మీ హోమ్ పేజీ, ప్రారంభ పేజీని సెట్ చేయండి

హోమ్ పేజీ లేదా ప్రారంభ పేజీ కోసం ఏ పేజీని అయినా తెరవడానికి మీరు Google Chromeను అనుకూలంగా మార్చవచ్చు. మీరు వాటిని సెట్ చేయనంతవరకు ఈ రెండు పేజీలు ఒకేలా ఉండవు.

  • మీ పరికరంలో Chromeను ప్రారంభించినప్పుడు మీకు మొదటిగా కనిపించేది మీ ప్రారంభ పేజీ.
  • మీరు మొదటి ట్యాబ్ Homeను క్లిక్ చేసినప్పుడు మీరు వెళ్ళేది మీ హోమ్ పేజీ.

మీ ప్రారంభ పేజీ, హోమ్ పేజీ, లేదా సెర్చ్ ఇంజిన్ అకస్మాత్తుగా మారిపోతే, మీరు అవాంఛిత సాఫ్ట్‌వేర్‌ను కలిగి ఉండవచ్చు. మీ పరికరం నుండి మాల్‌వేర్‌ను కనుగొని, తీసివేయడం ఎలానో తెలుసుకోండి, మీ సెట్టింగ్‌లను తిరిగి పొందండి.

మీ ప్రారంభ పేజీని సెట్ చేయండి

మీ కంప్యూటర్‌లో Chromeను ప్రారంభించినప్పుడు ఏ పేజీ లేదా పేజీలు కనబడాలో మీరు కంట్రోల్ చేయవచ్చు.

ఒక కొత్త ట్యాబ్ తెరిచి ఉంది
మీరు కొత్త విండోను తెరిచినప్పుడల్లా కొత్త ట్యాబ్ పేజీని తెరిచేలా మీరు Chromeను సెట్ చేయవచ్చు.
  1. మీ కంప్యూటర్‌లో, Chrome Chromeను తెరవండి.
  2. పైన కుడి వైపున, మరిన్ని మరిన్ని ఆ తర్వాత సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. 
  3. ఎడమ వైపున ప్రారంభించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి. 
  4. కొత్త ట్యాబ్ పేజీని తెరవండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
మీ కొత్త ట్యాబ్ పేజీని మీరు కింది వాటితో అనుకూలంగా మార్చవచ్చు:
  • మీ షార్ట్‌కట్‌లు
  • మీరు చూసిన వంటకాలు
  • ఇతర సైట్స్‌లోని మీ షాపింగ్ కార్ట్‌లు
  • వేర్వేరు రూపాలు
మీ కొత్త ట్యాబ్ పేజీని వ్యక్తిగతీకరించడం ఎలానో తెలుసుకోండి.
మీరు ఆపివేసిన చోటు నుండే కొనసాగించండి

మీరు నిష్క్రమించినప్పుడు, మీరు చూస్తున్న అవే పేజీలను తిరిగి తెరవమని Chromeకు మీరు చెప్పవచ్చు.

కంప్యూటర్‌లో:

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. పైన కుడి వైపున, మరిన్ని మరిన్ని ఆ తర్వాత సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. ప్రారంభంలో అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. మీరు ఆపివేసిన చోటు నుండే కొనసాగించండిఅనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

మీ కుక్కీలు, డేటా సేవ్ చేయబడతాయి, కాబట్టి మీరు ఇంతకు ముందు లాగిన్ అయిన ఏ వెబ్‌సైట్‌లు (ఉదాహరణకు, Gmail వంటివి) అయినా తిరిగి తెరవబడతాయి. మీరు ఈ పేజీలకు ఆటోమేటిక్‌గా సైన్-ఇన్ చేయాలనుకోకపోతే, ఈ దిగువ దశలను ఫాలో చేయండి:

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున ఉన్న, మరిన్ని మరిన్ని ఆ తర్వాత సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. గోప్యత, సెక్యూరిటీ ఆ తర్వాత సైట్ సెట్టింగ్‌లు ఆ తర్వాత అదనపు కంటెంట్ సెట్టింగ్‌లు ఆ తర్వాత పరికరంలోని సైట్ డేటా ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. మీరు అన్ని విండోలను మూసివేసినప్పుడు మీ పరికరంలో సేవ్ చేసిన డేటా సైట్‌లను తొలగించండి అనే ఆప్షన్‌ను ఆన్ చేయండి.

