Chrome ఉపయోగించి వెబ్‌లో సెర్చ్ చేయండి

మీరు ఇంటర్నెట్‌లోనూ, మీ బుక్‌మార్క్‌లలోనూ, ఇంకా మీ బ్రౌజింగ్ హిస్టరీలోను సెర్చ్ చేస్తున్న వాటిని త్వరగా కనుగొనవచ్చు. మీ ఆటోమేటిక్ సెర్చ్ ఇంజిన్ Chrome ఫీచర్‌కు సపోర్ట్‌ను అందించకపోతే, అది అందుబాటులో ఉండకపోవచ్చు.
  1. మీ iPhone లేదా iPadలో, Chrome యాప్ Chromeను తెరవండి.
  2. పైన ఉన్న అడ్రస్ బార్‌లో, మీరు సెర్చ్ చేయాలనుకుంటున్న దానిని ఎంటర్ చేయండి.
  3. ఫలితంపై ట్యాప్ చేయండి లేదా వెళ్లండిని ట్యాప్ చేయండి.

వాయిస్ ద్వారా సెర్చ్ చేయండి

కీబోర్డ్ పైన లేదా కొత్త పేజీలో, మైక్రోఫోన్ ను ట్యాప్ చేయండి.

QR కోడ్ లేదా బార్‌కోడ్‌తో సెర్చ్ చేయండి
  1. మీ iPhone లేదా iPadలో, Chrome యాప్ Chromeను తెరవండి.
  2. ఎగువన, అడ్రస్ బార్‌ను ట్యాప్ చేయండి.
  3. మీ కీబోర్డ్ పైన, స్కాన్ చేయండి Scanని ట్యాప్ చేయండి.
  4. హైలైట్ చేసిన పెట్టెలో, QR కోడ్ లేదా బార్‌కోడ్‌ను ఉంచండి. ఇది పని చేసినప్పుడు, అడ్రస్ బార్‌లో కోడ్ ప్రదర్శించబడుతుంది.
  5. వెళ్లండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

"QR కోడ్" అనేది జపాన్, తదితర దేశాలలో చేర్చబడిన Denso Waveకు సంబంధించిన నమోదిత వ్యాపార చిహ్నం.

పేజీలోనే సెర్చ్ చేయండి

మీరు వెబ్ పేజీలో నిర్దిష్ట పదం లేదా పదబంధాన్ని కనుగొనవచ్చు.

  1. మీ iPhone లేదా iPadలో, Chrome యాప్ Chromeను తెరవండి.
  2. పేజీలో, మరిన్ని మరిన్ని ఆ తర్వాత పేజీలో కనుగొనండి… ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీ సెర్చ్ క్వెరీని ఎంటర్ చేయండి.
    • మ్యాచ్ అయ్యే పదాలు హైలైట్ చేయబడ్డాయి. ప్రస్తుతం ఎంచుకున్న మ్యాచ్ పసుపు రంగు బ్యాక్‌గ్రౌండ్‌తో హైలైట్ చేయబడింది.
  4. మీరు సెర్చ్ చేస్తున్న దాన్ని కనుగొన్నప్పుడు, పూర్తయింది ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
ఇమేజ్‌లతో వెబ్‌లో సెర్చ్ చేయండి

iPhoneలోని Google Lensతో మీరు ఇమేజ్ గురించి మరింత తెలుసుకోవచ్చు. ఉదాహరణకు, ఒక మొక్క ఫోటోను ఉపయోగించి అది ఏ రకానికి చెందినదో సెర్చ్ చేయవచ్చు లేదా పేజీలో ఉన్న ఇమేజ్‌ను పోలిన మరిన్ని ఇమేజ్‌లను కనుగొనవచ్చు.

మీరు ప్రారంభించడానికి ముందు:

ఇమేజ్ గురించి మరింత తెలుసుకోవడానికి:

  1. మీ iPhoneలో, Chrome యాప్ Chromeను తెరవండి.
  2. మీరు మరింత తెలుసుకోవాలనుకుంటున్న ఇమేజ్‌తో ఏదైనా సైట్‌కు వెళ్లండి.
  3. ఇమేజ్‌ను నొక్కి పట్టుకోండి.
  4. సంబంధిత మెనూలో, Googleతో ఇమేజ్‌ను సెర్చ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
వెబ్ నుండి కాపీ చేసిన ఇమేజ్‌లను సెర్చ్ చేయండి

వెబ్ పేజీ నుండి మీ క్లిప్‌బోర్డ్‌కు కాపీ చేసిన ఇమేజ్ గురించి మీరు మరింత సమాచారాన్ని వెతకవచ్చు.

  1. మీ iPhone లేదా iPadలో, Chrome యాప్ Chromeను తెరవండి.
  2. పేజీలో, ఇమేజ్‌ను నొక్కి, పట్టుకోండి.
  3. ఇమేజ్‌ను కాపీ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. అడ్రస్ బార్‌ను ట్యాప్ చేయండి. కాపీ చేయబడిన ఇమేజ్ మీకు సెర్చ్ ఆప్షన్‌గా కనిపిస్తుంది.
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2966480147575905728
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
237
false
false