Chrome మీ URL & సెర్చ్ డేటాను ఎలా ప్రైవేట్‌గా ఉంచుతుంది

మీ Google Chrome బ్రౌజర్ విండోకు ఎగువున, వెబ్ అడ్రస్, సెర్చ్ బార్ కలిసి ఉన్నాయి. మీరు అడ్రస్ బార్‌పై ఫోకస్ చేసినప్పుడు లేదా అందులో టైప్ చేసినప్పుడు, మీ పరికర బ్రౌజింగ్ హిస్టరీ, మీ ఆటోమేటిక్ సెర్చ్ ఇంజిన్‌లోని డేటా ఆధారంగా అది వెబ్ అడ్రస్‌లు, సెర్చ్ క్వెరీలకు సూచనలను చూపుతుంది. ఆటోమేటిక్ సెర్చ్ ఇంజిన్ అందించిన సూచనలను మీరుChrome సెర్చ్ ఇంజిన్ సెట్టింగ్‌లలో మేనేజ్ చేయవచ్చు.

అడ్రస్ బార్ ఎలా పని చేస్తుంది

సూచనలు, సెర్చ్ ఫలితాలను వేగంగా అందించడానికి, బ్యాక్‌గ్రౌండ్‌లో Chrome మీ ఆటోమేటిక్ సెర్చ్ ఇంజిన్‌కు ముందుగానే కనెక్ట్ కావచ్చు.

"ఆటో-కంప్లీట్ సెర్చ్‌లు, URLల" సెట్టింగ్ ఎనేబుల్ అయి ఉంటే, మీరు అడ్రస్ బార్‌పై ఫోకస్ చేసినప్పుడు లేదా అందులో టైప్ చేసినప్పుడు, Chrome మీ ఆటోమేటిక్ సెర్చ్ ఇంజిన్‌కు డేటాను పంపుతుంది. మీరు టైప్ చేసేటప్పుడు, మీ సెర్చ్ క్వెరీలను ఆటో-కంప్లీట్ చేయడం కోసం, సూచనలను అందించడానికి, ఆ టెక్స్ట్‌ను పంపడం జరుగుతుంది. అంతే కాకుండా, మీరు ఆటోమేటిక్‌గా సెట్ చేసుకున్న సెర్చ్ ఇంజిన్ Google అయ్యి ఉండి, మీ హిస్టరీని మీ Google ఖాతాకు మీరు సింక్ చేసుకుని ఉంటే, మీ IP అడ్రస్, మీ కంప్యూటర్‌లో “కుక్కీలు”గా స్టోర్ అయిన సెర్చ్ సమాచారం, ప్రస్తుత URL, అత్యంత సందర్భోచితమైన సూచనలను అందించడం కోసం పంపబడతాయి.

"Chrome ఫీచర్‌లను, పనితీరును మెరుగుపరచడంలో సహాయపడండి" అనే సెట్టింగ్ ఎనేబుల్ అయ్యి ఉంటే, సూచన ఫీచర్‌ను మెరుగుపరచడానికి Chrome డేటాను తిరిగి Googleకు కూడా పంపుతుంది. మీరు ఒక సూచనను ఎంచుకున్నప్పుడు, అది సెర్చ్ అవుతుందా లేక URL అవుతుందా అనేది, మీరు ఎంచుకోవడానికి ముందు ఎన్ని అక్షరాలను టైప్ చేశారు, ఫలితాల లిస్ట్‌లో దాని స్థానం ఎంత వంటి ఎంపిక చేసిన సూచనలకు సంబంధించిన సమాచారాన్ని Chrome పంపుతుంది. మీరు టైప్ చేసినది లేదా మీరు ఎంచుకున్న URL పంపిన డేటాలో ఖచ్చితంగా ఉంటుందని చెప్పలేము.

మీ ఆటోమేటిక్ సెర్చ్ ఇంజిన్ Google కాకపోతే, సూచనలు, సెర్చ్ క్వెరీల కోసం మీరు చేసిన రిక్వెస్ట్‌లు, మీ సెర్చ్ ఇంజిన్ గోప్యతా పాలసీకి అనుగుణంగా లాగ్ చేయబడతాయి.

