మీ పరికరాలంతటా పాస్‌వర్డ్‌లను ఉపయోగించండి

మీరు ఈ కింది వాటిలో ఏదైనా చేసినప్పుడు మీ Google ఖాతాకు సేవ్ చేయబడిన పాస్‌వర్డ్‌లను ఉపయోగించి మీరు వేర్వేరు పరికరాలలోని యాప్‌లు, సైట్‌లకు సైన్ ఇన్ చేయవచ్చు:

  • Androidలో Chromeలో సింక్‌ను ఆన్ చేయండి
  • మీ కంప్యూటర్‌లో Chromeకు సైన్ ఇన్ చేయండి

మీ Google ఖాతాకు పాస్‌వర్డ్‌లను సేవ్ చేయండి

పాస్‌వర్డ్‌లను సేవ్ చేయడానికి ఆఫర్ చేయి ఆన్ చేసి ఉన్నట్లయితే, మీరు Android లేదా Chromeలో సైట్‌లు, యాప్‌లకు సైన్ ఇన్ చేసినప్పుడు మీ పాస్‌వర్డ్‌ను సేవ్ చేయమని మీకు ప్రాంప్ట్ చేయబడుతుంది.

ఈ సైట్ లేదా యాప్‌నకు మీ పాస్‌వర్డ్‌ను సేవ్ చేయడానికి, సేవ్ చేయిని ఎంచుకోండి. మీ Android పరికరానికి ఒకటి కంటే ఎక్కువ Google ఖాతాలు సైన్ ఇన్ చేసి ఉన్నట్లయితే, మీరు మీ పాస్‌వర్డ్‌ను ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ ఖాతాను ఎంచుకోవచ్చు.

passwords.google.com లేదా Chromeలో మీ సేవ్ చేయబడిన పాస్‌వర్డ్‌లను ఏ సమయంలో అయినా మేనేజ్ చేసుకోవచ్చు.

పాస్‌వర్డ్‌లను సేవ్ చేయడానికి ఆఫర్‌లను మేనేజ్ చేయండి

సైట్‌ల కోసం పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడానికి, Google ఖాతాలో సేవ్ అయ్యి ఉన్న పాస్‌వర్డ్‌లను ఉపయోగించి మిమ్మల్ని ఆటోమేటిక్‌గా సైన్ ఇన్ చేయించడానికి Chromeను మీరు అనుమతించవచ్చు.

"పాస్‌వర్డ్‌లను సేవ్ చేయడానికి ఆఫర్" ఆటోమేటిక్‌గా ఆన్ అయ్యి ఉంటుంది, మీరు దానిని ఆఫ్ చేయవచ్చు లేదా తిరిగి ఆన్ చేయవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున ఉన్న మరిన్ని నిర్వహించండి ఆ తర్వాత పాస్‌వర్డ్‌లు, ఆటోఫిల్ ఆ తర్వాత Google Password Manager అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. ఎడమ వైపున, సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. పాస్‌వర్డ్‌లను సేవ్ చేయడానికి ఆఫర్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

నిర్దిష్ట సైట్‌లు లేదా యాప్‌లకు పాస్‌వర్డ్‌లను సేవ్ చేయడానికి ఆఫర్‌లను మేనేజ్ చేయండి

నిర్దిష్ట సైట్‌లకు ఎప్పటికీ పాస్‌వర్డ్‌లను సేవ్ చేయకుండా మీరు ఎంచుకోవచ్చు. పాస్‌వర్డ్‌ను సేవ్ చేయమని మీకు ప్రాంప్ట్ వచ్చినప్పుడు, ఎప్పుడూ వద్దును ఎంచుకోండి. ఆ పాస్‌వర్డ్‌ను సేవ్ చేయడానికి ఆఫర్‌ను మీరు మళ్లీ చూడరు.

పాస్‌వర్డ్‌లను సేవ్ చేయడానికి ఎప్పటికీ ఆఫర్ చేయని సైట్‌లను మీరు వీక్షించవచ్చు లేదా మేనేజ్ చేయవచ్చు:

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున ఉన్న మరిన్ని నిర్వహించండి ఆ తర్వాత పాస్‌వర్డ్‌లు, ఆటోఫిల్ ఆ తర్వాత Google Password Manager అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. ఎడమ వైపున, సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. "తిరస్కరించిన సైట్‌లు, యాప్‌లు" కింద, పాస్‌వర్డ్‌లను సేవ్ చేయమని ఆఫర్ చేయని వెబ్‌సైట్‌లను కనుగొనండి. సైట్‌ను తీసివేయడానికి, తీసివేయండి తీసివేయండిను ఎంచుకోండి.

ఆటోమేటిక్ సైన్ ఇన్‌ను మేనేజ్ చేయండి

మీరు సేవ్ చేసిన సమాచారంతో మీరు ఆటోమేటిక్‌గా సైట్‌లు, యాప్‌లకు సైన్ ఇన్ చేయవచ్చు. మీరు సైట్ లేదా యాప్‌నకు సైన్ ఇన్ చేయడానికి ముందు Chrome నిర్ధారణ కోసం అడగాలని మీరు కోరుకుంటే, ఆటోమేటిక్‌గా సైన్ ఇన్ చేయండిని ఆఫ్ చేయండి.

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున ఉన్న మరిన్ని నిర్వహించండి ఆ తర్వాత పాస్‌వర్డ్‌లు, ఆటోఫిల్ ఆ తర్వాత Google Password Manager అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. ఎడమ వైపున, సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. ఆటోమేటిక్‌గా సైన్ ఇన్ చేసే ఆప్షన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.
కంప్యూటర్ Android
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
12312900995056146238
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
237
false
false