Chromeలో పాప్-అప్‌లను బ్లాక్ చేయండి లేదా అనుమతించండి

మీ స్క్రీన్ పై పాప్-అప్‌లు ఆటోమేటిక్‌గా కనిపించకుండా Google Chrome ఆటోమేటిక్‌గా బ్లాక్ చేస్తుంది. పాప్-అప్‌ను బ్లాక్ చేసినప్పుడు, 'పాప్-అప్ బ్లాక్ చేయబడింది' Pop-up blocked అని అడ్రస్ బార్‌లో మార్క్ చేయబడుతుంది. పాప్-అప్‌లను అనుమతించడానికి కూడా మీరు నిర్ణయించుకోవచ్చు.

పాప్-అప్‌లను డిజేబుల్ చేసిన తర్వాత కూడా మీకు అవి కనిపిస్తుంటే:

మీ ఆటోమేటిక్ పాప్-అప్‌ల సెట్టింగ్‌లను, ఇంకా మళ్లింపుల సెట్టింగ్‌లను మార్చడం

  1. మీ కంప్యూటర్‌లో, Chrome ఆప్షన్‌ను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, మరిన్ని మరిన్ని ఆ తర్వాత సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. గోప్యత, సెక్యూరిటీ ఆ తర్వాత సైట్ సెట్టింగ్‌లు ఆ తర్వాత పాప్-అప్‌లు, మళ్లింపులు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. మీరు ఆటోమేటిక్ సెట్టింగ్‌గా ఉండాలనుకుంటున్న ఆప్షన్‌ను ఎంచుకోండి.

నిర్దిష్ట సైట్‌కు సంబంధించిన పాప్-అప్‌లను, ఇంకా మళ్లింపులను మేనేజ్ చేయడం

అన్నీ పాప్-అప్‌లు యాడ్‌లు లేదా స్పామ్ కావు. కొన్ని చట్టబద్ధమైన వెబ్‌సైట్‌లు వెబ్ కంటెంట్‌ను పాప్-అప్ విండోలలో ప్రదర్శిస్తాయి.

సైట్‌కు సంబంధించిన పాప్-అప్‌లను, ఇంకా మళ్లింపులను అనుమతించడం
  1. మీ కంప్యూటర్‌లో, Chrome ఆప్షన్‌ను తెరవండి.
  2. పాప్-అప్‌లు బ్లాక్ చేయబడిన పేజీకి వెళ్ళండి.
  3. అడ్రస్ బార్‌లో, పాప్-అప్ బ్లాక్ చేయబడింది Pop-up blockedని క్లిక్ చేయండి.
  4. మీరు చూడాలనుకునే పాప్-అప్ కోసం లింక్‌ను క్లిక్ చేయండి.
  5. సైట్ కోసం పాప్-అప్‌లను ఎల్లప్పుడూ చూడడం కోసం, [site] నుండి ఎల్లప్పుడూ పాప్-అప్‌లు, మళ్లింపులను అనుమతించండి ఆ తర్వాత పూర్తయిందిని ఎంచుకోండి.
సైట్‌కు సంబంధించిన పాప్-అప్‌లను, మళ్లింపులను బ్లాక్ చేయడం
  1. మీ కంప్యూటర్‌లో, Chrome ఆప్షన్‌ను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, మరిన్ని మరిన్ని ఆ తర్వాత సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. గోప్యత, సెక్యూరిటీ ఆ తర్వాత సైట్ సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. పాప్-అప్‌లు, మళ్లింపులు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. "పాప్-అప్‌లను పంపడానికి, మళ్లింపులను ఉపయోగించడానికి అనుమతి ఉంది" అనే ఆప్షన్ కింద, సైట్‌ను కనుగొనండి.
  6. సైట్‌కు కుడి వైపున, మరిన్ని మరిన్ని ఆ తర్వాత బ్లాక్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

సైట్ ఒకవేళ లిస్ట్‌లో లేకపోతే, పాప్-అప్‌లను పంపడానికి, మళ్లింపులను ఉపయోగించడానికి అనుమతించబడదు" కింద, జోడించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. సైట్ వెబ్ అడ్రస్‌ను ఎంటర్ చేయండి, ఆపై జోడించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. సైట్ అంతటా ఉన్న పాప్-అప్‌లన్నింటినీ క్యాప్చర్ చేయడానికి, [*.]example.com ఆకృతిని ఉపయోగించండి.

నోటిఫికేషన్‌లను బ్లాక్ చేయడం

పాప్-అప్‌లను డిజేబుల్ చేసిన తర్వాత కూడా సైట్ నుండి సమాచారాన్ని పొందుతుంటే, దానికి కారణం బహుశా మీరు నోటిఫికేషన్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసి ఉండటం కావచ్చు. ఒక సైట్ నుండి నోటిఫికేషన్లను ఆఫ్ చేయడానికి:

  1. మీ కంప్యూటర్‌లో, Chrome ఆప్షన్‌ను తెరవండి.
  2. మీరు నోటిఫికేషన్‌లు పొందుతున్న సైట్‌కు వెళ్లండి.
  3. సైట్ సమాచారాన్ని చూడండిని క్లిక్ చేయండి.
  4. "నోటిఫికేషన్‌ల" పక్కన, డ్రాప్-డౌన్ మెనూ నుండి బ్లాక్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

మీ సైట్ సెట్టింగ్‌ల నుండి కూడా మీరు నోటిఫికేషన్‌లను బ్లాక్ చేయవచ్చు.

పాప్-అప్‌లలో వచ్చే సమస్యలు

వర్క్ లేదా స్కూల్‌లో Chrome పరికరాన్ని ఉపయోగించడం: ఈ సెట్టింగ్‌ను మీరు స్వయంగా మార్చలేరు, కానీ మీ నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్ మీ కోసం పాప్-అప్ బ్లాకర్‌ను సెటప్ చేయగలరు. మేనేజ్ చేయబడుతున్న Chrome పరికరాన్ని ఉపయోగించడం ఎలాగో తెలుసుకోండి.

మీరు Chromeను ఉపయోగిస్తున్నప్పుడు వెబ్‌సైట్ నిర్దిష్ట మార్గాలలో స్పందించేలా మీరు కంట్రోల్ చేయవచ్చు. Chromeలో అనుమతులను సెట్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

నా సైట్ పాప్ అప్‌లు బ్లాక్ చేయబడుతున్నాయి

యూజర్లకు ఉపయోగకరంగా లేవనిపించే పాప్-అప్‌లను Chrome బ్లాక్ చేస్తుంది.

మీకు చెందిన సైట్‌లో పాప్-అప్‌లు బ్లాక్ చేయబడితే, మోసపూరిత డిజైన్ రిపోర్ట్‌లో చూడండి. రిపోర్ట్‌లో, మీ సైట్‌లో మీరు పరిష్కరించగల సమస్యలు ఏవైనా ఉన్నాయేమో తెలుసుకోవచ్చు.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3528506242244283033
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
237
false
false