అవసరంలేని యాడ్‌లు, పాప్-అప్‌లు, మాల్‌వేర్‌ను తీసివేయండి

మీరు ఈ సమస్యలను ఎదుర్కొంటుంటే, మీ కంప్యూటర్‌లో మీరు అవాంఛిత సాఫ్ట్‌వేర్‌ను లేదా మాల్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసి ఉండవచ్చు:

  • విస్మరించలేని పాప్-అప్ యాడ్‌లు, కొత్త ట్యాబ్‌లు
  • మీ అనుమతి లేకుండా మీ Chrome హోమ్ పేజీ లేదా సెర్చ్ ఇంజిన్ మారుతూ ఉంటుంది
  • తిరిగి వస్తూనే ఉండే అవసరంలేని Chrome ఎక్స్‌టెన్షన్‌లు లేదా టూల్‌బార్‌లు
  • మీ బ్రౌజింగ్‌ను హైజాక్ చేసి, తెలియని పేజీలు, యాడ్‌లకు మళ్లిస్తుంది
  • వైరస్ లేదా హానికరమైన పరికరం గురించి అలర్ట్‌లు

చిట్కాలు:

మీ ఆటోమేటిక్ యాడ్‌ల అనుమతులను మార్చండి

అనుచితమైన లేదా తప్పుదారి పట్టించే యాడ్‌లను నిరోధించడానికి, మీ సైట్ సెట్టింగ్‌లను మార్చండి.
  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున ఉన్న, మరిన్ని మరిన్ని ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆ తర్వాత గోప్యత, సెక్యూరిటీ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. సైట్ సెట్టింగ్‌లు ఆ తర్వాత అదనపు కంటెంట్ సెట్టింగ్‌లు ఆ తర్వాత అనుచిత యాడ్‌లు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. మీరు ఆటోమేటిక్ సెట్టింగ్‌గా ఉండాలనుకుంటున్న ఆప్షన్‌ను ఎంచుకోండి.

మీ Macలో అవసరం లేని ప్రోగ్రామ్‌లను తీసివేయండి

మీరు మీ Macలో మీ బ్రౌజర్ సెట్టింగ్‌లను రీసెట్ చేయడానికి ముందు, అవసరం లేని ప్రోగ్రామ్‌ల కోసం మీ కంప్యూటర్‌ను చెక్ చేయండి.

మీ Macలో హానికరమైన సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లను మాన్యువల్‌గా తీసివేయండి

మీరు మీ కంప్యూటర్‌లో మాల్‌వేర్‌ను, అలాగే మీరు ఇన్‌స్టాల్ చేసినట్లు గుర్తులేని ఇతర ప్రోగ్రామ్‌లను తీసివేయవచ్చు.

  1. ఫైండర్‌ను తెరవండి.
  2. ఎడమ వైపు, యాప్‌లను క్లిక్ చేయండి.
  3. మీరు గుర్తించని ఏ ప్రోగ్రామ్‌ల కోసం అయినా చూడండి.
  4. ఏ అవసరంలేని ప్రోగ్రామ్‌ల పేరును అయినా కుడి క్లిక్ చేయండి.
  5. ట్రాష్‌కు తరలించండిని క్లిక్ చేయండి.
  6. మీరు పూర్తి చేసిన తర్వాత, దిగువున, ట్రాష్‌ను కుడి క్లిక్ చేయండి.
  7. ట్రాష్‌ను ఖాళీ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీ బ్రౌజర్ సెట్టింగ్‌లను రీసెట్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, మరిన్ని మరిన్ని ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. సెట్టింగ్‌లను రీసెట్ చేయండి ఆ తర్వాత సెట్టింగ్‌లను వాటి ఒరిజినల్ ఆటోమేటిక్ సెట్టింగ్‌లకు రీస్టోర్ చేయండి ఆ తర్వాత సెట్టింగ్‌లను రీసెట్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.

