Chrome నుండి చిట్కాలు & సూచనలు

కింద ఉన్న మా కొన్ని చిట్కాలను ట్రై చేయడం ద్వారా Chrome నుండి అత్యధిక ప్రయోజనాలను పొందండి.

మీ Google ఖాతాతో Chromeకు సైన్ ఇన్ చేయండి

మీరు మీ Google ఖాతాతో Chromeకు సైన్ ఇన్ చేసినప్పుడు, మీ పాస్‌వర్డ్‌లు, బుక్‌మార్క్‌లు, ఇతర డేటా వంటి వివరాలను మీ ఖాతాలో సేవ్ చేసుకోవచ్చు. ఇది మీరు సైన్ ఇన్ చేసిన మీ ఇతర పరికరాలలో వాటిని ఉపయోగించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

మీ Google ఖాతాతో Chromeకు సైన్ ఇన్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

మీ స్వంత ప్రొఫైల్‌ను రూపొందించుకోండి

ఒకే పరికరంలో పలువురు వ్యక్తులు Chromeను వారి సొంత సెట్టింగ్‌లు, బుక్‌మార్క్‌లు, థీమ్‌లతో, ఉపయోగించేలా చేయడానికి మీకు అవకాశం ఉంది.

మీరు వర్క్ ఖాతా, వ్యక్తిగత ఖాతా లాంటి వేర్వేరు ఖాతాలను కలిగి ఉన్నట్లయితే, మీరు బుక్‌మార్క్‌లు, ఎక్స్‌టెన్షన్‌లు, సెట్టింగ్‌లను వేరుగా ఉంచేందుకు Chrome ప్రొఫైల్‌లను ఉపయోగించవచ్చు.

Chrome ప్రొఫైల్‌ను జోడించడం ఎలాగో తెలుసుకోండి.

ఎక్స్‌టెన్షన్‌లతో, రూపాలతో Chromeను వ్యక్తిగతీకరించండి

ఎక్స్‌టెన్షన్‌లు లేదా ఆహ్లాదకరమైన థీమ్‌తో Chromeను వ్యక్తిగతీకరించండి. మీరు Chrome వెబ్ స్టోర్‌లో కొత్త ఎక్స్‌టెన్షన్‌లు, థీమ్‌లను కనుగొనవచ్చు.

  • ఎక్స్‌టెన్షన్‌లు అనేవి మీరు Chromeకు జోడించగల అదనపు ఫీచర్‌లు.
  • మీరు కొత్త ట్యాబ్‌ను తెరిచినప్పుడు బ్రౌజర్ అంచున చుట్టూ థీమ్‌లు కనపడతాయి, బ్యాక్‌గ్రౌండ్‌ను చూపిస్తాయి.

రూపాలతో Chromeను అనుకూలంగా మార్చడం ఎలాగో తెలుసుకోండి.

నిర్దిష్ట పేజీని తెరవండి లేదా మీరు ఆపివేసిన చోటు నుండే కొనసాగించండి

మీరు మీ కంప్యూటర్‌లో Chromeను మొదటగా తెరిచినప్పుడు, మీకు ఇష్టమైన పేజీని లోడ్ చేయడానికి Chromeను సెటప్ చేయండి. లేదా, మీరు Chromeను చివరిసారి ఉపయోగించినప్పుడు మీరు తెరిచిన పేజీలలో మీరు ఆపివేసిన చోటు నుండి కొనసాగించవచ్చు.

మీ ప్రారంభ పేజీలను సెట్ చేయడంఎలాగో తెలుసుకోండి.

ప్రైవేట్‌గా బ్రౌజ్ చేయండి లేదా హిస్టరీని తొలగించండి

మీరు సందర్శించిన, డౌన్‌లోడ్ చేసిన వాటి రికార్డును Google Chrome సేవ్ చేయకూడదని మీరు అనుకున్నట్లయితే, మీరు వెబ్‌ను అజ్ఞాత మోడ్‌లో ప్రైవేట్‌గా బ్రౌజ్ చేయవచ్చు. మీరు మీ హిస్టరీ, కుక్కీలు, ఇతర సమాచారాన్ని కూడా తొలగించవచ్చు: వాటి మొత్తం, లేదా నిర్దిష్ట సమయం నుండి కొంత తీసివేయండి.

అజ్ఞాత మోడ్‌ను ఉపయోగించడం, మీ సమాచారాన్ని తొలగించడంఎలాగో తెలుసుకోండి.

మీ కొత్త ట్యాబ్ పేజీని వ్యక్తిగతీకరించండి

మీ వెబ్ యాక్టివిటీ ఆధారంగా మీకు ఉపయోగపడే కంటెంట్‌ను Chrome నిర్వహిస్తుంది. కొత్త ట్యాబ్ పేజీలోని Chrome కార్డ్‌లు ఇటీవలి Google Drive ఫైల్స్‌కు, మీ షాపింగ్ కార్ట్‌లకు క్విక్ యాక్సెస్‌ను అందిస్తాయి.

మీ కొత్త ట్యాబ్ పేజీని వ్యక్తిగతీకరించడం ఎలానో తెలుసుకోండి.

సంబంధిత రిసోర్స్‌లు

true
Google Chrome tips

From productivity to customization, learn how to get things done more quickly with your browser.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
12378378655926302121
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
237
false
false