మీరు పోగొట్టుకున్న ఫోన్ లేదా కంప్యూటర్‌ను లాక్ చేయండి లేదా ఫ్యాక్టరీ రీసెట్ చేయండి

మీ ఫోన్, టాబ్లెట్, లేదా ల్యాప్‌టాప్ పోయినా లేదా దొంగిలించబడినా, మీ పరికరాన్ని సురక్షితంగా ఉంచడంలో సహాయపడే ఈ దశలను ఫాలో అవ్వండి.

ఆ పరికరాన్ని తిరిగి పొందలేకపోతే, కొన్ని దశలను అప్పటికప్పుడే చేపట్టడం ద్వారా అవి మీ సమాచారాన్ని కాపాడుకోవడంలో సహాయపడవచ్చు.

దశ 1: మీరు పోగొట్టుకొన్న ఫోన్, టాబ్లెట్, లేదా Chromebookను సురక్షితంగా ఉంచండి

మీ పరికరానికి రింగ్ ఇవ్వడం, లాక్ చేయడం లేదా సైన్ అవుట్ చేయడం వంటి కొన్ని రిమోట్ చర్యలను మీరు ట్రై చేయవచ్చు.

Windows, Mac లేదా Linux కంప్యూటర్‌ను పోగొట్టుకొన్నారా? "మీ ఫోన్‌ను కనుగొనండి" కింద కంప్యూటర్‌లు లిస్ట్ చేయబడలేదు. మీ Google ఖాతా పాస్‌వర్డ్‌ను మార్చడం అనే దశకు వెళ్లండి.

  1. Chrome Chrome వంటి ఒక బ్రౌజర్‌ను తెరవండి. మీరు వేరే ఎవరి పరికరాన్నయినా ఉపయోగిస్తుంటే, ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్‌ను ఉపయోగించండి.
  2. మీ Google ఖాతాను తెరవండి.
  3. "సెక్యూరిటీ" విభాగంలో, "మీ పరికరాల"ను కనుగొనండి. పరికరాలను మేనేజ్ చేయండిని ఎంచుకోండి.
  4. పోగొట్టుకొన్న ఫోన్, టాబ్లెట్ లేదా Chromebookను ఎంచుకోండి. ఆ పరికరం చివరిసారిగా ఎక్కడ ఉపయోగించబడింది, చివరిగా అది ఏ నగరంలో ఉంది అనేది మీకు కనిపిస్తుంది.
  5. "ఖాతా యాక్సెస్" పక్కన, సైన్ అవుట్‌ను ఎంచుకోండి. మీ Google ఖాతాకు,  అలాగే మీ పరికరంలో కనెక్ట్ చేసి ఉన్న యాప్‌లకు యాక్సెస్ తీసివేయడానికి స్క్రీన్ పై సూచనలను ఫాలో అవ్వండి.​
    • మీరు మీ పరికరాన్ని కనుగొంటే, మీరు మీ Google ఖాతాకు మళ్లీ సైన్ చేయవచ్చు.

మీరు పోగొట్టుకొన్న ఫోన్ లేదా టాబ్లెట్‌ను కనుగొనడానికి ట్రై చేస్తున్నట్లయితే, మీరు పోగొట్టుకొన్న పరికరాన్ని కనుగొనండి అనే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. మీ పరికరాన్ని కనుగొనడానికి లేదా సురక్షితంగా ఉంచడానికి సంబంధించిన మరిన్ని మార్గాల కోసం స్క్రీన్‌పై కనిపించే సూచనలను ఫాలో అవ్వండి.

మీరు వేరే ఎవరి పరికరాన్నయినా ఉపయోగిస్తుంటే, మీ పని ముగిసిన తర్వాత, ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్‌ను మూసివేయడం ద్వారా సైన్ అవుట్ చేయండి.

