యాడ్‌ల విషయంలో గోప్యత అన్నది Chromeలో ఎలా పని చేస్తుంది

Chromeలోని యాడ్‌ల విషయంలో గోప్యత ఫీచర్‌లు ఆన్‌లైన్‌లో మీ గోప్యతను మెరుగుపరుస్తాయి. అదే సమయంలో, అవి యాడ్‌లకు, అలాగే యాడ్‌లకు వీలు కల్పించే ఉచిత కంటెంట్‌కు, సర్వీస్‌లకు సపోర్ట్ అందిస్తాయి.

యాడ్‌ల విషయంలో గోప్యత అన్నది Chromeలో ఎలా పని చేస్తుంది

మీరు సందర్శించే సైట్‌లు ఇతర సైట్‌లలోని కంటెంట్‌ను పొందుపరచవచ్చు, తద్వారా వాటి కంటెంట్‌ను, అంటే ఇమేజ్‌లు, యాడ్‌లు, ఇంకా టెక్స్ట్‌ని మరింత మెరుగైన రీతిలో అందించవచ్చు. ఇప్పుడు, ఈ పొందుపరిచిన కంటెంట్ థర్డ్-పార్టీ కుక్కీలను ఉపయోగించడం ద్వారా మీరు వెబ్‌లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని ట్రాక్ చేస్తాయి. ప్రస్తుతం మీరు కుక్కీలను బ్లాక్ చేయడానికి ఎంచుకోవచ్చు, అయితే, దీని వలన వెబ్‌సైట్ పనితనంలో తరచుగా ఆటంకాలు ఎదురవుతాయి. Chromeలోని యాడ్‌ల గోప్యత ఫీచర్‌లు ట్రాకింగ్ చేయకుండానే అదే రకం బ్రౌజింగ్ అనుభవాన్ని అందిస్తాయి.

ఇదంతా 2024 ద్వితీయార్థంలో థర్డ్-పార్టీ కుక్కీల తొలగింపు ప్రణాళికలో భాగం. ఇది మరింత ప్రైవేట్ వెబ్‌ను అందించడానికి చేస్తున్న కృషిలో తొలి అడుగు మాత్రమే. Chrome కాలక్రమేణా మరిన్ని గోప్యత రక్షణలను విడుదల చేయడం కొనసాగిస్తుంది.

మీ గోప్యతను కాపాడటంలో Chrome ఎలా సహాయపడుతుంది

అడ్వర్టయిజింగ్ కోసం ఉపయోగించినప్పుడు, యాడ్‌ల గోప్యత APIలు మీ గోప్యతను కాపాడతాయి, అలాగే మీ గురించి తెలుసుకోవడానికి సైట్‌లు ఉపయోగించగల డేటా మొత్తాన్ని కనీస స్థాయికి తగ్గిస్తాయి. ఎలా అంటే:

