థర్డ్-పార్టీ సైన్-ఇన్ గురించి తెలుసుకోండి

థర్డ్-పార్టీ సైన్-ఇన్ అనేది ఒక రకమైన ఫెడరేటెడ్ సైన్-ఇన్, ఇది మీరు చూసే ప్రతి వ్యక్తిగత వెబ్‌సైట్ కోసం ప్రత్యేకమైన లాగిన్ ఆధారాలను క్రియేట్ చేయడానికి బదులుగా ఐడెంటిటీ సర్వీస్‌తో లాగిన్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు థర్డ్-పార్టీ సైన్-ఇన్ ప్రాంప్ట్‌లను అనుమతిస్తే, మీరు వెబ్‌లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు, మీరు ఐడెంటిటీ సర్వీస్‌తో సైన్ ఇన్ చేయాలనుకుంటున్నారా అని అడిగే డైలాగ్‌లను మీరు అందుకోవచ్చు.

మీకు నచ్చిన ఐడెంటిటీ సర్వీస్ ద్వారా మీరు Chromeను ఉపయోగించి వెబ్‌సైట్‌లకు సైన్ ఇన్ చేయవచ్చు. ఐడెంటిటీ సర్వీస్ మీ అనుమతి ప్రకారం వెబ్‌లో మీ సైన్-ఇన్ సమాచారం, ఐడెంటిటీని స్టోర్ చేస్తుంది, మేనేజ్ చేస్తుంది.

థర్డ్-పార్టీ సైన్ ఇన్ ప్రాంప్ట్‌లను మేనేజ్ చేయండి

మీ థర్డ్-పార్టీ సైన్-ఇన్ ప్రాంప్ట్ ప్రాధాన్యతలను ఎంచుకోవడానికి కింది దశలను అవ్వండి:

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున ఉన్న, మరిన్ని నిర్వహించండి ఆ తర్వాత సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. ఎడమ వైపున ఉన్న, గోప్యత, సెక్యూరిటీ ఆ తర్వాత సైట్ సెట్టింగ్‌లు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. “కంటెంట్” కింద ఉన్న, అదనపు కంటెంట్ సెట్టింగ్‌లు ఆ తర్వాత థర్డ్-పార్టీ సైన్ ఇన్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. మీకు నచ్చిన కింది సెట్టింగ్‌ను ఎంచుకోండి:
    • ఐడెంటిటీ సర్వీస్‌ల నుండి సైన్-ఇన్ ప్రాంప్ట్‌లను సైట్‌లు చూపగలవు
    • ఐడెంటిటీ సర్వీస్‌ల నుండి సైన్-ఇన్ ప్రాంప్ట్‌లను బ్లాక్ చేయండి

చిట్కా: మీరు ఈ ఫీచర్‌ను బ్లాక్ చేస్తే, Chrome మీ ఐడెంటిటీ సర్వీస్ ద్వారా సైన్ ఇన్ చేయమని స్థానిక ప్రాంప్ట్‌లను చూపదు, కానీ మీరు చూసే వెబ్‌సైట్ లేదా మీ ఐడెంటిటీ సర్వీస్ ఇప్పటికీ మీకు ఇలాంటి ప్రాంప్ట్‌లను చూపవచ్చు. అంతేకాకుండా, మీరు ఇప్పటికీ సాధారణ సైన్-ఇన్ బటన్‌లు లేదా మీ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ ద్వారా మీ ఐడెంటిటీ సర్వీస్‌తో లాగిన్ చేయవచ్చు.

సంబంధిత రిసోర్స్‌లు

కంప్యూటర్ Android
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
12767019123199304037
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
237
false
false