మరింత సహాయం పొందండి

  • పోగొట్టుకొన్న iPhone కోసం, మీ పరికరాన్ని iCloudతో లొకేట్ చేసి, సురక్షితంగా ఉంచే మార్గాల గురించి మరింత తెలుసుకోండి.
  • మీ మొబైల్ క్యారియర్ ఇలాంటి కొన్ని మార్గాల్లో మీకు సహాయపడవచ్చు:
    • మీకు వచ్చే కాల్స్‌ను వేరొక నంబర్‌కు మళ్లించడం
    • కొత్త SIM కార్డ్‌ను ఆర్డర్ చేయడం
    • వేరే వ్యక్తులు కాల్స్ చేయడం, మెసేజ్‌లు పంపడం వంటివి చేయడానికి వీలు లేకుండా మీ SIM కార్డ్‌ను ఆఫ్ చేయడం

మీ పరికరం లిస్ట్ చేయబడలేదు

మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న పరికరంలో సరైన Google ఖాతాకు సైన్ ఇన్ అయ్యారని చెక్ చేయండి.

  • మీరు పోగొట్టుకొన్న పరికరంలో Gmail, YouTube లాంటి ఒక Google యాప్‌లో మీ Google ఖాతాకు సైన్ చేసి ఉండాలి.
  • Windows, Mac, Linux కంప్యూటర్‌లు, Chromebookలు "మీ ఫోన్‌ను కనుగొనండి" విభాగంలో లిస్ట్ చేసి లేవు.

మీ పరికరం ఇప్పటికీ లిస్ట్ చేయబడకపోతే, మీ Google ఖాతా పాస్‌వర్డ్ మార్చడం కోసం ముందుకు వెళ్లండి.

దశ 2: మీ Google ఖాతా పాస్‌వర్డ్‌ను మార్చండి

మీరు Chromeకు, అలాగే Gmail, YouTube లాంటి ఇతర Google ప్రోడక్ట్‌లకు ఏ పాస్‌వర్డ్‌ను అయితే ఉపయోగిస్తున్నారో అదే పాస్‌వర్డ్ మీ Google ఖాతా పాస్‌వర్డ్‌గా ఉంటుంది. శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

  1. మీ Google ఖాతాను తెరవండి. మీరు సైన్ ఇన్ చేయాల్సి రావచ్చు.
  2. "సెక్యూరిటీ" విభాగంలో, Googleకు సైన్ ఇన్ చేయండిని ఎంచుకోండి.
  3. పాస్‌వర్డ్‌ను ఎంచుకోండి. మీరు మళ్లీ సైన్ ఇన్ చేయాల్సి రావచ్చు.
  4. మీ కొత్త పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి, ఆ తర్వాత పాస్‌వర్డ్‌ను మార్చండిని ఎంచుకోండి.
  5. పాస్‌వర్డ్‌ను మార్చండి

దశ 3: సేవ్ చేయబడిన మీ పాస్‌వర్డ్‌లను మార్చండి

ఎవరి వద్దయినా మీరు పోగొట్టుకొన్న పరికరం ఉంటే, మీ పరికరానికి లేదా Google ఖాతాకు సేవ్ చేయబడిన పాస్‌వర్డ్‌లను మార్చడాన్ని పరిగణించండి.

  1. passwords.google.comను తెరవండి.
  2. మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  3. "సేవ్ చేయబడిన పాస్‌వర్డ్"‌లను చూడండి.
    • ఈ లిస్ట్‌లో కేవలం మీ ఖాతాకు సేవ్ చేయబడిన పాస్‌వర్డ్‌లు మాత్రమే ఉంటాయి, మీరు పోగొట్టుకొన్న పరికరానికి సేవ్ చేయబడినవి ఉండవు.
  4. మీరు మార్చాలనుకునే ప్రతీ పాస్‌వర్డ్ కోసం, యాప్‌ను తెరవండి లేదా సైట్‌కు వెళ్లండి.
  5. మీ పాస్‌వర్డ్‌ను మార్చండి.

చిట్కా: మోసం బారిన పడకుండా మీ ఖాతాలను పర్యవేక్షించండి. మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లపై నిఘా ఉంచండి, ఏదైనా మోసపూరిత కొనుగోళ్లు జరిగితే, వాటిని మీ క్రెడిట్ కార్డ్ కంపెనీకి రిపోర్ట్ చేయండి.

సంబంధిత లింక్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
13542537394671890887
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
237
false
false