మీ డేటాను మేము ఎలా సంరక్షిస్తాము

మీరు అడ్రస్ బార్‌లో పాస్‌వర్డ్‌లు, లోకల్ ఫైల్ పేర్లు, లేదా పాత్‌లు కలిగిన HTTPS URLల వంటి కొన్ని రకాల గోప్యమైన సమాచారాన్ని ఎంటర్ చేస్తే, Chrome దానిని గుర్తిస్తుంది. మీరు ఎంటర్ చేసిన దానిలో గోప్యమైన సమాచారం ఉండే అవకాశం ఉందని Chrome నిర్ణయిస్తే, ఎంటర్ చేసిన టెక్స్ట్‌ను ఆటో-కంప్లీట్ సూచనల కోసం అది పంపదు.

మీ బ్రౌజింగ్ హిస్టరీని మీ Google ఖాతాకు మీరు సింక్ చేసినట్లయితే, Google మీ బ్రౌజింగ్ హిస్టరీని ఉపయోగించి Chromeకు సందర్భోచితమైన సెర్చ్ సూచనలను అందిస్తుంది. మీ బ్రౌజింగ్ హిస్టరీ నుండి మీరు ఏదైనా URLను తొలగిస్తే, మీకు అందించబడే వ్యక్తిగతీకరించిన సూచనలకు, ఇకపై దాన్ని ఉపయోగించడం అనేది జరగదు. మీ బ్రౌజింగ్ హిస్టరీలోని ఐటెమ్‌లను మీరు తొలగించకపోతే, మీ Google ఖాతా సెట్టింగ్‌ల ఆధారంగా అవి ఒక సంవత్సరం వరకు మీ Google ఖాతాలో స్టోర్ అయి ఉంటాయి.

అజ్ఞాత మోడ్‌లో, మీరు సూచనను ఎంచుకునే వరకు Chrome మీ సెర్చ్ ఇంజిన్‌కు ఎటువంటి సమాచారాన్ని పంపదు.

కంట్రోల్ మీ చేతిలో ఉంది

సూచించిన వెబ్ అడ్రస్ & సెర్చ్ సెట్టింగ్‌లను మార్చడం

మీరు టైప్ చేసిన దానిని మీ ఆటోమేటిక్ సెర్చ్ ఇంజిన్‌కు పంపాలో, లేదో కంట్రోల్ చేయడానికి:

కంప్యూటర్

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున ఉన్న మరిన్ని నిర్వహించండి ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆ తర్వాత మీరు, Googleను ఎంచుకోండి.
  3. సింక్, Google సర్వీస్‌లు అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. సెర్చ్ సూచనలను మెరుగుపరచండి అనే ఆప్షన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

Android

  1. మీ Android పరికరంలో, Chrome Chromeను తెరవండి.
  2. మరిన్ని నిర్వహించండి ఆ తర్వాత సెట్టింగ్‌లు Settings ఆ తర్వాత Google సర్వీస్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. సెర్చ్ సూచనలను మెరుగుపరచండి అనే ఆప్షన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

iOS

  1. మీ iPhone లేదా iPadలో, Chrome Chromeను తెరవండి.
  2. దిగువ కుడి వైపున ఉన్న మరిన్ని నిర్వహించండి ఆ తర్వాత సెట్టింగ్‌లు Settings ఆ తర్వాత Google సర్వీస్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. సెర్చ్ సూచనలను మెరుగుపరచండి అనే ఆప్షన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

చిట్కా: ఈ సెట్టింగ్ డిజేబుల్ చేసి ఉన్నప్పటికీ, మీ లోకల్ సెర్చ్, బ్రౌజింగ్ హిస్టరీ ఆధారంగా Chrome ఇప్పటికీ సూచనలను అందించవచ్చు. మీ సెర్చ్ హిస్టరీని మీరు సెర్చ్ ఇంజిన్ సెట్టింగ్‌లలో మేనేజ్ చేయవచ్చు. మీ Chrome బ్రౌజింగ్ హిస్టరీ సెట్టింగ్‌లను ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోండి.

Google Drive సెర్చ్ సూచన సెట్టింగ్‌లను మేనేజ్ చేయండి

మీ హిస్టరీని మీ Google ఖాతాకు మీరు సింక్ చేసినట్లయితే, మీ Google Drive ఫైల్స్ నుండి మీకు సూచనలు అందవచ్చు.

కంప్యూటర్

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. మరిన్ని నిర్వహించండి ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆ తర్వాత మీరు, Googleను ఎంచుకోండి.
  3. సింక్, Google సర్వీస్‌లు అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. Google Drive సూచనలను చూడండి అనే ఆప్షన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

సంబంధిత రిసోర్స్‌లు

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
10700096198379692318
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
237
false
false