  • మీ గుర్తింపును కాపాడతాయి: యాడ్ గోప్యత APIలు మీరు బ్రౌజ్ చేసేటప్పుడు మీ యాక్టివిటీని ట్రాక్ చేయగల సైట్ సామర్థ్యాన్ని పరిమితం చేస్తాయి. మిమ్మల్ని మళ్లీ గుర్తించకుండా కూడా APIలు కాపాడతాయి. ఉదాహరణకు, ట్రాకర్ అప్పటికే కలిగి ఉన్న మీ యాక్టివిటీ, ఇతర సమాచారం, అంటే వెబ్‌సైట్‌లోని మీ గుర్తింపు లాంటి వాటి ఆధారంగా, మీరు ఎవరు అనేది గుర్తించగలుగుతుంది.
    • Topics API మీ ఇటీవలి బ్రౌజింగ్ హిస్టరీ ఆధారంగా మీ ఆసక్తులపై ఉన్నతస్థాయి అవగాహనను సైట్‌లకు అందిస్తుంది. కొత్త API అన్నది అవసరం కోసం అపరిమిత సమాచారాన్ని అందించడం కాకుండా, కేవలం మూడు ఆసక్తులకు సంబంధించిన సమాచారాన్ని అంటే “స్పోర్ట్స్” లాంటి వాటి సమాచారాన్ని మాత్రమే స్వీకరించేలా సైట్‌లను అనుమతిస్తుంది. ఇది అప్పుడప్పుడు యాదృచ్ఛిక ఆసక్తిని కూడా అందిస్తుంది. మేము దీన్నే “డేటాను ఇతర వాటితో కలిపి అస్పష్టంగా మార్చడం” అని కూడా పిలుస్తాము, మీ గుర్తింపును కాపాడటం కోసం మేము ఇలా చేస్తాము. దీనంతటి వలన ట్రాకర్ మిమ్మల్ని గుర్తించడానికి తగినంత సమాచారాన్ని సేకరించడం మరింత కష్టమయ్యేలా Topics API చేస్తుంది. Topics API గురించి మరింత తెలుసుకోండి.
    • Protected Audience API అన్నది మీ పరికరంలో పరిమిత బ్రౌజింగ్ హిస్టరీని మాత్రమే స్టోర్ చేసే విధంగా సైట్‌లను అనుమతిస్తుంది. అడ్వర్టయిజింగ్ టెక్నాలజీ కంపెనీలు మీ క్రాస్-సైట్ డేటాను మీ పరికరంలో మాత్రమే ప్రాసెస్ చేయగలుగుతాయి. కనుక మిమ్మల్ని గుర్తించడం, మీ గురించిన సమాచారాన్ని సేకరించడం మరింత కష్టతరం అవుతుంది. Protected Audience API గురించి మరింత తెలుసుకోండి.
    • Attribution Reporting API సహాయంతో, అడ్వర్టయిజర్‌లు వివిధ సైట్‌లు, యాప్‌లలోని మీ యాక్టివిటీని ట్రాక్ చేయాల్సిన అవసరం లేకుండానే వారి ఆన్‌లైన్ యాడ్‌ల ప్రభావాన్ని కొలవగలుగుతారు. Topics లాగానే, ఈ API కూడా డేటాను ఇతర వాటితో కలిపి అస్పష్టంగా మార్చడం ద్వారా మిమ్మల్ని గుర్తించడానికి ఉపయోగించే ప్రత్యేక తరహా అంశాలను కనిపెట్టలేని విధంగా చేస్తుంది. అలాగే ఇది రిపోర్ట్‌లలో ల్యాగ్ ఉండేలా చేస్తుంది. అందువల్ల డేటా సెట్‌లలోని మీ యాక్టివిటీని కనెక్ట్ చేయడం కూడా మరింత కష్టతరం అవుతుంది. యూజర్ ఐడెంటిఫయర్‌లను అస్పష్టంగా మార్చి, ఎన్‌క్రిప్ట్ చేసినప్పటికీ, ఆ ఐడెంటిఫయర్‌లతో నేడు సాధ్యమయ్యే అనేక పునః-గుర్తింపు దాడులను ఈ రక్షణలు నిరోధిస్తాయి. Attribution Reporting API గురించి మరింత తెలుసుకోండి.
  • డేటా కలెక్షన్‌ను తగ్గించండి: నేడు, థర్డ్-పార్టీ కుక్కీల వంటి సాంకేతికతల కారణంగా మీరు వెబ్‌లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు అడ్వర్టయిజింగ్ టెక్నాలజీ కంపెనీలు పెద్ద మొత్తంలో మీ డేటాను కలెక్ట్ చేయగలవు. యాడ్ గోప్యత APIలు ఏ సమయంలోనైనా మీ గురించి తెలుసుకోగల డేటా పరిమాణాన్ని పరిమితం చేస్తాయి, ప్రత్యేకించి మీరు ఒక సైట్ నుండి మరొక సైట్‌కి బ్రౌజ్ చేస్తున్నప్పుడు, థర్డ్-పార్టీ కుక్కీలను బ్లాక్ చేసే సమయంలో మీ గోప్యతను గణనీయంగా మెరుగుపరుస్తాయి. అడ్వర్టయిజింగ్ కంపెనీ మిమ్మల్ని గుర్తుపట్టడాన్ని APIలు మరింత కష్టతరం చేస్తాయి, అంటే మీతో ప్రొఫైల్‌ను ఏర్పరిచి, దానిని అనుబంధించడం చాలా కష్టంగా ఉంటుంది. APIలు ఈ విధమైన ఇతర డేటా పరిమితులను కూడా విధిస్తాయి:
    • Topics API మీ ఇటీవలి బ్రౌజింగ్ హిస్టరీ ఆధారంగా వారానికి అతితక్కువ సంఖ్యలో అంశాలను మాత్రమే కలెక్ట్ చేసేలా అడ్వర్టయిజర్‌లకు పరిమితి విధిస్తుంది. ప్రస్తుతం థర్డ్-పార్టీ కుక్కీలు, ఇతర ఐడెంటిఫయర్‌లు కాలానుగుణమైన మీ మొత్తం బ్రౌజింగ్ హిస్టరీ ఆధారంగా మీ గురించి అత్యంత వివరణాత్మక సమాచారాన్ని సేకరించేందుకు అడ్వర్టయిజింగ్ టెక్నాలజీ కంపెనీలను అనుమతిస్తుంటాయి.
    • Protected Audience API అన్నది మీరు ఒక వ్యక్తిగతీకరించిన యాడ్‌ను చూసినప్పుడు డేటాను ఎవరు స్వీకరించాలి, వారు ఏయే డేటాను స్వీకరించాలి అనే అంశాలను నియంత్రిస్తుంది. వెబ్ పేజీలో యాడ్‌ను చూపించడానికి ప్రమేయం కలిగి ఉన్న కంపెనీలు మాత్రమే, ఈ APIతో ఆ యాడ్ ఇంప్రెషన్ గురించిన సమాచారాన్ని స్వీకరిస్తాయి. దీనికి విరుద్ధంగా, ఈనాడు, థర్డ్-పార్టీ కుక్కీలను ఉపయోగించి పేజీలో వ్యక్తిగతీకరించిన యాడ్‌ను ఉంచినప్పుడు, యాడ్‌ను చూపడంలో తమకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ, విస్తృత స్థాయిలోని అనేక రకాల కంపెనీలు సమాచారాన్ని సేకరించగలుగుతాయి.
    • Attribution Reporting API ఏదైనా ఇవ్వబడిన యాడ్‌ను చూపడం కోసం మీతో కనెక్ట్ చేయగల సమాచారాన్ని పరిమితం చేస్తుంది. అలాగే సమగ్రంగా అందించే రిపోర్ట్‌ల కోసం, మీ గుర్తింపును కాపాడటానికి అనేక యూజర్ రిపోర్ట్‌లను ఒకే రిపోర్ట్‌గా పూల్ చేయడం ద్వారా, API కొలవగల సమాచార రకాలను సమర్థవంతంగా పరిమితం చేస్తుంది, అలాగే రికార్డ్ చేయబడే యాడ్‌పై సానుకూల స్పందన‌ సమాచారం పరిమాణాన్ని కూడా పరిమితం చేస్తుంది. నేడు, ట్రాకర్‌లు మీ యాక్టివిటీకి సంబంధించిన వివరణాత్మక సమాచారంతో సహా అపరిమిత మొత్తంలో డేటాను సేకరించగలవు.
  • అడ్వర్టయిజింగ్ టెక్నాలజీ ప్రొవైడర్‌ల నుండి గొప్ప స్థాయిలో జవాబుదారీతనం: యాడ్‌ల కోసం ఈ APIలను ఉపయోగించే అడ్వర్టయిజింగ్ టెక్నాలజీ కంపెనీలను ట్రాక్ చేస్తుండటం ద్వారా పారదర్శకత, జవాబుదారీతనం లభిస్తుంది. Chrome ఒక "ధృవీకరణ సంతకం" మోడల్‌ను ఉపయోగిస్తుంది, దీని కోసం అడ్వర్టయిజింగ్ టెక్నాలజీ కంపెనీలు స్వీకరించే పరిమిత డేటాను తాము సక్రమమైన పద్ధతిలో, గోప్యతను కాపాడే విధంగా ఉపయోగించడానికి స్పష్టంగా, పబ్లిక్‌గా కట్టుబడి ఉండాలి. అడ్వర్టయిజింగ్ టెక్నాలజీ ప్రొవైడర్‌ల నుండి గొప్ప జవాబుదారీతనం గురించి మరింత తెలుసుకోండి.
  • మరింత సమర్థవంతమైన యూజర్ కంట్రోల్స్: నేడు, థర్డ్-పార్టీ కుక్కీలతో మీ యాడ్‌ల విషయంలో గోప్యతను నిర్వహించడానికి శ్రమ పడాల్సి ఉంటుంది. మీరు థర్డ్-పార్టీ కుక్కీల సహాయంతో నిరంతర సైన్-ఇన్ సేవల వంటి యాడ్ యేతర ప్రయోజనాలను వదులుకోవడానికి సిద్ధపడి థర్డ్-పార్టీ కుక్కీలను పూర్తిగా ఆఫ్ చేయవచ్చు లేదా మీరు థర్డ్-పార్టీ కుక్కీలను యాక్టివ్‌గానే ఉంచి, వందల కొద్దీ కుక్కీ డొమైన్‌ల ద్వారా, అలాగే తరచూ గుర్తించలేని అడ్వర్టయిజింగ్ టెక్నాలజీ ప్రొవైడర్‌ల ద్వారా క్రమబద్ధీకరించవచ్చు. కొత్త APIలతో, మీ ఆన్‌లైన్ యాడ్‌ల గోప్యతను మేనేజ్ చేయడం మరింత సులభం అవుతుంది. ఉదాహరణకు, Protected Audience API ద్వారా వ్యక్తిగతీకరించిన యాడ్‌లను అందిస్తున్నప్పుడు, మీకు వ్యక్తిగతీకరించిన యాడ్‌లను చూపడానికి ఉపయోగించకూడదని కోరుకునే నిర్ణీత అంశాలను, సైట్‌లను మీరు బ్లాక్ చేయవచ్చు.
మీరు కంట్రోల్ చేయవచ్చు