మీ బ్రౌజర్ సెట్టింగ్‌లను రీసెట్ చేస్తే, మీరు కొన్ని ఎక్స్‌టెన్షన్‌లను ఆన్ చేయాలి. ఎక్స్‌టెన్షన్‌లను ఆన్ చేయడానికి, ఎగువున కుడి వైపున ఉన్న, మరిన్ని మరిన్ని ఆ తర్వాత ఎక్స్‌టెన్షన్‌లు ఆ తర్వాత ఎక్స్‌టెన్షన్‌లను మేనేజ్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి. మీరు నమ్మే ఎక్స్‌టెన్షన్‌లను మాత్రమే ఆన్ చేయండి.

పైన పేర్కొన్న దశల వలన పని జరగకపోతే, Chrome సహాయ ఫోరమ్‌కు వెళ్లండి.

చిట్కా: మీరు వెబ్‌సైట్ ఓనర్ అయితే, మీ డౌన్‌లోడ్‌లకు సంబంధించిన మాల్‌వేర్ లేదా అవాంఛిత సాఫ్ట్‌వేర్ సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలుసుకోండి.

మాల్‌వేర్ గురించి మరింత సమాచారం

మాల్‌వేర్‌ను గుర్తించడం ఎలా (వీడియో, 1:42)

మాల్‌వేర్‌ను గుర్తించడానికి మూడు చిట్కాలు (1:42)

మీ కంప్యూటర్‌లో మీరు మాల్‌వేర్‌ను కలిగి ఉన్నప్పుడు ఏమి చూడాలి, ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఎలా ఉండాలో తెలుసుకోండి.

మీ కంప్యూటర్‌లో మీరు మాల్‌వేర్‌ను కలిగి ఉన్నప్పుడు ఏమి చూడాలి, ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఎలా ఉండాలో తెలుసుకోండి.

భవిష్యత్తులో మాల్‌వేర్‌ను నివారించడం ఎలా
  • అవాంఛిత సాఫ్ట్‌వేర్‌ను మీరు డౌన్‌లోడ్ చేసేలా చేసే సైట్‌ల పట్ల జాగ్రత్త వహించండి. ఉదాహరణకు, మీరు ఒక పోటీలో గెలిచారని లేదా కాపీరైట్ చేసిన కంటెంట్‌ను ఛార్జీ లేకుండా పొందవచ్చని చెప్పేవి.
  • యాంటీ-వైరస్‌ను గుర్తించే స్కాన్‌లను బైపాస్ చేసే అవకాశం ఉన్న పాస్‌వర్డ్ అవసరమైన .zip ఫైల్స్ వంటి ఎన్‌క్రిప్ట్ చేసిన ఆర్కైవ్‌ల పట్ల జాగ్రత్త వహించండి.
  • ప్రత్యేకించి మీరు ఇటీవల వైరస్ స్కానర్‌ను ఉపయోగించకపోతే, వైరస్‌లు లేదా హానికరమైన పరికరాల గురించి చేసే హెచ్చరికల పట్ల జాగ్రత్త వహించండి.
  • మీరు సైట్‌లకు వెళ్లినప్పుడు సురక్షితం కాని కనెక్షన్‌లను ఉపయోగించకండి, HTTPSతో ప్రారంభం కాని సైట్‌ల నుండి ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయకండి. సైట్ కనెక్షన్ సురక్షితంగా ఉందో, లేదో ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.
  • సురక్షిత బ్రౌజింగ్ అందించే డౌన్‌లోడ్ హెచ్చరికలపై శ్రద్ధ వహించండి. యాంటీ-వైరస్ గుర్తింపులను పని చేయకుండా చేయడానికి, హానికరమైన సాఫ్ట్‌వేర్‌లు హెచ్చరికలను ఆఫ్ చేయమని లేదా వాటిని విస్మరించమని మిమ్మల్ని కోరవచ్చు.
  • ప్రోగ్రామ్‌కు సంబంధించిన అప్‌డేట్ లేదా డౌన్‌లోడ్ గురించిన పాప్‌అప్ అనుమానాస్పదంగా కనిపిస్తే, దానిపై క్లిక్ చేయకండి. బదులుగా, దానిని డౌన్‌లోడ్ చేయడానికి ప్రోగ్రామ్ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15461408166191455303
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
237
false
false