని ఆ తర్వాత సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. గోప్యత, సెక్యూరిటీ ఆ తర్వాత థర్డ్-పార్టీ కుక్కీలు ఆ తర్వాత మొత్తం సైట్ డేటాను, అనుమతులను చూడండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • చిట్కా: మీరు ట్రాకింగ్ నుండి రక్షణ టెస్ట్ గ్రూప్‌లో భాగమైతే, బదులుగా ట్రాకింగ్ నుండి రక్షణ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. ఒక సైట్‌ను ఎంచుకోండి.
  5. మరిన్ని మరిన్ని ఆ తర్వాత అదే గ్రూప్‌లో ఉన్న సైట్‌లను చూడండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కా:

  • సంబంధిత సైట్‌లను కనుగొనడానికి, అడ్రస్ బార్ పక్కన సైట్ సమాచారాన్ని చూడండి Default (Secure) ఆ తర్వాత కుక్కీలు, సైట్ డేటా ఆ తర్వాత సంబంధిత సైట్‌లను చూడండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • మీరు ట్రాకింగ్ నుండి రక్షణ టెస్ట్ గ్రూప్‌లో భాగమైతే, బదులుగా ట్రాకింగ్ నుండి రక్షణ ఆప్షన్‌ను ఎంచుకోండి.
పొందుపరచబడిన కంటెంట్ గురించిన సమాచారం

మీరు తెరిచే సైట్‌లు, ఇతర సైట్‌ల నుండి ఇమేజ్‌లు, యాడ్‌లు, టెక్స్ట్ వంటి కంటెంట్‌ను పొందుపరచవచ్చు, లేదా టెక్స్ట్ ఎడిటర్, వాతావరణ విడ్జెట్ వంటి ఫీచర్‌లను పొందుపరచవచ్చు. ఈ ఇతర సైట్‌లు తమ కంటెంట్ సరిగ్గా పని చేయడం కోసం మీ గురించి సేవ్ చేసిన (తరచూ కుక్కీలను ఉపయోగించి సేవ్ చేసిన) సమాచారాన్ని ఉపయోగించడానికి అనుమతిని అడగవచ్చు.

ఉదాహరణకు, మీరు సాధారణంగా docs.google.com సైట్‌లో డాక్యుమెంట్‌లను కంపోజ్ చేస్తారనుకోండి. పాఠశాల కోసం ఒక పనిని పూర్తి చేస్తున్నప్పుడు, మీరు Google Docsకు డైరెక్ట్ యాక్సెస్‌ను అందించే మీ పాఠశాల తరగతి పోర్టల్‌లో ఇతర విద్యార్థులతో కలిసి పని చేయాలి. మీ అనుమతితో ఈ కిందివి చేయగలదు:

  • మీరు మీ పాఠశాల సైట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు Google Docs దాని థర్డ్-పార్టీ కుక్కీలను యాక్సెస్ చేయగలదు, ఇది సైట్, Google Docs మధ్య కనెక్షన్‌ను అనుమతిస్తుంది.
  • ఇది మీరు ఎవరో వెరిఫై చేయడానికి, మీ సమాచారాన్ని కనుగొనడానికి, సైట్‌లోని మీ డాక్యుమెంట్‌లకు మీరు చేసే మార్పులను సేవ్ చేయడానికి Google Docsను అనుమతించవచ్చు.

కొన్ని సందర్భాలలో, మీరు సైట్‌లను బ్రౌజ్ చేస్తున్నప్పుడు మీ యాక్టివిటీని ట్రాక్ చేయడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. గోప్యతా ఫీచర్‌గా, మీరు విశ్వసించే సైట్‌ల కోసం మీ డేటాను యాక్సెస్ చేయడానికి పొందుపరచబడిన కంటెంట్‌ను ఎప్పుడు అనుమతించాలో మీరు నిర్ణయించుకోవచ్చు.

చిట్కా: కనెక్షన్ కుక్కీలను ఉపయోగిస్తుంది, 30 రోజులు లేదా మీరు యాక్టివ్‌గా ఉన్నంత వరకు అలాగే కొనసాగుతుంది. మీరు సెట్టింగ్‌లు ఉపయోగించి ఎప్పుడైనా కనెక్షన్‌ను అనుమతించడాన్ని ఆపివేయవచ్చు.