Chromebookలో: మీరు సైన్ ఇన్ చేసినప్పుడు పేజీలను తిరిగి తెరవడానికి, Ctrl + Shift + tను నొక్కండి.

నిర్దిష్ట పేజీల సెట్‌ను తెరవండి

ఏ వెబ్‌పేజీని అయినా తెరవమని మీరు Chromeకు చెప్పవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఎగువున కుడి భాగంలో, మరిన్ని మరిన్నిఆ తర్వాతసెట్టింగ్‌లును క్లిక్ చేయండి.
  3. "ప్రారంభంలో" దిగువున, నిర్దిష్ట పేజీ లేదా పేజీల సెట్‌ను తెరవండి.
    • కొత్త పేజీని జోడించండిని క్లిక్ చేయండి. వెబ్ అడ్రస్‌ను ఎంటర్ చేసి, జోడించును క్లిక్ చేయండి.
    • ప్రస్తుత పేజీలను ఉపయోగించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

పేజీలను అప్‌డేట్ చేయడానికి, పేజీకి కుడివైపున, మరిన్ని మరిన్ని ఆ తర్వాత ఎడిట్ చేయండి లేదా తొలగించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి. 

మీ ప్రారంభ పేజీ లేదా హోమ్ పేజీతో సమస్యలు

మీరు కంప్యూటర్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, మీకు మీరు సెట్ చేయని హోమ్ పేజీ లేదా ప్రారంభ పేజీని మీరు చూస్తున్నట్లయితే, మీ కంప్యూటర్ మాల్‌వేర్‌ను కలిగి ఉండవచ్చు. Chromeలో అవసరంలేని మార్పులను బ్లాక్ చేయడం ఎలానో తెలుసుకోండి.

వర్క్ లేదా స్కూల్‌లో Chromebookను ఉపయోగిస్తున్నట్లయితే, మీ ప్రారంభ పేజీ(లు) లేదా హోమ్ పేజీని మీ నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్ మీకోసం ఎంచుకోవచ్చు. అలా అయితే, మీరు వాటిని మార్చలేరు. మరింత సహాయం కోసం, మీ అడ్మినిస్ట్రేటర్‌ను అడగండి.

మీ హోమ్ పేజీని ఎంచుకోండి

మీరు మొదటి పేజీ Home ఆప్షన్‌ను క్లిక్ చేసినప్పుడు మీకు ఏ పేజీ కనిపించాలో మీరు కంట్రోల్ చేయవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఎగువున కుడి భాగంలో, మరిన్ని మరిన్నిఆ తర్వాతసెట్టింగ్‌లును క్లిక్ చేయండి.
  3. "కనిపించే తీరు" దిగువున, 'హోమ్ బటన్‌ను చూపించును ఆన్ చేయండి.
  4. "హోమ్ బటన్‌ను చూపించండి" కింద, కొత్త ట్యాబ్ పేజీ లేదా అనుకూల పేజీని ఉపయోగించడాన్ని ఎంచుకోండి

మీ అడ్రస్ బార్‌కు ఎడమవైపు హోమ్ బటన్ కనిపిస్తుంది. 

Chrome సెట్టింగ్‌లు, మీకు నచ్చిన విధంగా

మీ Chromeను అనుకూలంగా మార్చడం ఎలానో తెలుసుకోండి, మీ Chrome సెట్టింగ్‌లను మార్చండి.

మీ Chromeను అనుకూలంగా మార్చడం ఎలానో తెలుసుకోండి, మీ Chrome సెట్టింగ్‌లను మార్చండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15816889511030475168
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
237
false
false