Chrome మీ పాస్‌వర్డ్‌లను ఎలా సంరక్షిస్తుంది

డేటా ఉల్లంఘనల ద్వారా చోరీకి గురైన పాస్‌వర్డ్‌లను గుర్తించడానికి, మార్చడానికి Chrome మీకు సహాయపడుతుంది, తద్వారా మీ ఆధారాలు సురక్షితంగా ఉంటాయి. మీ ఆధారాలలో మీరు సైన్ ఇన్ చేసే సైట్‌లు లేదా యాప్‌లకు సంబంధించిన మీ యూజర్‌నేమ్‌లు, పాస్‌వర్డ్‌లు ఉంటాయి.
పాస్‌వర్డ్ రక్షణ ఎలా పని చేస్తుంది

మీరు ఒక వెబ్‌సైట్‌కు లాగిన్ చేయడానికి ఉపయోగించే యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లు డేటా ఉల్లంఘనకు గురైతే, Chrome మిమ్మల్ని హెచ్చరించగలదు. ఈ సెట్టింగ్ ఆటోమేటిక్‌గా ఆన్ చేసి ఉంటుంది.

మీరు సేవ్ చేసిన అన్ని ఆధారాలను ఒకే సమయంలో చెక్ చేయడానికి మీరు Chromeను కూడా ఉపయోగించవచ్చు. Chrome మీ సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లను చెక్ చేసి, వాటిలో ఏదైనా డేటా ఉల్లంఘనలో బహిర్గతమైతే, మీకు తెలియజేస్తుంది.

మీ ఆధారాలను చెక్ చేయడానికి, Chrome మొదట మీ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌ను ఎన్‌క్రిప్ట్ చేస్తుంది. తెలిసిన ఉల్లంఘించిన డేటాకు సంబంధించిన ఎన్‌క్రిప్ట్ చేసిన లిస్ట్‌తో సరిపోల్చడానికి అది ఎన్‌క్రిప్ట్ చేసిన ఆధారాలను Googleకు పంపుతుంది. ఎన్‌క్రిప్ట్ చేసిన డేటా సెట్‌లతో మ్యాచ్ అయినట్లు Chrome గుర్తించినట్లయితే, అది మీ పాస్‌వర్డ్‌ను మార్చమని మిమ్మల్ని ప్రాంప్ట్ చేసేలా హెచ్చరికను ప్రదర్శిస్తుంది. ఈ ప్రక్రియలో Google మీ యూజర్‌నేమ్‌లు లేదా పాస్‌వర్డ్‌లను ఎప్పటికీ తెలుసుకోదు.

మీ డేటాను మేము ఎలా సంరక్షిస్తాము
మీరు Chromeను ఉపయోగించి ఒక వెబ్‌సైట్‌లో సైన్ ఇన్ చేసినప్పుడు, మీకు మాత్రమే తెలిసిన రహస్య కీతో Chrome మీ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌ను ఎన్‌క్రిప్ట్ చేస్తుంది. ఆపై అది మీ డేటాకు సంబంధించిన అస్పష్టమైన కాపీని Googleకు పంపుతుంది. Google సర్వర్‌లకు సమాచారం చేరడానికి ముందే ఎన్‌క్రిప్షన్ జరుగుతుంది కాబట్టి, Googleతో సహా మీ యూజర్‌నేమ్ లేదా పాస్‌వర్డ్ ఎవరికీ తెలియవు.
నియంత్రణ మీ చేతిలో ఉంది

డేటా ఉల్లంఘన కారణంగా మీ సేవ్ చేసిన యూజర్‌నేమ్‌లు లేదా పాస్‌వర్డ్‌లు బహిర్గతం అయ్యాయో, లేదో మీరు చెక్ చేయవచ్చు. డేటా ఉల్లంఘన గుర్తించబడిన సైట్‌కు మీరు సైన్ ఇన్ చేసినప్పుడు ఆధారాల గురించి ఆటోమేటిక్ హెచ్చరికలను పొందేలా కూడా మీరు ఎంచుకోవచ్చు.

మీ కంప్యూటర్‌లో, మీరు సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లను చెక్ చేయడానికి కింది దశలను ఫాలో అవ్వండి:
  1. Chromeను తెరవండి.
  2. మరిన్ని నిర్వహించండి ఆ తర్వాత పాస్‌వర్డ్‌లు, ఆటోఫిల్ ఆ తర్వాత Google Password Manager ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. ఎడమ వైపున ఉన్న, చెకప్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
మీ కంప్యూటర్‌లో, డేటా ఉల్లంఘన జరిగినప్పుడు, దానికి సంబంధించిన ఆటోమేటిక్ హెచ్చరికలను పొందడానికి కింది దశలను ఫాలో అవ్వండి:
  1. Chromeను తెరవండి.
  2. మరిన్ని నిర్వహించండి ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆ తర్వాత గోప్యత, సెక్యూరిటీ ఆప్షన్‌లను ఎంచుకోండి.
  3. "గోప్యత, సెక్యూరిటీ" కింద ఉన్న, సెక్యూరిటీ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. పాస్‌వర్డ్‌లు డేటా ఉల్లంఘనలో బహిర్గతమైతే మిమ్మల్ని హెచ్చరించాలి అనే ఫీచర్‌ను ఆన్ చేయండి.
    • మీరు "స్టాండర్డ్ రక్షణ" కింద ఈ ఎంపికను కనుగొనవచ్చు.
    • మీరు మెరుగైన రక్షణను ఎంచుకుంటే, ఈ ఆప్షన్ డిఫాల్ట్‌గా ఆన్‌లో ఉంటుంది.

మీరు మొబైల్ పరికరాన్ని ఉపయోగిస్తుంటే సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లను ఎలా చెక్ చేయాలో, ఆటోమేటిక్ హెచ్చరికలను ఎలా పొందాలో గురించి మరింత తెలుసుకోండి.

సంబంధిత రిసోర్స్‌లు

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3723558921244956992
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
237
false
false