అజ్ఞాత మోడ్‌లో బ్రౌజ్ చేయండి

మీరు అజ్ఞాత మోడ్‌లో వెబ్‌ను మరింత ప్రైవేట్‌గా బ్రౌజ్ చేయవచ్చు.
 
  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, మరిన్ని మరిన్ని ఆ తర్వాత కొత్త అజ్ఞాత విండోను క్లిక్ చేయండి.
  3. కొత్త విండో కనిపిస్తుంది. ఎగువున మూలలో, అజ్ఞాత విండో చిహ్నం అజ్ఞాత మోడ్ కోసం చూడండి.

అజ్ఞాత విండోను తెరవడానికి మీరు కీబోర్డ్ షార్ట్‌కట్‌ను కూడా ఉపయోగించవచ్చు:

  • Windows, Linux, లేదా Chrome OS: Ctrl + Shift + n నొక్కండి.
  • Mac: ⌘ + Shift + n నొక్కండి.

మీరు అజ్ఞాత విండోలు, సాధారణ Chrome విండోల మధ్య స్విచ్ చేయవచ్చు. మీరు అజ్ఞాత విండోను ఉపయోగిస్తున్నప్పుడు మాత్రమే ప్రైవేట్‌గా బ్రౌజ్ చేస్తారు.

మీరు కొత్త అజ్ఞాత విండోను తెరిచినప్పుడు థర్డ్-పార్టీ కుక్కీలను బ్లాక్ చేయడాన్ని కూడా ఎంచుకోవచ్చు. కుక్కీల గురించి మరింత తెలుసుకోండి.

అజ్ఞాత మోడ్‌ను మూసివేయండి

మీరు ఇప్పటికే ఒక అజ్ఞాత విండోను తెరిచి ఉంచి, మళ్లీ మరొక దాన్ని మీరు తెరిచినట్లయితే, మీ ప్రైవేట్ బ్రౌజింగ్ సెషన్ కొత్త విండోలో కొనసాగుతుంది. అజ్ఞాత మోడ్ నుండి నిష్క్రమించడానికి, అన్ని అజ్ఞాత విండోలను మూసివేయండి.

ఒకవేళ అజ్ఞాత విండో చిహ్నానికి పక్కన మీకు ఏదైనా నంబర్ కనిపిస్తే, మీరు ఒకటి కంటే ఎక్కువ అజ్ఞాత విండోలను తెరిచారని అర్థం. అజ్ఞాత విండోను మూసివేయడానికి:

  1. మీ కంప్యూటర్‌లో, మీ అజ్ఞాత విండోకు వెళ్లండి.
  2. విండోను మూసివేయడం:
    • Windows లేదా Chrome OS: ఎగువున కుడి వైపున ఉన్న, 'మూసివేయండి' Closeను క్లిక్ చేయండి.
    • Mac: ఎగువున కుడి వైపున ఉన్న, 'మూసివేయండి' Closeను క్లిక్ చేయండి.

సంబంధిత ఆర్టికల్స్

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15441700397863434287
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
237
false
false