Chromeలో పాప్-అప్‌లను బ్లాక్ చేయండి లేదా అనుమతించండి

మీ స్క్రీన్ పై పాప్-అప్‌లు ఆటోమేటిక్‌గా కనిపించకుండా Google Chrome ఆటోమేటిక్‌గా బ్లాక్ చేస్తుంది. పాప్-అప్‌ను బ్లాక్ చేసినప్పుడు, 'పాప్-అప్ బ్లాక్ చేయబడింది' Pop-up blocked అని అడ్రస్ బార్‌లో మార్క్ చేయబడుతుంది. పాప్-అప్‌లను అనుమతించడానికి కూడా మీరు నిర్ణయించుకోవచ్చు.

పాప్-అప్‌లను డిజేబుల్ చేసిన తర్వాత కూడా మీకు అవి కనిపిస్తుంటే:

పాప్-అప్‌లను ఆన్ లేదా ఆఫ్ చేయండి

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Chrome యాప్ Chromeను తెరవండి.
  2. అడ్రస్ బార్‌కు కుడి వైపున, మరిన్ని మరిన్ని సెట్టింగ్‌లును ట్యాప్ చేయండి.
  3. అనుమతులు ఆ తర్వాత పాప్-అప్‌లు, మళ్లింపులు ను ట్యాప్ చేయండి.
  4. పాప్-అప్‌లు, మళ్లింపులును ఆఫ్ చేయండి.

నిర్దిష్ట సైట్ నుండి పాప్-అప్‌లను అనుమతించండి

పాప్-అప్‌లన్నీ యాడ్‌లు లేదా స్పామ్ కావు. చట్టబద్ధమైన వెబ్‌సైట్‌లు కొన్ని వాటి వెబ్ కంటెంట్‌ను పాప్-అప్ విండోలలో ప్రదర్శిస్తాయి.

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Chrome యాప్ Chromeను తెరవండి.
  2. పాప్-అప్‌లు బ్లాక్ చేయబడిన పేజీకి వెళ్ళండి.
  3. దిగువున, ఎల్లప్పుడూ చూడండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

ఒక నిర్దిష్ట సైట్ నుండి నోటిఫికేషన్‌లను అనుమతించండి లేదా బ్లాక్ చేయండి

  1. మీ Android పరికరంలో, Chrome Chromeను తెరవండి.
  2. మీరు నోటిఫికేషన్ సెట్టింగ్‌లను మార్చాలనుకుంటున్న సైట్‌కు వెళ్లండి.
  3. అడ్రస్ బార్‌కు ఎడమ వైపున, పేజీ సమాచారం Default (Secure) ఆ తర్వాత అనుమతులు అనే ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
    • ఏదైనా మెనూ తెరుచుకుంటే: మీరు మార్చాలనుకుంటున్న సెట్టింగ్‌ను ఎంచుకోండి.
    • మెనూ ఏదీ తెరుచుకోకపోతే: అనుమతులు, వాటి ఒరిజినల్ సెట్టింగ్‌లలోనే ఉంటాయి.

నా సైట్ పాప్ అప్‌లు బ్లాక్ చేయబడుతున్నాయి

యూజర్లకు ఉపయోగకరంగా లేవనిపించే పాప్-అప్‌లను Chrome బ్లాక్ చేస్తుంది.

మీకు చెందిన సైట్‌లో పాప్-అప్‌లు బ్లాక్ చేయబడితే, మోసపూరిత డిజైన్ రిపోర్ట్‌లో చూడండి. రిపోర్ట్‌లో, మీ సైట్‌లో మీరు పరిష్కరించగల సమస్యలు ఏవైనా ఉన్నాయేమో తెలుసుకోవచ్చు.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
6384852718525669909
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
237
false
false