గెస్ట్‌లాగా Chromeను బ్రౌజ్ చేయండి

ముఖ్య గమనిక: మీరు విశ్వసించే వ్యక్తుల పరికరాలలో మాత్రమే గోప్యమైన వెబ్‌సైట్‌లకు లాగిన్ చేయండి. ఓనర్‌లు మీ డేటాకు యాక్సెస్ పొందే అవకాశం ఉంది.

గెస్ట్ మోడ్‌లో ఉన్నప్పుడు, ఏ ఇతర Chrome ప్రొఫైళ్ల సమాచారాన్నీ మీరు చూడరు లేదా మార్చలేరు. మీరు గెస్ట్ మోడ్ నుండి నిష్క్రమించినప్పుడు, మీ బ్రౌజింగ్ యాక్టివిటీ కంప్యూటర్ నుండి తొలగించబడుతుంది.

దీని కోసం గెస్ట్ మోడ్‌ను ఉపయోగించండి:

  • మీ కంప్యూటర్‌ను ఇతరులకు ఇవ్వడం, లేదా వేరొకరి కంప్యూటర్‌ను మీరు తీసుకోవడం.
  • లైబ్రరీ లేదా కెఫే లాంటి ప్రాంతాల్లో పబ్లిక్ కంప్యూటర్ ఉపయోగించడం.

మీ స్వంత కంప్యూటర్‌లో ప్రైవేట్‌గా బ్రౌజ్ చేయాలనుకుంటే, అజ్ఞాత మోడ్ ఉపయోగించండి. ఎటువంటి బ్రౌజింగ్ హిస్టరీని సేవ్ చేయకుండానే మీరు మీ సమాచారం, సెట్టింగ్‌లను చూస్తారు.

గెస్ట్ మోడ్‌ను తెరవండి

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున ఉన్న ప్రొఫైల్Profileను క్లిక్ చేయండి.
  3. గెస్ట్‌ను క్లిక్ చేయండి.

చిట్కాలు:

గెస్ట్ మోడ్ నుండి నిష్క్రమించండి

గెస్ట్ మోడ్ బ్రౌజింగ్ విండోను మూసివేయండి.

మీ బ్రౌజింగ్ హిస్టరీ, కుక్కీలు, సైట్ డేటా తొలగించబడతాయి.

ఇతరులు కొంత సమాచారాన్ని చూడగలరు

గెస్ట్ మోడ్ మీ బ్రౌజింగ్ యాక్టివిటీని మీ లోకల్ హిస్టరీకి సేవ్ చేయకుండా Chromeను ఆపివేస్తుంది, కానీ మీరు విశ్వసించే వ్యక్తుల పరికరాలలో మాత్రమే గోప్యమైన వెబ్‌సైట్‌లకు లాగిన్ చేయాలి. పరికర ఓనర్‌లు మీ యాక్టివిటీ, లొకేషన్ వంటి మీ డేటాకు యాక్సెస్‌ను పొందే అవకాశం ఉంది. ఈ డేటా ఇప్పటికీ వీరికి కనిపించవచ్చు:

  • మీరు సందర్శించే వెబ్‌సైట్‌లు, యాడ్‌లు, రిసోర్స్‌లతో పాటు ఆ సైట్‌లలో ఉపయోగించబడతాయి
  • మీరు సైన్ ఇన్ చేసే వెబ్‌సైట్‌లు
  • మీ ఎంప్లాయర్, పాఠశాల, లేదా మీరు ఉపయోగించే నెట్‌వర్క్‌ను రన్ చేసే ఎవరైనా
  • మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్
  • సెర్చ్ ఇంజిన్‌లు

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
13818589065416082985
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
237
false
false