ముఖ్య విషయం: వెబ్‌సైట్‌లు చూపే యాడ్‌లకు కూడా సైట్ పాలసీలు వర్తిస్తాయి.

మీరు బ్రౌజ్ చేస్తున్నప్పుడు, మీకు వ్యక్తిగతీకరించిన యాడ్‌లను చూపడానికి సైట్‌లు యాడ్‌ల గోప్యత APIలను ఉపయోగిస్తున్నప్పుడు ఆ సైట్‌లు ఉపయోగించే సమాచారాన్ని ప్రభావితం చేయడానికి ఈ సెట్టింగ్‌లు మిమ్మల్ని అనుమతిస్తాయి. మీరు మీ Chrome సెట్టింగ్‌లలో ఎప్పుడైనా ఈ ఫీచర్‌లను ఆఫ్ చేయవచ్చు. అలాగే, మీరు Chromeలో కుక్కీలను క్లియర్ చేయవచ్చు, అనుమతించవచ్చు, మేనేజ్ చేయవచ్చు.

ఈ కొత్త సెట్టింగ్‌లు, అలాగే థర్డ్-పార్టీ కుక్కీల నిలిపివేత పని ప్రోగ్రెస్‌లో ఉంది. 2024 ద్వితీయార్ధం ప్రారంభ కాలంలో Chromeలోని థర్డ్-పార్టీ కుక్కీలను విస్మరించేంత వరకు, కొత్త యాడ్‌ల గోప్యతా APIల ద్వారా లభించే పూర్తి గోప్యతా ప్రయోజనాలను పొందలేరు.

మీ Chrome యాడ్‌ల గోప్యతా సెట్టింగ్‌లను మార్చడానికి:

కంప్యూటర్

  1. మీ కంప్యూటర్‌లో, Chrome Chromeను తెరవండి.
  2. పైన కుడివైపున, మరిన్ని మరిన్ని ఆ తర్వాత సెట్టింగ్‌లు ఎంచుకోండి.
  3. గోప్యత, సెక్యూరిటీ ఆ తర్వాత యాడ్‌ల విషయంలో గోప్యతను ఎంచుకోండి.
  4. మీరు ఆన్ లేదా ఆఫ్ చేయాలనుకుంటున్న యాడ్ ఫీచర్‌ను ఎంచుకోండి.

Android

  1. మీ Android పరికరంలో, Chrome Chromeను తెరవండి.
  2. మరిన్ని మరిన్ని ఆ తర్వాత సెట్టింగ్‌లను ట్యాప్ చేయండి.
  3. గోప్యత, సెక్యూరిటీ ఆ తర్వాత యాడ్‌ల విషయంలో గోప్యతను ఎంచుకోండి.
  4. మీరు ఆన్ లేదా ఆఫ్ చేయాలనుకుంటున్న యాడ్ ఫీచర్‌ను ఎంచుకోండి.

iOS

iOS పరికరాలలో Chrome కోసం యాడ్‌ల గోప్యతా సెట్టింగ్‌లు అందుబాటులో లేవు.

సంబంధిత రిసోర్స్‌లు

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
9540758166319599713
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
237
false
false