అనుమతిని మంజూరు చేయడానికి లేదా తిరస్కరించడానికి కింది ఆప్షన్‌ను ఎంచుకోండి

మీరు మీ గురించి వారు సేవ్ చేసిన సమాచారాన్ని ఉపయోగించడానికి పొందుపరిచిన కంటెంట్ కోసం అనుమతిని రిక్వెస్ట్ చేస్తూ ప్రాంప్ట్‌ను డిస్‌ప్లే చేసే సైట్‌ను బ్రౌజ్ చేసినప్పుడు ఈ కింది ఆప్షన్‌ను ఎంచుకోండి:

  • వారు మీ గురించి (కుక్కీ ఉపయోగించి) సేవ్ చేసిన సమాచారానికి సైట్ యాక్సెస్‌ను అందించడానికి అనుమతించండి ఆప్షన్‌ను ఎంచుకోండి
  • యాక్సెస్‌ను తిరస్కరించడానికి అనుమతించవద్దు ఆప్షన్‌ను ఎంచుకోండి

చిట్కాలు:

మీ ట్రాకింగ్ నుండి రక్షణలను మేనేజ్ చేయండి

ఆన్ చేయబడినప్పుడు, ప్రాథమిక సర్వీసులు పని చేయడానికి అనుమతించే పరిమిత కేస్‌లకు మినహా, ట్రాకింగ్ నుండి రక్షణ మీరు బ్రౌజ్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని ట్రాక్ చేయడానికి థర్డ్-పార్టీ కుక్కీలను ఉపయోగించకుండా సైట్‌లను గణనీయంగా పరిమితం చేస్తుంది. మీరు ఎంచుకుంటే, మీరు మీ సెట్టింగ్‌లలో థర్డ్-పార్టీ కుక్కీలను పూర్తిగా బ్లాక్ చేయవచ్చు. మీరు మీ "గోప్యత, సెక్యూరిటీ" సెట్టింగ్‌లలో మీ ట్రాకింగ్ నుండి రక్షణ ప్రాధాన్యతలను మేనేజ్ చేయవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున ఉన్న, మరిన్ని మరిన్ని ఆ తర్వాత సెట్టింగ్‌లు Settings ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. గోప్యత, సెక్యూరిటీ ఆ తర్వాత ట్రాకింగ్ నుండి రక్షణ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. మీరు అధునాతన గోప్యత రక్షణలను కూడా ఎంచుకోవచ్చు:
    • అన్ని థర్డ్-పార్టీ కుక్కీలను బ్లాక్ చేయండి: మీరు ఈ టోగుల్‌ను ఆన్ చేసినప్పుడు, కొన్ని సైట్‌లలో ఫీచర్‌లు పని చేయకపోవచ్చు. సంబంధిత సైట్‌లతో సహా, మీరు సందర్శించే సైట్‌ల నుండి అన్ని థర్డ్-పార్టీ కుక్కీలను Chrome బ్లాక్ చేస్తుంది.
    • మీ బ్రౌజింగ్ ట్రాఫిక్‌తో “ట్రక్ చేయవద్దు” రిక్వెస్ట్‌ను పంపండి: మీరు ఈ టోగుల్‌ను ఆన్ చేసినప్పుడు, సైట్‌లు మిమ్మల్ని ట్రాక్ చేయవద్దని మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు. రిక్వెస్ట్‌ను అమలు చేయడం అనేది సైట్‌ల సెట్టింగ్‌లపై ఆధారపడి ఉంటుంది. "Do Not Track" గురించి మరింత తెలుసుకోండి.
    • థర్డ్-పార్టీ కుక్కీలను ఉపయోగించడానికి మీరు ఏ సైట్‌లను అనుమతించాలనుకుంటున్నారో ఎంచుకోండి: మీరు "థర్డ్-పార్టీ కుక్కీల ఉపయోగాన్ని అనుమతించిన సైట్‌లు" కింద థర్డ్-పార్టీ కుక్కీలను ఉపయోగించడానికి మీరు అనుమతించే సైట్‌లను కూడా చెక్ చేయవచ్చు, ఎడిట్ చేయవచ్చు. థర్డ్-పార్టీ కుక్కీలను ఎలా అనుమతించాలో తెలుసుకోండి.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4971904187422857298
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
237
false
false