మీ లొకేషన్‌ను షేర్ చేయండి

సైట్‌లకు మీ లొకేషన్‌ను చూసే అవకాశం ఇవ్వడం ద్వారా వాటి నుంచి మరింత ఉపయోగకర సమాచారాన్ని పొందండి. ఉదాహరణకు, మీ లొకేషన్ షేర్ చేయడం ద్వారా, మీకు దగ్గరలో ఉన్న ఫుడ్ స్టాల్‌ల గురించి త్వరగా తెలుసుకోవచ్చు.

సైట్‌కు మీ లొకేషన్ తెలియనివ్వడం

ఏదైనా సైట్ మీ లొకేషన్‌ను చూడాలనుకుంటున్నపుడు, Chrome మిమ్మల్ని ఆటోమేటిక్‌గా అడుగుతుంది. మీరు ఎక్కడున్నారనేది సైట్‌కు తెలియజేయడానికి, అనుమతించండి ఆప్షన్‌ను ఎంచుకోండి. మీ లొకేషన్‌ను షేర్ చేయడానికి ముందు, సైట్‌కు సంబంధించిన గోప్యతా పాలసీని రివ్యూ చేయండి.

ఒకవేళ మీరు మీ ఫోన్‌లో Googleను ఆటోమేటిక్ సెర్చ్ ఇంజిన్‌గా ఉపయోగిస్తే, Googleలో మీరు చేసే అన్ని సెర్చ్‌లకు మీ లొకేషన్ ఆటోమేటిక్‌గా ఉపయోగించబడుతుంది.

మీ ఆటోమేటిక్ లొకేషన్ సెట్టింగ్‌లను మార్చడం

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Chrome యాప్ Chromeను తెరవండి.
  2. అడ్రస్ బార్‌కు కుడి వైపున ఉన్న, మరిన్ని మరిన్ని ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. సైట్ సెట్టింగ్‌లు ఆ తర్వాత లొకేషన్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. లొకేషన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

నిర్దిష్ట సైట్‌కు సంబంధించిన సెట్టింగ్‌లను మార్చడానికి, కింద లిస్ట్ చేయబడిన సైట్ పేరును ట్యాప్ చేయండి.

మీ లొకేషన్‌కు Google యాక్సెస్‌ను మార్చడం

ఒకవేళ మీ ఆటోమేటిక్ సెర్చ్ ఇంజిన్ Google అయితే, అడ్రస్ బార్‌లోను, Googleలోను మీరు చేసిన సెర్చ్‌లకు మీ లొకేషన్ ఉపయోగించబడుతుంది.

సెర్చ్‌లలో మీ లొకేషన్ ఉపయోగాన్ని నిలిపివేయడానికి:

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Chrome యాప్ Chromeను తెరవండి.
  2. google.com వంటి Google సెర్చ్ పేజీకి వెళ్లండి.
  3. వెబ్ అడ్రస్‌కు ఎడమ వైపున, పేజీ సమాచారం Default (Secure) ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. అనుమతులు ఆ తర్వాత లొకేషన్ యాక్సెస్ ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
  5. ప్రస్తుత సెర్చ్ ఇంజిన్‌కు బ్లాక్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.

మీ లొకేషన్‌ను Chrome ఎలా షేర్ చేస్తుంది

ఒకవేళ మీరు ఏదైనా సైట్‌కు మీ లొకేషన్‌ను షేర్ చేయడానికి మీరు Chromeను అనుమతిస్తే, మీరు ఎక్కడ ఉన్నారనే అంచనా కోసం సమాచారాన్ని Chrome, Google లొకేషన్ సర్వీస్‌లకు పంపిస్తుంది. ఆ తర్వాత, మీ లొకేషన్‌ను అడుగుతున్న సైట్‌కు ఆ సమాచారాన్ని Chrome షేర్ చేస్తుంది.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
1649898520439295533
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
237
false
false